
హర్షవర్ధన శ్రింగ్లా (ఫైల్ ఫొటో)
సాక్షి, న్యూఢిల్లీ : భారత దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రింగ్లాను అమెరికాలో భారత రాయబారిగా నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత రాయబారి నవ్‌తేజ్ సర్నా స్థానంలో త్వరలోనే హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించనున్నారని గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ 1984 బ్యాచ్‌కు చెందిన హర్షవర్ధన్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భారత హైకమీషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా రాయబారిగా నియమితులవుతున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో రివా గంగూలీ దాస్ బంగ్లాదేశ్ భారత హైకమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.