ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసిందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డితెలిపారు.
హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ముగిసిందని ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డితెలిపారు. ఈనెల 30 సీట్లు కేటాయిస్తామని చెప్పారు. గుర్తింపు రద్దయిన 130 కాలేజీల లిస్టు 12 గంటలలోపు వచ్చివుంటే కౌన్సెలింగ్ లో వాటి పేర్లను చే్చే అవకాశముండేదన్నారు.
గుర్తింపు కోల్పోయిన కాలేజీలను జేఎన్టీయూ సర్టిఫై చేస్తే ఆయా కాలేజీల పేర్లను వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామన్నారు. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.