ఆదివారాలూ ఆధార్‌ సేవలు | Aadhaar services also in Sundays | Sakshi
Sakshi News home page

ఆదివారాలూ ఆధార్‌ సేవలు

Published Thu, Nov 28 2019 4:01 AM | Last Updated on Thu, Nov 28 2019 4:01 AM

Aadhaar services also in Sundays - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆధార్‌ కార్డులో మార్పుల కోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆఫ్‌లైన్‌లో నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చింది. యూఐడీఏఐ ఆధ్వర్యంలో నగరంలోని మాదాపూర్‌లో ప్రత్యేక కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ కేంద్రం ఆదివారం కూడా పనిచేస్తుంది.

భారత ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేసే ఈ కేంద్రాన్ని మాదాపూర్‌ విఠల్‌రావునగర్‌లోని రిలయన్స్‌ సైబర్‌విల్లే ప్లాట్‌ నంబర్‌ 17–24 లలో ప్రారంభించారు. యూఐడీఏఐ వెబ్‌సైట్‌ uidai.gov.in  ద్వారా ప్రజలు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ తీసుకొని ఈ కేంద్రంలో తమకు కావాల్సిన సేవలను పొందవచ్చని ఆధార్‌ రాష్ట్ర డిప్యుటీ సెక్రటరీ గడ్డం వేణుగోపాలరెడ్డి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement