న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో నాలుగో క్వాడ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు.
‘‘చైనా దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. ఇలా దూకుడుగా ప్రవర్తిస్తూ.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాల్లో చైనా మనందరినీ పరీక్షిస్తోంది. అయితే ఈ సందర్భంలో దేశాల మధ్య పోటీకి దౌత్యం అవసరమని మేము నమ్ముతున్నాం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైతం ఆ దేశ ప్రయోజనాలను దూకుడుగా కొనసాగించేందుకు ఇతర దేశాలతో దౌత్యపరమైన విధానాలు అమలు చేయడానికి యోచిస్తున్నారని విన్నాను. ముఖ్యంగా చైనాలో దేశీయ ఆర్థిక సవాళ్లపై జీ జిన్‌పింగ్ దృష్టి సారించారని, చైనాలో అల్లకల్లోలం తగ్గించేందుకు దృష్టి సారించారని తెలుస్తోంది’ అని అన్నారు.
President Joe Biden was caught on a hot mic saying China is “testing” the US and its allies in the Indo-Pacific region during a Quad leaders’ summit https://t.co/qAPslysOMJ
— Bloomberg Markets (@markets) September 21, 2024
క్రెడిట్స్: Bloomberg Markets
దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం ప్రదర్శించడానికి దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే మొత్తం దక్షిణ చైనా సముద్రంపై తాము సార్వభౌమాధికారం కలిగి ఉన్నామని చైనా అంటున్న విషయం తెలిసిందే. అయితే చైనా వైఖరిపై వియత్నాం, మలేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ ఇతర ఆగ్నేయాసియా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment