హాయ్..నేను జ్యోతిలక్ష్మిని..
తాను ఎక్కడికి వెళ్లినా జ్యోతిలక్ష్మి వచ్చిందంటున్నారని, ఇది తనకెంతో ఆనందంగా ఉందని కథానాయిక చార్మి పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హల్‌లో వంశీ ఇంటర్నేషనల్-వంశీ ఫిలిం సొసైటీ ఆధ్వర్యంలో ‘ జ్యోతిలక్ష్మీ’ చిత్ర యూనిట్‌కు అభినందన సభ నిర్వహించారు. ఇందులో హీరోయిన్ చార్మి మాట్లాడుతూ.. మహిళలను తోటి మహిళ గౌరవించే సంస్కృతి వస్తే మిగతా వారు గౌరవిస్తారన్నారు. పురుషుడి అండ ఉంటే మరింత ప్రగతి సాధిస్తారన్నారు.
ఈ సందర్భంగా చార్మి, హీరో సత్య, చిత్ర బృందంపై పూలవాన కురిపించారు. నిర్మాత సి.కల్యాణ్, సమాచార హక్కు చట్టం కమిషనర్ పి. విజయబాబు, టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి, రచయిత్రి కేబీ లక్ష్మి, జీవీఎల్‌ఎన్ రాజు, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, వంశీ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్ తెన్నేటి సుధాదేవి, ప్రధాన కార్యదర్శి సుంకరపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు.
- సాక్షి,సిటీబ్యూరో