వై దిస్..!
‘హారీ పోటర్’ స్టార్ డానియుల్ రాడ్‌క్లిఫ్ జపనీస్ భాషతో తంటాలు పడుతున్నాడు. ఏదేమైనా ఈ భాష నేర్చుకోవడం బహు కష్టవుంటున్నాడు. ‘ఇప్పుడే నేర్చుకోవడం మొదలెట్టా. ఎంత కష్టంగా ఉందో... అంతే అద్భుతమైన లాంగ్వేజ్ ఇది. ఇందులో ఇప్పటివరకు నాకు నచ్చిన పదం..
టోకిడోకి (అప్పుడప్పుడు)’ అంటూ తెగ వుురిసిపోతున్నాడు. అంతేకాదు... స్కూల్‌లో ఉన్నప్పుడు స్పానిష్‌లో కూడా పాసయ్యూనని కాసింత గర్వంగా చెప్పుకొంటున్నాడు. ఇంతకీ ఈ బుల్లోడి వునసు ఉన్నట్టుండి జపనీస్‌పైకి ఎందుకెళ్లిందబ్బా అనేది కొందరి క్యూరియూసిటీ.