venugopal reddy
-
ఓటరు స్వేచ్ఛగా ఓటేసేలా ఏర్పాట్లు చేశాం: కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి
-
ఆపన్నులకు ప్రభుత్వం ఆర్థిక సాయం
గుంటూరు వెస్ట్: ఆపన్నుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో గురువారం జరిగిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో కొందరు బాధితులు ముఖ్యమంత్రికి తమ బాధలను చెప్పుకున్నారు. దీంతో వారిలో ఆరుగురికి రూ.లక్ష చొప్పున ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కులను శనివారం గుంటూరు కలెక్టరేట్లో జేసీ జి.రాజకుమారితో కలిసి కలెక్టర్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ బాధితులకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోపే చెక్కులను అందజేశామన్నారు. అలాగే వారికి కావాల్సిన వైద్య సేవలు కూడా అందిస్తామని తెలిపారు. పేదల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వంలో ప్రజలకు ఏ అవసరమొచ్చినా తక్షణ సాయం లభిస్తుందన్నారు. అలాగే తాడికొండ నియోజకవర్గ పరిధిలో ఆరుగురు తమ చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. వీరికి మొత్తం రూ.9.90 లక్షలు మంజూరు చేస్తూ సీఎంవో కార్యాలయం చెక్కులు పంపింది. ఈ చెక్కులను కూడా ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత, కలెక్టర్, జేసీలు అందజేశారు. మట్టుకొయ్య కోటేశ్వరరావుకు రూ.60 వేలు, నిలకుదిటి రఘుపతమ్మకు రూ.40 వేలు, మర్రి వెంకటేశ్వరరావుకు రూ.3 లక్షలు, ఇట్ల కుసుమసాయికి రూ.1.60 లక్షలు, అజీ్మర్ దివ్యకు రూ.4.30 లక్షల చొప్పున మొత్తం రూ.9.90 లక్షల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా బాధితులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం
-
1400 ఎకరాల్లో... 47 వేల మందికి ఇళ్ల నిర్మాణాలు..!
-
బిల్డింగ్ యజమానిని విచారిస్తున్నాం : ఏసీపీ వేణుగోపాల్ రెడ్డి
-
ధరణిపై కోర్టుకెక్కుతా: రాజనర్సింహ
లక్డీకాపూల్: సమస్యాత్మకంగా తయారైన ధరణి పోర్టల్‌పై హైకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ముఖ్యంగా రాచకొండ భూముల అంశంపై రిట్ పిటిషన్ వేయాలన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ‘ధరణి పోర్టల్–భూ సమస్యల పరిష్కారం’డిమాండ్‌తో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వేదిక అధ్యక్షులు బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆయా సమస్యలపై సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నామన్నారు. ఈ విషయంలో బాధిత రైతులు తమ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు కొట్లాడిన తరహాలోనే ధరణి పోర్టల్ సమస్యపై పోరాటం చేద్దామని, జిల్లా కేంద్రాల్లో చర్చా వేదికలను నిర్వహించి తద్వారా బాధిత రైతులను సంఘటితం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఏడు లక్షల ఎకరాలు అక్రమంగా టీఆర్ఎస్ నేతల పేర్లపై మారిపోయాయని ఆందోళన చెందారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పాలసీపై నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక కుట్ర దాగి ఉంటుందని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ధరణి ద్వారా పేదల భూములను బలవంతంగా లాక్కుంటోందన్నారు. రాష్ట్రంలో 2.77 కోట్ల ఎకరాలకుగాను సగం భూమి కూడా ధరణి పోర్టల్‌లో ఎక్కలేదన్నారు. అందులోనూ 25 లక్షల ఎకరాలను నిషేధిత జా బితాలో చేర్చడం ఆక్షేపణీయమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాలంటే శాశ్వత ట్రిబునల్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గ్రేటెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డిజైన్ చేసిన ఆయన సాఫ్ట్వేర్ ఎక్స్‌ఫర్ట్ కావద్దా అని సూటిగా ప్రశ్నించారు. ధరణి పోర్టల్‌ను డెవలప్ చేసిందెవరన్నది గోప్యంగా ఉంచడానికి కారణమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ, ధరణి పోర్టల్, పోడు భూముల పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున భూదందా జరుగుతున్నదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖరరెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్య పద్మ, సోషల్ మీడియా ఫోరం కన్వీనర్ దాసరి కరుణాకర్, సీపీఎం నాయకులు నంద్యాల నరసింహారెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, ధరణి బాధితులు పాల్గొన్నారు. -
భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదు
సాక్షి, విశాఖపట్నం: భూములిచ్చిన ఏ ఒక్క రైతుకూ పరిహారం విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిందని విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. విశాఖ జిల్లాలోని నక్కపల్లి పారిశ్రామిక పార్కుపై బుధవారం రాజయ్యపేట వద్ద ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. జేసీ వేణుగోపాల్‌రెడ్డితో పాటు నర్సీపట్నం సబ్‌కలెక్టర్ మౌర్య, కాలుష్య నియంత్రణ మండలి అధికారి షేక్ సుభాన్ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ తో పాటు స్థానికులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. వేలాది మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక పార్కు ఏర్పాటును స్వాగతించారు. పర్యావరణ కాలుష్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. భూ పరిహారానికి సంబంధించి ఇంకా కొందరికి బకాయిలు చెల్లించాల్సి ఉందని.. కొన్నిచోట్ల ఇళ్లకు, చెట్లకు తక్కువ పరిహారమిచ్చారని తెలిపారు. ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వారికి కూడా నష్టపరిహారమివ్వాలని కోరారు. వీటన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి జేసీ హామీ ఇచ్చారు. నక్కపల్లి మండలంలో భూ సేకరణ జరిగిన బుచ్చిరాజుపేట, చందనాడ, వేంపాడు, డీఎల్ పురం, రాజయ్యపేట గ్రామాల్లో పరిహారం సహా ఇతర సమస్యలను పరిష్కరించేందుకు డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించామన్నారు. -
చిన్నారులను అందంగా అలంకరించి..
పటాన్చెరు: అమీన్‌ఫూర్ అనాథశ్రమంలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై ఏడాదిగా అత్యాచారం జరిగిన తర్వాత ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. అనాథశ్రమం ముసుగులో అనేక చీకటి వ్యవహారాలు సాగేవని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆంధ్ర ప్రాంత బడా నాయకులతో పాటు గల్లీ లీడర్లు కూడ ఆ అనాథాశ్రమానికి వచ్చి పోయేవారని, చిన్నారులను అందంగా అలంకరించి బయటకు పంపే వారని చెబుతున్నారు. వాస్తవానికి పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనుమతి లేనిది ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పంపకూడదు. రంగారెడ్డి జిల్లాలో అనాథాశ్రమం రిజిస్ట్రేషన్ జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా శివారు, సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్లో అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. (మరో బాలికపైనా అఘాయిత్యం!) అనాథశ్రమ భవనంపైఉన్న అడ్రస్ మాత్రం మియాపూర్ అనే రాసి ఉంది. అయినా రంగారెడ్డి జిల్లా అధికారులు స్పందించలేదు. రేయింబవళ్లు అధికారుల స్టిక్కర్లగల వాహనాల రాకపోకలు సాగేవని, చిన్నారులను చాలా వేధించేవారని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు. అశ్రమ చిన్నారులే కాకుండా బయట నుంచి కూడా మహిళలు, యువతులు వచ్చి పోయేవారనే ఆరోపణలు ఉన్నాయి. అనాథశ్రమంలో ఉన్న చిన్నారులందరూ రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) సిఫారసు చేసిన వారే ఉండాలి. అధికారిక లెక్కల ప్రకారం ఆశ్రమంలో 49 మంది విద్యార్థులు ఉండాలి కానీ, 60 మంది వరకు బాలికలు ఉండేవారని చెబుతున్నారు. జిల్లా అధికారులకు తెలియకుండా అనాథ పిల్లలు చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధం. తరచూ చిరునామాలు మారుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రంగారెడ్డి జిల్లాలో ఉండాల్సిన అనాథాశ్రమం అమీన్పూర్లో నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు ఆ ఆశ్రమాన్ని కొనసాగిస్తుండటం విశేషం. అధికార యంత్రంగానికి తెలియకుండా నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2005లో మియాపూర్ దీప్తి శ్రీనగర్‌లో ఆశ్రమం నిర్వహించేవారని తెలిసింది. విజయవాడకు చెందిన నిర్వాకురాలు ఇక్కడ స్థిరపడి అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ఆర్ఐలు నుంచి విరాళాలు సేకరించేవారని, చాలా స్వల్పవ్యవధిలో రూ.2 కోట్ల విలువైన భవనం నిర్మించాలరని తెలిసింది. ఆశ్రమం ముసుగులో కొందరు బడా బాబులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఆ కోణంలో కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అనాథాశ్రమానికి నిధులు ఇచ్చే వారికి పూర్తి సొమ్ము ఇచ్చేసి అందులో కొంత సొమ్మును కమిషన్ రూపంలో తీసుకునే ఆశ్రమాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఉలిక్కి పడిన అమీన్పూర్ పటాన్చెరు: అమీన్పూర్లో మరో ‘ముజఫర్‌పూర్’ ఘటన స్థానికులను కదిలించింది. అనాథ బాలికను చిదిమేసిన అంశంపై మానవతవాదులు కదిలిపోయారు. అన్ని టీవీ చానళ్లలోనూ ఈ వార్తపై కథనాలివ్వడంతో అమీన్పూర్ వాసులు ఒక్కసారిగా ఆందోళనకులోనయ్యారు. అమీన్‌పూర్‌లోని మియాపూర్ శివారులో మారుతి అనాథాశ్రమం ఉంది. అందులోని బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రమంలోని మిగిలిన చిన్నారుల విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాలిక మృతికి కారకులైన వారందరినీ శిక్షించాలని వివిధ సంఘాలు, పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్పీ రాజేశ్వర్ సాక్షితో మాట్లాడుతూ బోయిన్‌పల్లిలో కేసు నమోదయ్యిందని, అత్యాచార నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పట్టణ నాయకుడు కె.నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నాయని లలిత ఓ ప్రకటనలో ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వైఎస్సాఆర్సీపీ ఎస్పీ విభాగం జిల్లా అధ్యక్షుడు డప్పు రాజు మాట్లాడుతూ బాలిక మృతికి కారకులైన వారందరినీ గుర్తించాలని, ఆశ్రమ అనుమతులన్ని రద్దు చేయాలన్నారు. -
మరో బాలికపైనా అఘాయిత్యం!
సాక్షి, హైదరాబాద్: అమీన్పూర్ అనాథాశ్రమంలో అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడి మారుతి అనాథాశ్రమంలో ఏడాదిపాటు అత్యాచారానికి గురైన దళిత క్రైస్తవ బాలిక బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. తనలాగే మరో బాలిక కూడా వేధింపులకు గురైందని కొన్నిరోజుల క్రితం ఆమె చెప్పినట్టు మృతురాలి పిన్ని ప్రీతి వెల్లడించారు. ఆ బాలిక సైతం అస్వస్థతకు గురికావడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి నిలదీశారని చెప్పారు. దీంతో అనాథాశ్రమం నిర్వాహకురాలు విజయ బెదిరించడంతో వారు తమ కుమార్తెను తీసుకుని వెళ్లిపోయారని మృతురాలు చెప్పినట్టు వివరించారు. ఓ ప్రైవేటు ఫార్మా కంపెనీలో సూపర్వైజర్గా పనిచేసే ప్రధాన నిందితుడు నరెడ్ల వేణుగోపాల్‌రెడ్డి.. 14 ఏళ్ల బాలికపై ఏడాది పాటు అత్యాచారానికి పాల్పడగా, అనాథాశ్రమం నిర్వాహకురాలు చెలుకూరు విజయ, ఆమె సోదరుడు సూరపనేని జయదీప్ అతడికి సహకరించిన విషయం తెలిసిందే. రెండో బాలికపై సైతం వేణుగోపాల్‌రెడ్డి అత్యాచారం చేశాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనాథాశ్రమానికి తరచుగా ఇతర వ్యక్తులు, దాతలు వచ్చి విజయకు డబ్బులు, స్వీట్లు ఇచ్చి వెళ్లేవారని.. ఈ వ్యవహారంలో వేరే వ్యక్తుల పాత్రా ఉండవచ్చనే అనుమానాలున్నాయి. దర్యాప్తులో నిర్లక్ష్యం..?: గతనెల 31న ఈ ఘటన వెలుగులోకి రాగా, ఈ కేసును లోతుగా దర్యాప్తు జరిపే విషయంలో స్థానిక పోలీసులు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపినట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనాథాశ్రమంలో 70 మందికి పైగా అనాథ, పేద బాలికలు ఉండగా, లాక్డౌన్ ప్రకటించడంతో కొంతమంది తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో లాక్డౌన్లో 49 మంది ఇక్కడ ఆశ్రయం పొందారు. వీరిలో 29 మంది బాలికలు 18 ఏళ్ల వయస్సు లోపు గలవారు ఉన్నారు. కేసు నమోదైన వెంటనే ఇక్కడ ఆశ్రయం పొందిన బాలికలందరినీ మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ నిర్వహించి, వారిపై కూడా ఏమైనా అఘాయిత్యాలు జరిగాయా అనే అంశాన్ని కూపీ లాగడంలో పోలీసులతోపాటు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడు వేణుగోపాల్‌రెడ్డి ‘చేయూత ఫౌండేషన్’పేరుతో చాలాకాలంగా ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడని.. తనకున్న పలుకుబడి, పరిచయాలతో కేసును ప్రభావితం చేశాడని ఎన్జీవోలు ఆరోపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ఓ ముఖ్యురాలితో వేణుగోపాల్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని, కమిటీ సమావేశాల్లో సైతం అతడు కూర్చునేవాడని ఓ ఎన్జీవో ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. రెస్క్యూ చేసిన బాలికలను మారుతి అనాథాశ్రమానికి పంపించాలని ఆమె ఒత్తిడి తెచ్చేదని, లాక్డౌన్ సమయంలోనే 29 మంది బాలికలను అక్కడకు పంపించిందని ఆరోపించారు. దాతల నుంచి విరాళాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులను రాబట్టడంలో వేణుగోపాల్‌రెడ్డి నేర్పరి అని ఎన్జీఓలు పేర్కొంటున్నాయి. సెప్టిసియాతో బాలిక మరణం.. అత్యాచారానికి గురైన బాలిక మర్మాంగాలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడ ఏర్పడిన ఇన్ఫెక్షన్ రక్తంతో పాటు మొత్తం శరీరానికి వ్యాప్తి చెందిందని, దీంతో ఆమె సెప్టిసియాతో మరణించిందని నిలోఫర్ వైద్యులు పేర్కొంటున్నారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతే ఆమె మరణానికి అసలు కారణాలు తెలియనున్నాయి. కాగా, ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన అనాథాశ్రమాలు రాష్ట్రవ్యాప్తంగా 400కి పైగా ఉండగా.. వాటిలో దాదాపు 13వేల మంది బాలికలు ఆశ్రయం పొందుతున్నారు. లాక్డౌన్ ప్రకటించడంతో దాదాపు 9వేల మంది తమ సమీప బంధువుల దగ్గరికి వెళ్లిపోయారని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. మారుతి అనాథాశ్రమం ఘటన నేపథ్యంలో ఇక ఎక్కడైనా ఎవరైనా లైంగిక హింసకు గురయ్యారా లేక వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై అధ్యయనం జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బంధువుల ఇళ్లకు వెళ్లిన బాలికల వద్దకు అంగన్వాడీ వర్కర్లను పం పి వారితో మాట్లాడించనుంది. బాలికల నుంచి ఫిర్యాదులు వస్తే అనాథాశ్రమం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటా మని అధికారవర్గాలు తెలిపాయి. -
మంత్రిగారి తండాలో నాకు ఓట్లు పడలె..!
కురవి: ‘గత ఎన్నికల్లో మంత్రిగారి సొంత తండాలో నాకు ఓట్లు పడలె..’అని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మంత్రి సత్యవతి రాథోడ్ బాధ్యత కలిగిన పదవిలో ఉన్నారు. అదృష్టం బాగుంది. మహిళ అనో.. భర్త లేడనో.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చరిత్రలో ఎవరూ చేయలేని పని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు’అని పేర్కొన్నారు. సత్యవతికి మంత్రి పదవి వచ్చినందుకు తనకు అభ్యంతరం లేదన్నారు. అయితే.. గత సొసైటీ ఎన్నికల్లో పార్టీకి ద్రోహం చేసిన నూకల వేణుగోపాల్‌రెడ్డిని వెంటేసుకొని తిరగడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జెడ్పీటీసీ, ఎంపీపీ ఊర్లో పార్టీ అభ్యర్థి గెలవడు. మంత్రి గారి తండాలో ఓట్లు రావు. పార్టీకి ద్రోహం చేసిన వారి గురించి అసలు పట్టించుకోవడం లేదు.. పైగా నాకు కూడా చెప్పకుండా తన నియోజకవర్గంలో వారిని వెంబడేసుకుని తిరగడం ఎంత వరకు సమంజసమో మంత్రి గారి విజ్ఞతకే వదిలేస్తున్నా’అని రెడ్యానాయక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పిలిస్తేనే ఆ నియోజకవర్గంలో రావాలి.. 33 జిల్లాలు ఉన్నాయి. ఎక్కడన్నా తిరుగు వద్దంటారా? అని ఎద్దేవా చేశారు. తామందరమూ ఒకే పార్టీకి చెందిన వారమని, ఎక్కడైనా వర్గపోరుంటే సరిచేయాలే గానీ, ఇలా వ్యవహరించడం భావ్యం కాదన్నారు. గతంలో కూడా తనను దెబ్బతీద్దామని చూశారని, తాను జాగ్రత్తలు తీసుకోవడానికి వారు నేర్పిన విద్యేనని పేర్కొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పార్టీ ద్రోహులపై ఓ కన్నేసి ఉంచాలని, లేకుంటే ఏనాడైనా దెబ్బతినడం ఖాయమని రెడ్యానాయక్ జోస్యం చెప్పారు. -
దేశంలోనే సరికొత్త చరిత్రకు శ్రీకారం
సాక్షి, విశాఖపట్నం: ‘రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ అనే కార్యక్రమంలో భాగంగా సొంత ఇల్లు లేని అర్హులైన వారికి నివాస స్థల పట్టాల పంపిణీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టారు. గ్రామీణ ప్రాంతంలో ఒకటిన్నర సెంట్లు, పట్టణ ప్రాంతంలో కనీసం ఒక సెంటు చొప్పున ఇంటి స్థలం ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమం అంతా మార్చి 25వ తేదీ ఉగాది రోజున ఒక పండుగలా జరగనుంది. స్థలం ఇవ్వడమంటే పట్టా ఇచ్చేయడమనే గత విధానానికి భిన్నంగా సాగుతుంది ఇప్పటి ప్రక్రియ. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏవిధంగా అయితే లేఅవుట్లు అభివృద్ధి చేస్తారో ఆ మాదిరిగా ప్రభుత్వమే అన్ని ప్రాథమిక వసతులు కల్పించి ఇవ్వాలనేది ఉద్దేశం. అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు ఏర్పాటు చేయడమే గాక ఆ లేఅవుట్లో సామాజిక అవసరాలకు స్థలం కేటాయింపు ఉంటుంది. సరిహద్దులు గుర్తించి, ఆ ప్రకారం రాళ్లు వేయిస్తున్నాం. ఆ స్థలంపై లబ్ధిదారుల కుటుంబంలోని మహిళకు యాజమాన్య హక్కు ఉంటుంది. గతంలో ఇచ్చినట్లు అసైన్డ్ పట్టా మాదిరిగా గాకుండా యాజమాన్య హక్కు పత్రం (కన్వీయన్స్ డీడ్) తయారుచేసి ప్రభుత్వం ఇస్తోంది. అర్హులందరికీ స్థలం కుల, వర్గ, మత, రాజకీయాలకు అతీతంగా ఈ స్థలాల కేటాయింపు కోసం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగింది. ఇంటింటికీ వెళ్లి గ్రామ, వార్డు వలంటీర్లు సర్వే నిర్వహించారు. ఎంపికైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో, మండల కార్యాలయాల్లో ప్రదర్శించాం. దరఖాస్తు చేసుకున్నా కొంతమందికి ఎందుకు అర్హత లేదో స్పష్టంగా పేర్కొంటూ అనర్హుల జాబితాలను ఉంచాం. వాటిపై అభ్యంతరాలను స్వీకరించి పునఃపరిశీలన చేయించాం. ఆ దశలోనూ అర్హులైనవారికి అవకాశం కల్పించాం. జిల్లాలో 2.50 లక్షల మందికి లబ్ధి జిల్లాలో ఇప్పటివరకూ లెక్క తేలిన లబ్ధిదారులు 2.50 లక్షల మంది. గ్రామీణ ప్రాంతంలో సుమారు 66 వేల మంది ఉన్నారు. వారికి ఒకటిన్నర సెంట్లు చొప్పున స్థలం కేటాయించాలంటే లేఅవుట్లు వేసేందుకు 1,613 ఎకరాల భూమి అవసరమవుతోంది. దీనిలో 1,393 ఎకరాలు అంటే దాదాపు 1,400 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించాం. అదీ ఏ గ్రామంలో లబ్ధిదారులకు ఆ గ్రామ పరిధిలోనే స్థలం ఇవ్వాలనేది లక్షం. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. వేరే గ్రామంలో స్థలం ఇచ్చినా అక్కడ నివాసానికి వెళ్లకపోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకూ ఒక గ్రామంలోని లబ్ధిదారుల కోసం ఆ గ్రామ పరిధిలోనే లేఅవుట్ వేయిస్తున్నాం. ప్రభుత్వ భూమి అందుబాటులో లేనిచోట 171 ఎకరాల అసైన్డ్ భూమి మాత్రమే తీసుకున్నాం. జిరాయితీ భూమి ధరతో సమానంగా పరిహారం ఇచ్చిన తర్వాతే వాటిని సేకరించాం. ఇక ప్రభుత్వ, అసైన్డ్ భూమి అందుబాటులో లేనిచోట 47.64 ఎకరాల మేర జిరాయితీ భూమి కూడా తీసుకున్నాం. ఇందుకు రూ.46.83 కోట్ల మేర బిల్లులు పంపించాం. కొంతమందికి ఇప్పటికే ఆ మొత్తం అందింది కూడా. వీఎంఆర్డీఏకు బాధ్యతలు.. విశాఖ మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) అనేది ఒక ప్రభుత్వ సంస్థ. విశాఖ నగర పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి బాధ్యతలు దీనికే ప్రభుత్వం అప్పగించింది. ప్రతి లేఅవుట్‌లోనూ పక్కాగా రోడ్లు, డ్రెయిన్లు, వీధిదీపాల సహా మౌలిక వసతులన్నీ కల్పించి ఇస్తుంది. ఇందుకు రూ.150 కోట్ల వరకూ ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్చి 25వ తేదీన ఉగాది రోజున పట్టాల పంపిణీకి అన్నీ సిద్ధమవుతాయి. 20 బ్లాక్‌ల్లో లేఅవుట్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీఎంఆర్డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఈ బ్లాక్‌లన్నీ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉన్నాయి. వార్డుల వారీ లబ్ధిదారులకు వారికి సమీప బ్లాక్‌లోనే స్థలం కేటాయించేలా మ్యాపింగ్ చేస్తున్నాం. కన్వీయన్స్ డీడ్స్ సిద్ధం చేస్తున్నాం ప్రతి లబ్ధిదారుడికి కేటాయించిన స్థలానికి సంబంధించి కన్వీయన్స్ డీడ్ (ఆస్తి హక్కు పత్రం)ను ప్రభుత్వం ఇస్తుంది. వాటిని లబ్ధిదారుల కుటుంబంలో మహిళ పేరిట అన్ని వివరాలతో సిద్ధం చేస్తున్నాం. పట్టణంలోనే ల్యాండ్ పూలింగ్.. విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)తో పాటు నర్సీపట్నం, యలమంచిలి పురపాలక ప్రాంతాల్లో మొత్తం 1,84,704 మందికి ఇళ్ల స్థలాలకు అర్హులుగా గుర్తించాం. వారిలో 28,152 మందికి టిడ్కో ఇళ్లను కేటాయిస్తాం. మిగతా 1,56,552 మందికి ఇళ్ల స్థలం ఇవ్వాల్సి ఉంది. జీవీఎంసీ పరిధిలోనే సుమారు 1.52 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వారి కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమి సమీకరించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికి 5,200 ఎకరాల భూసమీకరణ ప్రక్రియ పూర్తి అయ్యింది. అసైన్డ్ భూమి అనుభవదారులైన రైతులు, ప్రభుత్వ భూమి ఆక్రమణదారులు చాలామంది తమ ఆమోదం తెలిపారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ లేదు. వారికి ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి చేసిన లేఅవుట్లో స్థలం ఇస్తారని ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. అధికార యంత్రాంగంపై విశ్వాసం ఉంది. తక్కువ ఖర్చుతోనే.. రాష్ట్రంలో ఇంత తక్కువ మొత్తం ఖర్చుతో భూసేకరణ పూర్తి అయ్యింది మన జిల్లాల్లోనే. దాదాపుగా ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమినే లేఅవుట్ల కోసం వినియోగిస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో మొత్తం 845 లేఅవుట్లు వేస్తున్నాం. వాటిలో 493 లేఅవుట్లు అన్ని విధాలా సిద్ధమయ్యాయి. వాటిలో 33,192 ప్లాట్లను సిద్ధం చేసేశాం. మిగతావి కూడా మరో ఒకటీ రెండు వారాల్లో సిద్ధమవుతాయి. -
ఆదివారాలూ ఆధార్ సేవలు
సాక్షి, హైదరాబాద్: ఆధార్ కార్డులో మార్పుల కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆఫ్‌లైన్‌లో నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూఐడీఏఐ ఆధ్వర్యంలో నగరంలోని మాదాపూర్‌లో ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కేంద్రం ఆదివారం కూడా పనిచేస్తుంది. భారత ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేసే ఈ కేంద్రాన్ని మాదాపూర్ విఠల్‌రావునగర్‌లోని రిలయన్స్ సైబర్విల్లే ప్లాట్ నంబర్ 17–24 లలో ప్రారంభించారు. యూఐడీఏఐ వెబ్సైట్ uidai.gov.in ద్వారా ప్రజలు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకొని ఈ కేంద్రంలో తమకు కావాల్సిన సేవలను పొందవచ్చని ఆధార్ రాష్ట్ర డిప్యుటీ సెక్రటరీ గడ్డం వేణుగోపాలరెడ్డి తెలిపారు. -
జేఎన్టీయూహెచ్లో అధ్యాపకుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్లో 186 అధ్యాపకుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఇప్పటికే 32 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ కాగా, మిగిలిన 154 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ కానున్నాయి. జేఎన్టీయూహెచ్ హెడ్‌క్వార్టర్స్‌తోపాటు హైదరాబాద్, జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీ లో భాగంగా ఈ నియామకాలను చేపట్టను న్నారు. జేఎన్టీయూహెచ్లో మొత్తం 410 అధ్యాపక పోస్టులుండగా, తాజాగా ఖాళీల సంఖ్య 260కు పెరిగిందని జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఖాళీలు 186గా ఉన్నప్పుడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఆ తర్వాత జరిగిన పదవీ విరమణలతో ఈ సంఖ్య 260కు పెరిగిందన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు ఈ ఖాళీలు భర్తీ చేస్తా మన్నారు. ఈ నెల 26న జవహర్లాల్ నెహ్రూ ఆడిటోరియంలో సాయంత్రం 3 గంటలకు వర్సిటీ స్నాతకోత్సవం జరగనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. స్నాతకోత్సవంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ యూబీ దేశాయ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నామని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ నియామకాల్లో జేఎన్టీయూహెచ్ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు 721 మంది ఎంపికయ్యారన్నారు. మైక్రోసాప్ట్, ఐబీఎం వంటి 52 కంపెనీలు క్యాంపస్ నియామకాల్లో పాల్గొన్నాయని చెప్పారు. -
కులరహిత సమాజం దిశగా...
అస్పృశ్యతపై సాగుతున్న పోరాటం ఫలించాలంటే కులాంతర వివాహం చేసుకున్న వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనం చేయాలి. ఒకటి రెండు తరాల పిదప ఎవరి కులం ఏమిటో తెలియని పరిస్థితే కులాతీత సమాజానికి నాంది. గుణకర్మలను అనుసరించి చాతుర్వర్ణాలు ఏర్పడ్డాయన్న గీతావాక్యానికి ఎప్పుడు, ఎవరు సవరణ తెచ్చారో తెలీకుండానే హిందూ సమాజంలో పంచముల పుట్టుక, అంట రానితనం చోటు చేసుకున్నాయి. ఆర్థిక, సాంఘిక, రాజకీయ సాంస్కృతిక పరిస్థితుల్లో మార్పుల ఫలితంగా సమాజంలో పొడసూపిన కొన్ని రుగ్మతలు స్వల్పకాలంలో సర్దుకోవడాన్ని చూస్తుంటాం. అలా సమసిపోని రుగ్మతలు సాంఘిక దురాచారాలుగా బలం పుంజుకుని స్థిరపడతాయి. అంటరానితనం సైద్ధాంతిక దోషమని ప్రకటిం చిన ఆది శంకరులు కాశీ నగరంలో మానిషా పంచకం వెలువరించారు. వారి బోధను ఆచరించడం ఇష్టంలేని పెద్దలు ఆ చారిత్రక ఘట్టాన్ని తమకు సానుకూలంగా మార్చుకున్నారు. అంటరానితనాన్ని రూపుమాపడానికి మానిషా పంచక శక్తి చాలలేదు కానీ, సామాజిక సమరసతకు ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతం ఊతమిచ్చింది. ఆ తరువాత రామానుజుల నుంచి గాంధీజీ వంటి సంస్కర్తలెందరో అంటరానితనాన్ని రూపు మాపాలని ప్రయత్నించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిబా ఫూలే, డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ వంటి పలువురు మహనీయులు పోరాడారు. సమాజ ప్రగతికి కుల వ్యవస్థ అవరోధంగా మారిందని వంద ఏళ్ల క్రితమే హిందూ సమాజం గ్రహించింది. ఆర్యసమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి, శ్రద్ధానంద వంటి సంస్కర్తలు కులభేదాలను నిర్మూలించాలని ప్రయత్నించారు. ఆంధ్రప్రాంతంలో గోరా వంటి నాస్తికోద్యమకారులు కులనిర్మూలనకు కృషిచేశారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొంటూనే వైద్య పట్టభద్రులు ఒకరు విభిన్నంగా ఆలోచించారు. ఇతరులతో పోల్చితే అన్ని అంశాల్లో సర్వ ప్రథమంగా నిలచిన జాతి కేవలం కుల భేదాలవల్ల విఘటితమై బలహీనపడిందని, కొద్దిమంది విదేశీయుల చేతిలో పరాజిత అయి, బానిసగా మిగిలిం దని నిర్ధారించారాయన. అసలు రుగ్మతకు చికిత్స జరపడమే సరయిన పరిష్కారం అని భావించిన డా.కేశవరావు బలిరామ్ హెగ్డెవార్ కులాలకు అతీతంగా హిందూ సమాజాన్ని ఐక్యం చేయాలని సంకల్పిం చారు. హిందూ సమాజ ఐక్యతలో భాగంగానే అంట రానితనం అంతం కావాలని ఆయన ఆశించారు. అంటరానితనం నేరం కాకపోతే మరేదీ నేరం కాదని ఆరెస్సెస్ అధినేత బాలాసాహెబ్ దేవరస్ అన్నారు. రాజకీయ సమానత్వం ద్వారా దళితులకు సామాజిక సమానత్వం ప్రాప్తిస్తుందని అంబేడ్కర్ భావిం చారు. ఆ దృష్టితోనే ఆయన రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పొందుపరిచారు. స్వతంత్ర భారత పాలకులు రాజ్యాంగాన్ని సక్రమంగా అమలుపరుస్తారని, రిజర్వేషన్ సౌకర్యాలను ఉపయోగించుకుని ఆయా వర్గాల ప్రజలు పదేళ్ల కాల వ్యవధిలో విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అభ్యున్నతి సాధిస్తారని ఆయన ఆశించారు. కానీ అధికార పీఠాలను అధిష్టించిన పెద్దల అల్పబుద్ధి కారణంగా రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి మూడు దశాబ్దాలు గడచినా దళితవర్గాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుందని 1980లలో గణాంకాలతో సహా ఏబీ వాజ్‌పేయి పార్లమెంటులో ఎలుగెత్తిన పిదప కొంత కదలిక మొదలైంది. అమానవీయ నేరాల నిరోధానికి 1955లో ఏర్పడిన చట్టం 1976లో పౌరుల హక్కుల రక్షణ చట్టంగా రూపాంతరం చెందింది. అయినా ఫలితం కనిపించక ప్రజాందోళనల నేపథ్యంలో 1989లో దానికి సవరణలు తెచ్చారు. ఆపైన అది ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంగా పేరొంది ప్రచారంలోకి వచ్చింది. చాలాకాలం పాటు కాగితం పులిగా పేరుపడిన ఈ చట్టం ఖాకీలకు దయ, ధైర్యం కలిగినప్పుడు అడపాద డపా ఊపిరి పోసుకునేది. న్యాయస్థానాల ధోరణి కూడా భిన్నంగా లేదు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం దుర్వినియోగమవుతోందనే ఆరోపణపై ఆదేశాలు జారీ చేసే ముందు ఆరుదశాబ్దాల తర్వాత కూడా దళితులు రిజర్వేషన్లు అడుక్కునే పరిస్థితి నుంచి బయట పడలేకపోవడానికి కారకులెవరని ఆలోచించి ఉండాల్సింది కాదా! దళిత ఆవేదనను ఆకళింపు చేసుకోగల హృదయాలు మన న్యాయవ్యవస్థలో ఉన్నత స్థానాల్లో లేకపోవడం దళిత పక్షానికి శాపమైందని బీజేపీ మాజీ అధ్యక్షులు స్వర్గీయ బంగారు లక్ష్మణ్ వెల్లడించిన ఆవేదన అర్థం చేసుకోతగినదే. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్న ఆయుర్వేద సూత్రాన్ని అనుసరించి స్వార్థపరుల ప్రతిక్రియకు విరుగుడు వ్యూహాన్ని స్వార్థం ఆసరాగానే అమలు చేయాలి. కులం పేరిట స్వప్రయోజనాలను పండించుకోడానికి విశాల హిందూ సమాజ ప్రయోజనాలను తుంగలో తొక్కే స్వార్థపరులను స్వార్థం ఆసరాగానే దారికి తేవాలి. ఎస్సీ, ఎస్టీలతో పాటు కులాంతర వివాహం చేసుకున్న వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనం చేయాలి. ఇది అంత సులువు కాదు. కానీ ఒకటి రెండు తరాల పిదప ఎవరి కులం ఏమిటో తెలియని పరిస్థితి దాపురించి, రిజర్వేషన్ సౌకర్యం పొందడానికి కులాంతర వివాహం చేసుకోవాలని ప్రయత్నించడం కష్టమై కులాలకు అతీ తంగా సమాజం పురోగమించగలదు. వ్యాసకర్త అధ్యక్షులు, ఏకలవ్య ఫౌండేషన్ పి. వేణుగోపాల్ రెడ్డి మొబైల్ : 77022 52011 -
ప్రతి కళాశాల ప్రమాణాలు పాటించాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలు నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటించాల్సిందేనని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ వేణుగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో కళాశాల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కాలేజీలో బయోమెట్రిక్ హాజరు విధానం తప్పనిసరిగా అమలు చేయాలని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అనుబంధ గుర్తింపు పొందాలంటే గత మూడేళ్లుగా 25 శాతానికి పైగా అడ్మిషన్లు ఉండాలని, ఉత్తీర్ణత శాతం కూడా మెరుగైన రీతిలో ఉండాలని స్పష్టం చేశారు. కళాశాలల్లో కనీస వసతులు ఉంటేనే అనుబంధ గుర్తింపు ఇస్తామని పేర్కొన్నారు. అయితే అనుబంధ గుర్తింపునకు గత మూడేళ్ల ప్రవేశాలకు బదులుగా ఇప్పటినుంచి మూడేళ్ల ప్రవేశాల తీరును పరిగణలోకి తీసుకోవాలని పలు కాలేజీల యాజమాన్యాలు సూచించినట్లు తెలిసింది. అనుబంధ గుర్తింపునకు, ఉత్తీర్ణతకు ముడిపెట్టొదని యాజమాన్యాలు కోరినట్లు సమాచారం. -
నంద్యాల డీఎస్పీగా వేణుగోపాల్‌కృష్ణ
కర్నూలు : పోలీసు శాఖలో డీఎస్పీల బదిలీలు ప్రారంభమయ్యాయి. మొదటి విడత రాష్ట్రంలో 17 మందికి స్థానచలనం కల్పిస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీఎస్పీ కర్నూలు రెండవ పటాలంలో అసిస్టెంట్ కమాండెంట్‌గా (డీఎస్పీ) పనిచేస్తున్న ఎస్.వేణుగోపాలకృష్ణను నంద్యాలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన ఈయన 1989లో ఎస్ఐ హోదాలో పోలీసు శాఖలో చేరారు. జిల్లాలోని చాగలమర్రి, ఉయ్యాలవాడ, మహానంది, గడివేముల, కోవెలకుంట్ల, శిరివెళ్ల, మిడుతూరు, ఎమ్మిగనూరు రూరల్, కొలిమిగుండ్ల డీసీఆర్బీలో సేవలు అందించారు. 2003లో సీఐగా పదోన్నతి పొంది శ్రీశైలం, ఎమ్మిగనూరు, ఎమ్మిగనూరు రూరల్, జమ్మలమడుగు అర్బన్, బనగానపల్లె, డీసీఆర్బీ కర్నూలులో పనిచేశారు. 2012లో డీఎస్పీగా పదోన్నతి పొంది తిరుపతి రైల్వే, చిత్తూరు సీసీఎస్‌లో పనిచేసి ఏడాదిన్నర క్రితం కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలానికి వచ్చారు. హరినాథరెడ్డిని విజయవాడ చీఫ్ ఆఫీస్‌లో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులో పేర్కొన్నారు. -
ఈ పాక్షిక దృష్టి ప్రమాదకరం
రాంనాథ్ కోవింద్, మీరా కుమార్‌లు దళితులైనందువల్లనే రాష్ట్రపతి పదవికి అభ్యర్థులుగా ఎంపికైనారన్నది మీడియా వాదన. వారికున్న సమర్థతల గురించిన చర్చ జరగనే లేదు. ఇద్దరూ సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నవారు, విద్యావంతులు, సమర్థులు కూడా అన్న అంశాలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వకుంటే ఎలా? రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. రాబోయే ఫలితం గురించి అనుమానాలు ఎవరికీ లేకపోయినా మరో నెల రోజులపాట ఇందుకు సంబంధించిన చర్చ మీడియాలో కొనసాగుతుంది. ఈ ఎన్నికలో రాజకీయ పక్షాల పాత్రతో పాటు మీడియా ప్రమేయం గురించి కూడా సమీక్షించుకోవాలి. రాబోయే తరం కోసం యోచన చేసే స్థాయి నుండి కేవలం రాబోవు ఎన్నికల్లో సానుకూల ఫలితాల సాధన కోసం పరితపించే స్థాయికి మన దేశ రాజకీయ రంగం ఏనాడో దిగజారింది. పార్టీల పేర్లు, జెండాలు, సిద్ధాంతాలు వేరైనా, రాజకీయ పక్షాలన్నీ కాంగ్రెస్ సంస్కృతిని ఒంటబట్టించుకున్నాయి. అయితే ప్రజల పక్షాన, ప్రత్యేకించి పీడితుల పక్షాన నిలచి పోరాడాల్సిన మీడియా పయనం గురించి చర్చించక తప్పదు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దాదాపు 60 ఏళ్ల పాటు భారత్‌లో కాంగ్రెస్ ఆధిపత్యం నడిచింది. ప్రతిపక్షాలు, ప్రాంతీయ పక్షాల బలం పెరి గిన తర్వాత పోటీ అనివార్యమైంది. నెమ్మదిగా ఓటుబ్యాంకు రాజకీయ వ్యూహాలు ప్రారంభమయ్యాయి. తమ పార్టీ దళితులు, మైనారిటీల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందన్న ప్రచారాలకు తెరలెత్తాయి. ప్రస్తుతం ఇది అనివార్యమే కావచ్చు. ఈ అంశంలో మీడియా పాత్ర ఏమిటి? సామాజిక అసమానతలను కాస్తయినా తగ్గించాలనే సంకల్పంతోనే రిజర్వేషన్లను ప్రవేశపెట్టారు. పరిపాలనలోను, దేశ ప్రగతిలోను అందరూ భాగస్వాములు కావడానికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు తప్పనిసరి అవుతాయన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పే బాధ్యతను మీడియా నుంచి ఆశించడం సహజం. అయితే ఆ దారిలో మీడియా పయనిస్తున్నదా? నేటి రాష్ట్రపతి ఎన్నికనే తీసుకుందాం. ఎన్డీఏ తన అభ్యర్థిగా రాంనాథ్ కోవింద్‌ను ప్రకటించింది. ఎన్డీఏ నిర్ణయాన్ని కేవలం దళితులను తన అక్కున చేర్చుకొనే వ్యూహంగా మాత్రమే అధిక శాతం మీడియా అభివర్ణించింది. అంతేకాదు; కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు మరో దళిత అభ్యర్థి మీరాకుమార్ను పోటీలోకి దించడం ద్వారా ఎన్డీఏ వ్యూహాలను దెబ్బతీసిందన్న అంశానికే మీడియా అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. రాంనాథ్ కోవింద్, మీరా కుమార్‌లు కేవలం దళితులైనందువల్లనే ఎంపికైనారన్నది మీడియా వాదన. వారికున్న సమర్థతల గురించిన చర్చ జరగనే లేదు. ఇద్దరూ సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నవారు, విద్యావంతులు, అత్యంత సమర్థులు కూడా అన్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యతను మీడియా స్వీకరించలేదు. ఇది పక్షపాత ధోరణి కాదా? జాతీయ నాయకుల్లో సామాజిక పోరాటాలను నిర్వహించిన యోధుల్లో డాక్టర్ అంబేడ్కర్‌ది తప్ప మరొకరి పేరు ఎక్కడైనా కనిపిస్తుందా? ఈ మధ్య జ్యోతీరావ్ పూలే పేరు అక్కడక్కడా కనిపిస్తున్నది. సమత కోసం ఉద్యమించిన భాగ్యరెడ్డి వర్మ లాంటి వారు కోకొల్లలు. వెతికే దృష్టికోణం లేకనా లేక మీడియాకు మనసే కరువైనదా? ఈనెలలోనే మనలను తొలచిన వార్త డాక్టర్ సి నారాయణరెడ్డి మరణం. వారి రచనా వైదుష్యాన్ని, అత్యున్నత స్థాయిలో మీడియా ప్రజల ముందుంచింది. అయితే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ స్వర్గస్థులైన సందర్భంగా మీడియా ఇంతగా స్పందించిందా? గుర్రం జాషువా, భోయి భీమన్నలను సాహితీ సంస్థలు ఎలాగూ పట్టించుకోవు. కానీ మీడియాలో వీరి స్థానం ఏమిటి? ప్రజల మనస్తత్వాన్ని మలచవలసిన మీడియా తన వంతు పాత్రను పరిహరించడం ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదం. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపా రాష్ట్ర అధ్యక్షునిగాను, జాతీయ అధ్యక్షునిగాను పనిచేసిన ప్రముఖుడు బంగారు లక్ష్మణ్. సిద్ధాంత స్పష్టత, యోగ్యమైన కార్యాచరణ, అర్థవంతమైన మార్గదర్శనం చేయడంలో రాష్ట్ర బీజేపీ నాయకుల్లో ఆయన అత్యంత సమర్థుడు. 20 ఏళ్లపాటు వారితో కలిసి రాజకీయ క్షేత్రంలో పనిచేసిన అనుభవంతో నేనీ విషయాన్ని చెబుతున్నాను. కానీ, వారిపై వచ్చిన అవినీతి కేసుకే మీడియా ప్రాధాన్యతనిచ్చింది. ఇంకెవరూ ఇలాంటి కేసుల్లో లేనట్లు భ్రమపడేలా, ‘రాజకీయ రంగంలో అవినీతి’ అనే అంశం వచ్చినప్పుడల్లా బంగారు లక్ష్మణ్ అవినీతి క్లిప్పింగును పదే పదే చూపడం ద్వారా తన దళిత వ్యతిరేకతను చూపకనే చూపింది. ప్రముఖ జర్నలిస్టు బిలాల్ జైదీ ఈ నెల 21వ తేదీన తన ఫేస్బుక్ పేజీలో రాసిన అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించడం అవసరం. నితిన్ గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఉన్న కాలంలో పార్టీ అధికార ప్రతి నిధుల్లో రాంనాథ్ కోవింద్ కూడా ఉన్నారు. వివిధ అంశాల మీద పార్టీ దృక్పథాన్ని స్పష్టంగా చెప్పగల సమర్థుడు కూడా ఆయన. అయినా మిగి లిన అధికార ప్రతినిధులైన రవిశంకర ప్రసాద్, రాజీవ్ ప్రతాప్ రూఢీ, ప్రకాశ్ జవదేకర్ల స్పందనల కోసమే మీడియా పాకులాడేది. పార్టీ మీడియా కో ఆర్డినేటర్ శ్రీకాంత్ శర్మ ఎన్నో సందర్భాల్లో రాంనాథ్ కోవింద్ స్పందనను తీసుకోవాలని కోరినా, మీడియా సుముఖత చూపలేదనేది బిలాల్ జైదీ అభిప్రాయం. ఇలాంటి ధోరణి సామాజిక సమతకు దోహదకారేనా? బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు విడిగా కేటాయింపులు ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయి. అయితే కేటాయించిన సొమ్మును సబ్ ప్లాన్ల కోసం ఖర్చుపెట్టిన దాఖలాలే కరువైనాయి. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ప్రజా ప్రతినిధులుగా ఎంతో మంది ఎన్నికైనారు. ఎన్నికవుతున్నారు. రాజ కీయ పక్షాలు, ప్రభుత్వ యంత్రాంగాల మిలాఖత్తోనే ఈ అకృత్యాలు కొనసాగుతున్నాయి. స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఇటువంటి సంఘటనలను మీడియా ఎన్నడైనా బట్టబయలు చేసిందా? ఆర్థిక అంతరాలు తగ్గాలని, సామాజిక అంతరాలు, ఆర్థిక పీడన అంతం కావాలని అందరం అంగీకరిస్తాం. ఈ పరిణామాలు కేవలం చట్టాలతో సాధ్యమయ్యేవి కావు. మానసిక పరిణతితో మాత్రమే ఇవి సాధ్యం. విజ్ఞులైన పౌరుల ప్రయత్నాలకు మీడియా తోడు ఉన్నప్పుడే ఈ అవలక్షణాలను అధిగమించగలుగుతాము. రాబోయే నెల రోజుల కాలంలో భారతదేశ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఆరోగ్యవంతమైన చర్చ మీడియాలో జరగాలి. రాంనాథ్ కోవింద్, మీరాకుమార్ దళిత కులాల్లో పుట్టిన వారు మాత్రమే కాదు. విద్యావంతులు, మేధావులు, వివిధ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. ఉన్నత స్థాయి భారతీయ పౌరులు కూడా. అందరి శక్తియుక్తులు సమాజ ప్రగతికి ఉపయుక్తంగా రూపొంది, ఏకోన్ముఖంగా సమాజం ముందుకు సాగడానికి మన మీడియా సంధాన కర్తగా నిలవాలి. అంతరాలు తగ్గి, నవ సమాజ నిర్మాణం దిశగా అడుగులు వేయాలంటే బాధ్యతాయుతమైన మీడియా ఈ దిశలో ముందుకు సాగక తప్పదు. చివరిమాట: రిజర్వేషన్లు లేని ఒలింపిక్ క్రీడారంగంలో భారత్ ఎన్నవది? ఇందులో పతకాల సాధనకు ఏ అసమర్థతలు అడ్డం వచ్చాయి? అసమాన ధైర్య స్థైర్యాలతో విజయవంతంగా ఎవరెస్టును అధిరోహించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వన్నె తెచ్చిన పదకొండుమంది చిరంజీవులు ఎస్టీ, ఎస్సీలే సుమా! పి.వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్, మొబైల్ : 94904 70064 -
పాడి సంతలైన పశువుల సంతలు
సందర్భం కేంద్ర ప్రభుత్వం జంతువుల మార్కెట్ల క్రమబద్ధీకరణపై తీసుకొచ్చిన కొత్త నిబంధనల్లో గొడ్డు మాంసాన్ని నిషేధించలేదు. కేంద్రం అన్ని వాస్తవాలను సవివరంగా ప్రజానీకానికి వెల్లడిస్తే.. అసంపూర్తి సమాచారంపై ఆధారపడిన రాజకీయ పగలను నివారించవచ్చు. భారత ప్రభుత్వ పర్యావరణం, అడవుల మంత్రిత్వశాఖ 2017 మే 23న అన్ని రాష్ట్రాలలోను జంతువుల మార్కెట్లను క్రమబద్ధీకరించడానికి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ మార్కెట్లు రైతులకు మాత్రమే ఉద్దేశించినవి. ఇక్కడ రైతులు వ్యవసాయ అవసరాల కోసం పశువులను కొనవచ్చు, అమ్మవచ్చు. జంతువులSపట్ల క్రూరత్వ నివారణ చట్టం క్రింద ప్రకటించిన ఈ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు.. 1. జిల్లా జంతువుల మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయాలి. 2. పశు వైద్యసేవలు, ఆశ్రయం, నీరు, పశుగ్రాసం వంటి అన్ని రకాల సౌకర్యాలను నిర్వహిం చాలి. ఈ నిబంధనలు ఆవులు, దూడలు, గేదెలు, ఒంటెలు, కోళ్ళు వంటి వాటికి వర్తిస్తాయి. కాని గొర్రెలకు, మేకలకు కాదు. ఈ వార్త మీడియాలో మే 25వ తేదీన వెలుగు చూసింది. 29వ తేదీన మద్రాస్ హైకోర్టు (మదురై బెంచి)లో కొందరు రాజ్యాంగ పరమైన అంశాలుపైకి చాలెంజ్ చేస్తే ఈ నోటిఫికేషన్‌ను నాలుగు వారాల పాటు స్టే ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ఫెడరల్ వ్యవస్ధని దెబ్బ తీస్తుంది కనుక దీన్ని మేం అమలు చేయమని ఒక సీఎం అన్నాడు. ఇంకో సీఎం అయితే తామే మిగిలిన సీఎంల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తాం అన్నాడు. మరో సీఎం ఇది కేంద్ర నోటిఫికేషన్, దీన్ని అమలు చేయకండి అని మాంస వ్యాపారాలకు పత్రికా ముఖంగా పిలుపునిచ్చాడు. ఒక పార్టీ కార్యకర్తలు బీఫ్ పెస్టివల్ పెట్టి ఒక దూడనే క్రూరంగా, అన్యాయంగా, చట్ట విరుద్ధంగా చంపి బహిరంగ విందు చేసుకున్నారు. మరిన్ని స్వచ్ఛంద సంస్థలు, కొందరు విశ్లేషకులు, పరిశోధకులు, వకీళ్లు మీడియా ద్వారా కేంద్ర నోటిఫికేషన్ని వ్యతిరేకిస్తూ రకరకాల వాదనలు చేస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం, పశువుల పెంపకం రాష్ట్రాల పరిధిలోకి వచ్చే అంశాలు అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఎందుకు ప్రకటించింది అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. 2014 నుంచి జరిగిన కొన్ని చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే అటువంటి ప్రశ్నలకు జవాబు లభిస్తుంది. ఆ వాస్తవాలు క్లుప్తంగా ఇలా ఉన్నాయి: గౌరి మలేఖ అనే జంతు సంక్షేమ కార్యకర్త సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 881/2014 నంబరుతో 2014లో దాఖలైన ఈ వ్యాజ్యంపై విచారణ 14 అక్టోబర్ 2014న మెుదలైంది. నేపాలీ హిందువులు ప్రతి ఐదేళ్లకోసారి గథిమా పండుగ జరుపుతారు. ఈ పండుగ ఆచారాలలో భాగంగా లక్షలాది పశువులను బలి ఇస్తారు. 2014లో జరిగిన పండుగలో దాదాపు 2.5 లక్షల పశువులను బలి ఇచ్చారని అంచనా. దీని కోసం మనదేశం నుండి లక్షల సంఖ్యలో పశువుల అక్రమ రవాణా జరుగుతోంది. ఇలా జరుగుతున్న పశువుల అక్రమ రవాణాను నిరోధించడం ఈ వ్యాజ్యంలో ప్రధాన అభ్యర్థన. ఈ అక్రమ రవాణా వలన మన సరిహద్దు భద్రతాదళం వివిధ కార్యాచరణ సమస్యలను ఎదుర్కొంటోంది. హోం మంత్రిత్వశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీ 203 సంఖ్య గల నివేదికలో పశువుల అక్రమ రవాణా గురించి చర్చిం చింది. నివేదికలో పేర్కొన్న గణాంకాల ప్రకారం ప్రతి ఏటా లక్షలాది పశువులను సరిహద్దు భద్రతా దళం స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపింది. సాధారణంగా ఈ విధంగా స్వాధీనం చేసుకున్న పశువులను కస్టమ్స్ శాఖకు అప్పగిస్తారు. గడచిన సంవత్సరాలలో వీరు స్వాధీనం చేసుకున్న పశువుల సంఖ్య : 2012–1,20,724, 2013–1,22,000, 2014–1,09,999, 2015–1,53,602. కమిటీ నివేదిక పేరా 2.6.9 లో ఈ విధంగా సిఫారసు చేసింది. ‘‘అన్ని రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్, అస్సాం వైపు పశువుల సామూహిక గమనం జరుగుతున్నదని కమిటీ అంగీకరిస్తోంది. సరిహద్దు రాష్ట్రాల వైపుగా జరుగుతున్న పశువుల గమనాన్ని ఆపడంలో వివిధ రాష్ట్రాల పోలీసు దళాలు విఫలమయ్యాయని, పశువుల కదలికలను అడ్డుకోవడంలోను లేదా ఆపడంలోను పశ్చిమ బెంగాల్ పోలీసులు విఫలమయ్యారని కమిటీ భావిస్తోంది. లోతుగా పాతుకుపోయిన దుష్ట సంబంధాలే ఈ సమస్య విస్తరించడానికి కారణమని, దీనిని పూర్తిగా నివారించేందుకు ప్రభుత్వం ఈ మూలాలపై దెబ్బతీయాలని కమిటీ భావిస్తోంది’’. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒడిశా, త్రిపుర, రాష్ట్ర ప్రభుత్వాలను కక్షిదారులుగా చేర్చింది. పశువుల అక్రమ రవాణాను నిరోధించడానికి ముసాయిదా మార్గదర్శకాలు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సరిహద్దు భద్రతా దళం డైరెక్టర్ జనరల్‌ను సుప్రీంకోర్టు కోరింది. ఈ వ్యాజ్యంపై విచారణ 14 సార్లు జరిగింది. 12 జూన్ 2016 న సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చింది. వీటి ప్రకారం జంతువుల పట్ల క్రూరత్వ నివారణ చట్టం క్రింద నిబంధనలను మూడు నెలలలోపు ప్రకటించాలని కేంద్ర పర్యావరణం, అడవుల మంత్రిత్వశా ఖను కోరింది. తదనుగుణంగా 16 జనవరి 2017న పర్యావరణం, అడవుల మంత్రిత్వశాఖ ముసాయిదా నిబంధనలను విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలను, సలహాలను ఆహ్వానించింది. కొత్త నిబంధనల ప్రకారం జంతువుల మార్కెట్లు రైతుల కోసం ఉద్దేశించినవి కనుక, అక్కడ వ్యవసాయేతర అవసరాలకు జంతువులను కొనాలనే వారుగాని, అమ్మాలనుకునే వారుగాని, వధశాలల ప్రతినిధులు గాని వ్యవహారాలు జరుపకూడదు. వధించడం కోసం జరిగే జంతువుల క్రయ, విక్రయాలు ఈ మార్కెట్ల వెలుపలే జరగాలి. అయితే, ఆ విధంగా విక్రయించే అన్ని జంతువుల ఆరోగ్యం గురించి పశువైద్యులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. 31 మే 2017 న కేరళ హైకోర్టు ఈ నియమాల రాజ్యాంగ బద్ధతను ధ్రువీకరిస్తూ, ఈ నియమాలు గొడ్డు మాంసాన్ని నిషేధించలేదని, యదార్థంగా ఈ నియమాలను పూర్తిగా చదవకుండానే ప్రజలు స్పందిస్తున్నారని చెబుతూ, దీనిపై వచ్చిన అభ్యర్థనను రద్దు చేసింది. పై వివరణను అర్థం చేసుకున్న వాళ్లకి కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్య నిస్సందేహంగా సత్యమనే అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నియమాలను ప్రకటించే ముందు అన్ని వాస్తవాలను సవివరంగా ప్రజానీకానికి వెల్లడిస్తే ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాలను ప్రజలు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, దాంతో ప్రజాధన వృధాను, అసంపూర్తి సమాచారంపై ఆధారపడిన రాజకీయ పగలను నివారించవచ్చు. వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ ఛైర్మన్ పి. వేణుగోపాల్ రెడ్డి 9490470064 -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట విద్యుత్ శాఖ ఏఈ నంగు వేణుగోపాల్‌రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం చిక్కాడు. మోమిన్‌పేట మండలానికి చెందిన ఓ రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆ పని పూర్తి చేయటానికి రూ.25 వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశాడు. దీంతో సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అధికారుల సూచనల మేరకు రైతు నగదును ఏఈకి తార్నాకలో అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఏఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. -
కేంద్రం నిధులతోనే రాష్ర్టంలో పనులు
హన్మకొండ అర్బన్ : కేంద్రం నిధులతోనే రా ష్ర్టంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్ నరహరి వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సుమారు 8వేల గ్రామ పంచాయతీల కు కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో ఒక్కో పంచాయతీకి రూ.80 లక్షలకు పైగా నిధులు ఇచ్చిం దని ఆయన పేర్కొన్నారు. శనివారం హన్మకొండలో పార్టీ జిల్లా అధ్య క్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజెక్టుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కరువు సాయం కూడా ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణకు ఎక్కువ మొత్తంగా రూ.791కోట్లు ఇచ్చిందన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో బయో డైవర్సిటీ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు రూ.350 కోట్లు, హరిటేజ్ పథకం కింద రూ.21కోట్లు మునిసిపాలిటీలకు కేటాయించిం దని తెలిపారు. రూ.100 కోట్ల సబ్సిడీతో వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు మంజూరు చేస్తే ఇంత వరకు రాష్ట్రం ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని తెలిపారు. రాష్ట్రంలో 24 వేల మంది చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కేంద్రం కల్పించిందన్నారు. తెలంగాణలోని 12 నగరాలు అమృత్ పథకంలో ఎంపిక చేసి రూ. 100 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోం దని తెలిపారు. రాష్ట్రానికి పసుపు బోర్డు, పత్తి పరిశోధన కేంద్రం మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పనులు ముందుకు సాగనివ్వడం లేదని చెప్పారు. రూ.1200 కోట్లతో బీబీనగర్ వద్ద మంజూరు చేసిన ఎయిమ్స్‌కు ఇప్పటివరకు స్థలం కేటాయించలేదన్నారు. ఈజీఎస్, భూముల సర్వే కోసం కేంద్ర ఇచ్చిన నిధులు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. తమిళనాడు, ఏపీ, కర్నాటక వ ంటి రాష్ట్రాలు నాణ్యమైన విద్యత్ 24గంటలు అందిస్తున్నాయని, తెలంగాణలో మాత్రం 9గంటల విద్యుత్ విషయంలో ప్రకటనలకే పరిమితమైందని వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. కనీసం 5గంటల విద్యుత్ కూడా రైతాంగానికి అందడం లేదని, ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఒక్క ప్రాజెక్టు కోసం కూడా కేంద్రం వద్ద రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు లేవని, ఒక వేళ ఉన్నట్లు చూపితే తామే మంత్రి ఉమాభారతితో మాట్లాడి మంజూరు చేయించుకువస్తామని అన్నారు. పాలిచ్చే ఆవులాగా ఉన్న కేంద్రం ప్రభుత్వం నుంచి రాష్ట్రం ఉన్నకాడికి పిండుకుంటోందని, పైగా ఆరోపణలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ పాపం రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతుందని శాపనర్ధాలు పెట్టారు. మిగులు బడ్జట్‌తో ఏర్పడిన తెలంగాణ ఆదాయం ఏమవుతుందో తెలియజేయాలని, తెలంగాణ ఆస్తులు ఏమేరకు పెంచారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఫసల్ బీమాపై ప్రభుత్వం నిర్లక్ష్యం కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బీజేపీ తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్ నరహరి వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాకు ఎస్సారెస్పీ నీరు రాకుండా కేటీఆర్, హరీష్‌రావు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కిట్స్ కళాశాల సమీపంలో కాల్వకు గండి కొట్టి జిల్లాకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రాజెక్టులకు దరఖాస్తు చేయడం లేదని, రూ.వేల కోట్ల నిధులు ఇస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని చెప్పారు. 2014-15లో రూ.15 వేల కోట్లు, 15-16లో రూ.5వేల కోట్ల ఆర్థిక సంఘం నిధులు, 2016-17లో రూ.28 వేల కోట్లు పన్నులకు సంబంధించిన నిధులు రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు. మూలుగుతున్న డబుల్ బెడ్రూం నిధులు.. డబుల్ బెడ్ రూం పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటాగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.30 లక్షలు విడుదల చేసిందని, పనులు ప్రారంభంకాక నిధులు మూలుగుతున్నాయని అన్నారు. ప్రధాన మంత్ర ఫసల్ బీమా దరఖాస్తుకు గడువు 14 వరకు మాత్రమే ఉందని, ఇప్పటికైనా రాష్ట్రం మేల్కొని రైతులకు బీమా వర్తించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అన్నారు. గతంలో పన్నుల ఆదాయంలో 39 శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 49 శాతంగా చేసి కేంద్రం ఇస్తోందని అన్నారు. జన్‌ధన్ కింద 80 వేల ఖాతాలు, ముద్ర పథకం కింద 5 లక్షల మందికి రూ.2,284 కోట్ల రుణాలు, రోడ్లకు రూ.43వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధుల వల్లే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని వివరించారు. 13,14వ ఆర్థిక సంఘాలు ఇచ్చిన నిధులతోనే గ్రామ పంచాయతీల్లో పనులు సాగుతున్నాయని తెలిపారు. నీతి ఆయోగ్ తాజాగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు మరో మారు నిధులు ఇవ్వమని కేంద్రానికి సిఫారసు చేసిన విషయం గుర్తు చేశారు. ఈనెల 25న తొర్రూరులో పార్టీ జిల్లా స్థాయి సమావేశం తొర్రూరులో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో కొత్త దశరథం, పెదగాని సోమయ్య, కూచన రవళి, కీర్తిరెడ్డి, దిలీప్, త్రిలోకేశ్వర్, వెంకటేశ్వర్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ఖరారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపును ఖరారు చేసినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మొత్తం 73,072 సీట్లు భర్తీ చేసినట్టు తెలిపారు. ఇంకా ఏడు కాలేజీల్లో విద్యార్థులు చేరలేదన్నారు. ఆ సీట్ల భర్తీకి త్వరలోనే రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. -
జపాన్ భాషా బోధన సమన్వయకర్తగా వేణుగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జపాన్ భాషా బోధనను అమలు పరిచేందుకు నిర్ణయించిన రాష్ట్రప్రభుత్వం ఈ బాధ్యతను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డికి అప్పగించింది. ప్రాథమిక స్థాయినుంచి ఒక యజ్ఞంలా దీన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జపాన్ భాషా బోధనపై తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వేణుగోపాలరెడ్డి, జపాన్ ప్రతినిధిగా వచ్చిన రాజేష్ పాండ్యన్, అధికారులు పాల్గొన్నారు. -
అమ్మో... నల్లగొండ
ఈ ఒత్తిడి నేను భరించలేను * సెలవుపై మునిసిపల్ కమిషనర్ * మరోసారి ఇన్చార్జ్ పాలన * సిమ్‌తో సహా ఇచ్చి వెళ్లిపోయిన వేణుగోపాల్‌రెడ్డి నల్లగొండ టూటౌన్ : రాష్ట్రంలో ఒక పార్టీది అధికారం ... మునిసిపాలిటీలో మరోపార్టీ వారిది అధికారం ... కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకు కోపం..అధికారం మాదే మేము చెప్పిందే వినాలని ఒకరు.. మునిసిపాలిటీలో అధికారం మాది మేము ఏది చెప్పితే అదే ఫైనల్ చేయాలంటూ మరొకరు... ఇలా ఇరుపార్టీల నేతలు చేస్తున్న ఒత్తిళ్లకు ఇప్పుడు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ‘‘ఈ ఒత్తిడి తట్టుకోలేను బాబు ఇక్కడ పనిచేస్తే లేని పోని రోగాలు వస్తాయి... ఇక ఇక్కడ నేను పని చేయలేను’’ అని నల్లగొండ మునిసిపల్ కమిషనర్ జి.వేణుగోపాల్‌రెడ్డి సెలవులో వెళ్లిపోయారు. కలెక్టర్ తొలుత అనుమతించకపోయినా, తన ఆవేదనను అర్థం చేసుకోమని చెప్పి తన ఫోన్ సిమ్‌కార్డు మరీ ఇచ్చేసి 15 రోజులు సెలవుపై వెళ్లిపోయారాయన. ఆయన సెలవు పెట్టేందుకు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమని ప్రచారం జరుగుతోంది. ఇటీవల కొంత మంది కౌన్సిలర్లు చిన్నచిన్న విషయాలకు కూడా కమి షనర్‌తో ఘర్షణకు దిగుతుండడంతో ఆయన ఇక్కడి నుంచి వెళ్లి పోవడానికే నిర్ణయించుకున్నుట్లు తెలుస్తోంది. మునిసిపల్ లీజు షాపుల వేలం ఆపడానికేనా ...? మునిసిపాలిటీకి చెందిన 238 దుకాణాలు, స్థలాలను బహిరంగవేలం ద్వారా లీజుకు ఇచ్చేందుకు గత నెలలో జరిగిన మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం కోసం పెట్టారు. కాగా దీనిని ఆపడానికి తెర వెనుక కొంతమంది నాయకులు తీవ్రంగానే ప్రయత్నించినా, కమిషనర్ హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఎవరి ఒత్తిళ్లకు లొంగలేదని అప్పట్లోనే చర్చించుకున్నారు. ఈ నెలాఖరులోగా ఎలాగైనా ఆ స్థలాలు, దుకాణాలను వేలం వేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కమిషనర్ ఇక్కడి నుంచి పోతేనే తమకు నచ్చిన అధికారిని పెట్టుకొని పనులు చక్కబెట్టుకోవచ్చనే ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ముక్కుసూటిగా వెళ్లడమే... వేణుగోపాల్‌రెడ్డి ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం కూడా కొంతమంది నేతలకు రుచించడంలేదని సమాచారం. తాము చెప్పింది చేయాలి కానీ నిబంధనలు తమకెందుకు అనేరీతిలో కొంతమంది మాట్లాడిన తీరుపై కమిషనర్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిసింది. ఎవరు ఏ పని చేయమన్నా, తానుమాత్రం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే చేస్తాను అని ఖరాఖండిగా చెప్పి ముక్కుసూటిగా వ్యవహరించిన తీరు కూడా ఇరుపార్టీల నాయకులకు నచ్చలేదని సమాచారం. ఆసరా పింఛన్ల జాభితాపై కూడా కాంగ్రెస్ నాయకులు కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నిక్కచ్చిగా వ్యవహరించి అర్హులైన వారికి పింఛన్లు ఇస్తున్నా, తనపైనే ఏ అధికారం లేని వ్యక్తి పెత్తనం చెలాయించడం ఏంటని ఉన్నతాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అదేవిధంగా కార్యాలయంలో ఇటీవల అధికారుల సెక్షన్ల మార్పు కూడా కమిషనర్ సెలవు పెట్టడానికి కారణమైనట్లు తెలుస్తుంది. అధికారులను పనిచేయించుకోవాల్సిన తాను చెప్పిన విధంగా కాకుండా దానిని కూడా రాజకీయం చేయాలని చూడడం ఆయనకు నచ్చలేదు. దీంతో ఆయన వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. మరోసారి ఇన్చార్జ్ పాలన... నల్లగొండ మునిసిపాలిటీలో విధులు నిర్వహించాలంటేనే అధికారులు, ఉద్యోగులు హడలిపోయే పరిస్థితి వ చ్చింది. గతంలో దాదాపు మూడు సంవత్సరాల పాటు ఇన్చార్జ్ పాలన కొనసాగింది. ప్రత్యేకాధికారి పాలన ఉన్న రోజులలో పట్టణ ప్రజలు చిన్న పనులకు కూడా అనేక అవస్థలు పడ్డారు. మళ్లీ మరోసారి ఇన్చార్జ్ పాలనకు దారితీసింది. మునిసిపల్ ఈఈగా పనిచేస్తున్న రాజయ్యకు (ఎఫ్ఏసీ ) అదనపు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ డీఎంఏ కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరి ఈయన ఎలా నెట్టుకొస్తారో, ఈయన పట్ల అధికార పార్టీ నేతలు ఎలా వ్యవహరిస్తారోననే చర్చ మునిసిపల్ వర్గాల్లో జరుగుతోంది. -
రెండో కౌన్సెలింగ్ ఉండదు: వేణుగోపాలరెడ్డి
ఈసారి ఇంజనీరింగ్‌కు రెండో విడత కౌన్సెలింగ్ అంటూ ఉండబోదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేవలం 174 కాలేజీలలో మాత్రమే అడ్మిషన్లు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో 50 పనిదినాలు పూర్తయిపోయాయని, అందువల్ల స్లైడింగ్‌కు అనుమతించే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తెలంగాణలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో రెండో విడత అడ్మిషన్లకు సుప్రీంకోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి స్పందించారు. -
'కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు కాదు'
హైదరాబాద్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఇంజనీరింగ్ లో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్ అనేది నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించినంత మాత్రానా కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు కాదన్నారు. మేనేజ్మెంట్ సీట్ల కోటా భర్తీ ఏపీ ఉన్నత విద్యా మండలి పరిరక్షణలో జరుగుతుందన్నారు. షెడ్యూల్ ప్రకారం అన్ని కౌన్సెలింగులు తామే నిర్వహిస్తామని ఆయన తెలిపారు -
ఇంజనీరింగ్ మొదటి కౌన్సెలింగ్ పూర్తి
హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసిందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డితెలిపారు. ఈనెల 30 సీట్లు కేటాయిస్తామని చెప్పారు. గుర్తింపు రద్దయిన 130 కాలేజీల లిస్టు 12 గంటలలోపు వచ్చివుంటే కౌన్సెలింగ్ లో వాటి పేర్లను చే్చే అవకాశముండేదన్నారు. గుర్తింపు కోల్పోయిన కాలేజీలను జేఎన్టీయూ సర్టిఫై చేస్తే ఆయా కాలేజీల పేర్లను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. -
ఏ ఒక్క రాష్ట్రానికో అధికారమిచ్చినట్లుకాదు!
-
ఏ ఒక్క రాష్ట్రానికో అధికారమిచ్చినట్లుకాదు!
ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లు విభజన చట్టానికి లోబడే ఉండాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.చట్ట ప్రకారం ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని మాత్రమే సుప్రీంకోర్టు పేర్కొందని ఆయన తెలిపారు. దీంతో ఏ ఒక్క రాష్ట్రానికో అధికారం ఇచ్చినట్లు కాదన్నారు. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో కౌన్సిలింగ్ నిర్వహించాలని రామకృష్ణా రెడ్డి సూచించారు. కామన్ అడ్మిషన్లను ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించాలనడం సరైనది పద్దతి కాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరికి ఇవ్వాలన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తమ రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి విధానాలకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయంలో ధర్మాసనం జోక్యం ఉండదన్నారు. ఆగస్టు 31 లోగా కౌన్సెలింగ్ పూర్తికావాలని, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని గత తీర్పులో సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మాత్రం తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. అక్టోబరు 31 వరకూ కౌన్సెలింగ్ పొడిగించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాగే స్థానికత అంశాన్ని కూడా పక్కనపెట్టింది. -
10వ తేదీ నాటికి వెరిఫికేషన్
* తెలంగాణలో ఎంసెట్‌పై ఏపీ ఉన్నత విద్యా మండలి * ఏపీలో నేటి నుంచి మొదలు * వెబ్ ఆప్షన్లపై రెండ్రోజుల్లో నిర్ణయం * 23 నాటికి ఇరు రాష్ట్రాల్లో ధ్రువపత్రాల తనిఖీ పూర్తి * 29కల్లా కౌన్సెలింగ్ పూర్తి * సెప్టెంబర్ తొలివారంలో తరగతులు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా.. ఆంధ్రప్రదేశ్‌లో గురువారం (7వ తేదీ) నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల తనిఖీ ప్రక్రియ ప్రారంభం కానుందని, తెలంగాణలో 10వ తేదీ నాటికి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కమిటీలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం వేణుగోపాలరెడ్డి విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ఈనెల 23 నాటికి ధ్రువపత్రాల తనిఖీ పూర్తవుతుందని చెప్పారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రక్రియకు అంగీకరించిందన్నారు. అయితే తెలంగాణలో హెల్ప్‌లైన్ కేంద్రాలను తెరవబోమని పాలిటెక్నిక్ అధ్యాపక సంఘాలు ప్రకటించాయని, వాటితో సమావేశం ఏర్పాటు చేసి ఒప్పించేందుకు రెండు మూడు రోజులు పడుతుందని తెలంగాణ అధికారులు వివరించారని వేణుగోపాలరెడ్డి పేర్కొన్నారు. మొత్తానికి 10వ తేదీ నాటికి తెలంగాణలో ధ్రువపత్రాల పరిశీలనను చేపడతామని చెప్పారని వివరించారు. ఇదివరకే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రక్రియ జరుగుతుందని, తెలంగాణలో కొంత ఆలస్యంగా ప్రారంభమైనా.. మొదటి రోజు 1వ ర్యాంకు నుంచి 10 వేల ర్యాంకు లేదా 20 వేల ర్యాంకు వరకు పరిశీలన చేపడతామన్నారు. వెబ్ ఆప్షన్లపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. శుక్ర లేదా శనివారాల్లో మరోసారి సమావేశమై వెబ్ ఆప్షన్లను ఏయే తేదీల నుంచి ప్రారంభించాలనే దానిపై నిర్ణయిస్తామని చెప్పారు. మొత్తానికి ఈనెల 29వ తేదీ నాటికి ప్రవేశాలు పూర్తి చేసి.. 30, 31 తేదీల్లో విద్యార్థులకు సీటు కేటాయింపు లేఖలు పంపిస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల 1 లేదా 2వ తేదీన తరగతులను ప్రారంభిస్తామని వివరించారు. స్పష్టత ఇస్తుందనుకుంటా..! విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అమలుచేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందని వేణుగోపాలరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా స్పష్టత ఇస్తుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. కాలేజీల్లో ఫీజులపై స్పష్టత లేదని, తెలంగాణలో విద్యార్థులకు నివాసం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేవని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘దానిపై నాకు క్లారిటీ లేదు. అవసరమైతే ప్రభుత్వాలను సంప్రదిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రెండు ప్రభుత్వాలు కూడా అవసరమైన చర్యలు చేపడతాయని భావిస్తున్నాం. కళాశాలల అనుమతులు, మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటాకు సంబంధించి ఉత్తర్వులు రావాల్సి ఉంది. వాటిని త్వరగా ఇవ్వాలని రెండు ప్రభుత్వాలను కోరుతాం..’’ అని చైర్మన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌన్సిల్ చైర్మన్‌ను భేటీకి పిలవలేదేమని ప్రశ్నించగా... పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తామే కాంపిటెంట్ అథారిటీ అని, కొత్త చైర్మన్ ప్రవేశాల కమిటీలో సభ్యుడు కానందున పిలవలేదని తెలిపారు. ‘టీ’ చైర్మన్‌కు అందని పిలుపు.. ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను ఆహ్వానించలేదు. టీ మండలి చైర్మన్‌ను పిలవకపోవడంతోపాటు కాంపిటెంట్ అథారిటీ ఎవరనే అంశంపైనా సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా కాంపిటెంట్ అథారిటీ ఎవరనే విషయంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, కౌన్సిల్ చట్టం ప్రకారం చైర్మన్‌గా తనకున్న అధికారాల పరిధిని వేణుగోపాలరెడ్డి వివరించినట్లు తెలిసింది. ఇక తెలంగాణ మండలికి చైర్మన్‌ను నియమించాక కూడా సమావేశానికి పిలవకపోవడం ఏమిటని, ఆయనను సమావేశానికి పిలవాలని లేఖ రాసిన తరువాత కూడా పట్టించుకోకపోవడం ఏమిటనే అంశంపై తెలంగాణ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. -
'షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సిలింగ్'
హైదరాబాద్: ఎంసెట్ రూపొందించిన షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని బుధవారం మీడియాకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 31వ తేదీలోపు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అడ్మిషన్లు పూర్తి చేస్తామని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఇంజనీరంగ్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని విద్యార్ధులకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. -
ఇరు రాష్ట్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన
* 7 నుంచి 23 వరకూ నిర్వహిస్తాం: ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం గురువారం (7వ తేదీ) నుంచి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి తెలిపారు. ప్రవేశాల కౌన్సెలింగ్‌ను 31 నాటికి పూర్తి చేసి, వచ్చే నెల మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో.. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ముందుకు సాగుతామని చెప్పారు. ఈ నెల 7 నుంచి 23వ తేదీ వరకూ రెండు రాష్ట్రాల్లో ఉమ్మడిగా ధ్రువపత్రాల పరిశీలన చేపడతామని వెల్లడించారు. విద్యార్థులు ర్యాంకుల వారీగా ఏయే తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలో జూలై 30న జారీ చేసిన నోటిఫికేషన్లో వివరంగా ప్రకటించామని, ఆ షెడ్యూల్ ప్రకారం ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. అయితే.. ఈ నెల 11న సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పును బట్టి తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. నేడు ఎంసెట్ ప్రవేశాల కమిటీ భేటీ? సుప్రీంకోర్టు తీర్పు పరిస్థితులపై చర్చించేందుకు అవసరమైతే మంగళవారం (5వ తేదీన) ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తామని వేణుగోపాలరెడ్డి తెలిపారు. అయితే.. ధ్రువపత్రాల పరిశీలనకు తెలంగాణలో 23, ఆంధ్రప్రదేశ్‌లో 34 సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కానీ కౌన్సెలింగ్ ప్రక్రియకు సహకరించబోమని తెలంగాణలో పాలిటెక్నిక్ లెక్చరర్ల సంఘం ప్రకటించిన నేపథ్యంలో సహాయక కేంద్రాల ఏర్పాటు, ధ్రువపత్రాల పరిశీలనపై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ఎంసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం కావాల్సిందేనని అధికారులు పేర్కొంటున్నారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు మేం సిద్ధం
జీవోలు రాకపోవడంతో నిర్వహించలేదు ఉన్నత విద్యామండలి ఇంప్లీడ్ పిటిషన్ ఏపీ మండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి శుక్రవారం సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. జూలై 31లోపే కౌన్సెలింగ్ ప్రక్రియ ముగించాల్సి ఉన్నప్పటికీ నిర్వహించకపోవడానికి గల కారణాలనూ ఆ పిటిషన్లో పేర్కొంది. అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహణకు అక్టోబర్ 31 వరకు గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆ కేసు ఆగస్టు 4కు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ కేసు విచారణలో తమను కూడా చేర్చాలని తాజాగా ఉన్నత విద్యామండలి ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి ఢిల్లీలో మీడియాకు వివరించారు. ఆయనేం చెప్పారంటే... మాకు తగిన యంత్రాంగం ఉంది. మేం అడ్మిషన్లు నిర్వహించుకుంటామని కోరాం. కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించాల్సిన అధీకృత సంస్థ మాది. చాలా సంవత్సరాలుగా ఇతర అధికారులు అవసరం లేకుండానే కౌన్సెలింగ్ నిర్వహించాం. మాకు కావాల్సింది 57 హెల్ప్‌లైన్ సెంటర్లు. ప్రొఫెసర్లు, లెక్చరర్లు. వాళ్ల ద్వారా అడ్మిషన్లు జరిగిపోతాయి. అదనపు అధికారుల అవసరం మాకు లేదని చెప్పాం. పాలిటెక్నిక్ లెక్చరర్లు తాము విధుల్లో పాల్గొనబోమని చెప్పారు. కాబట్టి నాలుగో తేదీ ఎలా ఉంటుందన్నది చూడాలి. ఒకవేళ సుప్రీం కోర్టు రెండు రాష్ట్రాలు మండలికి సహకారం అందించాలని ఆదేశిస్తే.. ఒక అడుగు ముందుకు పడ్డట్టే. ముఖ్యంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రకటించాం. దానికి దాదాపు 15 రోజులు పడుతుంది. కోర్టు నిర్ణయం వచ్చేలోపు ఆ ప్రక్రియ పూర్తిచేసుకుంటే పిల్లలకు ఇబ్బంది ఉండదు. ఆ ఉద్దేశంతోనే ప్రకటన జారీచేశాం. వేరే దురుద్దేశం లేదు. మేం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదు. రెండు రాష్ట్రాలకు లేఖలు పంపించాం. సమావేశానికి తెలంగాణ అధికారులు కూడా వచ్చారు. లోతుగా చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడం గానీ, మరొక ప్రభుత్వానికి అనుకూలంగా పోవడం గానీ లేదు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ప్రకటన జారీచేశాం. మేం అటానమస్ అయినప్పటికీ ప్రభుత్వం చెప్పినట్టు మేం వినాలి. ఫీజు రీయింబర్స్మెంట్, మిగిలిన కొన్ని విషయాల్లో ప్రభుత్వ సహకారంతో జరుగుతాయి. అన్నీ చర్చించే నిర్ణయం తీసుకున్నాం. సుప్రీం కోర్టు ఆదేశాలతో అన్నీ సర్దుకుంటాయని ఆశిస్తున్నాం. జూలై 31లోపు అడ్మిషన్లు నిర్వహించాలి. మీరు ఎందుకు అడ్మిషన్లు నిర్వహించలేదని సుప్రీం కోర్టు ప్రశ్నించే ఆస్కారం ఉంది. అందువల్ల మేం ఇంప్లీడ్ అయ్యాం. మేం చేయలేకపోవడానికి కారణాలు వివరిస్తాం. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఐదో తేదీన మరోసారి సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను పక్కనబెట్టి తెలంగాణ వరకు అడ్మిషన్లు నిర్వహించడం కష్టమే. కౌన్సెలింగ్ ప్రక్రియపై గవర్నర్‌కు తెలిపాం. -
వేణుగోపాల్ రెడ్డిపై దేశపతి ఆగ్రహం!
హైదరాబాద్: ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిపై తెలంగాణ వికాస సమితి దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేణుగోపాల్ రెడ్డి ఆంధ్రా మేధావుల సంఘం చైర్మన్లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యం కావడం కొత్త కాదని దేశపతి అన్నారు. తెలంగాణ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేశపతి శ్రీనివాస్ తెలిపారు. -
చట్టప్రకారం ఎంసెట్ ప్రవేశాలు : వేణుగోపాల్ రెడ్డి
-
చట్టప్రకారం ఎంసెట్ ప్రవేశాలు : వేణుగోపాల్ రెడ్డి
హైదరాబాద్: ఉన్నత విద్యామండలి చట్టం ప్రకారం ఎంసెట్ ప్రవేశాలు నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావుతో వేణుగోపాల రెడ్డి సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంసెట్ కౌన్సెలింగ్‌పై చర్చించినట్లు తెలిపారు. యథావిధిగా కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నామని చెప్పారు. కౌన్సెలింగ్ సజావుగా జరిగేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఆపాలని సుప్రీంకోర్టు చెప్పలేదని తెలిపారు. ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పెద్దఎత్తున విజ్ఞప్తులు వచ్చాయన్నారు. నిన్న అడ్మిషన్ల కమిటీలో తీసుకున్న నిర్ణయాలనే కొనసాగిస్తామని చెప్పారు. ఈ నెల 30న ఎంసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, వచ్చే నెల 7న విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని వివరించారు. కౌన్సెలింగ్ ఆలస్యానికి దారితీసిన పరిస్థితులను సుప్రీంకోర్టులో వివరిస్తామని వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్ యథాతథం
విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఎంసెట్ కౌన్సెలింగ్ విషయమై చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినా సరే.. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఆలస్యం చేయడం సరికాదని, అలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు సమాచారం. ఆలస్యంగా విద్యాసంవత్సరం మొదలైతే.. భవిష్యత్తులో వాళ్ల పీజీ కోర్సుల దగ్గర నుంచి ఉద్యోగ నియామకాల వరకు అన్నింటిలోనూ ఇబ్బంది అవుతుంది. ఈ ఉద్దేశంతోనే కౌన్సెలింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని మండలి భావిస్తోంది. సాయంత్రం 5 గంటల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటుచేసి, తెలంగాణ ప్రభుత్వం కూడా కౌన్సెలింగ్‌కు సహకరించాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి కోరనున్నట్లు సమాచారం. -
పూర్తిస్థాయిలో మొదలైన గ్రీవెన్స్‌సెల్
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: దాదాపు మూడు నెలల తర్వాత ప్రజాదర్బార్ పూర్తిస్థాయిలో జరగడంతో వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. హౌసింగ్ పీడీ రామసుబ్బు, డీఆర్డీఏ పీడీ నజీర్‌సాహెబ్, జేడీఏ ఠాగూర్‌నాయక్‌లు తమ శాఖలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొద్దిసేపు సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజాదర్బార్, డయల్ యువర్ కలెక్టర్‌కు వచ్చిన సమస్యల పరిష్కారానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యలను పెండింగ్‌లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని వివరించారు. ఇంటి పట్టాలు ఇవ్వండి: గోస్పాడు మండలం బీవీనగర్‌లో కొన్నేళ్ల క్రితం చింతమానువనంలో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారికి పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌కు ప్రజాదర్బార్‌లో వినతిపత్రం సమర్పించాను. - శ్రీనివాసరెడ్డి -
నేటి నుంచి యథావిధిగా ‘డయల్ యువర్ కలెక్టర్’
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: డయల్ యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్ కార్యక్రమాలు సోమవారం నుంచి యథావిధిగా నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, సాధారణ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దాదాపు మూడు నెలల పాటు డయల్ యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఎన్నికల సమయం కావడంతో జిల్లా యంత్రాంగం ప్రజల నుంచి వినతులు కూడా స్వీకరించలేకపోయింది. అయితే ఈనెల 2వ తేదీ నుంచి డయల్ యువర్ కలెక్టర్, ప్రజాదర్బార్లు యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు నిర్వహిస్తామని, ఫోన్ ద్వారా నేరుగా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురావచ్చన్నారు. 08518-277100 నెంబర్‌కు ఫోన్ చేసి సమస్యను వివరిస్తే కలెక్టర్ వెంటనే స్పందిస్తారని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజాదర్బార్ కూడా యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌పై విభజన ఎఫెక్ట్
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు బ్యాంకు గల్లంతు అత్యధిక స్థానాల్లో రెండువేల ఓట్ల లోపే కేవలం 1.67 శాతం ఓట్లతోనే కాంగ్రెస్ సరి జేఎస్పీకి 3.28 శాతం ఓట్లు నోటాకు కూడా 10 వేల ఓట్లు మాజీ ఎంపీ చింతాకు షాక్ సాక్షి, చిత్తూరు: జిల్లాలో విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తిస్థాయిలో మట్టికరిపించారు. సీమాంధ్రను విడదీసి అన్యాయం చేశారనే కోపాన్ని ఓటనే అస్త్రంతో కాంగ్రెస్‌కు రుచిచూపించారు. తిరుపతి, రాజంపేట, చిత్తూరు లోక్‌సభ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఎక్కడా కనీసం రెండవ స్థానం కూడా దక్కలేదు. ఎన్నికల ముందే కాంగ్రెస్ మునిగిపోయే నావ అని తెలుసుకుని మంత్రులుగా పనిచేసినవారు, ఎమ్మేల్యేలు దాటుకోవడంతో కాంగ్రెస్‌పార్టీకి దిక్కులేకుండా పోయింది. దొరికినవారిని అభ్యర్థులుగా పెట్టిన కాంగ్రెస్ పూర్తిగా చేతులు కాల్చుకుంది. జిల్లా అధ్యక్షుడిగా మండల నాయకుడిగా ఉన్న వేణుగోపాల్‌రెడ్డిని తెచ్చి పెట్టారు. ఆయన చంద్రగిరి అభ్యర్థిగా బరిలో ఉండడం, జిల్లా అంతా కాంగ్రెస్‌ను పట్టిష్టం చేసి నడిపించే శక్తి లేకపోవడంతో ఈ ప్రయోగం రవ్వంత కూడా ఫలించలేదు. ఓడిపోతామని తెలిసి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగినవారు ఒకసారి తాము కూడా జాతీయ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీచేశాం అని అనిపించుకునేందుకు ఎన్నికల్లో నిలబడ్డారు. జిల్లాలో 24 లక్షల 10వేల 228 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 40228. ఇవి కేవలం 1.67 శాతం మాత్రమే. పీలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ కన్నా జైసమైక్యాంధ్ర పోటీ గట్టిపోటీ ఇచ్చి రెండవ స్థానం నిలబెట్టుకుంది. కాంగ్రెస్ తరపున మదనపల్లి నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా కూడా 7357 ఓట్లతో నాల్గో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లాలో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు 1000-2000 మధ్య ఓట్లే వచ్చాయి. ఇంత దారుణమైన పరిస్థితి చిత్తూరు జిల్లాలో 1952 ఎన్నికల నుంచి కాంగ్రెస్‌కు ఎప్పుడు ఎదురుకాలేదు. రాష్ట్ర విభజనతో పూర్తిగా ప్రజలు కాంగ్రెస్‌ను మట్టి కరిపించారు. చింతాకు డిపాజిట్ గల్లంతు రాజకీయ చాణుక్యుడిగా తెరవెనుక వ్యూహాలతో ప్రతి ఎన్నికల్లో గెలుస్తారని పేరున్న తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌కు ఓటర్లు మంగళం పాడారు. ఆయనకు డిపాజిట్ కూడా దక్కనంత ఘోరంగా ఓడించారు. కాంగ్రెస్ నుంచి 25 ఏళ్లుగా రాజకీయల్లో చక్రం తిప్పుతూ ఐదుసార్లు ఎంపీగా పని చేసిన చింతామోహన్ ఈసారి కాంగ్రెస్ విభజన వ్యవహారంతో బోర్లాపడ్డారు. ఆయన డ్వాక్రా మహిళలకు ఇల్లు ఇస్తానన్నా, రుణాలు ఇప్పిస్తానన్నా, లక్షాధికారులను చేస్తానన్నా, తిరుపతిని రాజధాని చేస్తామని చెప్పినా జనం నమ్మలేదు. ఆయన రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎరుగునంతటి ఘోర ఓటమిని రుచిచూపించారు. తిరుపతి పార్లమెంట్‌కు పోటీ పడిన వారిలో వరప్రసాద్‌కు 5.8 లక్షల ఓట్లు రాగా,బీజేపీ అభ్యర్థి జయరామ్‌కు 5.4 లక్షల ఓట్లు వచ్చా యి. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌కు కేవలం 33333 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ గుర్తు చూసి జనం ఓట్లేస్తారు.. క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ బీజేపీ కూటమి ఓట్లు ఎంపీకి తనకు పడతాయనుకున్న చింతా ఆశలు అడియాశలయ్యాయి. వైఎస్సార్సీపీకి టీడీపీకి స్వల్ప తేడా జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్సార్సీపీ తెలుగుదేశం మధ్య స్వల్ప తేడా నెలకొంది. తెలుగుదేశం పార్టీకి మొత్తం వచ్చిన ఓట్లు 11 లక్షలా 7వేలా 145. ఇది 45.94శాతం. వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లు 10 లక్షలా 86వేలా 79, శాతంలో చూస్తే ఇది 45.10. ఇదే పరిస్థితి చిత్తూరు, తిరుపతి లోక్‌సభల ఓట్లలోనూ నెలకొంది. జేఎస్పీకి అదే పరిస్థితి తాజ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి స్థాపించిన జైసమైక్యాంధ్ర పార్టీ పరిస్థితి కూడా ఇదే. జిల్లాలో పీలేరు మినహా ఇంకెక్కడా ఆ పార్టీ రెండవ స్థానంలోకి కూడా రాలేదు. అంతా 1500-2000 మధ్యలో ఓట్లతోనే ఆ పార్టీ అభ్యర్థులు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కిరణ్‌కుమార్‌రెడ్డి రోడ్డుషోలు నిర్వహించినా, సమైక్యాంధ్ర నినాదంతో ప్రచారం చేసినా జనం చివరి వరకు విభజనకు సహకరించిన వ్యక్తిగానే కిరణ్‌కుమార్‌రెడ్డిని చూశారు. కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు కేవలం 500 లోపు ఓట్లు వచ్చాయి. చంద్రగిరిలో జైసమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి మమతకు కేవలం 553 ఓట్లు వచ్చాయి. తంబళ్లపల్లెలో 455 ఓట్లే వచ్చాయి. జిల్లావ్యాప్తంగా పార్టీకి వచ్చిన ఓట్లు 79026 ఓట్లు వచ్చాయి. ఇది మొత్తం ఓట్లలో 3.25 శాతం. పీలేరులో కిరణ్ సోదరుడు కిశోర్‌కుమార్ రెడ్డికి మాత్రమే చెప్పుకోదగ్గ ఓట్లు వచ్చాయి. నోటాకు 10వేల ఓట్లు జిల్లాలో 24 లక్షల ఓట్లు పోల్ కాగా, ఇందులో అభ్యర్థులు ఎవరు ఇష్టం లేదని, తిరస్కరించిన ఓట్లు 14 నియోజకవర్గాల్లో 10వేలకు పైగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో నోటా బటన్ ఉపయోగించి ఓటు చేసిన వారు ఉండడం గమనార్హం. ఇది మొత్తం ఓట్లలో 0.43శాతంగా ఉంది. -
నేటి నుంచి పీజీ-ఈసెట్ హాల్‌టికెట్లు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 29 వరకు జరగనున్న పీజీ ఈసెట్-2014 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మంగళవారం నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి సోమవారం తెలిపారు. హాల్‌టికెట్లను ఠీఠీఠీ.్చఞఞజ్ఛఛ్ఛ్టి.ౌటజ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షకు మొత్తం 1.17 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పారు. -
రెండుగా ఉన్నత విద్యా మండలి
జూన్ 2 నుంచి అవుల్లోకి ఏపీ కౌన్సిల్‌కు వేణుగోపాల్‌రెడ్డి చైర్మన్! తెలంగాణ ఇన్చార్జి చైర్మన్‌గా సత్యనారాయుణ! వచ్చే ఏడాది ఎవరి ప్రవేశపరీక్షలు వారివే హైదరాబాద్: ఉన్నత విద్యా మండలిని రెండుగా విభజించే ప్రక్రియు దాదాపు పూర్తరుుంది. జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఉన్నత విద్యా మండలిలు అవుల్లోకి రానున్నారుు. 2015 జూన్ 2 వరకు ప్రస్తుత మండలి రెండు రాష్ట్రాలకు సేవలందించేలా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నప్పటికీ, ఇప్పుడే రెండుగా విభజిస్తున్నారు. ఆంధ్రప్రదే శ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనుండగా, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి ఉస్మానియూ విశ్వవిద్యాలయుం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సత్యనారాయుణ ఇన్చార్జి చైర్మన్‌గా వ్యవహరించనున్నారని సమాచారం. ఆయున ఇప్పటికే ఉన్నత విద్యా మండలి ైవె స్ చైర్మన్-1గా నియమితులయ్యారు. అరుుతే ఆయున ఇంకా విధుల్లో చేరలేదు. విభజన జరిగిన వెంటనే ఇన్చార్జి చైర్మన్‌గా ఆయనకే బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వురోవైపు ప్రస్తుతం మండలి ైవె స్ చైర్మన్-2గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ విజయుప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్‌కు వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. తెలంగాణ కౌన్సిల్‌కు వురో వైస్ చైర్మన్‌ను నియుమించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత ఉన్నత విద్యా మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి తెలంగాణ కౌన్సిల్‌కు కార్యదర్శిగా ఉంటారు. ఏపీ కౌన్సిల్‌కు కొత్త కార్యదర్శిని నియుమించాల్సి ఉంటుంది. అప్పటివరకు ప్రస్తుత డిప్యూటీ డెరైక్టర్ కృష్ణవుూర్తిని ఏపీ కౌన్సిల్ ఇన్చార్జి కార్యదర్శిగా నియుమించే అవకాశం ఉంది. ఇక సిబ్బందిని 10:13 నిష్పత్తిలో విభజించారు. అవసరమైతే కొంత వుంది తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో, ఆంధ్రప్రదే శ్‌కు చెందిన వారు కొందరు తెలంగాణ కౌన్సిల్లో పనిచేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారాలన్నింటిపై సోవువారం తుది నిర్ణయుం తీసుకునే అవకాశం ఉంది. ఇక వచ్చే ఏడాది రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగానే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రస్థాయి యూనివర్సిటీలైన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ద్రవిడ విశ్వవిద్యాలయాలను కూడా విభజించనున్నారు. సాంకేతిక విద్యా శాఖ, కళాశాల విద్యా శాఖలనూ విభజిస్తారు. ఈనెల 12న వీటిపై తుది నిర్ణయుం తీసుకోనున్నారు. -
మే 30న ఎడ్‌సెట్ పరీక్ష
ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం హైదరాబాద్: ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్)-2014ను మే 30వ తేదీన నిర్వహించాలని ఎడ్‌సెట్-2014 కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో మంగళవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2వ తేదీన ఎడ్‌సెట్‌ను నిర్వహిస్తామని ముందుగా షెడ్యూలు జారీ చేసినా.. ఆ రోజున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆవిర్భావ దినం (అపాయింటెడ్ డే) కావడంతో పరీక్షను మూడు రోజులు ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. ఇక అభ్యర్థులు ఈనెల 24 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని, రూ. 500 ఆలస్య రుసుముతో ఈనెల 30వ తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రూ. 150 పరీక్ష ఫీజును ఈసేవ/మీసేవ/ఏపీఆన్‌లైన్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు సహాయంతో ఫీజు చెల్లించవచ్చని వివరించారు. ఎడ్‌సెట్ రాసి, కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని పేర్కొన్నారు. 618 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 50,050 సీట్లు, మేనేజ్మెంట్ కోటాలో 16,680 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఎడ్‌సెట్‌ను వచ్చే నెల 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇతర వివరాలను ఠీఠీఠీ.్చఞ్ఛఛీఛ్ఛ్టి.ౌటజ వెబ్సైట్లో పొందవచ్చని తెలిపారు. ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా లాసెట్: జూన్ 8వ తేదీన లాసెట్-2014 నిర్వహణ కోసం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ఉన్నత విద్యా మందలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు -
పూర్వ వీసీని విచారించిన సీఐడీ
పీజీ మెడికల్ ఎంట్రన్స్ కేసు విజయవాడ, న్యూస్‌లైన్: పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీఐడీ అధికారులు ఆదివారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పూర్వ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఐవీ రావును విచారించారు. శనివారం వర్సిటీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు డాక్టర్ రావును విచారించిన సీఐడీ.. కొన్ని విషయాలపై తరచితరచి ప్రశ్నించినట్టు సమాచారం. అవసరమైతే మళ్లీ పిలుస్తామని చెబుతూ ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలిసింది. అడిషనల్ ఎస్పీ రవిప్రకాశ్ నేతృత్వంలో డీఎస్పీలు రఘు, సిరేన్బేగం తదితర అధికారులు ఐవీ రావుతో పాటు వర్శిటీ ఓఎస్డీ కోటయ్య, పరీక్షల విభాగం జాయింట్ రిజిస్ట్రార్ అనురాధ, సూపరిం టెండెంట్ నాగేశ్వరరావు, అడ్మినిస్ట్రేషన్ విభాగం జాయింట్ రిజిస్ట్రార్ ప్రతాప్, అడ్మిషన్ల విభాగం డిప్యూటీ రిజస్ట్రార్ రవీంద్ర, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సత్యనారాయణ, పరీక్షల విభాగానికి సంబంధించిన కొంతమంది కీలక ఉద్యోగులను కూడా విచారించారు. పరీక్షల విభాగానికి సంబంధించిన పలు ఫైళ్లను పరిశీలించారు. -
కన్సల్టెన్సీదే కీలక పాత్ర
పీజీ మెడికల్ స్కాంపై సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్యవిద్య ప్రవేశపరీక్ష (పీజీఎంఈటీ-2014) ప్రశ్నపత్రాల లీకేజీ స్కాంలో హైదరాబాద్‌కు చెందిన వర్టెక్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ కీలక పాత్ర పోషించింది. సీఐడీ చీఫ్ టి.కృష్ణప్రసాద్ శనివారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. కన్సల్టెన్సీ నిర్వాహకుడు కె.మునీశ్వర్‌రెడ్డి దేశవ్యాప్తంగా 12 మంది దళారుల్ని ఏర్పాటు చేసుకుని లీకేజీ వ్యవహారం పూర్తిచేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ‘‘తొలి 100 లోపు ర్యాంకులు సాధించిన వారిలో దాదాపు 25 మంది మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు అనుమానిస్తున్నాం. ఈ ప్రశ్నపత్రం ఎక్కడ నుంచి లీకైందనేది ఇంకా స్పష్టం కాలేదు. పరారీలో ఉన్న దళారులు, విద్యార్థుల్ని అరెస్టు చేయడానికి 12 ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా గాలిస్తున్నాయి’’ అని కృష్ణప్రసాద్ వివరించారు. మరోవైపు శనివారం అర్ధరాత్రి వరకు విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని ముఖ్య అధికారులతో పాటు పరీక్షల విభాగం ఉద్యోగులను ఐజీ నవీన్‌కుమార్ నేతృత్వంలో సీఐడీ అధికారులు విచారించారు. లీకేజీ ఎక్కడి నుంచి?... పీజీఎంఈటీ ప్రశ్నపత్రాల్ని మునీశ్వర్‌రెడ్డి కర్ణాటకలోని మణిపాల్‌లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ నుంచే చేజిక్కించుకున్నట్లు సీఐడీ నిర్ధారించినట్లు తెలిసింది. ప్రశ్నపత్రాలను ఫిబ్రవరి 8న ముద్రించి అదే నెల 25న హెల్త్ వర్సిటీకి డెలివరీ ఇచ్చింది. అయితే మునీశ్వర్‌రెడ్డి మాత్రం ఫిబ్రవరి 2 రాత్రే కొందరు అభ్యర్థులకు ప్రశ్నాపత్రం ప్రతుల్ని చూపించాడని తేలింది. దీంతో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడితో పాటు ఇద్దరు ప్రతినిధుల్నీ సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లీకేజీ ప్రశ్నపత్రల ప్రతులతో మునీశ్వర్‌రెడ్డి తాను కొంతమంది వైద్య విద్యార్థులకు, దళారుల ద్వారా మరికొందరికి ఎర వేశాడు. వారితో పాటు వారి తల్లిదండ్రులతోనూ మాట్లాడటానికి నాలుగు సెల్ఫోన్లు (9030314444, 9980099968, 9030132828, 9030132121) వినియోగించాడు. ఒక్కో అభ్యర్థీ రూ. 90 లక్షల నుంచి రూ. 1.10 కోట్ల వరకు చెల్లించేలా బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా రూ. 10 లక్షల చొప్పున వసూలు చేశాడు. మిగతా మొత్తం ర్యాంకు వచ్చిన తరవాత చెల్లించే వరకు ష్యూరిటీగా పదో తరగతి, ఇంటర్, ఎంబీబీఎస్ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు బ్లాంక్ చెక్కుల్నీ తీసుకున్నాడు. ఆయా అభ్యర్థులకు పరీక్ష రాయడంపై తర్ఫీదుకు ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేశాడు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 మధ్యకాలంలో ముంబై సమీప గుర్గావ్లోని షోహమ్ రెసిడెన్సీ, ఇంపీరియల్ హైట్స్ల్లో ఉన్న వసతిగృహాలతో పాటు హైదరాబాద్‌లోని సాయినాథ్ ఇంటికీ క్లాసుల కోసం వచ్చిన అభ్యర్థుల సెల్ఫోన్లన్నీ తీసేసుకున్నాడు. వారికి ప్రశ్నపత్రం, కీ అందించాడు. రెండ్రోజుల పాటు వాటి తర్ఫీదు తర్వాత ఆ ప్రశ్నపత్రాలన్నీ మళ్లీ వెనక్కి తీసేసుకున్నాడు. వారిని విమానాల్లో వారివారి పరీక్షాకేంద్రాలకు పంపించేశాడు. మార్చి 2న పీజీఎంఈటీ-2014కు వారంతా హాజరయ్యారు. ఇలా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినవారు రెండో ర్యాంక్ (సాయిసుధ) సహా 100లోపు అనేక ర్యాంకులు కైవశం చేసుకున్నారు. అయితే వారి ర్యాంకులపై తోటి విద్యార్థులు సందేహం వ్యక్తం చేయడంతో పీజీఎంఈటీ-2014 స్కాంపై దర్యాప్తునకు సీఐడీ రంగప్రవేశం చేసింది. ఈ వ్యవహారంలో కీలక సూత్రదారులైన మునీశ్వర్‌రెడ్డి, సాయినాథ్‌లను సీఐడీ అధికారులు పట్టుకున్నారు. వారి ద్వారా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన కడపకు చెందిన జగదీప్ (12వ ర్యాంక్), హైదరాబాద్‌కు చెందిన ఏవీ ఆనంద్ (16వ ర్యాంక్), గుంటూరుకు చెందిన భీమేశ్వరరావు (25వ ర్యాంక్), కరీంనగర్‌కు చెందిన బి.శ్రీనివాస్ (3వ ర్యాంక్), డి.శ్రావణి (28వ ర్యాంక్), సి.గురివిరెడ్డి (8వ ర్యాంక్), బి.వెంకటేశ్వరరావు (45వ ర్యాంక్)లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి నగదు, సర్టిఫికెట్లు, బ్లాంక్ చెక్కులు, కారు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దళారులతో పాటు మిగతా విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశం... పీజీఎంఈటీ-2014 స్కాం దర్యాప్తు పురోగతిపై సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ శనివారం మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలసి నివేదికను సమర్పించారు. ఈ నివేదికను గవర్నర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించి... అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ నివేదిక సీఎస్ పి.కె.మహంతికి చేరింది. నివేదికను కూలంకషంగా పరిశీలించి మంగళవారంలోగా ఆయన తన అభిప్రాయాన్ని గవర్నర్‌కు నివేదిస్తారని తెలిసింది. కాగా, పరీక్షపత్రం లీకేజీ వ్యవహారంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లు డాక్టర్ రవిరాజు, డాక్టర్ బాబూలాల్లు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని గుంటూరు జిల్లా ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఏకుల కిరణ్‌కుమార్ డిమాండ్ చేశారు. లీకేజీకి మూలకారకులైన వర్సిటీ అధికారులు, ప్రింటింగ్ ప్రెస్ యాజమాన్యాన్ని వదిలివేసి దళారులు, విద్యార్థులను అరెస్టు చేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఏవరీ మునీశ్వర్‌రెడ్డి?... వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి సమీపంలోని మునిమిరెడ్డిగారిపల్లెకు చెందిన కొమ్మూరి మునీశ్వర్‌రెడ్డి తమిళనాడులో ఎంబీఏ చదివాడు. 2006లో హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో వర్టెక్స్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను ఏర్పాటు చేశాడు. తర్వాత కార్యాలయాన్ని బంజారాహిల్స్ రోడ్ నం.2కు మార్చాడు. దీనికి బె ంగళూరులోని జయనగర్‌లోనూ శాఖ ఉంది. మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న మునీశ్వర్‌రెడ్డి... విద్యార్థులకు మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇప్పించడంలో దళారిగా వ్యవహరించేవాడు. వైద్యవిద్యలో రేడియాలజీ సీటుకు రూ. 1.5 కోట్లు, పీడియాట్రిక్స్‌కు రూ. 70 లక్షల చొప్పున వసూలు చేసి, యాజమాన్యాలతో పంచుకునేవాడు. ఇదే వ్యవహారాల్లో ఉన్న వి.సురేష్, బస్వరాజు (బెంగళూరు), అంజూసింగ్ (ముంబై), ధనుంజయ్‌కుమార్ చౌహన్ (బీహార్), డి.సాయినాథ్, భూషణ్‌రెడ్డి (హైదరాబాద్)లతో జత కట్టాడు. వీరితో సహా మొత్తం 12 మంది దళారుల్ని ఏర్పాటు చేసుకున్న మునీశ్వర్‌రెడ్డి పీజీఎంఈటీ-2014 స్కాంకు తెర లేపాడు. పాత నోటిఫికేషన్‌తోనే మళ్లీ పరీక్ష! పీజీ వైద్య ప్రవేశ పరీక్షలో అవకతవకలు నిరూపణ అయితే పరీక్ష రద్దు చేసి మళ్లీ ప్రవేశపరీక్ష నిర్వహిస్తామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం చెప్పారు. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు పీజీఎంఈటీ పాత నోటిఫికేషన్‌తోనే మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిద్ధమైంది. ఇప్పటికే ప్రశ్నాపత్రాల కూర్పు ప్రక్రియ కూడా మొదలుపెట్టినట్టు తెలిసింది. గతంలో వివిధ యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్ల నుంచి వచ్చిన ప్రశ్నలనే తీసుకుం టారా? లేదా కొత్తగా ఎయిమ్స్, పీజీఐ-చండీగఢ్ తదితర ప్రముఖ సంస్థలకు లేఖ రాసి తెప్పించుకుంటారా? అనేది ఇంకా తేలలేదు. ఇక పీజీఎంఈటీ స్కాంలో నిందితులైన అభ్యర్థులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించేటట్లయితే ఏప్రిల్ 15లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసి, అదే నెల 25 నాటికి ఫలితాలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. భారతీయ వైద్యమండలి నిబంధనల ప్రకారం జులై 7 తర్వాత కౌన్సెలింగ్ నిర్వహించడానికి అవకాశం లేదు. అప్పటికి సీట్లు ఏవైనా సీట్లు మిగిలిపోతే ఆ విద్యా సంవత్సరానికి అవి రద్దయినట్టే. -
నేడు గవర్నర్‌కు సీఐడీ నివేదిక!
-
నేడు గవర్నర్‌కు సీఐడీ నివేదిక!
విజయవాడ, న్యూస్‌లైన్: పీజీ మెడికల్ ఎంట్రన్స్ ప్రశ్నపత్రం లీకేజీపై దర్యాప్తు నివేదిక ఇప్పటికే సిద్ధమైందని, శుక్రవారం గవర్నర్ నరసింహన్‌కు అందజేసే అవకాశం ఉందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ రవిరాజు వెల్లడించారు. సీఐడీ నివేదిక ఆధారంగా ప్రవేశపరీక్ష మళ్లీ నిర్వహించాలా... వద్దా అనేది గవర్నర్ నిర్ణయిస్తారని చెప్పారు. కాగా, గురువారం ఉదయం నుంచి హెల్త్ యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్, సంబంధిత ఇతర అధికారులను అదనపు ఎస్పీ యు.రవిప్రకాశ్ నేతృత్వంలో దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. నాన్‌లోకల్ అభ్యర్థులు గుంటూరు జిల్లాలోనే ఎక్కువ మంది ఉన్నారనే వార్తల నేపథ్యంలో సీఐడీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విజయవాడలోని జూనియర్ డాక్టర్లు మరికొంతమంది అనుమానిత విద్యార్థుల జాబితాను సీఐడీ అధికారులకు అందజేశారు. ప్రశ్నపత్రం లీకైందని సీఐడీ దర్యాప్తులో తేలితే రీ-ఎగ్జామ్ తప్పదని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ రీ-ఎగ్జామ్ పెట్టిస్తారా, లేక అనుమానిత విద్యార్థుల ర్యాంకులను విత్‌హెల్డ్‌లో ఉంచి, కొత్తగా ర్యాంకులు ప్రకటిస్తారా అనేది వేచి చూడాల్సిందే. -
ర్యాంకర్లకు బిగుస్తున్న ఉచ్చు
సాక్షి, హైదరాబాద్: పీజీ వైద్యవిద్య ప్రవేశపరీక్ష స్కాంలో దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. దళారులు, లీకువీరులతో పాటు అడ్డదారిలో ర్యాంకులు సాధించిన వైద్య విద్యార్థులను, వారి తల్లిదండ్రులనూ ఈ కేసులో నిందితులుగా చేర్చాలని రాష్ట్ర నేర పరిశోధన విభాగం సీఐడీ నిర్ణయించింది. ఇప్పటికే కొందరు ర్యాంకర్ల తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. వీరిలో పలువురు వైద్యులు కూడా ఉన్నారు. గురువారం ఉదయం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను డీజీపీ బి.ప్రసాదరావు, సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఎం.మహేందర్‌రెడ్డి రాజ్‌భవన్‌లో కలిశారు. పీజీ వైద్యవిద్య ప్రవేశపరీక్ష స్కాం కేసు దర్యాప్తు పురోగతిని గవర్నర్‌కు వారు వివరించారు. అక్రమాలు చోటుచేసుకున్న దృష్ట్యా పరీక్షను రద్దు చేయాలని డీజీపీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ప్రశ్నపత్రం లీక్ ద్వారా 18 నుంచి 26 మంది వరకు విద్యార్థులు లబ్ధి పొందారని గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. ఈ స్కాంతో సంబంధం ఉన్న ఏ ఒక్కర్నీ వదిలిపెట్టవద్దని గవర్నర్ ఆదేశించినట్లు తె లిసింది. భేటీ అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ, అక్రమాలు జరిగినట్లు నిర్ధారించామని, మరో రెండ్రోజుల్లో కేసు కొలిక్కి వస్తుందని చెప్పారు. చేతులు మారింది నల్లధనమేనా? ప్రాథమిక ఆధారాలు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలను బట్టి ఈ స్కాం భారీ మొత్తంతో ముడిపడి ఉన్నట్లు సీఐడీ నిర్ధారించింది. ముఠాతో ముందే ఒప్పందం కుదుర్చుకున్న వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు చెల్లించి లీకైన ప్రశ్నపత్రాల్ని చేజిక్కించుకున్నట్లు తేలింది. దళారులతో సంప్రదింపులు జరిపిన తరవాతే విద్యార్థుల తల్లిదండ్రులు ఈ భారీ మొత్తంలో చెల్లింపులు చేసి ఉంటారని సీఐడీ అనుమానిస్తోంది. నేరం జరుగుతోందని తెలిసీ సహకరించిన ఆరోపణలతో ఆయా అనుమానిత ర్యాంకర్ల తల్లిదండ్రుల్నీ ఈ కేసులో నిందితులుగా చేర్చాలని నిర్ణయించింది. వీరిని తక్షణం అరెస్టు చేయకున్నా అభియోగాలు నమోదు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని భావిస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న నిందితులు, అనుమానితుల కోసం ప్రత్యేక బృందాలు దేశవ్యాప్తంగా గాలిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ర్యాంకర్ల తల్లిదండ్రులు దళారులకు చెల్లించింది లెక్కల్లో చూపని నల్లధనంగా సీఐడీ అనుమానిస్తోంది. దీంతో ఈ అంశాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదించాలని నిర్ణయించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ర్యాంకర్ల తల్లిదండ్రుల్లో వైద్యులు, వ్యాపారులు, ఉద్యోగులు ఉన్నారు. సీఐడీ నివేదిక ఆధారంగా ఐటీ అధికారులు సైతం వారికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ భారీ ఆర్థిక లావాదేవీల కోసం హవాలా, హుండీ మార్గాలను ఆశ్రయించి ఉంటారని సీఐడీ అనుమానిస్తోంది. ఆధారాలు లభించిన తరవాత అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ)కి సమాచారమివ్వాలని నిర్ణయించింది. -
పీజీ ‘సెట్’పై విచారణ
విచారణాధికారి ప్రొ.వేణుగోపాల్‌రెడ్డి నేటి నుంచి నాగార్జున వర్సిటీలో ఫిర్యాదుల స్వీకరణ విచారణకు మరికొందరు నిపుణుల నియామకం సాక్షి, హైదరాబాద్/విజయవాడ: పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్ష (పీజీ సెట్)లో అవకతవకలపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు విచారణాధికారి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. ఈ వ్యవహారంపై వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు నాగార్జున విశ్వవిద్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, గురువారం ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ ఎవరైనా తమకు ఉన్న అనుమానాలు, ఆధారాలను తెలపవచ్చని చెప్పారు. ఆయన బుధవారం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ కార్యాలయంలో వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్, ఇతర అధికారులతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. పలువురు విద్యార్థులు, వైద్య విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని వాటిపైన విచారణ జరుపుతున్నామని ఆయన చెప్పారు. ప్రశ్నపత్రం లీక్ అయిందా లేదా, ఒకవేళ లీక్ అయి ఉంటే యూనివర్సిటీ నుంచే బయటకు వచ్చిందా.. ప్రశ్నపత్రాలు ప్రింటింగ్‌కు వెళ్లిన సమయంలో అయిందా, ఇందులో అధికారుల పాత్ర ఎంత అన్న విషయాలను పరిశీలిస్తామన్నారు. నిపుణులైన మరికొంతమంది అధికారులను విచారణకు వినియోగిస్తున్నామని అన్నారు. విచారణలో తోడ్పాటునందించేందుకు ఎంసెట్ నిర్వహణలో అనుభవమున్న రఘునాథ్, నిర్మల కుమార్ ప్రియ, సూర్యప్రకాష్, వి.ఎస్.దత్, ఎన్.నారాయణరెడ్డి, జీఎన్పి కేశవరావులను నియమించినట్టు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి చెందిన సిబ్బంది అజయ, వాసు కూడా సహకరిస్తారని చెప్పారు. నాగార్జున వర్సిటీలో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ సెల్లో ఫర్యాదులు స్వీకరించేందుకు ఆ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య చలం, ఆచార్య చంద్రశేఖర్‌లను నియమిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ ఎవరైనా ఏవైనా ఆధారాలు ఇస్తే ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తామన్నారు. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేసి గవర్నర్‌కు నివేదిక ఇస్తామని చెప్పారు. ప్రశ్నపత్రాలను నిపుణులే తయారుచేశారు: వీసీ మెడికల్ పీజీసెట్ ప్రశ్నపత్రాలను నిపుణులైన వారే తయారు చేశారని వైద్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ రవిరాజు తెలిపారు. ఎయిమ్స్, జిప్మెర్, కర్ణాటక మెడికల్ సెట్ తదితర ఉన్నతస్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రశ్నపత్రాలు ఇచ్చిన ప్రొఫెసర్ల నుంచే ఇక్కడ కూడా ప్రశ్నలు తీసుకున్నామన్నారు. ఏ విభాగంలో ఎన్ని ప్రశ్నలుండాలి, ఎక్కడ నుంచి తీసుకోవాలన్న అంశాల్లో అన్ని నియమాలను పాటించామని అన్నారు. న్యాయం జరగకపోతే పోరాటం: జూడాలు పీజీ ప్రవేశ పరీక్షలో సుమారు రూ.200 కోట్ల కుంభకోణం జరిగిందని జూనియర్ వైద్యుల సంఘం (జూడా) ఆరోపించింది. దీనిపై కూలంకషంగా దర్యాప్తు జరిపి ప్రతిభ కలిగిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరింది. లేదంటే ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే సర్వీసులు నిలిపివేస్తామని, ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించింది. -
తనిఖీల్లో రూ.24.68 లక్షలు స్వాధీనం
పరిగి, న్యూస్‌లైన్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వేర్వేరు చోట్ల పోలీసులు రూ. 24.68 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో 2.84 కిలోల వెండి నగలు పట్టుకున్నారు. పరిగిలో అధికంగా 15 లక్షలు పట్టుకున్నారు. పరిగి సీఐ వేణుగోపాల్‌రెడ్డి తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. సాయంత్రం పరిగిలోని గంజ్ రోడ్డు వైపు నుంచి నంబర్ 02 ప్రభుత్వ ఉన్నత పాఠశాల వైపు కొందరు వ్యక్తులు ఓ బైకుపై అధిక మొత్తంలో డబ్బులు తరలిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సీఐ వేణుగోపాల్‌రెడ్డి ముగ్గురు కానిస్టేబుళ్లతో రెండు బైక్‌లపై వారిని వెంబడించారు. స్కూల్ వెనుక చిన్నదారి గుండా వెళ్తున్న వారిని పట్టుకున్నారు. పరిగికి చెందిన ఎంఏ రహీం, దోమ మండలం శివారెడ్డిపల్లికి చెందిన ఆహ్మద్ఖాన్లు రూ. 15 లక్షలు తరలిస్తున్నట్లు గుర్తించి నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా తాము కాంట్రాక్టర్లమని రోడ్డుపనులకు సంబంధించి మెటీరియల్‌తో పాటు కూలీలకు చెల్లించేందుకు బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి తీసుకెళ్తున్నట్లు అహ్మద్‌ఖాన్, రహీం పోలీసులకు తెలిపారు. వారు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన స్టాటిక్ సర్విలెన్స్ టీం సభ్యుడు సంగప్పకు సదరు డబ్బులను అప్పగించారు. సమావేశంలో ట్రెయినీ డీఎస్పీ సౌజన్య, పోలీసు సిబ్బంది పాండు, అంజనేయులు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. మరో ఘటనలో రూ. 2.5 లక్షలు పరిగి మండలం రాఘవాపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ. 2.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన అశోక్ షాద్‌నగర్ నుంచి పరిగికి స్విఫ్ట్ కారులో వెళ్తున్నాడు. అతడి కారులో ఉన్న రూ. 2.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును స్టాటిక్ సర్విలెన్స్ టీంకు అప్పగించారు. ఘట్కేసర్లో రూ.5. 38 లక్షలు ఘట్కేసర్: వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘట్కేసర్ పోలీసులు శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించి రూ. 5.38 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఘట్కేసర్కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి స్కూటర్ డిక్కీలో ఈ డబ్బులు పట్టుబడ్డాయి. నగదు పెట్రోల్ పంపునకు చెందినవి ఆయన పోలీసులకు చెప్పాడు. సరైన ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. అజీజ్‌నగర్ చౌరస్తాలో రూ.1.8 లక్షలు.. మొయినాబాద్: హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై మండల పరిధిలోని అజీజ్‌నగర్ చౌరస్తా వద్ద శుక్రవారం పోలీసుల తనిఖీల్లో ఓ కారులో రూ.1.8 లక్షలు పట్టుబడ్డాయి. వివరాలు.. నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన తిరుమలరెడ్డి తన కారులో చేవెళ్ల వైపునకు వెళ్తున్నాడు. వాహనంలో ఉన్న రూ.1.8 లక్షలను మొయినాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తాను మహాలక్ష్మి బిల్డర్స్ యజమానిని అని, భూమి కొనుగోలుకు సంబంధించి నగరంలోని పేట్‌బషీరాబాద్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు లో శుక్రవారం ఉదయం రూ.5 లక్షలు డ్రా చేశానని, అందు లో నుంచి రూ.1.8 లక్షలు తీసుకెళ్తున్నట్లు అతడు పోలీసులకు తెలిపాడు. భూమికి సంబంధించిన పత్రాలు కూడా చూపించాడు. డబ్బుకు సంబంధించి అన్ని ఆధారాలు చూపిస్తేనే తిరిగి అప్పగిస్తామని, లేదంటే ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తామని పోలీసులు తిరుమలరెడ్డికి స్పష్టం చేశారు. ముడిమ్యాల చెక్‌పోస్టులో 2.84 కిలోల వెండి పట్టివేత చేవెళ్ల రూరల్: పోలీసుల తనిఖీల్లో రూ. 1.5 లక్షలు విలువ చేసే 2.84 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. చేవెళ్ల పోలీసుల కథనం ప్రకారం.. పరిగి మండల కేంద్రానికి చెం దిన మదులాపురం రవికుమార్ స్థానికంగా వెండి ఆభరణాల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం రాత్రి ఆయన నగరం నుంచి పరిగికి బస్సులో వెళ్తున్నాడు. మండలంలోని ముడిమ్యాల చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో అతడి వద్ద ఉన్న బ్యాగులో 2.84 కిలోల వెండి ఆభరణాలు(పట్టాలు, రెండు వెండి బిస్కెట్లు) ఉన్నట్లు గుర్తించారు. తన దుకాణంలో అమ్ముకునేందుకు హైదరాబాద్ నుంచి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నట్లు రవికుమార్ పోలీసులకు చెప్పాడు. అతడి వద్ద ఓ తెల్లకాగితం రశీదు మాత్రమే ఉంది. దీంతో పోలీసులు అనుమానించి అతడిని ఠాణాకు తరలించారు. ఈ విషయాన్ని పోలీసులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు ఆర్డీఓ చంద్రశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం వెండి ఆభరణాలను కమర్షిల్ టాక్స్ శాఖ అధికారులకు అప్పగించారు. -
పీసెట్ షెడ్యూల్ విడుదల
7న నోటిఫికేషన్.. 11 నుంచి దరఖాస్తులు ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీసెట్-2014 (ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి విడుదల చేశారు. గుంటూరులోని ఏఎన్‌యూలో మంగళవారం జరిగిన పీసెట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోటిఫికేషన్ ఈనెల 7న విడుదల చేస్తారని, ఆన్లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ఈనెల 11 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవటానికి ఏప్రిల్ 22 ఆఖరు తేదీ. రూ.500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 25 వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మే 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఏప్రిల్ 30 నుంచి వెబ్సైట్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకున్నవారు మే 10 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పీసెట్ పరీక్షలు, స్క్రాచ్ కార్డుల పంపిణీ మే 5 తరువాత ప్రారంభమవుతుందని చెప్పారు. ఫలితాలను పరీక్షలు ముగిసిన వారంలో వెల్లడిస్తామన్నారు. సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, ఉన్నత విద్యామండలి కార్యదర్శి సతీష్ రెడ్డి, ఏఎన్‌యూ వీసీ, పీసెట్ చైర్మన్ కె.వియ్యన్నారావు, పీసెట్ కన్వీనర్ వై.కిషోర్ పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య బాధ్యత వర్సిటీలదే
=‘రూసా’తో వర్సిటీల అభివృద్ధికి నిధులు =వర్సిటీల బలోపేతానికి చర్యలు =ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి యూనివర్సిటీక్యాంపస్, న్యూస్‌లైన్: విద్యార్థులకు నాణ్యమైన విద్య, సమాజాభివృద్ధికి దోహదపడే పరిశోధనలు అందించే బాధ్యత యూనివర్సిటీలదేనని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. ఎస్వీయూ అతిథిగృహంలో శనివారం ఆయన ‘న్యూస్‌లైన్’కు ప్రత్యేక ఇంట ర్వ్యూ ఇచ్చారు. వర్సిటీల అభివృద్ధికి తీ సుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో అన్ని వర్సిటీలు ఆర్థిక లోటు తో కొట్టుమిట్టాడుతున్నాయి. 2013- 14 ఆర్థిక సంవత్సరంలో వర్సిటీల బ డ్జెట్‌ను ప్రభుత్వం పెంచింది. 2014- 15 సంవత్సరం ఎన్నికల సంవత్సరం కాబట్టి ప్రభుత్వం ఏమేరకు బడ్జెట్ పెం చుతుందో అనుమానమే. అయితే కేంద్రప్రభుత్వం ఉన్నత విద్య అభివృద్ధికి రాష్ట్రీయ ఉచిత శిక్షా అభియాన్(రూసా) అనే కొత్త పథకం ప్రవేశపెట్టింది. కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఈ పథకం అమలు చేస్తుంది. సుమారు పదేళ్లపాటు ఈ ప థకం అమలులో ఉంటుంది. తద్వారా రాష్ట్రానికి రెండేళ్లకు రెండువేల కోట్ల రూ పాయల నిధులు రానున్నారుు. రెండేళ్ల తర్వాత మరో ఐదువేల కోట్లు రానున్నాయని వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. అటానమస్ కళాశాలలకు వర్సిటీస్థాయి రూసా పథకం కింద అటానమస్ కళాశాలను వర్సిటీలుగా అప్‌గ్రేడ్ చేయనున్న ట్లు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. నాక్ ఎ-గ్రేడ్, కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కలిగి ఉండి, మూడువేల మంది విద్యార్థులు ఉన్న కళాశాలలను వర్సిటీలుగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు వర్సిటీల్లో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అ నుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు. భర్తీ ప్రక్రియ కొకనసాగుతోందన్నారు.అధ్యాపక పోస్టుల భర్తీలో వీసీలు అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పరిపాలనా పరమైన సంస్కరణలు తీసుకు వచ్చేందుకు కూ డా కృషి చేస్తున్నామన్నారు. బోధనా ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉందని, అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాలన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో సిలబస్‌ను మార్చాల్సిన అవసరాన్ని వర్సిటీలు గుర్తించాలని ఆయన సూచించారు. కొందరు కళంకం తెస్తున్నారు కొందరు వీసీలు, ఇతర అధికారులు ఉన్నత విద్యకు కళంకం తెస్తున్నారని ఆయన అన్నారు. నిధులు పెంచుకోవడం కోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటూ దారితప్పుతున్నారన్నారు. గ తంలో కుప్పంలోని ద్రవిడ వర్సిటీ, కర్నూలులోని రాయలసీమ వర్సిటీ సరైన నిబంధనలు పాటించకుండా లెక్కకుమించి పీహెచ్డీ అడ్మిషన్లు ఇచ్చాయని తెలిపారు. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలన్నారు. స్పష్టమైన లక్ష్యం కలిగి, దాన్ని సాధిం చేందుకు కృషి చేయూలని ఆయన సూచించారు. -
వింగ్ కమాండర్ వేణుగోపాల్‌రెడ్డి అదృశ్యం
జైపూర్: వైమానిక దళంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అధికారి రాజస్థాన్‌లో అదృశ్యమయ్యారు. వింగ్ కమాండర్ వేణుగోపాల్‌రెడ్డి ఆచూకీ నెల రోజులుగా తెలియటం లేదని రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. వైమానికదళ అధికారి ఒకరు శుక్రవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సూరత్‌గఢ్ స్టేషన్లో పనిచేస్తున్న వేణుగోపాల్‌రెడ్డి అదృశ్యం కావటంపై విచారణకు ఆదేశించినట్లు రక్షణశాఖ గోస్వామి తెలిపింది. -
రెవెన్యూ పోస్టుల భర్తీకి చర్యలు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోస్టుల భర్తీకి సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. జిల్లాలో వీఆర్వో పోస్టులు 105, వీఆర్ఏ పోస్టులు 176 భర్తీ చేస్తున్నామని తెలిపారు. మండలాల నుంచి కేటగిరీ వారీగా రోస్టర్ పాయింట్ ప్రకారం ఖాళీల వివరాలు సేకరించామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 28న నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు రూ. 200, ఇతరులు రూ.500ను పరీక్ష ఫీజు కింద మీ-సేవ కేంద్రాల్లో చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. వికలాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉందని, ఇందుకు సదరం ధృవీకరణ పత్రం ఉండాలని తెలిపారు. రెండు కేటగిరీల పోస్టులకు పోటీ పడేవారు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వీఆర్వో పోస్టులు జిల్లా యూనిట్‌గా భర్తీ చేస్తామన్నారు. వీఆర్ఏ పోస్టులకు ఆయా రెవెన్యూ గ్రామాలకు చెందిన వారే అర్హులన్నారు. వీఆర్వో పోస్టులకు ఇంటర్, వీఆర్ఏ పోస్టులకు 10వ తరగతి కనీస అర్హతగా ఉందన్నారు. 4వ తరగతి నుంచి వరుసగా నాలుగేళ్లు ఏ జిల్లాలో చదివి ఉంటారో అదే వారి స్థానిక జిల్లాగా పరిగణిస్తామన్నారు. 2013 జూలై 1వతేదీ నాటికి 18 ఏళ్లు నుంచి 36, వీఆర్ఏ పోస్టులకు 18 నుంచి 37 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, వికలాంగులకు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుందన్నారు. నోటిఫికేషన్ విడుదల, సెంటర్ల గుర్తింపు, ఇతర చర్యలపై దృష్టి పెట్టినట్లు ఆయన వివరించారు. -
ప్రజలకోసం ఫస్టొచ్చారు!
ముందుండాలని ఫస్ట్ వస్తారు ఎవరైనా. వెనకుండడం కోసం ఫస్ట్ తెచ్చుకున్నారు వేణుగోపాల్! టెన్త్‌లో స్కూల్ ఫస్ట్... డిగ్రీలో కాలేజ్ ఫస్ట్... ఎమ్మెస్సీలో యూనివర్శిటీ ఫస్ట్... గ్రూప్ 1లో స్టేట్ ఫస్ట్... ఈ ఫస్ట్‌లన్నీ - ప్రజల కోసం, ప్రజల వెనుక వుండడం కోసం కాలే కడుపుతో, నిద్ర లేని కళ్లతో సాధించారాయన! ఫస్ట్ అటెంప్ట్‌లోనే వాణిజ్య పన్నుల అధికారిగా ఎంపికైనా... గ్రూప్ 1 మళ్లీ రాసి రెవిన్యూ సర్వీసును ఎంచుకున్నది కూడా... ఆ ప్రజల కోసమే! పగిలిన పలక ముక్కపై అక్షరాలు దిద్దుకుని... స్నేహితుల పుస్తకాలు అరువు తెచ్చుకుని... ఆశల్ని చంపుకుని, ఆశయాల్ని నింపుకుని... ప్రజాసేవకుడినై తీరాలని ప్రతిన పూనిన వేణుగోపాల్‌ను అంతగా ప్రేరేపించిన పరిస్థితులేమిటి? చదవండి... ఈవారం ‘జనహితం’లో... ఆదర్శాలు అందరికీ ఉంటాయి.. కానీ ఆచరణలో ఎన్ని అమలు చేయగలం?.. చిన్ననాడు అన్నీ స్ఫూర్తికలిగిస్తాయి... అందులో ఎన్ని జీవితంలో ఆచరణలోకి వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఓసారి వేణుగోపాల్ రెడ్డి జీవితంలోకి తొంగి చూడాల్సిందే... తన జీవితంలో పేదరికం ఉంది. అడుగడుగునా కష్టాలు వెన్నాడుతున్నాయి. ఆఖరికి బడిలో.. చదువుల ఒడిలో అన్నీ సమస్యలే.. అయినా అమ్మానాన్నల ఆశీస్సులే పెట్టుబడిగా.. అన్నదమ్ముల ఆలంబనే ఆశీర్వాదాలుగా బతుకు చిత్రంలో ఒదిగి.. సర్కారీ బడిలోనే కష్టపడి చదివి... అధికారి అయ్యారు. కడప జిల్లా బద్వేలు మండలం జాఫర్‌సాహెబ్ పల్లి అనే ఓ చిన్ని గ్రామానికి చెందిన ఆయనే గ్రూప్-1 సర్వీసులో 2006 బ్యాచ్ స్టేట్ టాపర్‌గా నిలిచి, ప్రస్తుతం రాజమండ్రి రెవిన్యూ డివిజనల్ అధికారిగా పనిచేస్తున్న మట్లి వేణుగోపాల రెడ్డి. నిండా నలభై గడపలు కూడా లేని ఒక కుగ్రామంలో, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలోని ఆరుగురు అన్నదమ్ముల్లో నాలుగో సంతానం ఈయన. సర్కారీబడులు తప్ప చదువుకోవడానికి మరో మార్గం లేని ఆ గ్రామంలో పట్టుదలే ముందుకు నడిపిందంటూ తన జీవిత విశేషాలను సాక్షితో పంచుకున్నారు. ‘‘అడిగితే ఇంకొంత కష్టం చేసి అన్నీ కొనిస్తాడు నాయన. కానీ అది ఆయనకు ఎంత భారమో నాకు తెలుసు. పలక విరిగిపోతే, రెండు ముక్కలను ఇద్దరు అన్నదమ్ములం తీసుకునేవాళ్ళం. పుస్తకాలు కొనడానికి కూడా ఆలోచించవలసిన రోజులు అవి. స్నేహితుల వద్ద పుస్తకాలు తీసుకుని, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకునేవాడిని. ఇలా పడిన కష్టం ఫలించింది. పదోతరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచాను. ఇంటర్లో కాలేజీలో రెండవస్థానంతో సరిపుచ్చుకున్నా, డిగ్రీలో మాత్రం మళ్లీ కాలేజీ టాపర్నే అయ్యా. ఎమ్మెస్సీలో కూడా యూనివర్సిటీ ఫస్టు నేనే.. వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడదంతా ఓ అనుభూతిలా మిగిలింది.’ అంటున్నారాయన. నిబద్ధతతో జీవితాన్ని చిన్ననాటి నుంచి కొనసాగిస్తూ వస్తే ‘సాధ్యం’ ముంగిట ‘అసాధ్యం’ చిన్నదై పోతుందని చెబుతున్న వేణుగోపాలరెడ్డి తన జీవిత పుస్తకాన్ని నేటి యువతకు మార్గదర్శకం అయ్యేందుకు సాక్షికి ఓసారి తెరిచి చూపించారు. మొదటిసారి 2005లో గ్రూప్-1లో వాణిజ్య పన్నుల శాఖ అధికారిగా ఎంపికయ్యారు. కానీ అది తన లక్ష్యాలకు తగ్గట్టుగా లేదని ప్రజాసేవకు దగ్గరలో ఉండే బాధ్యతలు నిర్వర్తించాలని మరోసారి ప్రయత్నించి 2006లో స్టేట్ టాపర్‌గా నిలిచి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. ఎందుకనుకున్నానంటే... నేను అప్పర్ ప్రైమరీ చదువులో ఉండగా మా కుటుంబానికి ఓ ధృవపత్రం అవసరమైంది. దానికోసం ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాను. అక్కడ నాలాగే ఎందరో రకరకాల సర్టిఫికెట్ల కోసం బారులు తీరారు. ఎవరి బాధలు వారివి. అక్కడ జనం పడిగాపులు చూసి నేను ఇలాంటి ఆఫీసులో సేవకుడు కావాలని బలంగా అనుకున్నాను. అదే స్ఫూర్తి రెవెన్యూ సర్వీసెస్ కోసం నన్ను ముందుకు నడిపించింది. ఉమ్మడి కుటుంబం నేపథ్యం... ‘మాకు పదెకరాల వ్యవసాయ భూమి ఉండేది. వర్షాధార వ్యవసాయం. నాన్న చిన్నకృష్ణారెడ్డి అయిదో తరగతి వరకు చదివారు. అమ్మ చెన్నమ్మ చదువుకోలేదు. ఆరుగురు అన్నదమ్ముల్లో ముగ్గురు చదువులబాట పడితే, మరో ముగ్గురు వ్యవసాయానికి అంకితమయ్యారు. గ్రామంలో నా పెద్దన్న రాజగోపాల్‌రెడ్డి ఎం.ఏ పట్టా పుచ్చుకున్న మొదటి వ్యక్తి. మరో అన్నయ్య సూర్యనారాయణరెడ్డి బిట్స్ పిలానీలో ఎమ్మెస్సీ చదివారు. నేను తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ, గణితశాస్త్రం చదివాను. చదివిన అన్నలు, మా చదువుల కోసం వ్యవసాయానికి అంకితం అయిన సోదరులు అందించిన ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేను’ అంటున్న వేణుగోపాల్, ఇద్దరు సోదరులు చదువు మీద కాక, వ్యవసాయం మీదనే ఆధారపడ్డ సోదరులకు తమ వాటాగా వచ్చిన భూమిని ఇచ్చేశారు. ‘నాయన నుంచి వచ్చిన ఆస్తి వాటాను చదువుకోని నా అన్నదమ్ములకే విడిచేశాను. నాకు మంచి ఉద్యోగం ఉంది. అన్నలిద్దరూ కూడా చదువుకుని మంచిగానే బతుకు తున్నారు. అందుకే చదువుకున్న వాళ్లు ముగ్గురం మా ఆస్తులు చదువుకోని సోదరులకు ఇచ్చేశాం’ అని చెప్పుకొచ్చిన వేణుగోపాల్ తన జీవన ప్రస్థానంలో అర్ధాంగి సహకారం మరువలేనిదన్నారు. క్రికెట్ చూడటం, సాహిత్యం పట్ల ఆసక్తి ఉందంటున్న వేణుగోపాల్‌కి శ్రీశ్రీ, గురజాడ కన్యాశుల్కం, చలం సాహిత్యం అభిమాన గ్రంథాలట! దిశా నిర్దేశం అవసరం... ‘ఈనాటి యువత చదువులో దిశానిర్దేశం లేకుండా ఉన్నారు. కళాశాల విద్యలోకి ప్రవేశించాక... నిర్ణీత లక్ష్యాలు ఎంచుకోవాలి. ఆ దిశగా ఎంచుకునే కోర్సులు ఉండాలి. ఏదో చదివాంలే... పట్టభద్రులు అయ్యాంలే.. అనుకుంటే మంచి భవిష్యత్తు పొందలేరు’ అంటారు. ఈ పోటీ ప్రపంచంలో లక్ష్యం లేని విద్యకు విలువ లేదంటున్న వేణుగోపాల్ మాటలకు విలువ ఇస్తే, యువత తామనుకున్న మార్గంలో నడవడానికి ఎన్ని కష్టాలెదురైనా వెనుకడుగు వేయరేమో! - దేవళ్ల సూర్యనారాయణ మూర్తి, సాక్షి, రాజమండ్రి -
రాజకీయ ప్రయోజనాలకే ‘అవిశ్వాసం’
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : రాజకీయ ప్రయోజనాల కోసమే సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తున్నారని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధికార ప్రతినిధి నరహరి వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే 50 మంది సభ్యుల మద్దతు అవసరమన్నారు. ఇది సాధ్యం కాదని తెలిసి నాయకులు అవిశ్వాస డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాసాన్ని బీజేపీ సమర్థించేది లేదని ఆయన స్పష్టం చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు పొడిగించి తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఏవిధంగా వ్యవహరించాలో జాతీయ నాయకులతో చర్చించేందుకు కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలవగానే చంద్రబాబు గుజరాత్ సీఎం మోడీని సమర్థిస్తున్నారన్నారు. టీడీపీ సీమాం ధ్ర ఎంపీలు తెలంగాణకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టిన తర్వాత కూడా టీటీడీపీ నాయకుల్లో మార్పు రాకపోవడం సరికాదన్నారు. టీటీడీపీ నాయకులు బీజేపీలో చేరితే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేద్దామని సూచించారు. బాబు నాయకత్వంలో పనిచేస్తారా మోడీ నాయకత్వంలో పనిచేస్తారో తేల్చుకోవాలన్నారు. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ పెద్ద రాష్ట్రాలను కోరుకుంటున్నారని విమర్శించారు. నాయకులు నాగపురి రాజమౌళి, కోడెల రామ్మూర్తి, దిలీప్‌నాయక్, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు. -
వణుకుతున్న కుల్కచర్ల
కుల్కచర్ల, న్యూస్‌లైన్: వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు కుల్కచర్ల మండల పరిధిలోని గ్రామాల ప్రజలను వణికిస్తున్నాయి. నెలన్నర వ్యవధిలోనే ఐదు హత్య కేసులు, రెండు అత్యాచారం కేసులు నమోదవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరుసగా జరుగుతున్న నేరాలు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఎప్పుడేం జరుగుతుందోనని ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బండవెల్కిచర్ల కేసులో పోలీసులు తలమునకలై ఉన్నారు. ఉన్నతస్థాయి అధికారులు ఈ కేసు విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇద్దరిని తీసుకువచ్చి విచారించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు బయటికి మాత్రం చెప్పడం లేదు. ఒకటి రెండు రోజుల్లో కేసును ఛేదిస్తామని సీఐ వేణుగోపాల్‌రెడ్డి చెబుతున్నారు. ఇవీ సంఘటనలు... గతనెల 8న మండల పరిధిలోని విఠలాపూర్ గ్రామంలో పాతకక్షల నేపథ్యంలో పొలం దగ్గర మహిళను హత్య చేసి చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో ఎనిమిది రోజుల తర్వాత పోలీసులు నిందితులను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. గతనెల 20న కుల్కచర్లకు చెందిన వడ్డె చంద్రమ్మను దాయాదుల్లో ఒకరైన రాములు హత్య చేశాడు. ఈ కేసులో రాములును రిమాండ్‌కు తరలించారు. గతనెల 25న కుల్కచర్లకు చెందిన హరిజన్ నర్సయ్యను అతనితో సహవాసం చేస్తున్న మహిళ రాయితో తలపై కొట్టి హత్య చేసింది. ఈ కేసులో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 3న పటెల్చెరువు తండాలో భార్యపై భర్త, కుటుంబ సభ్యులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 6న మండల పరిధిలోని బండవెల్కిచర్లలో గుర్తుతెలియని మహిళను తాడుతో ఉరివేసి, గ్రామం నడిబొడ్డున పెట్రోల్ పోసి ఆనవాలు లేకుండా నిప్పంటించి హత్య చేశారు. 15 రోజులైనా ఈ కేసును పోలీసులు ఛేదించలేదు. కనీసం హత్యకు గురైన మహిళ వివరాలు కూడా తెలియ రాలేదు. ఈనెల 17న ఈర్లవాగు తండాకు చెందిన గిరిజన మహిళపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు రాత్రి పగలు కష్టపడి నిందితులను పట్టుకుని రిమాండ్‌కు పంపించారు. ఘణపూర్లోనూ ఇటీవల ఓ అత్యాచారం కేసు నమోదైనట్లు తెలిసింది. -
ఒకే వ్యక్తి పలు నియోజకవర్గాల్లో ... రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఏకకాలంలో ఒక వ్యక్తి పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్న ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు సోమవారం మరోసారి విచారించింది. ఈ వ్యాజ్యంలో అన్ని రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ వేణుగోపాల్‌రెడ్డిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభానులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక వ్యక్తి ఏకకాలంలో పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ న్యాయవాది వేణుగోపాల్‌రెడ్డి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని గతవారం విచారించిన ధర్మాసనం... ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. సోమవారం ఈ వ్యాజ్యం తిరిగి విచారణకు వచ్చినప్పుడు... ఇందులో రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చలేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఆ మేరకు రాజకీయ పార్టీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.