
హర్షవర్ధన్ ష్రింగ్లా
న్యూఢిల్లీ: అమెరికాలో భారత నూతన రాయబారిగా హర్షవర్ధన్ ష్రింగ్లాను నియమిస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హర్షవర్ధన్ 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా నవ్‌తేజ్ సర్నా కొనసాగుతున్నారు. త్వరలోనే హర్షవర్ధన్ కొత్త రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం హర్షవర్ధన్ బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్నారు. హెచ్1బీ వీసా, అమెరికా వద్దని వారించినా రష్యా నుంచి ఎస్400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఇరాన్ నుంచి చమురు దిగుమతులు వంటి కీలక అంశాల్లో భారత్‌పై ట్రంప్ నేతృత్వంలోని అమెరికా సర్కారు ధోరణిని హర్షవర్ధన్ సమర్ధవంతంగా ఎదుర్కోవాల్సి ఉంది. హర్షవర్ధన్ గతంలో థాయ్‌లాండ్, వియత్నాం, ఇజ్రాయెల్, దక్షిణాఫ్రికాల్లో భారత రాయబారిగా సేవలందించారు.