సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌కు చెందిన ఉన్నతాధికారి ట్వీటర్ అకౌంట్ హ్యాక్‌కి గురికావటం కలకలం రేపింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అకౌంట్‌ను పాక్ ఉగ్రసంస్థలు హ్యాక్ చేశాయి. సయ్యద్ ట్విటర్‌లో పాక్ జెండాను, దేశ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ఫోటోను పోస్టు చేశాయి.
ఆదివారం ఉదయం సయ్యద్ ట్విటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న హ్యాకర్లు రెండు పాకిస్థాన్ జెండా ఫోటోలను ఉంచారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అధికారిక ట్విటర్‌కు ఉండాల్సిన బ్లూ టిక్ మార్క్ కూడా కనిపించకుండా పోయింది. అప్రమత్తమైన ఆయన ఫిర్యాదు చేయటంతో ఆయా పోస్టులను తొలగించి అకౌంట్‌ను ట్వీటర్ పునరుద్ధరించింది. పాక్‌కు చెందిన హ్యాకర్లే ఈ పనికి పాల్పడినట్లు అధికారులు దృవీకరించారు.
భారత అధికారిక సైట్లను పాక్ ఉగ్రసంస్థలు హ్యాక్ చేయటం కొత్తేం కాదు. 2013-2016 మధ్య 700 సైట్లను హ్యాక్ చేయగా.. అందులో 199 ప్రభుత్వ వెబ్ సైట్లు ఉన్నాయి. గతేడాది జనవరిలో జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ)ని హ్యాక్‌కి గురి కావటం పెను కలకలమే రేపింది.
Comments
Please login to add a commentAdd a comment