వాషింగ్టన్: ఫార్మింగ్టన్ యూనివర్సిటీ ఉచ్చులో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ శ్రింగ్లా భరోసా ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మిషిగాన్‌లోని ఫార్మింగ్టన్ యూనివర్సిటీ విషయంలో ఇంతమంది భారతీయ విద్యార్థులను నిర్బంధించడం బాధాకరమైన విషయం. వివిధ ప్రాంతాల్లో ఉన్న మా అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. అందరూ క్షేమంగానే ఉన్నారు. వారికి న్యాయపరమైన సాయం అందజేసేందుకు గల మార్గాలపై నిపుణులతో చర్చించాం. మన విద్యార్థుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుంది. వారికి అండగా ఉంటుంది’ అని తెలిపారు. ఈ వ్యవహారంలో దళారులతోపాటు వందలాదిగా విద్యార్థులను నిర్బంధించిన అధికారులు మరో 600 మందికి వారంట్లు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment