వైమానిక దళంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అధికారి రాజస్థాన్‌లో అదృశ్యమయ్యారు.
జైపూర్: వైమానిక దళంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ అధికారి రాజస్థాన్‌లో అదృశ్యమయ్యారు. వింగ్ కమాండర్ వేణుగోపాల్‌రెడ్డి ఆచూకీ నెల రోజులుగా తెలియటం లేదని రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. వైమానికదళ అధికారి ఒకరు శుక్రవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సూరత్‌గఢ్ స్టేషన్‌లో పనిచేస్తున్న వేణుగోపాల్‌రెడ్డి అదృశ్యం కావటంపై విచారణకు ఆదేశించినట్లు రక్షణశాఖ గోస్వామి తెలిపింది.