పాక్ దుస్సాహసం.. రాయబారికి అవమానం | Islamabad court seizes indian envoy mobile phone | Sakshi
Sakshi News home page

పాక్ దుస్సాహసం.. రాయబారికి అవమానం

Published Fri, May 12 2017 2:07 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

పాక్ దుస్సాహసం.. రాయబారికి అవమానం

పాక్ దుస్సాహసం.. రాయబారికి అవమానం

పాకిస్తాన్ మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. భారత రాయబార కార్యాలయానికి చెందిన ఒక ఫస్ట్ సెక్రటరీ మొబైల్ ఫోన్‌ను ఇస్లామాబాద్ కోర్టు స్వాధీనం చేసుకుంది. ఉజ్మా అనే భారతీయ మహిళ పెళ్లి చేసుకోడానికి ఇస్లామాబాద్ వచ్చి, తీరా అక్కడకు వచ్చిన తర్వాత తన భర్త తాహిర్ అలీకి అప్పటికే పెళ్లయిందని, నలుగురు పిల్లలు కూడా ఉన్నారని తెలుసుకుని అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. ఈ కేసు ఇస్లామాబాద్ హైకోర్టులో విచారణకు వచ్చింది.

ఆ సందర్భంగా సాక్షిగా వచ్చిన భారత రాయబార కార్యాలయంలోని ఫస్ట్ సెక్రటరీ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను కోర్టు వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఒక్కసారిగా కలకలం రేపింది. పాకిస్తాన్ పౌరుడి చేతిలో మోసపోయిన భారతీయ మహిళకు ఆశ్రయం కల్పించే విషయంలో తన విధి నిర్వహణలో భాగంగా వచ్చిన ఒక దౌత్యవేత్త ఫోన్‌ను పాకిస్తాన్ అధికారులు ఎలా స్వాధీనం చేసుకుంటారంటూ స్వదేశంలో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement