sathya narayana
-
పనిమంతుడు
ప్రశంసలు అందుకుంటున్న కలెక్టర్ ► మానవీయ కోణంలోనూ స్పందన ► కుటుంబాల్లో కలహాల పరిష్కారానికి‘కుటుంబ స్నేహిత’ ► ‘అన్యోన్య దాంపత్యం’పై అవగాహన సదస్సులు ► సెలవు దినాల్లోనూ పల్లెబాట ► ఒక్క రోజూ సెలవు పెట్టని అధికారి ‘నా ఎదుగుదలకు కామారెడ్డిలో చదువే ఉపకరించింది. బతుకుబాట చూపిన ఈ గడ్డ రుణం తీర్చుకునేందుకు నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను’. – కలెక్టర్ సత్యనారాయణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కలెక్టర్ సత్యనారాయణ పనితీరుపై జిల్లాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన సామాజిక, మానవీయ కోణంలోనూ స్పందిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. జిల్లా ఆవిర్భావం రోజైన అక్టోబర్ 11న బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ ఇప్పటి వరకు ఏ ఒక్కరోజూ సెలవుపై వెళ్లలేదు. కామారెడ్డి : రాష్ట్ర రాజధానిలో జరిగిన రివ్యూ సమావేశాలు, ఓ సారి ఢిల్లీలో జరిగిన సమావేశానికి వెళ్లినపుడు మాత్రమే కలెక్టర్ సత్యనారాయణ జిల్లాను వదిలిపెట్టారు. మిగతా రోజులన్నీ ఇక్కడే గడిపారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి దాకా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఒక్కోరోజు ఐదారు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేగాక ఫీల్డ్ విజిట్లకు కూడా నిత్యం వెళుతున్నారు. కలెక్టర్ పనితీరును చూసి అందరూ ‘సత్తెన్న మస్తు చేస్తుండు’ అని మాట్లాడుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ఆయా విభాగాల సిబ్బందిని కలెక్టర్ ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు వస్తున్న వినతులు, అక్కడికి వచ్చి తమ గోడును వెళ్లబోసుకుంటున్న అమాయక జనాల వ్యథలను నిదానంగా వింటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ప్రజావాణికి వచ్చిన ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసిన ఘటన ఆయన్ను కలచివేసింది. సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలే తప్ప ఆత్మహత్య చేసుకోవడం ఆలోచన రావడం సరికాదని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలో సమస్యలే ఆమెను ఆత్మహత్యకు పురిగొలిపాయని గుర్తించిన కలెక్టర్ వాటిపై దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, జేసీ సత్తయ్య, డీఆర్వో మణిమాల, డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, సంక్షేమ శాఖల అధికారులు దేవిదాస్, గంగాధర్, రాధమ్మ తదితరులతో పలుమార్లు చర్చించి కుటుంబ సమస్యల పరిష్కారానికి ‘కుటుంబ స్నేహిత’ (ఫ్యామిలీ కౌన్సెలింగ్) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డివిజన్ స్థాయిలో రెండు టీమ్‌లను ఏర్పాటు చేయాలని భావించారు. పోలీసు, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బృందంలో ఎస్సై, మహిళా కానిస్టేబుల్, సీనియర్ సిటిజెన్, ఇద్దరు జెండర్ కమిటీ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చి సమస్యలను ఎలా పరిష్కరించాలన్న విషయమై అవగాహన కల్పించారు. కమిటీల ఆధ్వర్యంలో కుటుంబ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. అలాగే కొత్త దంపతులకు ‘అన్యోన్య దాంపత్యం’పై సదస్సులు ఏర్పాటు చేసి సైకాలజిస్టులతో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే నిరంతర విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఒత్తిడికి గురవుతుంటారని, వారికి, వారి కుటుంబ సభ్యులకు ఓ రోజు సైకాలజిస్టులతో అవగాహన తరగతులు ఇప్పించారు. ఇలా సామాజిక అంశాలపై కలెక్టర్ స్పందిస్తున్న తీరుకు అభినందనలు వస్తున్నాయి. ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుకు చర్యలు.. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా ఇళ్లలోనే కాన్పులు జరగడం ద్వారా తల్లికీ, బిడ్డకీ ప్రమాదం ఉందని గుర్తించిన కలెక్టర్ కాన్పులన్నీ దవాఖానల్లోనే జరగాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల కోసం అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలని ఆయన వైద్య ఆరోగ్య శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖలకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో సమస్యలు ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయడానికి కలెక్టర్ చర్యలు మొదలుపెట్టారు. విశ్రాంత ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలను అందుకోసం వినియోగించాలని భావిస్తున్నారు. త్వరలోనే హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుకానున్నాయి. సెలవు రోజుల్లోనూ పల్లెబాట.. పండుగ రోజులు, ఇతర సెలవు రోజుల్లోనూ కలెక్టర్ సత్యనారాయణ ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి వస్తున్నారు. సెలవు ఉన్న రోజున అధికారులు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదన్న భావనతో వివిధ ప్రాంతాలకు వెళ్లినపుడు వారికి సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఉపాధి హామీ పనులు, నర్సరీల పెంపకం పరిశీలిస్తున్నారు.జిల్లాలోని మారుమూల గ్రామాలను సైతం చుట్టివచ్చారు. జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజక వర్గంలో ప్రతీ నెల మొదటి వారం ఒక రోజు వెళ్లి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. -
50 మంది బాలకార్మికులకు విముక్తి
-
శ్రద్ధగా పని చేయండి
అనంతపురం సిటీ: సానుకూల దృక్పథంతో విధి నిర్వహణపై శ్రద్ధ వహించాలని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. డీఎస్ఓ ఉమామహేశ్వర్రావు, గృహనిర్మాణశాఖ పీడీ ప్రసాద్, స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్పిళ్లై, ఈఈలు అమర్నాథ్రెడ్డి, చంద్రమౌళి, రాజశేఖర్‌లతో కలిసి ఆయన హౌసింగ్ డీఈ, ఏఈలతో సోమవారం స్థానిక డ్వామా హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పథకాన్ని ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల ఆధార్ వివరాల సేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ మొదటి విడత కింద ఇళ్లు మంజూరును రేషన్‌కార్డు నిమిత్తం లేకుండానే ఇచ్చామని ఇలాంటి వాటికి ఆధార్ సీడింగ్ కష్టమవుతుందని గృహనిర్మాణ శాఖ ఏఈ, డీఈలు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. లబ్దిదారుడి పేరు, తండ్రి పేరు ఆధారంగా వివరాలు సేకరించాలన్నారు. ప్రధానంగా పునాది కన్నా తక్కువ స్థాయి(బీబీఎల్), పునాది స్థాయిలో ఉన్న (బీఎల్) లబ్ధిదారుల వివరాలు సేకరించాలన్నారు. గార్లదిన్నె మండలంలో పలువురు లబ్ధిదారులకు స్వస్థలం గార్లదిన్నె కాగా కల్లూరు అని ఆధార్‌లో నమోదైందని, ఇలాంటివి ఆన్లైన్లో నమోదు చేయడం కష్టమవుతుందని ఏఈ వివరించారు. ఆధార్‌లో తప్పుల సవరణకు 56 ఏపీ ఆన్లైన్, 12 ఈ-సేవా కేంద్రాలున్నాయని వాటిలో సరిచేసుకోవచ్చునని డీఎస్ఓ ఉమామహేశ్వర్రావు సూచించారు.ఆధార్ వివరాలు కావాలంటే సంబంధిత తహసీల్దార్లతో హార్డ్‌డిస్క్‌లు తీసుకోవాలని సూచించారు. వారు స్పందించకపోతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. గృహనిర్మాణశాఖ పీడీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 27 లోగా ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీఈలు కుప్పుస్వామి,లక్ష్మినారాయణమ్మ, శైలజ, తదితరులు పాల్గొన్నారు. విధుల్లోకి తీసుకోండి: జేసీకి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వినతి గృహనిర్మాణశాఖలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో డేటాఎంట్రీ ఆపరేటర్లు, వర్క్ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న తమను తొలగించారని, తిరిగి తమను విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలంటూ బాధితులు జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకె ళ్తామని జేసీ తెలిపారు. -
పాపం చిన్నారులు
చిలకపాలెంలో దంపతుల ఆత్మహత్య అనాధలైన కుమారులు ఎచ్చెర్ల క్యాంపస్: జెండా పండుగను అందరితో కలిసి ఘనంగా జరుపుకోవాలి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలిచిన బహుమతులు అమ్మానాన్నలకు చూపించాలని భావించి తమ్ముడితో కలిసి గురువారం రాత్రి 9 గంటలలోపే నిద్రకు ఉపక్రమించాడు ఆ కుర్రాడు. కానీ విధి వారి జీవితంతో ఆడుకుంది. ఉదయానే స్కూలుకు వేగిరంగా వెళ్లాలని నిద్ర లేచిన పిల్లలకు ఇంట్లో అమ్మా నాన్న కనిపించలేదు. ఏమయ్యారో ఇరుగుపొరుగు వారిని అడిగితే సరైన సమాధానం రాలేదు. చుట్టుపక్కల వెతికితే ఓ పాడుపడిన బావి దగ్గర తండ్రి సెల్ ఫోన్, కాళ్ల చెప్పులు కనిపించడంతో ఆందోళన చెందారు. బావిలో చూసేసరికి వారి నెత్తిన పిడుగుపడినట్లయింది. తల్లిదండ్రులిద్దనూ విగతజీవులుగా బావిలో కనిపించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోయిన వారు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే బంధువులకు సమాచారం అందించారు. వివరాలు ఇవీ... లావేరుకు చెందిన వాలపల్లి సత్యనారాయణ (45), సరస్వతి (40)కి 20 ఏళ్ల కిందట వివాహం అయింది. 15 ఏళ్ల కిందట వాళ్లు చిలకపాలెం జంక్షన్‌ను వలస వచ్చారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు కల్యాణ్ ఎచ్చెర్లలోని వెంకటసాయి ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి, చిన్నకుమారుడు ప్రసాద్ అల్లినగరం ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఇటుకల పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి పెద్దగా ఆర్థిక ఇబ్బందులు గానీ, అప్పులు గానీ లేవని బంధువులు చెబుతున్నారు. అయితే మద్యం వ్యసనం ఉన్న సత్యనారాయణ తరచూ భార్య సరస్వతితో గొడవపడుతుండేవాడు. గురువారం రాత్రి 9 గంటలకు పిల్లలిద్దరూ నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఏంజరిగిందో తెలియదుగానీ క్షణికావేశంలో దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న జేఆర్‌పురం సీఐ కె.అశోక్‌కుమార్ పిల్లలను విచారణ చేశారు. వారు కూడా దాదాపుగా స్థానికులు, బంధువులు చెప్పిన విషయాలే చెప్పడంతో భార్యాభర్తలది ఆత్మహత్యగా నిర్ధారణకు వచ్చారు. సత్యనారాయణ దంపతుల ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. సత్యనారాయణ అన్నయ్య లావేరులోను, తమ్ముడు వీరభద్రరావు చిలకపాలెంలోనూ ఉంటున్నారు .విషయం తెలిసి లావేరు మండలం నుంచి బంధువులు తరలివచ్చారు. కాగా పోలీసులు మృతదేహాలను బావిలోకి బయటకు తీయించి శవ పంచనామా అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాపం కల్యాణ్ కల్యాణ్‌కు చురుకైన విద్యార్థిగా పేరుంది. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల స్కూల్లో నిర్వహించిన క్విజ్, వక్తృత్వ పోటీల్లో బహుమతులు కూడా గెలిచాడు. అతిథుల చేతులు మీదుగా బహుమతులు అందుకోవాలని ఎంతో ఆశించాడు. కానీ ఊహించని రీతిలో ఇంట్లో విషాదం నెలకొనడంతో తల్లిదండ్రుల అంత్యక్రియల్లో పాల్గోవాల్సి వచ్చింది. తల్లిదండ్రుల మృతదేహాల ఎదుట కల్యాణ్, ప్రసాద్ గుండలవిసేలా విలపిస్తుంటే వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. -
రెండుగా ఉన్నత విద్యా మండలి
జూన్ 2 నుంచి అవుల్లోకి ఏపీ కౌన్సిల్‌కు వేణుగోపాల్‌రెడ్డి చైర్మన్! తెలంగాణ ఇన్చార్జి చైర్మన్‌గా సత్యనారాయుణ! వచ్చే ఏడాది ఎవరి ప్రవేశపరీక్షలు వారివే హైదరాబాద్: ఉన్నత విద్యా మండలిని రెండుగా విభజించే ప్రక్రియు దాదాపు పూర్తరుుంది. జూన్ 2 నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు ఉన్నత విద్యా మండలిలు అవుల్లోకి రానున్నారుు. 2015 జూన్ 2 వరకు ప్రస్తుత మండలి రెండు రాష్ట్రాలకు సేవలందించేలా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నప్పటికీ, ఇప్పుడే రెండుగా విభజిస్తున్నారు. ఆంధ్రప్రదే శ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనుండగా, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలికి ఉస్మానియూ విశ్వవిద్యాలయుం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సత్యనారాయుణ ఇన్చార్జి చైర్మన్‌గా వ్యవహరించనున్నారని సమాచారం. ఆయున ఇప్పటికే ఉన్నత విద్యా మండలి ైవె స్ చైర్మన్-1గా నియమితులయ్యారు. అరుుతే ఆయున ఇంకా విధుల్లో చేరలేదు. విభజన జరిగిన వెంటనే ఇన్చార్జి చైర్మన్‌గా ఆయనకే బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వురోవైపు ప్రస్తుతం మండలి ైవె స్ చైర్మన్-2గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ విజయుప్రకాష్ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్‌కు వైస్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. తెలంగాణ కౌన్సిల్‌కు వురో వైస్ చైర్మన్‌ను నియుమించే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత ఉన్నత విద్యా మండలికి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి తెలంగాణ కౌన్సిల్‌కు కార్యదర్శిగా ఉంటారు. ఏపీ కౌన్సిల్‌కు కొత్త కార్యదర్శిని నియుమించాల్సి ఉంటుంది. అప్పటివరకు ప్రస్తుత డిప్యూటీ డెరైక్టర్ కృష్ణవుూర్తిని ఏపీ కౌన్సిల్ ఇన్చార్జి కార్యదర్శిగా నియుమించే అవకాశం ఉంది. ఇక సిబ్బందిని 10:13 నిష్పత్తిలో విభజించారు. అవసరమైతే కొంత వుంది తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్లో, ఆంధ్రప్రదే శ్‌కు చెందిన వారు కొందరు తెలంగాణ కౌన్సిల్లో పనిచేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారాలన్నింటిపై సోవువారం తుది నిర్ణయుం తీసుకునే అవకాశం ఉంది. ఇక వచ్చే ఏడాది రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగానే ఎంసెట్, ఐసెట్, ఈసెట్, పాలీసెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రస్థాయి యూనివర్సిటీలైన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, ద్రవిడ విశ్వవిద్యాలయాలను కూడా విభజించనున్నారు. సాంకేతిక విద్యా శాఖ, కళాశాల విద్యా శాఖలనూ విభజిస్తారు. ఈనెల 12న వీటిపై తుది నిర్ణయుం తీసుకోనున్నారు. -
ఇక అధికారిక కోతలు
శ్రీకాకుళం : జిల్లాలో మంగళవారం నుంచి అధికారికంగా విద్యుత్ కోతలు అమలు కానున్నాయి.వాస్తవానికి ఇప్పటికే విద్యుత్ కోతలు అమలు చేస్తున్నా వాటిని అధికారులు లోడ్ రిలీఫ్‌గానే చెప్పుకొచ్చారు. కాగా అధికారికంగా కోతలు విధిస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో ట్రాన్స్‌కో అధికారులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రోజుకు మూడు గంటలు, మండల, మున్సిపల్ కేంద్రాల్లో నాలుగు గంటలు చొప్పున కోత విధిస్తారు. జిల్లా కేంద్రంలో ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి రెండు వరకు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు కోత ఉంటుంది. మండల కేంద్రాల్లో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అమలు చేస్తారు. ఎక్స్‌ప్రెస్ ఫీడర్లపై ఉన్న పరిశ్రమలకు ప్రతి శనివారం పవర్ హాలీడేగా ప్రకటించారు. వీటికి అదనంగా అత్యవసర సమయాల్లో ఎమర్జెన్జీ లోడ్ రిలీఫ్ అమలు చేస్తామని ట్రాన్స్‌కో ఎస్ఈ పీవీవీ సత్యనారాయణ తెలిపారు. -
రాయలకు ఒప్పుకోం
వర్గల్, న్యూస్‌లైన్: హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే కావాలని, రాయల తెలంగాణకు ఒప్పుకోబోమని మాజీ మంత్రి, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం గౌరారంలో జరిగిన వర్గల్, ములుగు మండలాల టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణపై కిరికిరి పెడితే మరో పోరాటానికైనా సిద్ధమని అన్నారు. తెలంగాణ కోసం అసెంబ్లీలో నోరు మెదపని, రాజీనామాలతో పదవీ త్యాగం చేయాలంటే పారిపోయినవారు తెలంగాణ పేరిట సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటని నాయిని ధ్వజమెత్తారు. మద్రాస్ రాష్ట్రంలో తమకు అటెండర్ పోస్ట్ విషయంలో అన్యాయం జరిగిందని ప్రత్యేక రాష్ట్రం కోరిన సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలో రెండు లక్షల ఉద్యోగాలను అనుభావిస్తున్నారని అన్నారు. అందుకోసమే తాము ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబుకు ప్రేమ, అనురాగాల ప్రాధాన్యత తెలియదని, సీఎం పదవి కోసం పిల్ల నిచ్చిన మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన ఘనుడని ఎదేవా చేశారు. టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమాలతోనే తెలంగాణ ఆవిర్భావం జరుగనుందన్నారు. హైదరాబాద్, భద్రాచలంతో కూడిన పది జిల్లాల తెలంగాణే మాలక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్చార్జి భూంరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు సరేష్‌గౌడ్, ఎలక్షన్ రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బాలా త్రిపురసుందరి ఆలయంపై 15 విగ్రహాలు ధ్వంసం
త్రిపురాంతకం, న్యూస్‌లైన్ : పిడుగుపాటుకు పాక్షికంగా దెబ్బతిన్న బాలా త్రిపురసుందరీదేవి ఆలయ గోపురాన్ని దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు శుక్రవారం పరిశీలించారు. బాలా త్రిపురసుందరి ఆలయ గోపురంపై గురువారం రాత్రి పిడుగుపడిన విషయం విధితమే. పిడుగుపాటుకు ఆలయ గోపురం పగుళ్లిచ్చింది. కొన్ని విగ్రహాలు పూర్తిగా ధ్వంసం కాగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తం 15 విగ్రహాలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న గోపురాన్ని జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, మార్కాపురం ఆర్డీఓ సత్యనారాయణ, తహసీల్దార్ వరప్రసాద్ పరిశీలించారు. దేవాదాయ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గోపురంపై దెబ్బతిన్న 15 విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గోపుర నిర్మాణానికి వెంటనే మరమ్మతులు చేస్తామని చెప్పారు. ఆలయంపై పిడుగుపాటు సంఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపడతారా అని విలేకర్లు ప్రశ్నించగా.. ఆగమ శాస్త్ర పండితుల సలహాతో చర్యలు చేపడతామని చెప్పారు. నష్టం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆర్డీఓ సత్యనారాయణ తెలిపారు. ఆలయ గోపుర నిర్మాణ పనులను త్వరగా పూర్తిగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ యర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావుకు విజ్ఞప్తి చేశారు. ‘ఇది అతి పురాతనమైన చరిత్ర గల ఆలయమైనందున అరిష్టం జరిగిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వెంటనే పనులు వెంటనే చేపట్టాల’ని డేవిడ్‌రాజు కోరారు. త్వరలోనే పనులు చేపడతామని శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆలయాల కార్యనిర్వహణాధికారి పప్పు వెంకట్రావు, శ్రీనివాసరెడ్డి ఉన్నారు.