Japanese language
-
ఈ భాష నేర్చుకుంటే బ్రహ్మాండమైన ఉద్యోగం!
కొత్త భాష నేర్చుకుంటే ఏమొస్తుంది? కొత్త ఉత్సాహం వస్తుంది. మెమోరీ మెరుగు పడుతుంది. విషయ జ్ఞానం పెరుగుతుంది. జపనీస్ నేర్చుకుంటే వీటితో పాటు బ్రహ్మాండమైన ఉద్యోగం కూడా వస్తుంది.... తమ దేశంలో ఉద్యోగుల కొరత తీర్చడానికి మన ప్రభుత్వం జపాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. హెల్త్‌కేర్, కన్స్ట్రక్షన్, ఏవియేషన్, ఫుడ్‌సర్వీస్, నర్సింగ్‌కేర్, మెషిన్ పార్ట్స్ అండ్ టూల్ ఇండస్త్రీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, షిప్ బిల్డింగ్ అండ్ షిప్ మెషినరీ...ఇలా పద్నాలుగు రంగాలలో జపాన్‌లో బోలెడు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగం చేయాలనుకునేవారికి స్పెసీఫైడ్ స్కిల్డ్ వర్కర్ కేటగిరిలో జపాన్ ప్రభుత్వం ప్రత్యేక వీసాలు ఇవ్వనుంది. 2030 నాటికి జపాన్‌లో 60 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం జపాన్ వైపు చూస్తోంది యువత. అయితే అక్కడ ఉద్యోగ ఎంపికలో జపనీస్ భాష నైపుణ్యం అనేది కీలకం కావడంతో పెన్ను, పుస్తకం పట్టుకొని భాష బడుల వైపు పరుగెత్తే వారి సంఖ్య పెరుగుతుంది. అసలు మనం జపనీస్ నేర్చుకోగలమా, మన వల్ల అవుతుందా? ఎందుకు కాదు అంటున్నాడు థామస్. యూరోపియన్ సిటిజన్ అయిన థామస్ ఫ్లైర్ సరదాగా జపనీస్ మీద మనసుపడ్డాడు. ఎలాగైనా నేర్చుకోవాలనుకోవడమే కాదు నేర్చుకున్నాడు కూడా. జపనీస్ రాయగలడు. మాట్లాడగలడు. తాను జపనీస్ ఎలా నేర్చుకున్నది ఆయన మాటల్లోనే... ‘మొదట నేను చేసిన పని ఏమిటంటే, జపనీస్ నేర్చుకోవడానికి అవసరమైన అన్ని రకాల పుస్తకాలు కొనడం. వాటిలో డిక్షనరీ, వొకాబులరీ, గ్రామర్ పుస్తకాలు ఉన్నాయి. ఎంత పెద్ద భవనానికైనా పునాది గట్టిగా ఉండాలంటారు కదా...కొత్త భాష మనకు పట్టుబడాలంటే ఎక్కువ పదాలు నేర్చుకోవాలి. ఇందుకు wani kani వెబ్సైట్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆరువేల పదాలను నేర్చుకోవచ్చు. text fugu సెల్ఫ్ లెర్నింగ్ జపనీస్ ఆన్లైన్ బుక్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో టెక్స్ట్‌తో పాటు వీడియోలు కూడా ఉంటాయి. జపనీస్ వైబ్సెట్లలోకి వెళ్లి చిన్న చిన్న పదాలు చదివేవాడిని. నీ పేరేమిటి? మీ ఇల్లు ఎక్కడ...నిత్యజీవితంలో ఉపయోగపడే చిన్న చిన్న వాక్యాలు నేర్చుకున్నాను. భాష నైపుణ్యానికి మూడు ‘పి’లు ఉంటే సరిపోతుంది. 1.ప్రాక్టిస్ లిజనింగ్ 2. ప్రాక్టిస్ స్పీకింగ్ 3. ప్రాక్టిస్ రైటింగ్. lang8 అనే సోషల్ నెట్‌వర్క్‌లోకి వెళితే మనకు విలువైన సలహాలెన్నో దొరుకుతాయి. జపనీస్‌లో మీరేమైనా రాసి పోస్ట్ చేస్తే అందులో ఏదైనా తప్పుదొర్లితే ఎవరో ఒకరు సవరించడమే కాదు సలహా కూడా ఇస్తారు. భాష నేర్చుకోవడం అనేది భారం కాదు. ఒక ప్రయాణం. గమ్యం చేరే క్రమంలో చేసే ప్రయాణం ఆనందమయం. లెర్న్ జపనీస్ ఆల్ఫాబెట్, జపనీస్ ఆల్ఫాబెట్ విత్ ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్, హౌటూ రీడ్ అండ్ రైట్ హిరగన (జపనీ అక్షరమాల)...మొదలైన పీడిఎఫ్లతో పాటు వీడియోలు నెట్లో అందుబాటులో ఉన్నాయి. అందాలొలికే సుందర జపనీ ► జపనీస్ కాలిగ్రఫీని ‘షోడో’ అంటారు. ఎంతో మంది విదేశీలు దీనికి ఆకర్షితులయ్యారు. ‘కంజి’ క్యారెక్టర్లలో 1–3 స్ట్రోక్‌లతో పాటు 20 స్ట్రోక్‌లతో రూపొందించినవి ఉన్నాయి. ► ఇంగ్లిష్‌కు ఒక స్క్రిప్ట్ చాలు. జపనీస్‌లో మాత్రం హిరగన, కటకన, కంజి అనే మూడు స్క్రిప్ట్‌లను నేర్చుకోవాల్సిందే. అయితే ఈ మూడు కలిపే ఉపయోగిస్తారు. దీంతో పాటు రొమజి (రోమనైజేషన్ ఆఫ్ జపనీ) స్క్రిప్ట్ కూడా ఉంటుంది. పిల్లల పుస్తకాలు తప్పనిసరిగా హిరగన, కటకన లో ఉంటాయి. హిరగన, కటకనలను కలిపి ‘కన’ అంటారు. ► ‘ది ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది యూఎస్’ చెప్పేదాని ప్రకారం జపనీస్‌లో పదును తేలడానికి 2200 గంటలు అవసరమవుతాయి. - కౌన్ ఒ ఇనొరిమసు (బెస్ట్ ఆఫ్ లక్) -
నాగార్జున యూనివర్సిటీలో జపనీస్ బోధన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో జపనీస్ భాషను విద్యార్థులకు నేర్పించేందుకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీని కేంద్రంగా నిర్ణయించారు. ఈ మేరకు.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోడల్ కేంద్రంగా గుర్తించిందని యూనివర్సిటీ ఇంటర్నేషనల్ సెంటర్ అడిషనల్ డెరైక్టర్ ఆచార్య జి.వి.ఎస్.ఆర్. ఆంజనేయులు తెలిపారు. రాష్ట్రంలో జపాన్ కంపెనీలు త్వరలో స్థాపించనున్న పలు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేందుకు అనుగుణంగా నైపుణ్య లక్షణాలతో పాటు, జపనీస్ భాష విద్యార్థులకు చాలా అవసరమని వారు తెలిపారు. జపాన్ భాషపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆ దేశ ప్రతినిధులు ఈ నెల 8న యూనివర్సిటీకి వస్తున్నారని చెప్పారు. -
జపాన్ భాషా బోధన సమన్వయకర్తగా వేణుగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జపాన్ భాషా బోధనను అమలు పరిచేందుకు నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం ఈ బాధ్యతను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డికి అప్పగించింది. ప్రాథమిక స్థాయినుంచి ఒక యజ్ఞంలా దీన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జపాన్ భాషా బోధనపై తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వేణుగోపాలరెడ్డి, జపాన్ ప్రతినిధిగా వచ్చిన రాజేష్ పాండ్యన్, అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ విద్యార్థులు జపనీస్ నేర్చుకోవాల్సిందే!
హైదరాబాద్ : ఇక నుంచి ఏపీ విద్యార్థులు జపనీస్ నేర్చుకోవాల్సిందే. ఏపీ రాజధాని నిర్మాణంలో సహకారంతో పాటు రాష్ట్రంలో జపాన్ పెట్టుబడులు పెట్టనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా జపనీస్ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని హితబోధ చేస్తున్నారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు రాబోయే కాలంలో జపనీస్ నేర్చుకోవడం తప్పనిసరి కానుంది. ఎందుకంటే...ఏపీలో పాఠశాల స్థాయి నుంచే జపనీస్‌ను ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జపాన్ నుంచి రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నందున అవకాశాలను అందిపుచ్చుకొనేలా విద్యార్థులను సిద్ధం చేయాలని భావిస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు జపాన్‌కు వెళ్లి అక్కడ ప్రభుత్వ ముఖ్యులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం జపాన్‌కు చెందిన ప్రవాస భారతీయుడు రాజీవ్ పాండ్యన్ సీఎంతో భేటీ అయ్యారు. పాఠశాల స్థాయిలో జపనీస్‌ను ప్రవేశపెట్టే అంశంపై మాట్లాడారు. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. -
భారత పాఠశాలల్లో జపనీస్ భాష బోధన!
టోక్యో: దేశాల మధ్య బంధాలు బలోపేతం కావడానికి భాష దోహదం చేస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. జపాన్ భాషను తమ దేశ పాఠశాల్లో ప్రవేశపెట్టాలన్న ఆకాంక్షను ఆయన వెలిబుచ్చారు. జపాన్ పర్యటనలో ఉన్న మోడీ సోమవారం తాయ్ మియ్ ప్రాథమిక పాఠశాలలో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జపాన్ టీచర్లు తమ భాషకు సంబంధించిన విషయాలు భారతీయ విద్యార్థులకు నేర్పాలని కోరారు. తమ పాఠశాల్లో జపనీస్ బాష ప్రవేశపెట్టలనుకుంటున్నామని, ఇందుకు జపాన్ టీచర్లు అవసరమని అన్నారు. తమ దేశానికి వచ్చి జపనీష్ భాష నేర్పాలని జపాన్ టీచర్లను మోడీ ఆహ్వానించారు. ఈ మేరకు పీఎఏంఓ ట్విటర్ పేర్కొంది. -
వై దిస్..!
‘హారీ పోటర్’ స్టార్ డానియుల్ రాడ్‌క్లిఫ్ జపనీస్ భాషతో తంటాలు పడుతున్నాడు. ఏదేమైనా ఈ భాష నేర్చుకోవడం బహు కష్టవుంటున్నాడు. ‘ఇప్పుడే నేర్చుకోవడం మొదలెట్టా. ఎంత కష్టంగా ఉందో... అంతే అద్భుతమైన లాంగ్వేజ్ ఇది. ఇందులో ఇప్పటివరకు నాకు నచ్చిన పదం.. టోకిడోకి (అప్పుడప్పుడు)’ అంటూ తెగ వుురిసిపోతున్నాడు. అంతేకాదు... స్కూల్లో ఉన్నప్పుడు స్పానిష్‌లో కూడా పాసయ్యూనని కాసింత గర్వంగా చెప్పుకొంటున్నాడు. ఇంతకీ ఈ బుల్లోడి వునసు ఉన్నట్టుండి జపనీస్పైకి ఎందుకెళ్లిందబ్బా అనేది కొందరి క్యూరియూసిటీ.