
జపాన్‌లోని టోక్యోలో ఈ నెల 24న జరగనున్న క్వాడ్ సదస్సుకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీ బిజీగా గడపనున్నారు.
న్యూఢిల్లీ: జపాన్‌లోని టోక్యోలో ఈ నెల 24న జరగనున్న క్వాడ్ సదస్సుకు వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజీ బిజీగా గడపనున్నారు. జపాన్‌లో 40 గంటల సేపు ఉండనున్న ఆయన మూడు దేశాల నేతలతో భేటీ సహా 23 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, ఆస్ట్రేలియా ప్రధానితో విడివిడిగా చర్చలు జరుపుతారు. మోదీ పర్యటనలో పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలు, వివిధ వర్గాల వారితో చర్చలు జరుపుతారు. జపాన్‌కు చెందిన 36 మంది సీఈవోలతో సమావేశమవుతారని, భారత సంతతికి చెందిన వారితో కూడా మాట్లాడతారని అధికార వర్గాలు వెల్లడించాయి.