Harsh Vardhan Shringla
-
భారత్‌కు అమెరికా స్వీట్ వార్నింగ్
US Deputy National Security Adviser Daleep Singh In India: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాదారు, రష్యాపై ఆంక్షలు విధించడంలో కీలక పాత్ర పోషించిన దలీప్ సింగ్ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లాతో అర్థవంతమైన చర్చలు జరిపినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ తదితర అంశాలపై బుధ, గురువారాల్లో భారత అధికారులతో దలీప్ సింగ్ చర్చించారు. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ అనుసరిస్తున్న తీరు పట్ల అమెరికా సంతృప్తికరంగా లేదు. ఈమేరకు ఈ విషయమై దలీప్ సింగ్ సైతం భారత్ తీరుపై విదేశాంగ కార్యదర్శితో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు, రూపాయి-రూబుల్-డినామినేటెడ్ చెల్లింపులు అంశాలపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు రష్యా పై ఆంక్షలు భారత్‌కి వర్తిస్తాయని అమెరికా భారత్‌కి పరోక్షంగా చెప్పకనే చెప్పారట. ఆంక్షల్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేయొద్దంటూ దలీప్ సింగ్ సున్నితంగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. అలాగే.. డ్రాగన్ దేశం(చైనా) గనుక భారత్‌లోని వాస్తవాధీన రేఖ దాటి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే.. రష్యా చూస్తుంటుందే తప్ప సహకరించదు అని హెచ్చరించారు. ఒక వేళ రష్యా పై చైనా గనుక పట్టు సాధిస్తే.. భారత్‌కే నష్టం వాటిల్లుతుందని గట్టిగా నొక్కి చెప్పారు దలీప్ సింగ్. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ భారత పర్యటనపైనా దలీప్ సింగ్ ఆరా తీసినట్లు సమాచారం. ఇక యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ‘దలీప్ సింగ్ భారత్ మధ్య చర్చలు సంతృప్తికరంగా సాగాయని పేర్కొన్నారు. అయితే రష్యాతో గల సంబంధాలు ఆయదేశాలకు సంబంధించినవిగా అర్ధం చేసుకుంటున్నాం అని చెప్పారు. క్వాడ్ విషయానికి వస్తే ఇండో పసిఫిక్ అభివృద్ధి దాని ప్రధాన ఆలోచన అని పేర్కొన్నారు. పైగా దానికి కొన్ని నిర్ధిష్ట సూత్రాలు, ఆదర్శాలు ఉన్నాయన్నారు. పైగా క్వాడ్ దేశాలు ఏదో ఒక దేశం ప్రయోజనంతో ఈ యుద్ధం విషయంలో ఆసక్తి కనబర్చడం లేదని నొక్కి చెప్పారు. కేవలం క్యాడ్కి ఒక నిర్థిష్టమైన సూత్రానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఉల్లంఘనలకు పాల్పడే దేశాలపై కొరడా ఝళిపించేలా నియమాల ఆధారిత అంతర్జాతీయ ఆదేశాలను పాటించేలా చేస్తుందని నైట్ ప్రెస్ చెప్పారు. (చదవండి: రష్యా బలగాల పై కీలక వ్యాఖ్యలు చేసిన బైడెన్...పుతిన్ తీరుపై అనుమానం) -
ఉక్రెయిన్‌లో 16 వేల మంది భారతీయులు.. ఆ దేశాల మీదుగా ఇండియాకు!
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో ప్రస్తుతం దాదాపు 16 వేల మంది భారతీయులు ఉన్నారని, వారిని క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా చెప్పారు. ఇందుకోసం ఉక్రెయిన్ సమీపంలో ఉన్న పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. రష్యన్ భాష మాట్లాడే అధికారులను ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు, అక్కడి ఇరుగుపొరుగు దేశాలకు పంపిస్తున్నామని అన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను పొరుగు దేశాలకు, అక్కడి నుంచి మన దేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఇందుకోసం ఉక్రెయిన్ సరిహద్దుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సహాయక కేంద్రాలు నెలకొల్పుతున్నామన్నారు. ఉక్రెయిన్‌లోని మన దేశస్తులను భద్రంగా తీసుకురావాలని ప్రధాని మోదీ ఆదేశించారని హర్షవర్దన్ ఉద్ఘాటించారు. భారత వైమానికి దళం విమానాలతోపాటు వాణిజ్య విమానాలను వాడతామన్నారు. ఉక్రెయిన్తోపాటు పోలాండ్, రొమేనియా, హంగేరి, స్లోవేకియా దేశాల విదేశాంగ మంత్రులతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. భారత విద్యార్థులతో సహా ఉక్రెయిన్‌లో మొత్తం 20 వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరిలో 4 వేల మంది తిరిగి వచ్చేశారు. మాకు రక్షణ కల్పించండి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయానికి భారతీయ విద్యార్థులు గురువారం పోటెత్తారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే, వారి కోసం భారత ఎంబసీ రక్షణపరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎంబసీ కల్పించిన వసతి సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నాయి. ఇప్పటిదాకా 200 మందికి పూర్తి భద్రతతో కూడిన తగిన వసతి కల్పించినట్లు సమాచారం. విద్యార్థులకు అడ్వైజరీ ఉక్రెయిన్‌లో విధించిన మార్షల్ లాతో రాకపోకలు కష్టతరంగా మారాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. సైరన్లు, బాంబు హెచ్చరికలు వినిపించే వారు తమ సమీపంలోని బాంబు షెల్టర్లకు చేరుకోవాలని భారతీయులకు సూచించింది. ‘ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే వారు గూగుల్ మ్యాప్‌ల సాయంతో సమీపంలోని బాంబు షెల్టర్లను గుర్తించండి. చాలా వరకు బాంబు షెల్టర్లు భూగర్భ మెట్రోల్లోనే ఉన్నాయి. చుట్టుపక్కల చోటుచేసుకునే పరిణామాల పట్ల అప్రమత్తతతో మెలగాలి. అన్ని సమయాల్లోనూ గుర్తింపు పత్రాలు వెంట ఉంచుకోవాలి’అని పేర్కొంది. మరోవైపు, ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్థులందరినీ కాపాడేయత్నం చేస్తున్నామని భారత్‌లో ఆ దేశ రాయబారి ఇగోర్ పోలిఖ తెలిపారు. భారత్ ప్రకటనలు సరిపోవని, శాంతిని నెలకొల్పే యత్నం చేయాలని ఇగోర్ పేర్కొన్నారు. రష్యా సైనిక దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రభుత్వం తన గగనతలాన్ని మూసివేయడంతో, ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువచ్చేందుకు బయలుదేరిన ఎయిరిండియా విమానం మార్గమధ్యంలోనే వెనుదిరిగింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎయిరిండియా విమానం గురువారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ నుంచి కీవ్‌లోని బోరీస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. అప్పటికే రష్యా వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పౌర విమానసేవలు చాలా ప్రమాదకరంగా మారినందున ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసేసింది. దీంతో ఆ సమయంలో ఇరాన్ గగనతలంపై ఉన్న ఆ విమానం తిరిగి వెనుదిరిగింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానంలో 182 మంది భారతీయులు గురువారం ఉదయం 7.45 గంటలకు ఢిల్లీకి చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో చాలామంది విద్యార్థులేనన్నారు. ఈ నెల 22వ తేదీన ఎయిరిండియా పంపిన మొదటి విమానంలో కీవ్‌లో ఉన్న 240 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఆఖరి క్షణంలో ఆగిపోయారు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి బయలుదేరిన ఇద్దరు భారత విద్యార్థులు రష్యా దాడుల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. భారత్‌లోని గుజరాత్ రాష్ట్రానికి చెందిన రోణక్ షెరాసియా(18), అతడి స్నేహితుడు మహావీర్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు 500 కిలోమీటర్ల దూరంలో చెర్నివిట్సీలో ఉన్న బుకోవినియన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ(బీఎస్ఎంయూ)లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వారు గురువారం ఉదయం భారత్‌కు వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. తెల్లవారుజామునే కీవ్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. ఎయిర్‌పోర్టు చెక్–ఇన్ కౌంటర్ వద్దకు వెళ్లగా విమానం రద్దయ్యిందని సిబ్బంది చెప్పారు. దీంతో చేసేదిలేక మళ్లీ బస్సులో యూనివర్సిటీకి బయలుదేరారు. కీవ్ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తుండగా, పెద్ద ఎత్తున బాంబుల శబ్దాలు పలుమార్లు వినిపించాయని రోణక్ షెరాసియా చెప్పాడు. ఆ భీకర శబ్దాలు ఇప్పటికీ తన చెవుల్లో మార్మోగుతున్నాయని పేర్కొన్నాడు. -
భారత్ ఆందోళనలపై తాలిబన్లు సానుకూలం!
వాషింగ్టన్: అఫ్గాన్ తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. తాలిబన్ల అ«దీనంలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌లో పాక్ చర్యల్ని భారత్, అమెరికా నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.అఫ్గాన్‌లో పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని శ్రింగ్లా తెలిపారు. (చదవండి: Kodanad Case: వీడని మిస్టరీ.. అంతులేని ‘కొడనాడు’ కథ) అఫ్గాన్‌పై అమెరికా వేచి చూసే ధోరణిని అవలంబిస్తోందని, భారత్ సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. వేగంగా మారుతున్న పరిణామాలు ఎలా రూపుదిద్దుకుంటాయో గమనిస్తున్నామన్నారు.తాలిబన్లతో భారత్ సంబంధాలు పరిమితమని, ఇటీవలి భేటీలో ఏ విషయంపైనా విస్తృత స్థాయిలో చర్చలు జరగలేదన్నారు. అయితే, అఫ్గాన్ గడ్డను ఉగ్ర అడ్డాగా మారుతుందేమోనన్న భారత ఆందోళనపై సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని తెలిపారు. అఫ్గాన్ భూభాగంలోని అనేక శక్తులకు పాక్ అండగా నిలిచిందని చెప్పారు. ఐరాస ఆంక్షల జాబితాలోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి సంస్థలు అఫ్గాన్‌లోకి స్వేచ్ఛగా ప్రవేశిస్తున్నాయని, వీరి కదలికలపై కన్నేసి ఉంచామని తెలిపారు. అఫ్గాన్ నుంచి ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు సాగినా తాలిబన్లదే బాధ్యతన్నారు. నవంబర్‌లో అమెరికాతో చర్చలు భారత్, అమెరికా మధ్య నాలుగో వార్షిక 2+2 చర్చలు నవంబర్‌లో వాషింగ్టన్లో జరుగుతాయని హర్షవర్ధన్ చెప్పారు. ఈదఫా చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాధ్ సింగ్, జైశంకర్‌లు తొలిసారి బైడెన్ ప్రభుత్వంలోని రక్షణ, విదేశాంగ మంత్రులతో సమావేశం కానున్నారు. (చదవండి: బీజేపీ నేత సువేందుకు సమన్లు) -
ఆయన అమెరికా- భారత్‌ల మధ్య బంధానికి కెప్టెన్
వాషింగ్టన్: భారత రాయబారి హర్షవర్దన్ ష్రింగ్లాకు అమెరికా ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. అందులో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని శ్వేతసౌధంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం వేగవంతం చేయడానికి సహకరించినందుకు ట్రంప్‌కు ష్రింగ్లా కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు భారత రాయబారికి అక్కడి విదేశాంగశాఖలోని దక్షిణ, మధ్య ఆసియా విభాగం అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ వెల్స్ ప్రత్యేకంగా వీడ్కోలు పలికారు. ఉభయ దేశాల మధ్య బంధానికి ష్రింగ్లా కెప్టెన్‌గా వ్యవహరించారని కొనియాడారు. భారత విదేశాంగశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ష్రింగ్లా.. ఉభయ దేశాల మైత్రి బలోపేతానికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. అంతకుముందు అమెరికా ప్రొటోకాల్ చీఫ్ హ్యాండర్సన్.. బ్లెయిర్ హౌజ్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విదేశాంగశాఖ కార్యదర్శి ఉన్న విజయ్ గోఖలే పదవీకాలం జనవరి 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో హర్షవర్ధన్ ష్రింగ్లాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 23న ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెల 29న విదేశాంగశాఖ కార్యదర్శిగా ష్రింగ్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1984 బ్యాచ్‌కు చెందిన హర్షవర్ధన్ ష్రింగ్లా అనేక పదవులను అధిరోహించారు. ఆయన 35 ఏళ్ల సర్వీసులో బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాలలో భారత హైకమిషనర్‌గా సేవలందించారు. A final goodbye! pic.twitter.com/AMvqROEaL2 — Harsh V Shringla (@HarshShringla) January 12, 2020 -
వైఎస్ జగన్‌కు భారత రాయబారి విందు!
వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా తన నివాసంలో విందు ఇచ్చారు. అంతకుముందు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా వ్యవహారాల ఉన్నతాధికారులతోనూ సమావేశం అయ్యారు. అట్లాంటిక్ కౌన్సిల్ దక్షిణాసియా సెంటర్‌కు చెందిన ఇర్ఫాన్ నూరుద్దీన్ కూడా సీఎంను కలిశారు. గిలీడ్ ప్రతినిధితో భేటీ ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ గిలీడ్ ప్రతినిధి క్లాడియో లిలియన్ ఫెలడ్ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. హెచ్ఐవీ ఎయిడ్స్, హెపటైటిస్ బీ, సీ వ్యాధులపై గిలీడ్ సంస్థ ఔషధాలను తయారుచేస్తోంది. ఏపీకి చెందిన ఔషధ కంపెనీలతో భాగస్వామ్యానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ గిలీడ్ ప్రతినిధిని కోరారు. హై ఎండ్ ఔషధాల తయారీకి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవలని ఆయన సూచించారు. ఫార్మా రంగంలో ఉత్తమ టెక్నాలజీని రాష్ట్రానికి అందించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. చదవండి: యూఎస్–ఇండియా బిజినెస్ కౌన్సిల్లో సీఎం జగన్ ప్రసంగం -
అమెరికాలో భారత రాయబారిగా హర్షవర్ధన్ శ్రింగ్లా
సాక్షి, న్యూఢిల్లీ : భారత దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రింగ్లాను అమెరికాలో భారత రాయబారిగా నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత రాయబారి నవ్‌తేజ్ సర్నా స్థానంలో త్వరలోనే హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించనున్నారని గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ 1984 బ్యాచ్‌కు చెందిన హర్షవర్ధన్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భారత హైకమీషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా రాయబారిగా నియమితులవుతున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో రివా గంగూలీ దాస్ బంగ్లాదేశ్ భారత హైకమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.