
భారత పాఠశాలల్లో జపనీస్ భాష బోధన!
టోక్యో: దేశాల మధ్య బంధాలు బలోపేతం కావడానికి భాష దోహదం చేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. జపాన్ భాషను తమ దేశ పాఠశాల్లో ప్రవేశపెట్టాలన్న ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. జపాన్ పర్యటనలో ఉన్న మోడీ సోమవారం తాయ్ మియ్ ప్రాథమిక పాఠశాలలో ముఖాముఖిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జపాన్ టీచర్లు తమ భాషకు సంబంధించిన విషయాలు భారతీయ విద్యార్థులకు నేర్పాలని కోరారు. తమ పాఠశాల్లో జపనీస్ బాష ప్రవేశపెట్టలనుకుంటున్నామని, ఇందుకు జపాన్ టీచర్లు అవసరమని అన్నారు. తమ దేశానికి వచ్చి జపనీష్ భాష నేర్పాలని జపాన్ టీచర్లను మోడీ ఆహ్వానించారు. ఈ మేరకు పీఎఏంఓ ట్విటర్ పేర్కొంది.