జపాన్‌లో భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
టోక్యో : భారత్‌లో డిజిటల్ మౌలిక వసతులు వేగంగా విస్తరిస్తునన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. జపాన్ పర్యటన సందర్భంగా ప్రదాని మోదీ దేశంలో కూల్‌డ్రింక్ కంటే 1జీబీ డేటా చౌకగా లభిస్తోందని అన్నారు. ఇండో-జపాన్ వార్షిక సదస్సులో భాగంగా సోమవారం ప్రధాని పలువురు జపాన్ నేతలతో భేటీలతో పాటు భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగించారు.
భారత్‌లో టెలికమ్యూనికేషన్లు, ఇంటర్‌నెట్ శరవేగంతో పురోగమిస్తున్నాయని చెప్పుకొచ్చారు. 2022 నాటికి భారత్‌లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ లక్ష డాలర్లకు పెరిగి పది లక్షల ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. గ్రామాలకు సైతం బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ చేరువైందని, దేశంలో 100 కోట్ల మొబైల్ వినియోగదారులున్నారని చెప్పారు. అందుబాటు ధరలో లభిస్తున్న డేటాతో సేవల సరఫరా సులభంగా మారిందన్నారు. మార్షల్ ఆర్ట్స్‌కు పెట్టింది పేరైన జపాన్‌లో కబడ్డీ, క్రికెట్‌ను పరిచయం చేసిన భారత సంతతి సేవలను ఆయన ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment