జూన్ 2 నుంచి అవుల్లోకి
ఏపీ కౌన్సిల్‌కు వేణుగోపాల్‌రెడ్డి చైర్మన్!
తెలంగాణ ఇన్‌చార్జి చైర్మన్‌గా సత్యనారాయుణ!
వచ్చే ఏడాది ఎవరి ప్రవేశపరీక్షలు వారివే
హైదరాబాద్: ఉన్నత విద్యా మండలిని రెండుగా విభజించే ప్రక్రియు దాదాపు పూర్తరుుంది. జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఉన్నత విద్యా మండలిలు అవుల్లోకి రానున్నారుు. 2015 జూన్ 2 వరకు ప్రస్తుత మండలి రెండు రాష్ట్రాలకు సేవలందించేలా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నప్పటికీ, ఇప్పుడే రెండుగా విభజిస్తున్నారు. ఆంధ్రప్రదే శ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనుండగా, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి ఉస్మానియూ విశ్వవిద్యాలయుం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ సత్యనారాయుణ ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరించనున్నారని సమాచారం. ఆయున ఇప్పటికే ఉన్నత విద్యా మండలి ైవె స్ చైర్మన్-1గా నియమితులయ్యారు. అరుుతే ఆయున ఇంకా విధుల్లో చేరలేదు. విభజన జరిగిన వెంటనే ఇన్‌చార్జి చైర్మన్‌గా ఆయనకే బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వురోవైపు ప్రస్తుతం మండలి ైవె స్ చైర్మన్-2గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ విజయుప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్‌కు వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. తెలంగాణ కౌన్సిల్‌కు వురో వైస్ చైర్మన్‌ను నియుమించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత ఉన్నత విద్యా మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి తెలంగాణ కౌన్సిల్‌కు కార్యదర్శిగా ఉంటారు. ఏపీ కౌన్సిల్‌కు కొత్త కార్యదర్శిని నియుమించాల్సి ఉంటుంది.
అప్పటివరకు ప్రస్తుత డిప్యూటీ డెరైక్టర్ కృష్ణవుూర్తిని ఏపీ కౌన్సిల్ ఇన్‌చార్జి కార్యదర్శిగా నియుమించే అవకాశం ఉంది. ఇక సిబ్బందిని 10:13 నిష్పత్తిలో విభజించారు. అవసరమైతే కొంత వుంది తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్‌లో, ఆంధ్రప్రదే శ్‌కు చెందిన వారు కొందరు తెలంగాణ కౌన్సిల్‌లో పనిచేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారాలన్నింటిపై సోవువారం తుది నిర్ణయుం తీసుకునే అవకాశం ఉంది. ఇక వచ్చే ఏడాది రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగానే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రస్థాయి యూనివర్సిటీలైన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ద్రవిడ విశ్వవిద్యాలయాలను కూడా విభజించనున్నారు. సాంకేతిక విద్యా శాఖ, కళాశాల విద్యా శాఖలనూ విభజిస్తారు. ఈనెల 12న వీటిపై తుది నిర్ణయుం తీసుకోనున్నారు.
రెండుగా ఉన్నత విద్యా మండలి
Published Sat, May 10 2014 12:12 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement