'షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సిలింగ్' | EMCET Councilling As per Schedule: Venugopal Reddy | Sakshi
Sakshi News home page

'షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సిలింగ్'

Published Wed, Aug 6 2014 7:12 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

EMCET Councilling As per Schedule: Venugopal Reddy

హైదరాబాద్: ఎంసెట్ రూపొందించిన షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామని బుధవారం మీడియాకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 31వ తేదీలోపు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అడ్మిషన్లు పూర్తి చేస్తామని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. 
 
సెప్టెంబర్ 1 నుంచి ఇంజనీరంగ్ తరగతులు ప్రారంభిస్తామన్నారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో ఎలాంటి గందరగోళానికి గురికావొద్దని విద్యార్ధులకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement