అమెరి‘ఖానా’... | Restaurant Group chilis' | Sakshi
Sakshi News home page

అమెరి‘ఖానా’...

Published Fri, Jul 3 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

అమెరి‘ఖానా’...

అమెరి‘ఖానా’...

అమెరికా కేంద్రంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్ గ్రూప్ ‘చిలీస్’ నగరంలో తన రెండవ శాఖను ఏర్పాటు చేసింది. బంజారాహిల్స్, రోడ్‌నెం..1లోని జలగం వెంగళరావు పార్క్ ఎదురుగా నెలకొల్పిన ఈ రెస్టారెంట్‌ను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటి షామిలి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ అశీష్ సక్సేనా మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇనార్బిట్ మాల్ తర్వాత బంజారాహిల్స్‌లో రెండవ శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

దీనితో భారత్‌లో తమ బ్రాండ్ 8 శాఖలు నెలకొల్పినట్టయిందన్నారు. అమెరికాలో అమితాదరణ కలిగిన టెర్లింగ్వా చిలి, బోంబే బర్గర్, ఒరిజినల్ బార్బెక్యూ రిబ్స్, చీజ్ క్యూసొదిల్లాస్, చెర్రీ కోలా.. వంటి రుచులు హైదరాబాదీలను సైతం అమితంగా ఆకట్టుకుంటున్నాయన్నారు.  - సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement