
ఇస్లాబామాద్ : ఎల్‌ఓసీ వద్ద భారత్ భధ్రతా బలగాలు ఏకపక్షంగా కాల్పులు జరుపుతున్నాయని ఆరోపిస్తూ.. పాకిస్తాన్‌లోని భారత రాయబారికి పాకిస్తాన్ సమన్లు జారీచేసింది. ప్రతిసారి భారత్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తోందని పాక్ ఆరోపించింది. సెప్టెంబర్ 30, అక్టోబర్ 2న భారత్ బలగాలు ఎల్‌ఓసీ వద్ద కాల్పుకు తెగబడిందని ఆరోపించింది. ఈ కాల్పుల వల్ల ముగ్గురు పౌరులు చనిపోగా, మరో అయిదు మంది తీవ్రంగా గాయపడ్డారని చెబుతోంది.
కాల్పుల విరమణకు సమాధానం చెప్పాలంటూ.. పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ ఫైసల్.. భారత్ హైకమిషనర్ జేపీ సింగ్‌కు సమన్లు జారీ చేశారు. దీనిపై స్పందించిన సింగ్.. భారత బలగాలు ఎన్నటికీ కాల్పుల విరమణ ఉల్లంఘించలేదని చెప్పారు.