indian envoy
-
కెనడా ప్రధాని చుట్టూ ఖలిస్తాన్ ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో తీరును కెనడాలో భారత హై కమిషనర్‌గా పనిచేసిన సంజయ్ కుమార్ వర్మ బట్టబయలు చేశారు. ట్రూడో ఆంతరంగికుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులతోపాటు భారత వ్యతిరేక శక్తులు ఉంటాయని చెప్పారు. కెనడాలో రాజకీయ అవసరాల కోసం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ట్రూడో ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని అన్నారు. భారత్–కెనడా మధ్య వివాదం నేపథ్యంలో సంజయ్ కుమార్ వర్మను భారత ప్రభుత్వం ఇటీవల వెనక్కి పిలిపించిన సంగతి తెలిసిందే. ఆయన తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెనడాలోని ఖలిస్తానీ శక్తులు, భారత వ్యతిరేక శక్తులు ప్రధాని ట్రూడోతో అత్యంత సన్నిహితంగా మెలుగుతుంటాయని వెల్లడించారు. ఖలిస్తాన్ మద్దతుదారులు ట్రూడో ఆప్తమిత్రులుగా మారిపోయారని తెలిపారు. 2018లో ట్రూడో భారత్‌ను సందర్శించినప్పుడు ఆయన వెంటనే ఖలిస్తాన్ సానుభూతిపరులు కూడా కనిపించారని సంజయ్ కుమార్ వర్మ గుర్తుచేశారు. ఖలిస్తాన్ పోరాట యోధులమని చెప్పుకుంటున్న వ్యక్తులకు కెనడాలో ఎనలేని ప్రోత్సాహం లభిస్తోందని ఆరోపించారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో సంజయ్ కుమార్ వర్మను కెనడా ప్రభుత్వం అనుమానితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తునకు భారత్ సహకరించడం లేదని కెనడా చేస్తున్న ఆరోపణలపై సంజయ్ కుమార్ వర్మ స్పందించారు. ఆ కేసులో భారత్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తేలి్చచెప్పారు. ఖలిస్తానీ ముష్కరులు కెనడాలో భారత కాన్సులేట్ కార్యాలయాల ఎదుట అల్లర్లు సృష్టించారని, భారత దౌత్యవేత్తలను సోషల్ మీడియా ద్వారా బెదిరించేందుకు ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. దారుణ పరిస్థితుల్లో విద్యార్థులు కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలని కోరుకుంటున్న భారత విద్యార్థులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సంజయ్ కుమార్ వర్మ సూచించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు మెరుగ్గా లేవని అన్నారు. రూ.లక్షలు ఖర్చు చేసినా మంచి కాలేజీల్లో ప్రవేశాలు దొరకడం లేదని, చదువులు పూర్తిచేసుకున్నాక ఉద్యోగాలు లభించడం లేదని చెప్పారు. విద్యార్థుల్లో కుంగుబాటు, ఆత్మహత్య వంటి పరిణామాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. తాను కెనడాలో హైకమిషనర్‌గా పనిచేసిన సమయంలో వారానికి కనీసం రెండు మృతదేహాలను భారత్‌కు పంపించిన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాలు రాక, తల్లిదండ్రులకు ముఖం చూపించలేక కెనడాలో భారతీయ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. అందుకని కెనడాను ఎంచుకోకపోవడమే మంచిదని సూచించారు. ఒకవేళ భారత్–కెనడా మధ్య సంబంధాలు బాగున్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు తాను ఇదే సలహా ఇచ్చేవాడినని వ్యాఖ్యానించారు. ఎన్నో ఆశలతో వెళ్లిన విద్యార్థులు శవాలై తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ దుస్థితికి ఏజెంట్లు కూడా కొంత కారణమని విమర్శించారు. రూ.లక్షలు దండుకొని ఊరూపేరు లేని కాలేజీల్లో విద్యార్థులను చేరి్పస్తున్నారని, సరైన వసతులు కూడా కలి్పంచడం లేదని వెల్లడించారు. వారానికి కేవలం ఒక క్లాసు నిర్వహించే కాలేజీలు కూడా ఉన్నాయన్నారు. ఇరుకు గదిలో ఎనిమిది మంది విద్యార్థులు సర్దుకోవాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తున్నాయని తెలిపారు. కెనడాలో భారతీయ విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు రాక జీవనోపాధి కోసం క్యాబ్ డ్రైవర్లుగా పని చేస్తున్నారని, దుకాణాల్లో చాయ్, సమోసాలు అమ్ముకుంటున్నారని సంజయ్ వర్మ ఆవేదన వ్యక్తంచేశారు. -
కెనడా ప్రధాని ఆరోపణలు.. భారత రాయబారి స్పందన
భారత్, కెనడా దేశాల మధ్య ఉన్న దౌత్యసంబంధాలను ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో నాశనం చేశారిన కెనడాలోని భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మ అన్నారు. ఖలిస్తానీ నేత నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి కెనడా భారత్‌తో ఎలాంటి సాక్ష్యాలను పంచుకోలేదని తెలిపారు. ఈ హత్యకేసు విషయంలో ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రేరేపితమని అన్నారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.‘ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు.. ఖచ్చితమైన సాక్ష్యం కంటే ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా చేసినవిగా ఉన్నాయి. ఆరోపించిన, బలమైన సాక్ష్యం లేదని అయనే ఒప్పుకున్నారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా..టట్రూడో ఇరు దేశాల మధ్య సంబంధాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ప్రస్తుతం చూసి చూపించాడు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్ల కెనడా ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు’’ అని అన్నారు.🇨🇦🇮🇳INDIAN AMBASSADOR BLAMES TRUDEAU FOR DIPLOMATIC NIGHTMAREIndia's expelled envoy to Canada, Sanjay Kumar Verma, fired back at Trudeau, accusing him of wrecking diplomatic relations between the two nations.Verma, who was ousted after Trudeau tied him to the murder of Sikh… pic.twitter.com/CcKnhhfOuo— Alex Kennedy (@therealmindman) October 21, 2024 ఇటీవల భారత్ ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు సంబంధించిన దర్యాప్తుతో భారత రాయబారి సంజయ్ కుమార్ వర్మకు సంబంధం ఉందంటూ కెనడా ఆరోపణలు చేసింది. కెనడా ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిచింది. అనంతరం కెనడాలోని హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.చదవండి: రష్యాపైకి ఉక్రెయిన్ 100 డ్రోన్లు -
పాలస్తీనా భారత రాయబారి ముకుల్ హఠాన్మరణం!
పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య ఆకస్మిక మరణం చెందారు. రమల్లహ్ భవనంలో ఆయన విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ముకుల్ మరణానికి గల కారణాల గురించి ఇటు భారత విదేశాంగ శాఖతో పాటు పాలస్తీనా ప్రభుత్వంగానీ స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఇరు దేశాలు మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఆయన భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య మృతిని ధ్రువీకరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. ముకుల్ ఆర్య ప్రతిభావంతుడైన అధికారి అని.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. స్నేహపూర్వక భారత ప్రభుత్వానికి, ప్రతినిధి ఆర్య కుటుంబానికి, సంతాపాన్ని ప్రకటించారు విదేశాంగ వ్యవహారాలు, వలసదారుల మంత్రి డాక్టర్ రియాద్ అల్-మాలి. Mukul Arya మృతదేహాన్ని అంత్యక్రియల కోసం భారతదేశానికి తరలించే ఏర్పాట్లను పూర్తి చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అధికారిక సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ముకుల్ మృతి పట్ల పాలస్తీనా ప్రభుత్వం విచారణ వ్యక్తం చేసింది. ఆయన మరణంపై దర్యాప్తు జరిపాలని అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని సైతం దర్యాప్తు విభాగాలను ఆదేశించారు. Deeply shocked to learn about the passing away of India’s Representative at Ramallah, Shri Mukul Arya. He was a bright and talented officer with so much before him. My heart goes out to his family and loved ones. Om Shanti. — Dr. S. Jaishankar (@DrSJaishankar) March 6, 2022 ముకుల్ నేపథ్యం.. ఢిల్లీలో పుట్టి, పెరిగిన ముకుల్ ఆర్య.. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదివాడు. 2008 ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన వారు. ఢిల్లీ విదేశాంగ విభాగాల్లోపని చేసిన ఆర్య.. యునెస్కో(పారిస్)లో శాశ్వత ప్రతినిధిగా పని చేశారు. అంతేకాదు కాబూల్, మాస్కోలోని రాయబార కార్యాలయాల్లో విధులు నిర్వర్తించారు. -
వైఎస్ జగన్‌కు భారత రాయబారి విందు!
వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ ష్రింగ్లా తన నివాసంలో విందు ఇచ్చారు. అంతకుముందు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ శాఖ దక్షిణాసియా వ్యవహారాల ఉన్నతాధికారులతోనూ సమావేశం అయ్యారు. అట్లాంటిక్ కౌన్సిల్ దక్షిణాసియా సెంటర్‌కు చెందిన ఇర్ఫాన్ నూరుద్దీన్ కూడా సీఎంను కలిశారు. గిలీడ్ ప్రతినిధితో భేటీ ప్రముఖ ఔషధాల తయారీ సంస్థ గిలీడ్ ప్రతినిధి క్లాడియో లిలియన్ ఫెలడ్ సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. హెచ్ఐవీ ఎయిడ్స్, హెపటైటిస్ బీ, సీ వ్యాధులపై గిలీడ్ సంస్థ ఔషధాలను తయారుచేస్తోంది. ఏపీకి చెందిన ఔషధ కంపెనీలతో భాగస్వామ్యానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ గిలీడ్ ప్రతినిధిని కోరారు. హై ఎండ్ ఔషధాల తయారీకి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవలని ఆయన సూచించారు. ఫార్మా రంగంలో ఉత్తమ టెక్నాలజీని రాష్ట్రానికి అందించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. చదవండి: యూఎస్–ఇండియా బిజినెస్ కౌన్సిల్లో సీఎం జగన్ ప్రసంగం -
ఆర్టికల్ 370 రద్దు; పాకిస్తాన్ సంచలన నిర్ణయం
ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్‌పై భారత్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయాల నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి దిగజారి వ్యవహరించింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేందుకు రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేసే తీర్మానాన్ని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టే బిల్లును భారత ప్రభుత్వం ఆమోదించడాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ ఆక్రోశం వెళ్లగక్కింది. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది. తమ దేశం నుంచి భారత రాయబారిని బహిష్కరించింది. ఢిల్లీలోని తమ రాయబారిని వెనక్కి పిలిపిస్తామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తెలిపారు. జమ్మూ కశ్మీర్‌పై భారత్ సంచలన నిర్ణయం నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన నేషనల్ సెక్యురిటీ కమిటీ(ఎన్ఎస్ఈ) బుధవారం అత్యవసరంగా సమావేశమైంది. రక్షణ, విదేశాంగ మంత్రులు, త్రివిధ దళాల అధిపతులు, ఐఎస్ఐ డైరెక్టర్ ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌తో ద్వైపాక్షిక ఒప్పందాలను సమీక్షించాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఇండియా ఫాసిస్ట్ విధానాలను దౌత్య మార్గాల ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని ఇమ్రాన్‌ఖాన్ ఆదేశించినట్టు పాకిస్తాన్ ఒక ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినం ఆగస్టు 14న కశ్మీర్లకు సంఘీభావ దినంగా, ఆగస్టు 15న చీకటి దినంగా పాటించాలని నిర్ణయించింది. కాగా, కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో పుల్వామా తరహా దాడి ఇమ్రాన్‌ఖాన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావచ్చొచ్చు. కశ్మీరీలు నిరసనలు తెలిపితే భారత్ వారిని అణచివేయవచ్చు. కశ్మీర్ పరిస్థితులను గమనిస్తూ ఉండాలి’ అని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. -
భారత రాయబారికి అవమానం
న్యూఢిల్లీ : దాయాది పాకిస్తాన్ మరోసారి తన వంకరబుద్ధిని బయటపెట్టుకుంది.భారత రాయబారి అజయ్ బిసారియాను ఉద్దేశపూర్వకంగా అవమానించింది.పలు దేశాల రాయబారులు, ఉన్నతాధికారులు సభ్యులుగా ఉండే ఇస్లామాబాద్ క్లబ్లో బిసారియా చేరకుండా అడ్డుకునేయత్నం చేసింది. సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో ముగిసే ప్రయను నెలలు గడుస్తున్నా వాయిదావేస్తూవచ్చింది. గతంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న పరిస్థితుల్లోనూ ఇలా ఎప్పుడూ జరగలేదు. కొంతకాలంగా సరిహద్దులో వరుస కాల్పులు, ఉద్రక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ తాజా చర్య మరింత రెచ్చగొట్టినట్లైంది. రాయబారుల అడ్డా ఇస్లామాబాద్ క్లబ్ : పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రాయబార కార్యాలయాలకు సమీపంగా ఇస్లామాబాద్ క్లబ్ ఉంది. 350 ఎకరాల సువిశాల ప్రాగణంలో గోల్ఫ్, స్విమ్మింగ్, రెస్టారెంట్ సహా సకల సదుపాయాలుంటాయి. పాక్‌లో పనిచేసే అన్ని దేశాల రాయబారులు, వారి కుటుంబాలు, అత్యున్నతాధికారులకు అదొక రిక్రియేషన్ ప్లేస్. ఏ దేశం నుంచైనా కొత్తగా రాయబారి నియమితులయ్యారంటే, గంటల వ్యవధిలోనే ఆ క్లబ్లో మెంబర్ కావడం రివాజుగా వస్తోంది. అలా ఇస్లామాబాద్ క్లబ్ రాయబారుల అడ్డాగా పేరుపొందింది. కాగా, గత డిసెంబర్లో అజయ్ బిసారియా పాకిస్తాన్లో భారత రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. సంప్రదాయం ప్రకారం ఇస్లామాబాద్ క్లబ్ మెంబర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నెలలు గడుస్తున్నప్పటికీ పాక్ అధికారులు ఆయనకు సభ్యత్వం ఇవ్వలేదు. భారత రాయబారుల కార్యకలాపాలపై ఆంక్షలు విధించాలన్న ఉద్దేశంలోనే పాక్ ఈ రీతిగా వ్యవహరిస్తున్నది. మరి భారత్‌లో పాక్ రాయబారి సంగతేంటి? : వేర్పాటువాద నేతలతో వరుస భేటీలు నిర్వహించి వివాదాస్పదుడిగా పేరుపొందిన అబ్దుల్ బాసిత్ పదవీ విరమణ అనంతరం భారత్‌లో పాక్ రాయబారిగా సోహైల్ మొహమ్మద్(గతేడాది మేలో) నియమితులైన సంగతి తెలిసిందే. బాసిత్ అనుభవం దృష్ట్యా సోహైల్ కార్యకలాపాలకు సంబంధించి భారత ప్రబుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. ఢిల్లీ శివారు నోయిడా, గురుగ్రామ్‌లలో పర్యటనకు ఆయనను అనుమతించడంలేదు. దీంతో పాకిస్తాన్కూడా అదే తరహా ఆంక్షలకు తెరలేపింది. -
భారత్ దౌత్యవేత్తకు పాక్ సమన్లు
ఇస్లాబామాద్ : ఎల్ఓసీ వద్ద భారత్ భధ్రతా బలగాలు ఏకపక్షంగా కాల్పులు జరుపుతున్నాయని ఆరోపిస్తూ.. పాకిస్తాన్‌లోని భారత రాయబారికి పాకిస్తాన్ సమన్లు జారీచేసింది. ప్రతిసారి భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తోందని పాక్ ఆరోపించింది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 2న భారత్ బలగాలు ఎల్ఓసీ వద్ద కాల్పుకు తెగబడిందని ఆరోపించింది. ఈ కాల్పుల వల్ల ముగ్గురు పౌరులు చనిపోగా, మరో అయిదు మంది తీవ్రంగా గాయపడ్డారని చెబుతోంది. కాల్పుల విరమణకు సమాధానం చెప్పాలంటూ.. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ ఫైసల్.. భారత్ హైకమిషనర్ జేపీ సింగ్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై స్పందించిన సింగ్.. భారత బలగాలు ఎన్నటికీ కాల్పుల విరమణ ఉల్లంఘించలేదని చెప్పారు. -
పాక్ దుస్సాహసం.. రాయబారికి అవమానం
-
పాక్ దుస్సాహసం.. రాయబారికి అవమానం
పాకిస్తాన్ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. భారత రాయబార కార్యాలయానికి చెందిన ఒక ఫస్ట్ సెక్రటరీ మొబైల్ ఫోన్‌ను ఇస్లామాబాద్ కోర్టు స్వాధీనం చేసుకుంది. ఉజ్మా అనే భారతీయ మహిళ పెళ్లి చేసుకోడానికి ఇస్లామాబాద్ వచ్చి, తీరా అక్కడకు వచ్చిన తర్వాత తన భర్త తాహిర్ అలీకి అప్పటికే పెళ్లయిందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకుని అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈ కేసు ఇస్లామాబాద్ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఆ సందర్భంగా సాక్షిగా వచ్చిన భారత రాయబార కార్యాలయంలోని ఫస్ట్ సెక్రటరీ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను కోర్టు వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఒక్కసారిగా కలకలం రేపింది. పాకిస్తాన్ పౌరుడి చేతిలో మోసపోయిన భారతీయ మహిళకు ఆశ్రయం కల్పించే విషయంలో తన విధి నిర్వహణలో భాగంగా వచ్చిన ఒక దౌత్యవేత్త ఫోన్‌ను పాకిస్తాన్ అధికారులు ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ స్వదేశంలో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
నార్వే అధికారులను కలిసిన భారత రాయబారి
బాలుడిని అధికారులు తీసుకెళ్లిన కేసు న్యూఢిల్లీ: నార్వేలో భారతీయురాలికి జన్మించిన చిన్నారిని అధికారులు తీసుకెళ్లిన కేసు విషయమై ఓస్లో (నార్వే రాజధాని)లోని భారత రాయబారి మంగళవారం సంబంధిత అధికారులను కలిశారు. తల్లిదండ్రులు చిన్నారిని సరిగా చూసుకోవడం లేదని ఫిర్యాదు అందడంతో కొన్ని రోజుల క్రితం ఐదున్నరేళ్ల బాలుడిని అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో బాలుడి తల్లికి భారత పౌరసత్వం ఉండగా, తండ్రి, బాలుడు నార్వే పౌరులు. తమ బిడ్డను అనవసరంగా, అన్యాయంగా అధికారులు తమకు దూరం చేస్తున్నారనీ, కేసులో కలగజేసుకుని కొడుకును మళ్లీ తమ వద్దకు చేర్చాలని గతంలో తల్లి గుర్విందర్‌జిత్ కౌర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విన్నవించారు. దీనిపై ఆమె సానుకూలంగా స్పందించారు. తత్ఫలితంగా మంగళవారం భారత రాయబారి నార్వే అధికారులను కలవగా, చాలా సున్నితత్వంతో నార్వే చట్టాల ప్రకారం ఈ కేసును పరిష్కరిస్తున్నామని వారు తెలిపారు. సమావేశానికి ముందు ఈ విషయంపై భారత్‌లో సుష్మ మాట్లాడుతూ బాలుడిని తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. బిడ్డలను కన్న తల్లిదండ్రులే బాగా చూసుకోగలరనీ, పెంపుడు తల్లిదండ్రులకు భారతీయ సంస్కృతి, మన ఆహార అలవాట్ల గురించి ఏమీ తెలీదని అన్నారు. నార్వేలో చిన్నారుల సంరక్షణకు సంబంధించి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. తల్లిదండ్రులు సరిగా చూసుకోవడం లేదనే ఆరోపణలపై భారత సంతతి పిల్లలను నార్వే అధికారులు కస్టడీలోకి తీసుకోవడం ఇది మూడోసారి. 2011లో మూడున్నరేళ్లు, ఏడాదిన్నర వయసున్న ఇద్దరు పిల్లలను అధికారులు తీసుకెళ్లగా నాటి యూపీఏ ప్రభుత్వం పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించాల్సిందిగా నార్వే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అనంతరం చిన్నారులను తల్లిదండ్రులకు అప్పగించాలని నార్వే కోర్టు తీర్పునిచ్చింది. 2012 డిసెంబరులో ఇదే విషయమై మరో భారతీయ జంటను అధికారులు జైలులో వేశారు. 7 ఏళ్లు, రెండేళ్ల వయసున్న వారి ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌లోని తాతయ్య, అమ్మమ్మల దగ్గరకు పంపించారు. -
'పాకిస్థాన్‌తో సైనిక విన్యాసాలా.. మీకు తగదు'
పాకిస్థాన్‌తో కలిసి సైనిక విన్యాసాలు చేయడం సరికాదని రష్యాకు భారతదేశం గట్టిగా చెప్పింది. ఉగ్రవాదాన్ని వాళ్లు ప్రభుత్వ విధానంగా భావించి దానికి మద్దతు ఇస్తారని, అలాంటి దేశంతో కలిసి మెలిసి తిరగడం అంత మంచిది కాదని స్పష్టం చేసింది. వార్షిక ద్వైపాక్షిక సదస్సుకు ముందు మాస్కోలో భారత రాయబారి పంకజ్ శరణ్ రష్యా వార్తాసంస్థ రియా నొవోస్టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈనెల 14వ తేదీన గోవాకు రానున్నారు. అక్కడ ప్రధాని మోదీకి, ఆయనకు మధ్య ద్వైపాక్షిక సదస్సు ఒకటి జరగనుంది. దాంతోపాటు ఈ నెల 16వ తేదీన జరిగే బ్రిక్స్ సదస్సులో కూడా పుతిన్ పాల్గొంటారు. పాకిస్థాన్‌తో కలిసి రష్యా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించడంపై భారతదేశం తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించింది. కానీ తాము ఆసియాలోని ఇతర దేశాలతో కలిసి కూడా సైనిక విన్యాసాలు చేస్తున్నామంటూ రష్యా మన మాటలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. బ్రిక్స్ దేశాలు తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయని శరణ్ చెప్పారు. బ్రిక్స్ గ్రూపులోని అన్ని దేశాలూ ఉగ్రవాదం బారిన పడ్డవేనని ఆయన అన్నారు. అందువల్ల ఈ అంశంపై కూడా బ్రిక్స్ సదస్సులో చర్చ గట్టిగా సాగుతుందన్నారు. భారత, రష్యా దేశాల మధ్య చాలా కాలంగా ప్రత్యేకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని.. అందులో ఎలాంటి మార్పు లేదని శరణ్ స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి కోసం ఇరుదేశాల భాగస్వామ్యం గట్టిగా కృషిచేస్తోందన్నారు. మన దేశం కూడా రష్యాతో కలిసి తరచు సైనిక విన్యాసాలు చేస్తుంటుందని.. అవి ఇక ముందు కూడా కొనసాగుతాయని తెలిపారు. -
కొనసాగుతున్న పాకిస్తాన్ కుయుక్తులు
ఇస్లామాబాద్: భారత గూఢచారి డ్రోన్ (స్పై డ్రోన్) ను తమ సైన్యం కూల్చివేసిందని ప్రకటించిన పాకిస్థాన్ ఇపుడు మరో ఎత్తుగడ వేసింది. దీనికి సంబంధించి పాక్‌లోని భారత రాయబారికి గురువారం సమన్లు పంపింది. ఇండియన్ హై కమిషనర్ రాఘవన్‌కు సమన్లు జారీ చేశామని విదేశీ వ్యవహారాల శాఖ అధికారి తెలిపారు. స్పై డ్రోన్ చొరబాటుకు నిరసనగానే తామీ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాల్సిందేనన్న డిమాండ్‌తో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చల ప్రక్రియపై నీలి మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత సైన్యానికి చెందిన డ్రోన్‌ను పాక్ ఆర్మీ కూల్చివేసిందన్న వార్తలు కలకలం రేపాయి. ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలోతొక్కిన పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దులో కాల్పులకు పాడుతూ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేస్తోంది. నిబంధనలను అతిక్రమించి మా గగనతలంలోకి ప్రవేశించినందువల్లే డ్రోన్‌ను కూల్చేసామని పాక్ సమర్థించుకుంది. మరోవైపు 'ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. తమకు సంబంధించిన డ్రోన్ ఏదీ కూలిపోలేదని ప్రకటించింది. -
బెల్జీయంలో భారత రాయబారిగా పూరి
బెల్జీయంలో భారత రాయబారిగా మన్జీవ్ సింగ్ పూరి నియమితులయ్యారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే కౌన్సిల్ ఆఫ్ ద యూరోపియన్ యూనియన్‌లో కూడా పూరి భారత రాయబారిగా విధులు నిర్వహించనున్నారని పేర్కొంది. ప్రస్తుతం పూరి ఐక్యరాజ్యసమితిలో భారత్ తరపున ఉప శాశ్వత ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.1982 బ్యాచ్ ఇండియన్ ఫారన్ సర్వీస్‌కు చెందిన పూరి ఇప్పటి వరకు పలు దేశాల్లో భారత రాయబారిగా పని చేశారు. అలాగే హాంగేరిలోని భారత రాయబారి ఉన్న మలయ్ మిశ్రాను బొస్నియా అండ్ హెర్జిగోవినాలో నూతన రాయబారిగా విదేశాంగ శాఖ నియమించింది. అయితే మారిషస్‌లో భారత రాయబారిగా ఉన్న టీ పీ సీతారాంను యూఏఈలో భారత రాయబారిగా నియమిస్తున్నట్లు విదేశాంగ శాఖ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీతారాం వచ్చే నెలలో ఆ నూతన బాధ్యతులు స్వీకరించనున్నారు.