హన్మకొండ అర్బన్ : కేంద్రం నిధులతోనే రా ష్ర్టంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని బీజేపీ తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్ నరహరి వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సుమారు 8వేల గ్రామ పంచాయతీల కు కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్ల కాలంలో ఒక్కో పంచాయతీకి రూ.80 లక్షలకు పైగా నిధులు ఇచ్చిం దని ఆయన పేర్కొన్నారు.
శనివారం హన్మకొండలో పార్టీ జిల్లా అధ్య క్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజెక్టుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కరువు సాయం కూడా ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణకు ఎక్కువ మొత్తంగా రూ.791కోట్లు ఇచ్చిందన్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో బయో డైవర్సిటీ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు రూ.350 కోట్లు, హరిటేజ్ పథకం కింద రూ.21కోట్లు మునిసిపాలిటీలకు కేటాయించిం దని తెలిపారు. రూ.100 కోట్ల సబ్సిడీతో వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు మంజూరు చేస్తే ఇంత వరకు రాష్ట్రం ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని తెలిపారు. రాష్ట్రంలో 24 వేల మంది చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా కేంద్రం కల్పించిందన్నారు. తెలంగాణలోని 12 నగరాలు అమృత్ పథకంలో ఎంపిక చేసి రూ. 100 కోట్ల చొప్పున కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తోం దని తెలిపారు.
రాష్ట్రానికి పసుపు బోర్డు, పత్తి పరిశోధన కేంద్రం మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పనులు ముందుకు సాగనివ్వడం లేదని చెప్పారు. రూ.1200 కోట్లతో బీబీనగర్ వద్ద మంజూరు చేసిన ఎయిమ్స్‌కు ఇప్పటివరకు స్థలం కేటాయించలేదన్నారు. ఈజీఎస్, భూముల సర్వే కోసం కేంద్ర ఇచ్చిన నిధులు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. తమిళనాడు, ఏపీ, కర్నాటక వ ంటి రాష్ట్రాలు నాణ్యమైన విద్యత్ 24గంటలు అందిస్తున్నాయని, తెలంగాణలో మాత్రం 9గంటల విద్యుత్ విషయంలో ప్రకటనలకే పరిమితమైందని వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. కనీసం 5గంటల విద్యుత్ కూడా రైతాంగానికి అందడం లేదని, ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఒక్క ప్రాజెక్టు కోసం కూడా కేంద్రం వద్ద రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు లేవని, ఒక వేళ ఉన్నట్లు చూపితే తామే మంత్రి ఉమాభారతితో మాట్లాడి మంజూరు చేయించుకువస్తామని అన్నారు. పాలిచ్చే ఆవులాగా ఉన్న కేంద్రం ప్రభుత్వం నుంచి రాష్ట్రం ఉన్నకాడికి పిండుకుంటోందని, పైగా ఆరోపణలు చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ పాపం రాష్ట్ర ప్రభుత్వానికి తగులుతుందని శాపనర్ధాలు పెట్టారు. మిగులు బడ్జట్‌తో ఏర్పడిన తెలంగాణ ఆదాయం ఏమవుతుందో తెలియజేయాలని, తెలంగాణ ఆస్తులు ఏమేరకు పెంచారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఫసల్ బీమాపై ప్రభుత్వం నిర్లక్ష్యం
కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని బీజేపీ తెలంగాణ అభివృద్ధి కమిటీ చైర్మన్ నరహరి వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాకు ఎస్సారెస్పీ నీరు రాకుండా కేటీఆర్, హరీష్‌రావు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కిట్స్ కళాశాల సమీపంలో కాల్వకు గండి కొట్టి జిల్లాకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రాజెక్టులకు దరఖాస్తు చేయడం లేదని, రూ.వేల కోట్ల నిధులు ఇస్తున్నా రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని చెప్పారు. 2014-15లో రూ.15 వేల కోట్లు, 15-16లో రూ.5వేల కోట్ల ఆర్థిక సంఘం నిధులు, 2016-17లో రూ.28 వేల కోట్లు పన్నులకు సంబంధించిన నిధులు రాష్ట్రానికి ఇచ్చిందని తెలిపారు.
మూలుగుతున్న డబుల్ బెడ్రూం నిధులు..
డబుల్ బెడ్ రూం పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటాగా ఒక్కో లబ్ధిదారుడికి రూ.1.30 లక్షలు విడుదల చేసిందని, పనులు ప్రారంభంకాక నిధులు మూలుగుతున్నాయని అన్నారు. ప్రధాన మంత్ర ఫసల్ బీమా దరఖాస్తుకు గడువు 14 వరకు మాత్రమే ఉందని, ఇప్పటికైనా రాష్ట్రం మేల్కొని రైతులకు బీమా వర్తించేలా అవగాహన కల్పించాలని సూచించారు. అన్నారు. గతంలో పన్నుల ఆదాయంలో 39 శాతంగా ఉన్న రాష్ట్ర వాటాను 49 శాతంగా చేసి కేంద్రం ఇస్తోందని అన్నారు. జన్‌ధన్ కింద 80 వేల ఖాతాలు, ముద్ర పథకం కింద 5 లక్షల మందికి రూ.2,284 కోట్ల రుణాలు, రోడ్లకు రూ.43వేల కోట్లు కేంద్రం ఇచ్చిందని తెలిపారు.
కేంద్రం ఇచ్చే నిధుల వల్లే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని వివరించారు. 13,14వ ఆర్థిక సంఘాలు ఇచ్చిన నిధులతోనే గ్రామ పంచాయతీల్లో పనులు సాగుతున్నాయని తెలిపారు. నీతి ఆయోగ్ తాజాగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలకు మరో మారు నిధులు ఇవ్వమని కేంద్రానికి సిఫారసు చేసిన విషయం గుర్తు చేశారు. ఈనెల 25న తొర్రూరులో పార్టీ జిల్లా స్థాయి సమావేశం తొర్రూరులో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో కొత్త దశరథం, పెదగాని సోమయ్య, కూచన రవళి, కీర్తిరెడ్డి, దిలీప్, త్రిలోకేశ్వర్, వెంకటేశ్వర్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.