
వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా తన నివాసంలో విందు ఇచ్చారు. అంతకుముందు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా వ్యవహారాల ఉన్నతాధికారులతోనూ సమావేశం అయ్యారు. అట్లాంటిక్ కౌన్సిల్ దక్షిణాసియా సెంటర్‌కు చెందిన ఇర్ఫాన్ నూరుద్దీన్ కూడా సీఎంను కలిశారు.
గిలీడ్ ప్రతినిధితో భేటీ
ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ గిలీడ్ ప్రతినిధి క్లాడియో లిలియన్ ఫెలడ్ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. హెచ్‌ఐవీ ఎయిడ్స్, హెపటైటిస్ బీ, సీ వ్యాధులపై గిలీడ్ సంస్థ ఔషధాలను తయారుచేస్తోంది. ఏపీకి చెందిన ఔషధ కంపెనీలతో భాగస్వామ్యానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ గిలీడ్ ప్రతినిధిని కోరారు. హై ఎండ్ ఔషధాల తయారీకి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవలని ఆయన సూచించారు. ఫార్మా రంగంలో ఉత్తమ టెక్నాలజీని రాష్ట్రానికి అందించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు.
చదవండి: యూఎస్–ఇండియా బిజినెస్ కౌన్సిల్‌లో సీఎం జగన్ ప్రసంగం