Quad Countries
-
చైనా మనందరినీ పరీక్షిస్తోంది: జో బైడెన్
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలో నాలుగో క్వాడ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు మాట్లాడారు. ‘‘చైనా దూకుడుగా ప్రవర్తిస్తూనే ఉంది. ఇలా దూకుడుగా ప్రవర్తిస్తూ.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఆర్థిక, సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాల్లో చైనా మనందరినీ పరీక్షిస్తోంది. అయితే ఈ సందర్భంలో దేశాల మధ్య పోటీకి దౌత్యం అవసరమని మేము నమ్ముతున్నాం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సైతం ఆ దేశ ప్రయోజనాలను దూకుడుగా కొనసాగించేందుకు ఇతర దేశాలతో దౌత్యపరమైన విధానాలు అమలు చేయడానికి యోచిస్తున్నారని విన్నాను. ముఖ్యంగా చైనాలో దేశీయ ఆర్థిక సవాళ్లపై జీ జిన్‌పింగ్ దృష్టి సారించారని, చైనాలో అల్లకల్లోలం తగ్గించేందుకు దృష్టి సారించారని తెలుస్తోంది’ అని అన్నారు.President Joe Biden was caught on a hot mic saying China is “testing” the US and its allies in the Indo-Pacific region during a Quad leaders’ summit https://t.co/qAPslysOMJ— Bloomberg Markets (@markets) September 21, 2024క్రెడిట్స్: Bloomberg Marketsదక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం ప్రదర్శించడానికి దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే మొత్తం దక్షిణ చైనా సముద్రంపై తాము సార్వభౌమాధికారం కలిగి ఉన్నామని చైనా అంటున్న విషయం తెలిసిందే. అయితే చైనా వైఖరిపై వియత్నాం, మలేషియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ ఇతర ఆగ్నేయాసియా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.చదవండి: బైడెన్‌తో చర్చలు ఫలించాయి: ప్రధాని మోదీ -
క్వాడ్‌తో మనకు ఒరిగేదేమిటి?
క్వాడ్ సభ్యదేశాలకు చెందిన ప్రత్యేక ఆర్థిక జోన్లలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరిట అమెరికా వంటి ప్రాంతీయేతర శక్తులు విహరించడాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి వ్యూహాన్నీ భారత్ రూపొందించలేదు. భారత్‌కు హిందూ మహాసముద్ర రీజియన్ చాలా ముఖ్యమైనది. 90 శాతం చమురు దిగుమతులు, 95 శాతం వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడినుంచే జరుగుతున్నాయి. విదేశీ ఆధిపత్య శక్తుల ద్వారా హిందూ మహా సముద్ర ప్రాంతంలో సైనికీకరణ, పోటీ నెలకొంటే అది భారత్ భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక ప్రాంతీయ శక్తిగా తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా, హిందూ మహా సముద్ర ప్రాంత సమీప దేశాల ప్రయోజనాలను కాపాడటంలోనూ భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో, ఇటీ వలే జపాన్‌లో ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా మధ్య ముగిసిన నాలుగుదేశాల సంభాషణ లేదా క్వాడ్ సదస్సు పలువురు అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులను విశేషంగా ఆకర్షించింది. తైవాన్‌పై చైనా దాడిచేస్తే సైనికపరంగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. సదస్సు తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటన... 2021 మార్చ్ 12న జరిగిన తొలి సదస్సులో చేసిన ప్రకటనలోని క్వాడ్ స్ఫూర్తిని నొక్కి చెప్పింది. అమెరికా ఇంతవరకూ 1982 నాటి సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్‌ను ఆమోదించలేదు కానీ 1958 నాటి నడి సము ద్రంపై కన్వెన్షన్ (సీహెచ్ఎస్)లో మాత్రం భాగం పుచ్చుకుంది. అయితే నడిసముద్రంపై కన్వన్షన్ని తదుపరి వచ్చిన సముద్ర చట్టాలపై ఐరాస కన్వెన్షన్ తోసిపుచ్చిందనుకోండి! అమెరికా దీన్నే లాంఛనప్రాయమైన అంతర్జాతీయ చట్టంగా గుర్తించినప్పటికీ, 1982 నాటి తాజా కన్వెన్షన్‌ని అమెరికా ఇంకా ఆమోదించకపోవడం వల్ల యూఎన్సీఎల్ఓఎస్ ప్రతిపాదించిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఈఈజెడ్) భావనకు గణనీయంగా సవాలు ఎదురవుతోంది. తీరం నుంచి 200 నాటికల్ మైళ్ల దూరం వరకు సముద్ర అన్వేషణలపై, సముద్ర వనరుల ఉపయోగంపై, నీటినుంచి, గాలి నుంచి విద్యుత్ ఉత్పత్తిపై ఆయా దేశాలకు ఉండే ప్రత్యేక హక్కులను ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ల భావన గుర్తిస్తోంది. గత సంవత్సరం క్వాడ్ దేశాల మధ్య తొలి సదస్సు జరిగిన నెల రోజుల్లోపే అంటే 2021 ఏప్రిల్ 7న అమెరికా భారత్‌కు నిజంగానే షాక్ కలిగించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉండే లక్షద్వీప్ దీవుల సమీపంలోని భారత ప్రత్యేక ఆర్థిక మండలి జలాల లోపలికి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ (ఎఫ్ఓఎన్ఓఎఫ్) పేరిట తన భారీ నౌకను పంపించినట్లు అమెరికా తెలిపింది. అయితే తీరప్రాంత దేశం సమ్మతి లేకుండా అలాంటి విన్యాసం నిర్వహించడం చట్టవిరుద్ధమని భారత్ తీవ్రంగానే స్పందించింది. సముద్ర మండళ్ల చట్టం 1976 ప్రకారం తన ప్రాదేశిక జలాల్లోకి, ప్రత్యేక ఎకనమిక్ జోన్లోకి విదేశీ నౌకలు ప్రత్యేకించి సైనిక నౌకలు ప్రవేశించాలంటే ముందస్తు సమా చారం, అనుమతి తీసుకోవాలని భారత్ చెబుతోంది. దీని ప్రకారం చూస్తే అమెరికా చేపట్టిన నౌకా విన్యాసం సముద్ర చట్టాలపై ఐక్య రాజ్య సమితి కన్వెన్షన్‌ని మాత్రమే కాదు, భారత జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించినట్లే అవుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ అన్ని దేశాలకూ వర్తిస్తుందనీ, క్వాడ్ డిక్లరేషన్ ఏ ప్రత్యేక దేశాన్నీ లక్ష్యంగా చేసుకోదని చెబుతూనే, చైనాకు బలమైన సందేశాన్ని పంపడంలో భాగంగా అమెరికా అలాంటి చర్యకు పాల్పడిందని కొంతమంది పరిశీలకులు సమర్థిస్తుండవచ్చు. అమెరికా పాదముద్రల్లో నడిచి, చైనాతో సహా ఇతర విదేశీ శక్తులు కూడా ఇదే వాదన వినిపించి భారత ప్రత్యేక ఆర్థిక జోన్లోకి స్వేచ్ఛగా తమ నౌకలను పంపిస్తే, భారత్‌కు ఇది తక్షణ ఆందోళన కలిగించక మానదు. ఈ అర్థంలో క్వాడ్ ప్రకటన స్థూలంగానే భారత భద్రతా పరమైన ఆందోళనలను విస్మరించిందనే చెప్పాలి. అంతేకాకుండా యూరేషి యన్ భౌగోళిక వ్యూహాన్ని దక్షిణాసియా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతంతో సహా ఓ ఒక్క శక్తీ లేదా సంకీర్ణ శక్తులు కూడా డామినేట్ చేయడాన్ని అనుమతించకూడదనే అమెరికన్ వ్యూహాన్ని మాత్రమే క్వాడ్ ప్రకటన సంతృప్తి పర్చనుంది. ‘చైనా–ఇండియా గ్రేట్ పవర్ కాంపిటీషన్ ఇన్ ది ఇండియన్ ఓషన్ రీజియన్ ఇష్యూస్ ఫర్ కాంగ్రెస్’ శీర్షికతో అమెరికా కాంగ్రెస్ రీసెర్చ్ పేపర్ని 2018లో ట్రంప్ పాలనా కాలంలో ప్రచురించారు. భారత్, చైనా మధ్య పోటీ, శత్రుత్వం పెరుగుతున్న నేపథ్యంలో హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో ఒక సమతుల్య శక్తిగా అమెరికా వ్యవహరించాలని ఈ పత్రం స్పష్టం చేసింది. తమ హిందూ మహాసముద్ర తీర ప్రాంత వ్యూహంలో భారత్ అతిముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటని ట్రంప్, బైడెన్ పాలనా యంత్రాంగాలు రెండూ ప్రకటించాయి గానీ, భారత ప్రత్యేక ఆర్థిక జోన్లో అమెరికా యుద్ధ నౌకా విహారం దాని విశ్వసనీయతకు తూట్లు పొడిచింది. అలాగే ఒక ప్రాంతీయ శక్తిగా ఈ మొత్తం రీజియన్ ప్రయోజనాలను పరిరక్షించే మాట దేవుడెరుగు, భారత్ తన సొంత ప్రయోజనాలనైనా కాపాడుకునే సామర్థ్యం కలిగివుందా అనే సందేహాలను ఇతర తీరప్రాంత దేశాల్లో పెంచి పోషించింది. తన ప్రత్యేక ఆర్థిక మండలిలోకి ఇతరులు ప్రవేశించడానికి భారత్ తీసుకున్న వైఖరి లాగానే, ఇతర దేశాలు కూడా తన ప్రత్యేక ఆర్థిక మండలిలోకి ప్రవేశించడానికి ముందుగా అనుమతి తీసుకోవలసి ఉందని చైనా పేర్కొంటోంది. అయితే ఈ ప్రత్యేక ఆర్థిక మండలి తనదే అని చైనా చెబుతుండటం వల్ల జపాన్, దక్షిణ కొరియా, పిలిఫ్పైన్స్, వియత్నాంతో దానికి వివాదాలు ఎదురవుతున్నాయి. అమెరికాకు ఈ దేశాలతో భద్రతాపరమైన బాధ్యతలు ఉంటున్నాయి. ప్రస్తుతానికి అయితే తూర్పు, దక్షిణ తీర ప్రాంతంలో భారత్ తన ఉనికిని ప్రదర్శించుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి చైనా తీరప్రాంతంపై క్వాడ్ చేసిన ప్రకటన భారత్‌కు ఉపకరించదు. అదే సమయంలో అమెరికాకు, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని తన పొత్తుదారుల ప్రయోజనాలను మాత్రమే ఈ ప్రకటన నెరవేరుస్తుందని గ్రహించాలి. హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని లేదా ఇండో పసిఫిక్ రీజియన్‌లోని భౌగోళిక ప్రాంతాన్ని క్వాడ్ గుర్తించడం లేదు. 2017 నాటి జాతీయ భద్రతా వ్యూహం ప్రకారం, భారత పశ్చిమ తీర ప్రాంతం నుంచి అమెరికా పశ్చిమ తీరప్రాంతం వరకు వ్యాపించిన ప్రాంతాన్ని ఇండో–పసిఫిక్ ప్రాంతమని అమెరికా నిర్వచించింది. కాగా, ఆఫ్రికా కొమ్ము అని చెబుతున్న ప్రాంతం నుంచి పసిఫిక్ రీజియన్ తీరం వరకు ఉన్నదే ఇండో–పసిఫిక్ ప్రాంతమని భారత్ భావిస్తోంది. ఈ ప్రాంతంలో భారత ప్రయోజనాలు చాలావరకు ఆగ్నేయాసియా దేశాలతోనే ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ పేరిట పెరుగుతున్న చైనా మదుపు ప్రాజెక్టులు, మిలిటరీ వ్యవస్థల నిర్మాణం భారత్ ఆర్థిక, భద్రతా ప్రయోజనాలకు ప్రత్యక్ష ప్రమాదంగా మారుతున్నాయి. భారతీయ హిందూ మహాసముద్ర వ్యూహంలో రెండు కీలక అంశాలున్నాయి. ఒకటి, భారత ప్రాంతీయ నౌకల ఉనికిని బలోపేతం చేయడం. దీనివల్ల విదేశీ శక్తుల ఆధిపత్యానికి చెక్ పెట్టవచ్చు. రెండు, ఆర్థిక, సాంకేతిక సహకార చర్యలను ప్రోత్సహించడం. సభ్యదేశాలకు చెందిన ప్రత్యక ఆర్థిక జోన్లలో ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరిట ప్రాంతీ యేతర శక్తులు విహరించడాన్ని సామూహికంగా అడ్డుకునేందుకు ఇంతవరకు ఎలాంటి వ్యూహాన్నీ భారత్ రూపొందించలేదు. భారత్‌కు సంబంధించినంతవరకూ హిందూ మహాసముద్ర రీజియన్ చాలా ముఖ్యమైనది. 90 శాతం చమురు దిగుమతులు, 95 శాతం వాణిజ్య కార్యకలాపాలు ఈ ప్రాంతం ద్వారానే జరుగుతున్నాయి. విదేశీ శక్తుల ద్వారా హిందూ మహాసముద్ర రీజియన్‌లో సైనికీకరణ, పోటీ నెల కొంటే అది భారత్ భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక ప్రాంతీయ శక్తిగా తన సొంత ప్రయోజనాలను కాపాడు కోవడం కోసమే కాకుండా, హిందూ మహా సముద్ర ప్రాంతం సమీప దేశాల ప్రయోజనాలను కూడా కాపాడటంలో భారత్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. దీనికోసం స్వతంత్ర హిందూ మహాసముద్ర వ్యూహాలను భారత్ బలోపేతం చేసుకోవలసి ఉంది. అప్పుడే ఈ రీజి యన్‌లో నిజమైన నికర భద్రతా ప్రదాతగా భారత్ ఆవిర్భవిస్తుంది. వ్యాసకర్త: డాక్టర్ గద్దె ఓంప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ మొబైల్: 79089 33741 -
జపాన్‌లో ప్రధాని మోదీ: పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా..
Narendra Modi Japan Tour: భారతదేశాన్ని ఆధునికీరించే సంస్కరణలను ప్రధాని మోదీ తీసుకువస్తున్నారు. పిఎం మోదీ స్వయం-విశ్వాస దీక్షకు జపాన్ కంపెనీలు గట్టిగా మద్దతు ఇస్తున్నాయి అని సుజుకీ మోటర్ కార్పొరేషన్ చైర్మన్, ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ పేర్కొన్నారు. క్వాడ్ సదస్సు, ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం నుంచి వరుసభేటీలు అవుతున్నారు. ముందుగా నోబుహిరో ఎండోతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. జపానీస్ మల్టీనేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రిక్ దిగ్గజం ఎన్ఈసీ కార్పొరేషన్‌కు హెడ్ ఆయన. భారతదేశ సంస్కరణల పథాన్ని హైలైట్ చేస్తూ.. డిజిటల్ లెర్నింగ్, ఫిన్‌టెక్, ఇన్ఫ్రా మరియు లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ల వంటి రంగాలలో అవకాశాల గురించి ఆయన మాట్లాడారు అంటూ ప్రధాని కార్యాలయం ట్విటర్ హ్యాండిల్ వివరాలను పోస్ట్ చేసింది. అదే విధంగా భారత్‌లో టెలికమ్యూనికేషన్ సెక్టార్లో ఎన్ఈసీ అందిస్తున్న సేవలకు.. ప్రత్యేకించి చెన్నై-అండమాన్ నికొబార్‌లో, కొచ్చి-లక్షద్వీప్ ప్రాజెక్టులపై ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. "PM Narendra Modi met Chairman of NEC Corporation Dr. Nobuhiro Endo in Tokyo. Appreciated NEC’s role in India’s telecommunication sector and discussed opportunities in new and emerging technologies in India," tweets MEA Spokesperson Arindam Bagchi. pic.twitter.com/9D3DmMeQvC — ANI (@ANI) May 23, 2022 యునిక్లో చైర్మన్.. సీఈవో తడాషి యానైతోనూ మోదీ భేటీ అయ్యారు. టెక్స్టైల్స్ తయారీ కేంద్రంగా, ప్రత్యేకించి టెక్స్టైల్ తయారీలో సాంకేతికతలను ఉపయోగించుకునే దిశగా భారతదేశ ప్రయాణంలో మెరుగైన భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దానికి యునిక్లో సానుకూలంగా స్పందించింది. PM Modi interacts with Tadashi Yanai, Chairman, President and CEO of UNIQLO in Tokyo "Mr. Yanai appreciated the entrepreneurial zeal of the people of India. PM Modi asked Mr. Yanai to take part in the PM-Mitra scheme aimed at further strengthening the textiles sector," says PMO. pic.twitter.com/Xelu0qVN47 — ANI (@ANI) May 23, 2022 భారతదేశంలో ఉత్పత్తి & రిటైల్ పరిశ్రమలో ఎలా పెట్టుబడి పెట్టాలనే దాని గురించి మేము చర్చించాం. ప్లాంట్ నుండి డిజైన్ నుండి ఫాబ్రిక్ వరకు ఎండ్-టు-ఎండ్ ఉత్పత్తులపై దృష్టి సారించగలం. భారతదేశంలో భారత ఐటీ ప్రతిభ అద్భుతమైనది. కాబట్టి, సానుకూలంగానే మేం ప్రధాని మోదీకి సమ్మతిని తెలిపాం అని యునిక్లో చైర్మన్.. సీఈవో తడాషి యానై వెల్లడించారు. Tokyo | PM Modi is bringing reforms which are changing India into a modern landscape. The self-reliance initiative of PM Modi is being strongly supported by Japanese companies: Toshihiro Suzuki, Chairman & President, Suzuki Motor Corp pic.twitter.com/OK190xenHh — ANI (@ANI) May 23, 2022 #WATCH Prime Minister Narendra Modi meets Osamu Suzuki, Adviser, Suzuki Motor Corporation in Tokyo pic.twitter.com/kJsgkA0Eun — ANI (@ANI) May 23, 2022 -
మోదీని సర్ప్రైజ్ చేసిన బాలుడు.. ఫుల్ హ్యాపీ అయిన ప్రధాని
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. జపాన్ చేరుకున్నారు. రేపు(మంగళవారం) జరగబోయే క్వాడ్ సదస్సుల్లో మోదీ పాల్గొననున్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఉదయం టోక్యో చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ‘మోదీ మోదీ’, ‘ వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు చేస్తూ.. భారత జాతీయ జెండాలు ఊపుతూ ప్రధాని మోదీకి వెల్కమ్ చెప్పారు. ఈ నేపథ్యంలో మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా ఓ జపాన్ బాలుడు మోదీతో హిందీలో మాట్లాడటంతో ఆయన ఆశ్చర్యపోయారు. "జపాన్‌కు స్వాగతం.. దయచేసి మీ ఆటోగ్రాఫ్ నాకు ఇవ్వండి", అని రిత్సుకీ కొబయాషి.. ప్రధాని మోదీని హిందీలో అడిగాడు. ఈ క్రమంలో మోదీ.. "వాహ్.. మీరు హిందీ ఎక్కడ నుండి నేర్చుకున్నారు?.. మీకు బాగా తెలుసా" అని ప్రశంసించారు. అనంతరం అక్కడున్న జపాన్ విద్యార్థులకు మోదీ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. అనంతరం రిత్సుకీ మీడియాతో మాట్లాడుతూ..‘‘నేను హిందీ ఎక్కువగా మాట్లాడలేను.. కానీ, నాకు అర్థం అవుతుంది. ప్రధాని మోదీ నా సందేశాన్ని చదివారు. నాకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. దీనికి నేను సంతోషంగా ఉన్నాను’’ అని తెలిపాడు. ఇదిలా ఉండగా.. రిత్సుకీ కొబయాషి ఐదో స్టాండర్ట్ చదువుతున్నట్టు చెప్పాడు. #WATCH | "Waah! Where did you learn Hindi from?... You know it pretty well?," PM Modi to Japanese kids who were awaiting his autograph with Indian kids on his arrival at a hotel in Tokyo, Japan pic.twitter.com/xbNRlSUjik — ANI (@ANI) May 22, 2022 ఇది కూడా చదవండి: భారత్ సహా 16 దేశాలపై ట్రావెల్ బ్యాన్, ఎందుకంటే.. -
నిర్ణయాల పురోగతిని సమీక్షిస్తాం
న్యూఢిల్లీ: క్వాడ్ కూటమి ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని టోక్యో శిఖరాగ్ర సమావేశాల్లో సమీక్షిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని చెప్పారు. ఈ నెల 23, 24వ తేదీల్లో జపాన్‌లో జరగనున్న క్వాడ్ శిఖరాగ్ర భేటీకి బయలుదేరే ముందు ప్రధాని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయా దేశాల నేతల రెండో ముఖాముఖి భేటీలో ఇండో–పసిఫిక్ ప్రాంతంతోపాటు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకుంటామన్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు టోక్యో వెళ్తున్నానన్నారు. ఇండో–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా కిషిడాతో చర్చలుంటాయని ప్రధాని వెల్లడించారు. ఆస్ట్రేలియా నూతన ప్రధాని అంటోనీ అల్బనీస్ కూడా మొదటిసారిగా ఈ సమావేశానికి వస్తున్నారని చెప్పారు. భారత్–ఆస్ట్రేలియా మధ్య బహుళ రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవడంపై, పరస్పరం ఆసక్తి ఉన్న అంశాలపైనా చర్చలు జరుపుతామన్నారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణ వాదానికి అడ్డుకట్ట వేయడమేలక్ష్యంగా ఏర్పడిన క్వాడ్‌లో భారత్‌తోపాటు జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ఉన్నాయి. బైడెన్‌తో నిర్మాణాత్మక చర్చలు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జరిగే సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించుకోవడంతోపాటు, ప్రాంతీయ, వర్తమాన అంతరా>్జతీయ పరిణామాలపైనా చర్చిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. ఎటువంటి దాపరికాలు లేకుండా, నిర్మాణాత్మకంగా ఈ చర్చలు ఉంటాయన్నారు. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో రష్యాపై తీవ్ర చర్యలు తీసుకోవాలన్న అమెరికా వైఖరిని జపాన్, ఆస్ట్రేలియా బలపరుస్తుండగా, సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనాలని భారత్ గట్టిగా కోరుతోంది. -
ప్రధాని మోదీ జపాన్ టూర్: 40 గంటల్లో 23 కార్యక్రమాలు
న్యూఢిల్లీ: జపాన్‌లోని టోక్యోలో ఈ నెల 24న జరగనున్న క్వాడ్ సదస్సుకు వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ బిజీగా గడపనున్నారు. జపాన్‌లో 40 గంటల సేపు ఉండనున్న ఆయన మూడు దేశాల నేతలతో భేటీ సహా 23 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా ప్రధానితో విడివిడిగా చర్చలు జరుపుతారు. మోదీ పర్యటనలో పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు, వివిధ వర్గాల వారితో చర్చలు జరుపుతారు. జపాన్‌కు చెందిన 36 మంది సీఈవోలతో సమావేశమవుతారని, భారత సంతతికి చెందిన వారితో కూడా మాట్లాడతారని అధికార వర్గాలు వెల్లడించాయి. -
భారత్‌కు అమెరికా స్వీట్ వార్నింగ్
US Deputy National Security Adviser Daleep Singh In India: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాదారు, రష్యాపై ఆంక్షలు విధించడంలో కీలక పాత్ర పోషించిన దలీప్ సింగ్ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లాతో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ తదితర అంశాలపై బుధ, గురువారాల్లో భారత అధికారులతో దలీప్ సింగ్ చర్చించారు. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ అనుసరిస్తున్న తీరు పట్ల అమెరికా సంతృప్తికరంగా లేదు. ఈమేరకు ఈ విషయమై దలీప్ సింగ్ సైతం భారత్ తీరుపై విదేశాంగ కార్యదర్శితో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు, రూపాయి-రూబుల్-డినామినేటెడ్ చెల్లింపులు అంశాలపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు రష్యా పై ఆంక్షలు భారత్‌కి వర్తిస్తాయని అమెరికా భారత్‌కి పరోక్షంగా చెప్పకనే చెప్పారట. ఆంక్షల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయొద్దంటూ దలీప్ సింగ్ సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రాగన్ దేశం(చైనా) గనుక భారత్‌లోని వాస్తవాధీన రేఖ దాటి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే.. రష్యా చూస్తుంటుందే తప్ప సహకరించదు అని హెచ్చరించారు. ఒక వేళ రష్యా పై చైనా గనుక పట్టు సాధిస్తే.. భారత్‌కే నష్టం వాటిల్లుతుందని గట్టిగా నొక్కి చెప్పారు దలీప్ సింగ్. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ భారత పర్యటనపైనా దలీప్ సింగ్ ఆరా తీసినట్లు సమాచారం. ఇక యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ‘దలీప్ సింగ్ భారత్ మధ్య చర్చలు సంతృప్తికరంగా సాగాయని పేర్కొన్నారు. అయితే రష్యాతో గల సంబంధాలు ఆయదేశాలకు సంబంధించినవిగా అర్ధం చేసుకుంటున్నాం అని చెప్పారు. క్వాడ్ విషయానికి వస్తే ఇండో పసిఫిక్ అభివృద్ధి దాని ప్రధాన ఆలోచన అని పేర్కొన్నారు. పైగా దానికి కొన్ని నిర్ధిష్ట సూత్రాలు, ఆదర్శాలు ఉన్నాయన్నారు. పైగా క్వాడ్ దేశాలు ఏదో ఒక దేశం ప్రయోజనంతో ఈ యుద్ధం విషయంలో ఆసక్తి కనబర్చడం లేదని నొక్కి చెప్పారు. కేవలం క్యాడ్కి ఒక నిర్థిష్టమైన సూత్రానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడే దేశాలపై కొరడా ఝళిపించేలా నియమాల ఆధారిత అంతర్జాతీయ ఆదేశాలను పాటించేలా చేస్తుందని నైట్ ప్రెస్ చెప్పారు. (చదవండి: రష్యా బలగాల పై కీలక వ్యాఖ్యలు చేసిన బైడెన్...పుతిన్ తీరుపై అనుమానం) -
దౌత్యమార్గంలో వెళ్లాల్సిందే
న్యూఢిల్లీ: రోజురోజుకూ ఉక్రెయిన్ నగరాలపై రష్యా సేనల దాడుల పరంపర ఎక్కువవుతున్న నేపథ్యంలో సమస్యకు దౌత్యమార్గం ద్వారా పరిష్కారం కనుగొనాలని ప్రధాని మోదీ అభిలషించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాలతో కలసి ప్రధాని మోదీ గురవారం రాత్రి ‘క్వాడ్’ సదస్సులో వర్చువల్ పద్ధతిలో పాల్గొని ప్రసంగించారు. ‘ ఉక్రెయిన్‌లో మానవతా సాయంపైనా అగ్రనేతలు చర్చించారు’ అని భారత సర్కార్ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఐరాస ఒడంబడిక, అంతర్జాతీయ చట్టాలు, ప్రాంతీయ సార్వభౌమత్వాలకు తగు ప్రాధాన్యతనివ్వాలి. సంక్షోభానికి చర్చలు, దౌత్యమార్గాల ద్వారా ముగింపు పలకాలి’ అని మోదీ వ్యాఖ్యానించినట్లు ప్రకటన పేర్కొంది. క్వాడ్ దేశాలు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు కొనసాగడంపైనే ప్రధానంగా దృష్టిసారించాలని మోదీ అన్నారు. -
ప్రధాని మోదీ వర్చువల్ భేటీ
-
ఉగ్రవాదంపై ఉక్కుపాదం
మెల్బోర్న్: శాంతి, సుస్థిరత, ఆర్థిక ప్రగతితో కూడిన స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ ప్రాంతం ప్రపంచ ప్రగతికి కీలకమని విదేశాంగ మంత్రి జై శంకర్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంత భద్రతలో క్వాడ్ మరింత చురుకైన పాత్ర పోషించాల్సి ఉందన్నారు. శుక్రవారం ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో నాలుగో క్వాడ్ విదేశాంగ మంత్రుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఆంటోనీ బ్లింకెన్ (అమెరికా), మారిస్ పైన్ (ఆస్ట్రేలియా), యొషిమాసా హయాషీ (జపాన్)తో పలు అంశాలపై లోతుగా చర్చించారు. ఇండో పసిఫిక్‌ను బెదిరింపులు, నిర్బంధ ఆర్థిక విధానాల బారినుంచి విముక్తం చేయాలని సదస్సు తీర్మానించింది. సీమాంతర ఉగ్రవాద వ్యాప్తికి పరోక్ష మద్దతిస్తున్న కొన్ని దేశాల తీరును తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల నెట్‌వర్క్‌ను, వాటి అడ్డాలను, మౌలిక సదుపాయాలను, ఆర్థిక మూలాలను పూర్తిగా పెకిలించేందుకు సభ్య దేశాలన్నీ కలిసి పని చేయాలని నిర్ణయించింది. అఫ్గాన్ భూ భాగాన్ని ఇతర దేశాలను బెదిరించేందుకు, వాటిపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోరాదని అభిప్రాయపడింది. తర్వాత మంత్రులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాంత దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారం తదితరాలపై రాజీ ఉండబోదన్నారు. ‘‘ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, సముద్ర రక్షణ తదితర అంశాల్లో కలిసి పని చేసేందుకు ఎంతో అవకాశముంది. ఈ ఉమ్మడి లక్ష్యాల సాధనకు ఇండో పసిఫిక్ దేశాలు చేసే ప్రయత్నాలన్నింటికీ మద్దతుగా నిలవాలన్న క్వాడ్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. తూర్పు, దక్షిణ చైనా సముద్ర తీర దేశాల హక్కులకు తలెత్తుతున్న సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొంటామని చైనాను ఉద్దేశించి పేర్కొన్నారు. రష్యా దూకుడుకు భారీ మూల్యమే ఉక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక మోహరింపుల విషయమై రష్యాతో చర్చించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు బ్లింకెన్ చెప్పారు. దూకుడు ప్రదర్శిస్తే ఆర్థిక, ఎగుమతిపరమైన ఆంక్షల రూపంలో భారీ మూల్యం తప్పదని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడే ప్రయత్నాలకు తమ మద్దతుంటుందని పైన్, హయాషీ చెప్పారు. బర్మా సంక్షోభంపై సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.అక్కడ ప్రజాస్వామ్యాన్ని తక్షణం పట్టాలెక్కించాలని సైనిక ప్రభుత్వానికి సూచించింది. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలకు మరింత మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. తర్వాత మంత్రులంతా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో భేటీ అయ్యారు. విఫల ప్రయోగం: చైనా క్వాడ్‌పై చైనా అక్కసు వెల్లగక్కింది. తమను నిలువరించే లక్ష్యంతో ఏర్పాటైన ఈ గ్రూపు విఫల ప్రయోగంగా మిగిలిపోతుందని శాపనార్థాలు పెట్టింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పలు దేశాలతో సరిహద్దు వివాదాలున్న చైనా క్వాడ్ ఏర్పాటును తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. -
అఫ్గాన్ పరిణామాలతో తీవ్ర ప్రభావం!.. అంత రహస్యమెందుకు?
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు ఈ ప్రాంతం మొత్తంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అభిప్రాయపడ్డారు. గతేడాది యూఎస్‌కు తాలిబన్లకు మధ్య దోహాలో జరిగిన డీల్‌లోని పలు అంశాల్లో భారత్‌ను పరిగణనలోకి తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు కావడం, అఫ్గాన్ గడ్డపై ఎలాంటి ఉగ్రమూకలు నివాసం ఏర్పరుచుకోకుండా జాగ్రత్త వహించడమే ప్రస్తుతానికి ఇండియాకు కావాల్సిన అంశాలన్నారు. ఇండో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ సమావేశంలో ఆయన ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. అఫ్గాన్‌లోని కొత్త ప్రభుత్వాన్ని గుర్తించడంలో ఇండియాకు ఎలాంటి తొందర లేదన్నారు. యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్‌తో ఏర్పాటైన క్వాడ్ గ్రూప్ ఏదేశానికి వ్యతిరేకం కాదని, దురుద్దేశాలతో ఏర్పాటైన కూటమి కాదని స్పష్టం చేశారు. అఫ్గాన్ గడ్డను ఉగ్ర అడ్డాగా మార్చకూడదన్న అంశంతో పాటు పలు అంశాల్లో ఇండియా, అమెరికాకు సామ్యాలున్నాయని చెప్పారు. అయితే దోహా డీల్ సందర్భంగా తమను అనేక అంశాల్లో పరిగణనలోకి తీసుకోలేదని ఎత్తిపొడిచారు. అలాంటి ఒప్పందాలు విసృతమైనవిగా ఉండాలని, కానీ ఏం జరుగుతుందో అంతా చూస్తున్నారని పరోక్షంగా అమెరికాను దెప్పిపొడిచారు. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడుతుందా? మైనార్టీల హక్కులకు రక్షణ కలుగుతుందా? అని ప్రశ్నించారు. అంత రహస్యమెందుకు? దోహాలో యూఎస్, తాలిబన్లకు మధ్య అఫ్గాన్‌పై ఒప్పందం కుదరింది. దీని ప్రకారం యూఎస్ దళాలు అఫ్గాన్ నుంచి వైదొలుగుతాయి, తాలిబన్లు హింసను వీడతారు. కానీ పాలన చేతికొచ్చాక తాలిబన్ల ప్రవర్తన ప్రశ్నార్ధకంగా మారింది. దీన్నే జైశంకర్ ప్రస్తావించారు. కీలకమైన అంశాలపై నిర్ణయాలకు ముందు ఆచితూచి వ్యవహరించాలని, కానీ సదరు డీల్‌లో ఏముందో పూర్తిగా అంతర్జాతీయ సమాజంలో ఎవరికీ తెలియదని చెప్పారు. అఫ్గాన్‌లో ఉగ్ర తండాలకు అభయం చిక్కకూడదన్న అంశాన్ని జోబైడెన్‌తో ప్రధాని ప్రస్తావించారని తెలిపారు. అఫ్గాన్‌లో పరిణామాల ప్రభావం దగ్గరగా ఉన్నందున తమపై ముందుగా, అధికంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే సరిహద్దు తీవ్రవాదానికి తాము బాధితులమని గుర్తు చేశారు. పాక్‌కు సంయుక్త వార్నింగ్ ఇవ్వడంపై అమెరికానే తేల్చుకోవాలన్నారు. క్వాడ్‌ను నెగిటివ్ ఉద్దేశంతో ఏర్పరచలేదని, చైనాతో తమ దేశాలన్నింటికీ స్థిరమైన సంబంధాలే ఉన్నాయని గుర్తు చేశారు. చైనా ఎదుగుదల ప్రపంచ నియతిపై మౌలిక ప్రభావం చూపగలదని అభిప్రాయపడ్డారు. అందువల్ల ఏదేశానికాదేశం తమ స్వీయ ప్రయోజనాలకు అనుగుణంగా చైనాతో వ్యవహరిస్తుందన్నారు.