న్యూఢిల్లీ: రోజురోజుకూ ఉక్రెయిన్ నగరాలపై రష్యా సేనల దాడుల పరంపర ఎక్కువవుతున్న నేపథ్యంలో సమస్యకు దౌత్యమార్గం ద్వారా పరిష్కారం కనుగొనాలని ప్రధాని మోదీ అభిలషించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాలతో కలసి ప్రధాని మోదీ గురవారం రాత్రి ‘క్వాడ్’ సదస్సులో వర్చువల్ పద్ధతిలో పాల్గొని ప్రసంగించారు. ‘ ఉక్రెయిన్‌లో మానవతా సాయంపైనా అగ్రనేతలు చర్చించారు’ అని భారత సర్కార్ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఐరాస ఒడంబడిక, అంతర్జాతీయ చట్టాలు, ప్రాంతీయ సార్వభౌమత్వాలకు తగు ప్రాధాన్యతనివ్వాలి. సంక్షోభానికి చర్చలు, దౌత్యమార్గాల ద్వారా ముగింపు పలకాలి’ అని మోదీ వ్యాఖ్యానించినట్లు ప్రకటన పేర్కొంది. క్వాడ్ దేశాలు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలు కొనసాగడంపైనే ప్రధానంగా దృష్టిసారించాలని మోదీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment