ఎల్.వేణుగోపాలరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జపాన్ భాషా బోధనను అమలు పరిచేందుకు నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం ఈ బాధ్యతను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డికి అప్పగించింది. ప్రాథమిక స్థాయినుంచి ఒక యజ్ఞంలా దీన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జపాన్ భాషా బోధనపై తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వేణుగోపాలరెడ్డి, జపాన్ ప్రతినిధిగా వచ్చిన రాజేష్ పాండ్యన్, అధికారులు పాల్గొన్నారు.