
నాగార్జున యూనివర్సిటీలో జపనీస్ బోధన
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో జపనీస్ భాషను విద్యార్థులకు నేర్పించేందుకు గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీని కేంద్రంగా నిర్ణయించారు. ఈ మేరకు.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోడల్ కేంద్రంగా గుర్తించిందని యూనివర్సిటీ ఇంటర్నేషనల్ సెంటర్ అడిషనల్ డెరైక్టర్ ఆచార్య జి.వి.ఎస్.ఆర్. ఆంజనేయులు తెలిపారు.
రాష్ట్రంలో జపాన్ కంపెనీలు త్వరలో స్థాపించనున్న పలు పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందేందుకు అనుగుణంగా నైపుణ్య లక్షణాలతో పాటు, జపనీస్ భాష విద్యార్థులకు చాలా అవసరమని వారు తెలిపారు. జపాన్ భాషపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆ దేశ ప్రతినిధులు ఈ నెల 8న యూనివర్సిటీకి వస్తున్నారని చెప్పారు.