యూఎస్ లో భారత రాయబారిగా నవ్ తేజ్ సర్నా
న్యూఢిల్లీ: అమెరికాలో తదుపరి భారత రాయబారిగా నవ్తేజ్ సర్నా ను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. సర్నా ఎనిమిది నెలల క్రితం బ్రిటన్లో భారత రాయబారిగా నియమితులయ్యారు. ఆయన 1980 ఐఏఎఫ్ బ్యాచ్ అధికారి. ప్రస్తుతం అమెరికాలో రాయబారిగా ఉన్న అరుణ్ కుమార్ సింగ్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు.
గతంలో సర్నా ఇజ్రాయెల్ లో భారత రాయబారిగా చేశారు. 2002 నుంచి 2008 వరకు సర్నా మాస్కో, వార్సా, టెహ్రాన్, జెనీవా, థింపులలో భారత అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2015 అక్టోబరులో ఢిల్లీలో జరిగిన ఇండో,ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ విజయవంత మవడంలో కీలకపాత్ర పోషించారు.