indian ambassador
-
భారత రాయబారిపై ఖలిస్తానీ వాదుల దూషణలు
న్యూయార్క్: గురుపూరబ్ పర్వదినం సందర్భంగా ప్రార్థనల్లో పాల్గొనేందుకు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరన్జీత్ సింగ్ సంధుపై ఖలిస్తానీ వాదులు నోరుపారేసుకున్నారు. లాంగ్ ఐలాండ్‌లో హిక్స్‌విల్లే గురుద్వారాకు వెళ్లిన సంధుకు ఘన స్వాగతం లభించింది. ఇది జీర్ణించుకోలేని ఖలిస్తానీ వాదులు ఆయన్ను దూషించారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనపై ఆయనపై పలు ప్రశ్నలు సంధిస్తూ పెద్దగా కేకలు వేశారు. స్థానిక సిక్కు సమాజ సభ్యులు సంధుకు రక్షణగా నిలిచి, ఖలిస్తానీ వాదులను బయటకు పంపించారు. -
భారత రాయబారిని అడ్డుకున్న ఖలిస్థానీ మద్దతుదారులు
న్యూయార్క్: అమెరికాలో భారత రాయబారిని ఖలిస్థానీ మద్దతుదారులు అడ్డుకున్నారు. న్యూయార్క్‌లోని గురుద్వారాలో రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూని చుట్టుముట్టారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందని ఆరోపించారు. సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నుతున్నారని నినాదాలు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గురునానక్ జయంతి సందర్భంగా న్యూయార్క్ న్యూఐలాండ్లోని గురుద్వారాలో ప్రార్ధనల్లో పాల్గొని తరణ్‌జిత్ సింగ్ బయటకు వచ్చిన సందర్భంగా ఖలిస్థానీ మూకలు అడ్డుతగిలారు. ఈ ఘటనను బీజేపీ నాయకుడు మంజిందర్ సింగ్ తప్పుబట్టారు. ఇది సిక్కుల భావాజాలమా? గురునానక్ బోధనలు ఇదే చెబుతున్నాయా? ఈ ఖలిస్థానీ గుండాలు సిక్కులు కానేకాదని మంజిందర్ సింగ్ మండిపడ్డారు. Khalistanies tried to heckle Indian Ambassador @SandhuTaranjitS with basless Questions for his role in the failed plot to assassinate Gurpatwant, (SFJ) and Khalistan Referendum campaign. Himmat Singh who led the pro Khalistanies at Hicksville Gurdwara in New York also accused… pic.twitter.com/JW5nqMQSxO — RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) November 27, 2023 కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ట్రూడో ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించింది. ఆనాటి నుంచి కెనడా-భారత్ మధ్య దౌత్య పరమైన సంబంధాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. నిజ్జర్ హత్య కేసు తర్వాత భారత రాయబారులకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సెప్టెంబర్‌లో యూకేలోనూ భారత రాయబారి విక్రమ్ దొరైస్వామిని గురుద్వారాలోకి ప్రవేశించకుండా దుండగులు అడ్డుకున్నారు. అయితే.. ప్రస్తుతం తరణ్‌జిత్ సింగ్‌ని ఖలిస్థానీ మద్దతుదారులు చుట్టుముట్టడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రాయబారుల భద్రత పట్ల అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లింది. ఇదీ చదవండి: భారతీయులకు గుడ్‌న్యూస్.. ఆ దేశానికి వెళ్లాలంటే నో ‘వీసా’ -
ఆయన అమెరికా- భారత్‌ల మధ్య బంధానికి కెప్టెన్
వాషింగ్టన్: భారత రాయబారి హర్షవర్దన్ ష్రింగ్లాకు అమెరికా ఘనమైన వీడ్కోలు ఇచ్చింది. అందులో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని శ్వేతసౌధంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన హయాంలో ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం వేగవంతం చేయడానికి సహకరించినందుకు ట్రంప్‌కు ష్రింగ్లా కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు భారత రాయబారికి అక్కడి విదేశాంగశాఖలోని దక్షిణ, మధ్య ఆసియా విభాగం అసిస్టెంట్ సెక్రటరీ అలైస్ వెల్స్ ప్రత్యేకంగా వీడ్కోలు పలికారు. ఉభయ దేశాల మధ్య బంధానికి ష్రింగ్లా కెప్టెన్‌గా వ్యవహరించారని కొనియాడారు. భారత విదేశాంగశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ష్రింగ్లా.. ఉభయ దేశాల మైత్రి బలోపేతానికి కృషి చేస్తారని ఆకాంక్షించారు. అంతకుముందు అమెరికా ప్రొటోకాల్ చీఫ్ హ్యాండర్సన్.. బ్లెయిర్ హౌజ్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విదేశాంగశాఖ కార్యదర్శి ఉన్న విజయ్ గోఖలే పదవీకాలం జనవరి 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ స్థానంలో హర్షవర్ధన్ ష్రింగ్లాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబరు 23న ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నెల 29న విదేశాంగశాఖ కార్యదర్శిగా ష్రింగ్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. 1984 బ్యాచ్‌కు చెందిన హర్షవర్ధన్ ష్రింగ్లా అనేక పదవులను అధిరోహించారు. ఆయన 35 ఏళ్ల సర్వీసులో బంగ్లాదేశ్, థాయిలాండ్ దేశాలలో భారత హైకమిషనర్‌గా సేవలందించారు. A final goodbye! pic.twitter.com/AMvqROEaL2 — Harsh V Shringla (@HarshShringla) January 12, 2020 -
‘ఫార్మింగ్టన్’ బాధితులను ఆదుకుంటాం
వాషింగ్టన్: ఫార్మింగ్టన్ యూనివర్సిటీ ఉచ్చులో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ శ్రింగ్లా భరోసా ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మిషిగాన్‌లోని ఫార్మింగ్టన్ యూనివర్సిటీ విషయంలో ఇంతమంది భారతీయ విద్యార్థులను నిర్బంధించడం బాధాకరమైన విషయం. వివిధ ప్రాంతాల్లో ఉన్న మా అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. అందరూ క్షేమంగానే ఉన్నారు. వారికి న్యాయపరమైన సాయం అందజేసేందుకు గల మార్గాలపై నిపుణులతో చర్చించాం. మన విద్యార్థుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుంది. వారికి అండగా ఉంటుంది’ అని తెలిపారు. ఈ వ్యవహారంలో దళారులతోపాటు వందలాదిగా విద్యార్థులను నిర్బంధించిన అధికారులు మరో 600 మందికి వారంట్లు జారీ చేశారు. -
అమెరికాలో భారత రాయబారిగా హర్షవర్ధన్
న్యూఢిల్లీ: అమెరికాలో భారత నూతన రాయబారిగా హర్షవర్ధన్ ష్రింగ్లాను నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్షవర్ధన్ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి. ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా నవ్‌తేజ్ సర్నా కొనసాగుతున్నారు. త్వరలోనే హర్షవర్ధన్ కొత్త రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం హర్షవర్ధన్ బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్నారు. హెచ్1బీ వీసా, అమెరికా వద్దని వారించినా రష్యా నుంచి ఎస్400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఇరాన్ నుంచి చమురు దిగుమతులు వంటి కీలక అంశాల్లో భారత్‌పై ట్రంప్ నేతృత్వంలోని అమెరికా సర్కారు ధోరణిని హర్షవర్ధన్ సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది. హర్షవర్ధన్ గతంలో థాయ్‌లాండ్, వియత్నాం, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికాల్లో భారత రాయబారిగా సేవలందించారు. -
పాక్‌లో భారత రాయబారికి అవమానం
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి భారత రాయబారిని అవమానించింది. పాక్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను భద్రతా కారణాలను సాకుగా చూపుతూ గురుద్వారాలోకి వెళ్లకుండా అడ్డుకుంది. శుక్రవారం తన పుట్టినరోజు సందర్భంగా బిసారియా కుటుంబ సభ్యులతో కలసి ఇస్లామాబాద్‌లోని గురుద్వారా పంజా సాహిబ్‌కు వెళ్లారు. ఇందు కోసం పాక్ విదేశాంగ శాఖ నుంచి ముందస్తు అనుమతి కూడా తీసుకున్నారు. అయితే గురుద్వారా సమీపానికి చేరుకున్నాక బిసారియాను లోపలకు అనుమతించలేదు. భద్రతా కారణాలను సాకుగా చూపిన పాక్ అధికారులు బిసారియా కారు నుంచి దిగేందుకు కూడా అంగీకరించలేదు. ఈ ఘటనపై ఢిల్లీలోని పాక్ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాకు సమన్లు జారీచేసిన భారత విదేశాంగ శాఖ.. పాక్ అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర నిరసన తెలిపింది. -
భారత అధికారి ట్వీటర్ హ్యాక్.. కలకలం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన ఉన్నతాధికారి ట్వీటర్ అకౌంట్ హ్యాక్‌కి గురికావటం కలకలం రేపింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అకౌంట్‌ను పాక్ ఉగ్రసంస్థలు హ్యాక్ చేశాయి. సయ్యద్ ట్విటర్లో పాక్ జెండాను, దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఫోటోను పోస్టు చేశాయి. ఆదివారం ఉదయం సయ్యద్ ట్విటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు రెండు పాకిస్థాన్ జెండా ఫోటోలను ఉంచారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అధికారిక ట్విటర్‌కు ఉండాల్సిన బ్లూ టిక్ మార్క్ కూడా కనిపించకుండా పోయింది. అప్రమత్తమైన ఆయన ఫిర్యాదు చేయటంతో ఆయా పోస్టులను తొలగించి అకౌంట్‌ను ట్వీటర్ పునరుద్ధరించింది. పాక్‌కు చెందిన హ్యాకర్లే ఈ పనికి పాల్పడినట్లు అధికారులు దృవీకరించారు. భారత అధికారిక సైట్లను పాక్ ఉగ్రసంస్థలు హ్యాక్ చేయటం కొత్తేం కాదు. 2013-2016 మధ్య 700 సైట్లను హ్యాక్ చేయగా.. అందులో 199 ప్రభుత్వ వెబ్ సైట్లు ఉన్నాయి. గతేడాది జనవరిలో జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ)ని హ్యాక్‌కి గురి కావటం పెను కలకలమే రేపింది. -
భారత రాయబారి ఇంట్లో రాకెట్ పేలుడు
-
భారత రాయబారి ఇంట్లో రాకెట్ పేలుడు
కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబారి నివాసంలో రాకెట్ పేలడం కలకలం రేపింది. కాబూల్‌లోని భారత ఎంబసీ కాంపౌండ్‌లోని అతిథి గృహంలో రాకెట్ లాంచర్ ఒకటి దూసుకొచ్చి పేలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. భారత అతిథి గృహం కాంపౌండ్‌లో ఉన్న వాలీబాల్ మైదానంలో ఉదయం 11.45 గంటలకు రాకెట్ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో భారత దౌత్యవేత్త మన్‌ప్రీత్ వోహ్రాతోపాటు ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది కూడా ఇంట్లోనే ఉన్నారు. గతవారం కాబూల్‌లోని దౌత్య ప్రాంతంలో భారీ ఉగ్రపేలుళ్లు చోటుచేసుకొని 150మందికిపైగా మృతిచెందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినా భారత దౌత్యవేత్త నివాసంలో రాకెట్ లాంచర్ పేలుడం ఆందోళన రేపుతోంది. -
జపాన్‌లో భారత రాయబారితో కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: జపాన్ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు అక్కడి భారత రాయబారి సుజన్ చినాయ్‌తో ఆదివారం మర్యా దపూర్వకంగా సమావేశమయ్యారు. జపాన్ నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిం చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాలను ఆయనకు కేటీఆర్ వివరించారు. అత్యంత వేగంగా, పారదర్శకంగా అనుమతులు జారీ చేస్తున్నామని తెలిపారు. సుజయ్ చినాయ్ మాట్లాడుతూ, జపాన్‌లోని ఒకటిరెండు నగరాలతో సిస్టర్సిటీ ఒప్పందం కుదుర్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. చిన్నతరహా పరిశ్రమలు, పెట్టుబడులపై దృష్టి సారించాలన్నారు. జపాన్ కంపెనీలకు కావాల్సిన సిబ్బంది సరఫరా, శిక్షణ కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని కోరారు. భారత రాయబారి సూచనలకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. -
యూఎస్ లో భారత రాయబారిగా నవ్ తేజ్ సర్నా
న్యూఢిల్లీ: అమెరికాలో తదుపరి భారత రాయబారిగా నవ్‌తేజ్ సర్నా ను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. సర్నా ఎనిమిది నెలల క్రితం బ్రిటన్‌లో భారత రాయబారిగా నియమితులయ్యారు. ఆయన 1980 ఐఏఎఫ్ బ్యాచ్ అధికారి. ప్రస్తుతం అమెరికాలో రాయబారిగా ఉన్న అరుణ్ కుమార్ సింగ్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. గతంలో సర్నా ఇజ్రాయెల్ లో భారత రాయబారిగా చేశారు. 2002 నుంచి 2008 వరకు సర్నా మాస్కో, వార్సా, టెహ్రాన్, జెనీవా, థింపులలో భారత అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2015 అక్టోబరులో ఢిల్లీలో జరిగిన ఇండో,ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ విజయవంత మవడంలో కీలకపాత్ర పోషించారు. -
నైజీరియా భారత రాయబారిగా నాగభూషన్ రెడ్డి
హైదరాబాద్: నైజీరియాలో మన దేశ రాయబారిగా వైఎస్సార్ జిల్లా వాసి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన బి. నాగభూషణరెడ్డి ప్రస్తుతం జెనీవాలోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో మన దేశ ఉప శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇండియన్ ఫారెన్ సర్వీసుకు చెందిన నాగభూషణరెడ్డి త్వరలోనే నైజీరియాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రభుత్వం పేర్కొంది. -
అమెరికా ఔచిత్య భంగం!
సంపాదకీయం మనుషుల్లో కలిమిలేముల భేదమున్నట్టే దేశాలమధ్య కూడా స్థాయీ భేదం ఉంటుంది. తనకొక నీతి, పరులకొక రీతి అమలు చేసే అమెరికా... ఈ స్థాయీ భేదాలను పద్ధతిగా పాటిస్తూ వస్తోంది. తాజాగా న్యూయార్క్‌లో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రగడేను అరెస్టు చేసిన తీరు దీన్నే మరోసారి రుజువుచేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ యువ అధికారిణిని అరెస్టుచేసి సంకెళ్లువేసి తీసుకెళ్లిన ఘటన అమెరికా మొరటుతనాన్ని బయట పెట్టింది. ఏడాది కాలంపైగా న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ కార్యాలయంలో పనిచేస్తున్న దేవయాని ఐఎఫ్ఎస్ అధికారిణి. తన వద్ద సహాయకురాలిగా పనిచేస్తున్న యువతికి సంబంధించిన వీసా దరఖాస్తులో ఆమె అబద్ధం చెప్పారని, అలాగే ఆ యువతికి చట్ట ప్రకారం ఇవ్వాల్సిన వేతనంకంటే చాలా తక్కువ చెల్లించారని దేవయానిపై ఆరోపణలు. అయితే, దేవయాని తరఫున ఆమె తండ్రి వేరే రకంగా చెబుతున్నారు. సహాయకురాలిగా వెళ్లిన యువతి మొన్నటి జూన్‌లో మాయమైందని, అప్పటినుంచీ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నదని ఆయన ఆరోపిస్తున్నారు. పైగా, ఆమె విషయంలో తాము ఢిల్లీ హైకోర్టులో ఇప్పటికే కేసు దాఖలుచేసి ఉన్నామంటున్నారు. ఈ కేసుకు సంబంధించి అమెరికాలోగానీ, మరెక్కడాగానీ వ్యాజ్యం తీసుకురావడానికి వీల్లేదంటూ ఢిల్లీ హైకోర్టు ఇంజంక్షన్ ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇందులో ఎవరి వాదన సరైందో, లోపం ఎక్కడున్నదో ఇంకా తేలవలసి ఉన్నది. ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు చట్టప్రకారం ఎలా వ్యవహరించాలో అలాగే చేశామని అమెరికా చెబుతోంది. అలా చేయడంలో ఎలాంటి ఉల్లంఘనలకూ పాల్పడలేదంటోంది. దేవయాని చేసిందేమిటి...అందులోని తప్పొప్పులేమిటనే విషయంలోకి ఇప్పుడెవరూ వెళ్లడంలేదు. దేవయాని తండ్రి చెబుతున్నట్టు ఆమె సహాయకురాలు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నదా, లేదా అనేది కూడా ఇక్కడ అప్రస్తుతం. కానీ, దౌత్యవేత్తగా పనిచేస్తున్న అధికారుల విషయంలో అంతర్జాతీయ నియమాలు, ఒప్పందాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత అమెరికాకు ఉంది. ఆ బాధ్యతను అది సక్రమంగా నిర్వర్తించలేకపోయిందని జరిగిన ఘటననుబట్టే అర్ధమవుతున్నది. భర్త ఏదో పనిపై దూరప్రాంతానికి వెళ్లిన సమయంలో తన పిల్లలను పాఠశాలకు దిగబెట్టడానికి వెళ్లిన మహిళను ఉన్నట్టుండి అరెస్టు చేయాల్సిన అగత్యం ఏం వచ్చిందో అమెరికా అధికారులు చెప్పాలి. ఆమె డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న వ్యక్తి. ఆరోపణలొచ్చాయని తెలిసిన వెంటనే మూడో కంటికి తెలియకుండా దేశం విడిచి పారిపోయే స్థితిలో ఆమె లేరు. దేవయానిపై వచ్చిన ఆరోపణలగురించి ముందు ఆమెకు తెలియాలి. అలాగే, వాటిని వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం దృష్టికి, మన విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లాలి. ముందస్తు సమాచారం ఇచ్చినంతమాత్రాన కొంప మునిగేదేమీ లేదు. అలా చేసివుంటే చట్టపరంగా తనవైపుగా తీసుకోవాల్సిన చర్యలేమిటో ఆమె నిర్ణయించు కునేవారు. ముందస్తు బెయిల్గానీ, మరోటిగానీ తెచ్చుకునేవారు. భారత్‌లోని కోర్టుల్లో తాము దాఖలుచేసిన పిటిషన్లపైనా, వాటిపై వచ్చిన ఆదేశాలపైనా వారికి వివరించి ఉండేవారు. ఇప్పుడు అమెరికా అధికారులు ఇంత హడావుడి చేశాక ఆమెకు మాన్‌హట్టన్ కోర్టు బెయిల్ మంజూరుచేసింది. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ఆమెను అరెస్టుచేయకుండానే, సంకెళ్లువేసి తీసుకెళ్లకుండానే ఇది జరిగేలా చేయడం పెద్ద కష్టంకాదు. ఆమె చట్టవిరుద్ధంగా ప్రవర్తించివుంటే, సహాయకురాలి విషయంలో అనుచితంగా ప్రవర్తించివుంటే వాటి పర్యవ సానాలను ఆమె అనుభవించాల్సిందే. అయితే, అమెరికా అధికారులు విచారణకు ముందే ఆరోపణలు రుజువైనంత హడావుడి ఎందుకు చేయాల్సి వచ్చింది? తమది అగ్రరాజ్యమని, తాము తల్చుకుంటే ఏమైనా చేయగలమని చెప్పడం తప్ప... దేవయాని తండ్రి అంటున్నట్టు తమ జాత్యహంకారాన్ని ప్రదర్శించుకోవడంతప్ప దీనిద్వారా అక్కడి అధికారులు సాధించిందేమైనా ఉందా? అమెరికా తీరుకు మన దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేయడంతోపాటు ఢిల్లీలోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను పిలిపించి నిరసన తెలిపింది. కానీ, ఆ దేశం ఎదురు వాదనకు దిగుతోంది. దౌత్యవేత్తల విషయంలో వ్యవహరిం చాల్సిన తీరుకు సంబంధించిన వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించలేదంటున్నది. దేవయాని చేసిన పని ఆమె దౌత్య విధుల్లో భాగం కాదుగనుక తమ చర్యల్లో దోషం లేదంటున్నది. కానీ, ఎలాంటి సమాచారమూ ఇవ్వకుండా దేవయానిని అర్ధం తరంగా అరెస్టుచేసి తీసుకెళ్లడం ఆమె విధులను ఆటంకం పర్చడమే అవుతుందన్న స్పృహ ఆ దేశానికి లోపిస్తున్నది. ఇంతకూ దౌత్య సంప్రదాయాల గురించి, మర్యా దల గురించి తెలుసునన్నట్టు చెబుతున్న అమెరికా ఇతర దేశాల్లో ప్రవరిస్తున్న తీరేమిటి? ఆ సంగతి వికీలీక్స్ పత్రాల్లో బట్టబయలై చాలాకాలమైంది. తనవారా, పరాయివారా అన్న విచక్షణ కూడా మరిచి అన్ని దేశాల అధినేతలపైనా అమెరికా గూఢచర్యానికి పాల్పడుతున్నదని ఆ దేశ పౌరుడు స్నోడెన్ వెల్లడించి ఎన్నాళ్లో కాలేదు. ఈమధ్యే మాస్కోలోని అమెరికా దౌత్యవేత్త ఒకరు గూఢచర్యానికి పాల్ప డుతున్నాడని ఆరోపించి, అతన్ని అవాంఛనీయమైన వ్యక్తిగా ప్రకటించింది రష్యా. దౌత్యపరమైన రక్షణలున్నాయి గనుక అతన్ని అరెస్టు చేయడంలేదని చెప్పింది. కనీసం ఈపాటి మర్యాదనైనా దేవయాని విషయంలో ఎందుకు పాటించలేదో అమెరికా సంజాయిషీ ఇవ్వాలి. తమకు భారత్‌తో చిరకాలంనుంచి ద్వైపాక్షిక సంబంధాలున్నాయని, అవి ఎప్పటిలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఆశిస్తే సరిపోదు. అందుకు అనుగుణమైన ఆచరణ అవసరమని ఆ దేశం గుర్తించాలి. కాస్తయినా సున్నితత్వాన్ని ప్రదర్శించడం నేర్చుకోవాలి. -
అమెరికాలో భారత దౌత్యవేత్త అరెస్టు
చేతులకు సంకెళ్లు వేసి మరీ దేవయాని ఖోబ్రాగాదే కోర్టుకు తరలింపు రూ. కోటిన్నర పూచీకత్తుతో బెయిల్‌పై విడుదల వీసా మోసానికి పాల్పడినట్టు అభియోగాలు వీసా మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై అమెరికాలోని న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రాగాదే (39)ను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. తన కుమార్తెను స్కూలు వద్ద దింపేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరూ చూస్తుండగానే చేతికి సంకెళ్లు వేసి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో ఆమెను హాజరు పరచగా న్యాయస్థానం 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 1.55 కోట్లు) పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది. తన ఇంట్లో పనిచేస్తున్న మహిళకు సంబంధించిన వీసా పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపైనే ఖోబ్రాగాదేను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. కాగా న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్‌కు చెందిన యూఎస్ అటార్నీ అయిన ప్రవాస భారతీయుడు ప్రీత్ భరారా చేసిన ఆరోపణల మేరకు ఆమె అరెస్ట్ జరిగింది. దేవయాని వీసా మోసానికి పాల్పడ్డారని, తప్పుడు సమాచారమిచ్చారని భరారా ఆరోపించారు. దేవయాని తన ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యతలను చూసుకోవడానికి భారత్ నుంచి ఓ మహిళను తీసుకొచ్చారని, అయితే ఆమె వీసా(ఏ-3) దరఖాస్తులో తప్పుడు సమాచారమిచ్చారని, అంతేగాక ఆమె పనికి తగిన వేతనాన్ని చెల్లించడం లేదంటూ అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాలు రుజువైతే గరిష్టంగా పదేళ్లు, ఐదేళ్ల చొప్పున జైలుశిక్ష పడేందుకు ఆస్కారముంది. తదుపరి విచారణను కోర్టు జనవరి 13కు వాయిదా వేసింది. ఆమెను అమెరికా విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఈ అరెస్ట్ భారత దౌత్యవర్గాలను దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. దీనిపై వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పందించింది. అమెరికా ప్రభుత్వానికి తన ఆందోళనను తెలియపరిచింది. ఆమె దౌత్యవేత్త హోదాను దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్కరించాలని కోరింది. దేవయాని గతేడాది న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో చేరారు. అంతకుముందు జర్మనీ, ఇటలీ, పాక్‌లలో పనిచేశారు. భారత్ దిగ్భ్రాంతి: ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దీనిపై భారత్‌లోని అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను శుక్రవారం ఢిల్లీలోని విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్ పిలిపించి భారత్ నిరసనను తెలియజేశారు. సీనియర్ దౌత్యవేత్తపై ఇంత అమర్యాదకరంగా వ్యవహరించడం సరికాదన్నారు. కాగా తన కుమార్తె అరెస్ట్‌పై ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రాగాదే శుక్రవారం ముంబైలో స్పందిస్తూ ఈ సంఘటన జాతి వివక్షకు నిదర్శనమని పేర్కొన్నారు.