ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : రాజకీయ ప్రయోజనాల కోసమే సీమాంధ్ర ఎంపీలు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తున్నారని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధికార ప్రతినిధి నరహరి వేణుగోపాల్‌రెడ్డి విమర్శించారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే 50 మంది సభ్యుల మద్దతు అవసరమన్నారు.
ఇది సాధ్యం కాదని తెలిసి నాయకులు అవిశ్వాస డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాసాన్ని బీజేపీ సమర్థించేది లేదని ఆయన స్పష్టం చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు పొడిగించి తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఏవిధంగా వ్యవహరించాలో జాతీయ నాయకులతో చర్చించేందుకు కిషన్‌రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారని వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలవగానే చంద్రబాబు గుజరాత్ సీఎం మోడీని సమర్థిస్తున్నారన్నారు. టీడీపీ సీమాం ధ్ర ఎంపీలు తెలంగాణకు వ్యతిరేకంగా అవిశ్వాసం పెట్టిన తర్వాత కూడా టీటీడీపీ నాయకుల్లో మార్పు రాకపోవడం సరికాదన్నారు. టీటీడీపీ నాయకులు బీజేపీలో చేరితే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేద్దామని సూచించారు. బాబు నాయకత్వంలో పనిచేస్తారా మోడీ నాయకత్వంలో పనిచేస్తారో తేల్చుకోవాలన్నారు. లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ పెద్ద రాష్ట్రాలను కోరుకుంటున్నారని విమర్శించారు. నాయకులు నాగపురి రాజమౌళి, కోడెల రామ్మూర్తి, దిలీప్‌నాయక్, త్రిలోకేశ్వర్ పాల్గొన్నారు.
రాజకీయ ప్రయోజనాలకే ‘అవిశ్వాసం’
Published Wed, Dec 11 2013 4:51 AM | Last Updated on Fri, Mar 29 2019 5:32 PM
Advertisement
Advertisement