US Deputy National Security Adviser Daleep Singh In India: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాదారు, రష్యాపై ఆంక్షలు విధించడంలో కీలక పాత్ర పోషించిన దలీప్ సింగ్ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లాతో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ తదితర అంశాలపై బుధ, గురువారాల్లో భారత అధికారులతో దలీప్ సింగ్ చర్చించారు. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ అనుసరిస్తున్న తీరు పట్ల అమెరికా సంతృప్తికరంగా లేదు.
ఈమేరకు ఈ విషయమై దలీప్ సింగ్ సైతం భారత్ తీరుపై విదేశాంగ కార్యదర్శితో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు, రూపాయి-రూబుల్-డినామినేటెడ్ చెల్లింపులు అంశాలపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు రష్యా పై ఆంక్షలు భారత్‌కి వర్తిస్తాయని అమెరికా భారత్‌కి పరోక్షంగా చెప్పకనే చెప్పారట. ఆంక్షల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయొద్దంటూ దలీప్ సింగ్ సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అలాగే.. డ్రాగన్ దేశం(చైనా) గనుక భారత్‌లోని వాస్తవాధీన రేఖ దాటి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే.. రష్యా చూస్తుంటుందే తప్ప సహకరించదు అని హెచ్చరించారు. ఒక వేళ రష్యా పై చైనా గనుక పట్టు సాధిస్తే.. భారత్‌కే నష్టం వాటిల్లుతుందని గట్టిగా నొక్కి చెప్పారు దలీప్ సింగ్. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ భారత పర్యటనపైనా దలీప్ సింగ్ ఆరా తీసినట్లు సమాచారం.
ఇక యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ‘దలీప్ సింగ్ భారత్ మధ్య చర్చలు సంతృప్తికరంగా సాగాయని పేర్కొన్నారు. అయితే రష్యాతో గల సంబంధాలు ఆయదేశాలకు సంబంధించినవిగా అర్ధం చేసుకుంటున్నాం అని చెప్పారు. క్వాడ్ విషయానికి వస్తే ఇండో పసిఫిక్ అభివృద్ధి దాని ప్రధాన ఆలోచన అని పేర్కొన్నారు. పైగా దానికి కొన్ని నిర్ధిష్ట సూత్రాలు, ఆదర్శాలు ఉన్నాయన్నారు. పైగా క్వాడ్ దేశాలు ఏదో ఒక దేశం ప్రయోజనంతో ఈ యుద్ధం విషయంలో ఆసక్తి కనబర్చడం లేదని నొక్కి చెప్పారు. కేవలం క్యాడ్‌కి ఒక నిర్థిష్టమైన సూత్రానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడే దేశాలపై కొరడా ఝళిపించేలా నియమాల ఆధారిత అంతర్జాతీయ ఆదేశాలను పాటించేలా చేస్తుందని నైట్ ప్రెస్ చెప్పారు.
(చదవండి: రష్యా బలగాల పై కీలక వ్యాఖ్యలు చేసిన బైడెన్...పుతిన్ తీరుపై అనుమానం)
Comments
Please login to add a commentAdd a comment