Navtej Sarna
-
అమెరికాలో భారత రాయబారిగా హర్షవర్ధన్ శ్రింగ్లా
సాక్షి, న్యూఢిల్లీ : భారత దౌత్యవేత్త హర్షవర్ధన్ శ్రింగ్లాను అమెరికాలో భారత రాయబారిగా నియమించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత రాయబారి నవ్‌తేజ్ సర్నా స్థానంలో త్వరలోనే హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించనున్నారని గురువారం ప్రకటన విడుదల చేసింది. కాగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ 1984 బ్యాచ్‌కు చెందిన హర్షవర్ధన్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో భారత హైకమీషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా రాయబారిగా నియమితులవుతున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో రివా గంగూలీ దాస్ బంగ్లాదేశ్ భారత హైకమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
భారత్ మాకు కీలక భాగస్వామి: అమెరికా
వాషింగ్టన్: అమెరికాకు భారత్ ఎప్పుడూ కీలక భాగస్వామిగానే ఉంటుందని అమెరికా విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మీడియాకు తెలిపారు. అమెరికాలో భారత్ కొత్త రాయబారి నవతేజ్ సర్నాకు స్వాగతం పలికిన అనంతరం కిర్బీ మీడియాతో మాట్లాడుతూ... ‘ఒబామా పాలనలో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేశామని, భవిష్యత్తులో కూడా పూర్తిస్థాయిలో ఈ అంశంపై దృష్టి సారిస్తామన్నారు. ప్రస్తుతం భారత్‌తో మంచి సంబంధాలను కలిగివున్నామని, రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించుకునేందుకు తాము మరింత కృషి చేస్తామన్నారు. కొత్త రాయబారి నవతేజ్ సర్నాకు తాము అన్నివిధాలా సహకరిస్తామ’న్నారు. -
యూఎస్ లో భారత రాయబారిగా నవ్ తేజ్ సర్నా
న్యూఢిల్లీ: అమెరికాలో తదుపరి భారత రాయబారిగా నవ్‌తేజ్ సర్నా ను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. సర్నా ఎనిమిది నెలల క్రితం బ్రిటన్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు. ఆయన 1980 ఐఏఎఫ్ బ్యాచ్ అధికారి. ప్రస్తుతం అమెరికాలో రాయబారిగా ఉన్న అరుణ్ కుమార్ సింగ్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. గతంలో సర్నా ఇజ్రాయెల్ లో భారత రాయబారిగా చేశారు. 2002 నుంచి 2008 వరకు సర్నా మాస్కో, వార్సా, టెహ్రాన్, జెనీవా, థింపులలో భారత అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2015 అక్టోబరులో ఢిల్లీలో జరిగిన ఇండో,ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ విజయవంత మవడంలో కీలకపాత్ర పోషించారు. -
నెలాఖరులో విదేశాలకు ప్రణబ్
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విదేశాలకు నెలాఖరులో విదేశాలకు వెళ్లనున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి నవతేజ్ సర్నా తెలిపారు. ఈనెల (మే) 31న ఇండియా నుంచి బయలుదేరి తొలుత స్వీడన్‌కు వెళ్తారు. జూన్ 2 వరకు ప్రణబ్ స్వీడన్లోనే ఉంటారు. తర్వాత అక్కడి నుంచి నేరుగా భారత్‌కు వచ్చి.. అదే రోజున అంటే జూన్ 2న బెలారస్ బయలుదేరుతారు. బెలారస్లో జూన్ 4 వరకు ఉంటారని నవతేజ్ సర్నా పేర్కొన్నారు.