fake university
-
నగదుకు నకిలీ గౌరవ డాక్టరేట్
మైసూరు: అదో పెద్ద హోటల్. సమావేశ గదిలో కోలాహలం. కొందరు స్నాతకోత్సవ గౌన్లు ధరించి.. డాక్టరేట్లు అందుకోబోతున్నామనే ఆనందంలో ఉన్నారు. ఇంతలో పోలీసులొచ్చారు. ముగ్గురిని అరెస్ట్‌చేశారు. అక్కడి నకిలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన కొందరు ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ అనే నకిలీ వర్సిటీ పేరుతో దందా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మైసూర్లో ఓ హోటల్‌పై దాడిచేశారు. ఔత్సాహికుల నుంచి భారీగా డబ్బు తీసుకుని నకిలీ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నట్లు నంబియార్, శ్రీనివాస్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆ సమయంలో హోటల్లో సుమారు 142 మందికి గౌరవ డాక్టరేట్ పట్టాలిస్తున్నారు. -
అరెస్టయిన భారతీయ విద్యార్థులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్టయిన విద్యార్థులకు ఊరట లభించింది. ఈనెల 26లోగా వారు స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు అక్కడి కోర్టు అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఆటా–తెలంగాణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ కేసులో అరెస్టయిన 16 మంది విద్యార్థులకు ఉపశమనం లభించినట్లయింది. ఫార్మింగ్టన్ నకిలీ వర్సిటీ కేసులో 20 మంది భారతీయ విద్యార్థులు అరెస్టయ్యారు. కేలహోన్ కౌంటీ జైలులో 12మంది, మన్రో కౌంటీ జైలులో 8మంది ఉన్నారు. ఈ విద్యార్థులకు అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆటా–తెలంగాణ) అండగా నిలిచింది. విద్యార్థుల తరపున వాదించేందుకు అటార్నీలను ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో మంగళవారం తుది విచారణ జరిగింది. అనంతరం.. అరెస్టయిన వీరికి స్వచ్ఛందంగా దేశం వదిలి వెళ్లేందుకు అవకాశాన్ని ఇచ్చింది. 20 మందిలో ముగ్గురు ముందుగానే.. వాలంటరీ డిపార్చర్ అనుమతితో వెళ్లిపోయారు. 17 మందిలో 15 మందికి కోర్టు తాజాగా వాలంటరీ డిపార్చర్ అవకాశం కల్పించింది. మిగిలిన ఇద్దరిలో ఒకరికి అక్కడి ప్రభుత్వం రిమూవల్ కింద వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా.. మరో విద్యార్థి అమెరికన్ సిటిజన్‌ను పెళ్లి చేసుకోవడంతో బెయిల్ బాండ్ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. ఈ 16 మంది విద్యార్థులు కోర్టు ఆదేశాలతో ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీరి తిరుగు ప్రయణానికి అవసరమైన ఏర్పాట్ల విషయంలో సహకరించాలని ఇమిగ్రేషన్ అధికారులను ఆటా ప్రతినిధులు కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. -
అమెరికాలో తెలుగు విద్యార్థులకు ఊరట
ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్టైన 16 మంది విద్యార్థులకు కోర్టులో ఊరట లభించింది. స్వచ్ఛందంగా స్వదేశాలకు ఫిబ్రవరి 20లోగా వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. 20 మందిలో ముందుగానే ముగ్గురు విద్యార్థులు(ఇద్దరు ఇండియన్స్, ఒక పాలస్తీనియన్) వాలంటరీ డిపార్చర్ అనుమతి పొందారు. మిగిలిన 17 మందిపై మంగళవారం విచారణ జరిగింది. 17 మందిలో 15 మందికి అందులో 8 మంది తెలుగు విద్యార్థులకు వాలంటరీగా స్వదేశాలకు తిరిగి వెళ్లే అవకాశాన్ని కోర్టు కల్పించింది. 16వ అమ్మాయికి కూడా తిరిగి వెళ్లిపోయే అవకాశం కల్పించింది. కానీ, స్వచ్చందంగా(వాలంటరీగా) కాకుండా యూఎస్ గవర్నమెంట్ రిమూవల్ క్రింద పంపుతున్నట్లు తెలిపింది. ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్శిటీ కేసులో అరెస్ట్ అయిన విద్యార్థుల ఫైనల్ హియరింగ్ ఫిబ్రవరి 12న జరిగింది. కేలహోన్ కౌంటీ జైలులో 12 మంది, మన్రో కౌంటీ జైలులో 8 మంది ఉన్నారు. 17వ విద్యార్థి యూఎస్ సిటిజన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అందుకు అతను కేసు వాదించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన 15 మంది విద్యార్థులు కోర్టు జడ్జిమెంట్ మేరకు వాలంటరీగా ఫిబ్రవరీ 20 లోగా యూఎస్ వదిలివెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు కూడా తిరుగు ప్రయాణానికి సిద్దమవుతున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇండియన్ ఎంబసీ అధికారులను తెలంగాణ అమెరికన్ అసోసియేషన్(ఆటా-తెలంగాణ) కోరింది. తెలంగాణ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు విద్యార్థులను స్వదేశానికి పంపే ఏర్పాట్లను ఇండియన్ ఎంబసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
భారత విద్యార్థులతో గౌరవంగా వ్యవహరించండి
వాషింగ్టన్: అమెరికాలోని ఫార్మింగ్టన్ విశ్వవిద్యాలయం వ్యవహారంలో అరెస్టయిన 129 మంది భారతీయ విద్యార్థులకు న్యాయ సహాయం అందించాలని రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు అధికారుల్ని కోరారు. వీరిపట్ల గౌరవంగా, మానవీయతతో వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు భారత సంతతి కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, థామస్ సౌజ్జి, రాబ్ వూడల్, బ్రెండా లారెన్స్ తదితరులు హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్)తో పాటు యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ)కు లేఖ రాశారు. అమెరికాలో అక్రమ మార్గాల్లో స్థిరపడేందుకు విదేశీయులకు సాయంచేస్తున్న వారిని పట్టుకోవడానికి హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు 2017లో ఫార్మింగ్టన్ అనే నకిలీ వర్సిటీని గ్రేటర్ డెట్రాయిట్ ప్రాంతంలో స్థాపించారు. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా దాదాపు 129 మంది భారతీయ విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యులు స్పందిస్తూ.. అరెస్టయిన భారతీయులకు చట్ట ప్రకారం అన్ని హక్కులు కల్పించాలనీ.. తమ న్యాయవాదిని కలుసుకునేందుకు అనుమతించాలని లేఖలో కోరారు. -
ఆ ఎనిమిది మంది డిటెన్షన్‌పై విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫార్మింగ్టన్ యూనివర్సిటీ కేసులో అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్న 8 మంది మధ్యవర్తుల విచారణ ప్రారంభమైంది. అమెరికా కాలమానం ప్రకారం మిచిగాన్ ఫెడరల్ న్యాయస్థానంలో సోమవారం విచారణ మొదలైంది. యూఎస్ పోలీసుల అదుపులో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల తరఫున వాదనలు వినిపించేందుకు గాను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అటార్నీ ఎడ్వర్డ్ బజూకా తొలిరోజు వాదనలు వినిపించారు. విచారణ పూర్తయ్యేంతవరకు ఆ ఎనిమిది మందిని ఫెడరల్ కస్టడీలోనే ఉంచాలని, వారు బెయిల్‌పై బయటకు వస్తే యూఎస్ ఐసీఈ (స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్) అధికారులు వారిని అరెస్టు చేసే అవకాశముందని బజూకా కోర్టుకు విన్నవించారు. యూఎస్ ఐసీఈ కస్టడీలో ఉంటే అది శిక్షగా పరిగణనలోకి తీసుకోరని, ఫెడరల్ కస్టడీలో ఉంటేనే శిక్షాకాలం కింద పరిగణనలోకి తీసుకుంటారని, ఈ కారణంతోనే అలా కోర్టుకు విన్నవించారని సమాచారం. అటార్నీ విన్నపాన్ని కోర్టు సానుకూలంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో అరెస్టయిన ఈ3 (డిఫెండెంట్) ఫణీంద్ర కర్ణాటికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కానీ అతను ఏ1 వీసా కలిగి ఉండటంతో యూఎస్ ఐసీఈ అదుపులోకి తీసుకోలేదని తెలుగు అసోసియేషన్లు వెల్లడించాయి. గతంలో ఈ కేసులో 156 మంది విద్యార్థులను అరెస్టు చేసిన సమయంలో సేకరించిన ఫైళ్లు, ఫోన్ కాల్ డేటా వివరాలను కూడా పరిశీలించేందుకు కోర్టుకు సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో చాలా విశ్వసనీయ విషయాలు వెల్లడవుతున్నాయని తెలుస్తోంది. తదుపరి విచారణ ఎప్పుడనేది కూడా న్యాయమూర్తి నిర్ణయం మేరకు ఉంటుందని, అది వచ్చే వారం ఉండే అవకాశముం దని సమాచారం. కాగా, ఈ ఎనిమిది మంది మధ్యవర్తుల ట్రయల్ పూర్తయిన తర్వాతే అరెస్టయిన 156 మంది విషయంలో కోర్టు విచారణ చేపట్టనుంది. త్వరగా విడుదలయ్యేలా కృషి.. ‘డిటెన్షన్ సెంటర్లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం చేస్తున్నాం. మా సంస్థ తరపున ఎడ్వర్డ్ బజూకా నేతృత్వంలోని బృందాన్ని అటార్నీగా నియమించాం. మిచిగాన్ ఫెడరల్ న్యాయస్థానంలో సోమవారం విచారణ జరిగింది. ఫణీంద్రకు బెయిల్ రావడం శుభసూచకం. వచ్చే వారం సెకండ్ ట్రయల్ ఉంటుంది. ఫణీంద్ర తరహాలోనే సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. తెలుగు విద్యార్థులకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు మా సంస్థ తరఫున అందిస్తాం..’ –వెంకట్ మంతెన, అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి అది తప్పని వారికి తెలుసు వాషింగ్టన్: నకిలీ యూనివర్సిటీలో పేరు నమోదుచేసుకుని దొరికిపోయిన 130 మంది విద్యార్థులకు తాము చేసింది తప్పని తెలుసని అమెరికా హోం శాఖ పేర్కొంది. ఎలాగైనా అమెరికాలో నివసించాలనే వారు ఈ అక్రమానికి పాల్పడ్డారని తెలిపింది. ఫార్మింగ్టన్ వర్సిటీ కార్యకలాపాలపై విద్యార్థులకు ఎలాంటి అవగాహన లేదని, అందుకే వారు ఈ ఉచ్చులో చిక్కుకున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో అమెరికా హోం శాఖ ప్రకటన భిన్నంగా రావడం గమనార్హం. ‘ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో తరగతులు, ఉపాధ్యాయులు లేరన్న సంగతి ఆ విద్యార్థులకు తెలుసు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండేందుకు అక్రమాలకు పాల్పడుతున్న సంగతి వారికి తెలుసు’హోం శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఫార్మింగ్టన్ వర్సిటీ బాధితుల్లో ఎక్కువ మంది తెలుగువారు ఉండటం పట్ల నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) విచారం వ్యక్తం చేసింది. 117 మందికి సాయం.. ఫార్మింగ్టన్ వర్సిటీ కేసులో అరెస్టయిన 129 మంది భారత విద్యార్థుల్లో 117 మందికి దౌత్య, న్యాయపర సాయం చేసేందుకు అనుమతి లభించిందని విదేశాంగ శాఖ వెల్లడించింది. విద్యార్థుల నిర్బంధం పై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, సమస్య పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. అమెరికా వ్యాప్తంగా 36 జైళ్లను సందర్శించి 117 మంది విద్యార్థులకు దౌత్యసాయం చేసేందుకు అనుమతులు సంపాదించామని, మిగిలిన 12 మంది కూడా సాయం చేసేందుకు ప్రయత్నాలు కొన సాగుతున్నాయని చెప్పింది. -
ఫేక్ యూనివర్సిటీ కేసు: మిషిగన్ ఫెడరల్ కోర్టులో ట్రయిల్
-
ఫార్మింగ్టన్ యూనివర్సీటి కేసు.. కొనసాగుతున్న విచారణ
సాక్షి, హైదరాబాద్: ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోందని తెలుగు విద్యార్థుల తరుపున వాదిస్తున్న న్యాయవ్యాది ఎడ్వర్డ్ బజూకా తెలిపారు. అమెరికన్ తెలంగాణ అసోసియేషన్(ఆటా-ATA) రమేష్ మంథన న్యాయవ్యాదిని కలిసి కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో చిక్కుకున్న ఎనిమిది మంది తెలుగు విద్యార్థుల తరపున వాదించేందుకు ఆటా ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 130మంది విద్యార్థులు అరెస్టవ్వగా.. అందులో అధికంగా భారతీయులే ఉండటం విశేషం. వీరిలో 30మందిని ఇప్పటికే ఇండియాకు రప్పించారు. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన ఫణి దిప్ కర్నాటికి బెయిల్ మంజూరు చేశారు. -
విద్యార్థుల కోసం తెలుగు సంఘాల కృషి
వాషింగ్టన్ : మిచిగాన్‌లోని ‘ఫర్మింగ్టన్’ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో బాధితులుగా మారిన భారత విద్యార్థులను బయటకు తెచ్చేందుకు భారత కాన్సులెట్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) వెల్లడించింది. అమెరికాలోని తెలుగు అసోషియేషన్ల సాయంతో విద్యార్థుల వివరాలును తీసుకుని అధికారులు వారిని కలిసారని పేర్కొంది. వారు ఇబ్బంది పడకుండా అందరిని ఒక దగ్గరికి చేరేలా చర్యలు తీసుకుందని తెలిపింది. గత శనివారం అమెరికాలోని పలు తెలుగు అసోసియేషన్లు భారత రాయబార కార్యాలయ అధికారి హర్షవర్దన్ ష్రింగ్లాను కలిసాయి. ఈ వివాదం నుంచి విద్యార్థులను రక్షించాలని కోరాయి. డిటెన్షన్‌కు గురైన విద్యార్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. డిటెన్షన్‌కు గురైన 139 మంది భారత విద్యార్థుల్లో భారత ఎంబసీ అధికారులు ఇప్పటికే 90 మందిని కలిసారు. ఇందులో 60 మందిని డిటెన్షన్ సెంటర్ల నుంచి విడుదల కూడా చేయించారు. విద్యార్ధుల తరపున ఎంబసీ న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. -
30 మంది తెలుగు విద్యార్థులకు విముక్తి
సాక్షి, హైదరాబాద్: ఫర్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగురాష్ట్రాల విద్యార్థులలో 30 మందికి విడుదల లభించింది. ఆదివారం ఆ విద్యార్ధులు అమెరికానుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అమెరికా తెలుగు సంఘాల నాయకుడు నవీన్ జలగం మీడియాకు తెలిపారు. ఆయన సాక్షితో మాట్లాడుతూ.. నకిలీ వీసాల కేసులో అమాయక విద్యార్ధులు ఇరుక్కుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా జైళ్లనుంచి విద్యార్ధులను విడుదల చేయించేందుకు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు న్యాయ సహాయం చేస్తున్నాయని తెలిపారు. తన ఫేస్ బుక్ ఐడీకి స్టూడెంట్స్ వివరాలు పంపమని సాక్షితో ఆయన కోరారు. విద్యార్ధుల తల్లిదండ్రులు కంగారుపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే మిగిలిన విద్యార్ధులు ఇండియాకు చేరకుంటారని చెప్పారు. ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. కాగా ఈ కేసులో మొత్తం 130మంది విద్యార్ధులు అరెస్టవ్వగా వారిలో అధికులు భారతీయులు కావటం గమనార్హం. -
‘ఫార్మింగ్టన్’ బాధితులను ఆదుకుంటాం
వాషింగ్టన్: ఫార్మింగ్టన్ యూనివర్సిటీ ఉచ్చులో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్ శ్రింగ్లా భరోసా ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మిషిగాన్‌లోని ఫార్మింగ్టన్ యూనివర్సిటీ విషయంలో ఇంతమంది భారతీయ విద్యార్థులను నిర్బంధించడం బాధాకరమైన విషయం. వివిధ ప్రాంతాల్లో ఉన్న మా అధికారులు విద్యార్థులతో మాట్లాడారు. అందరూ క్షేమంగానే ఉన్నారు. వారికి న్యాయపరమైన సాయం అందజేసేందుకు గల మార్గాలపై నిపుణులతో చర్చించాం. మన విద్యార్థుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుంది. వారికి అండగా ఉంటుంది’ అని తెలిపారు. ఈ వ్యవహారంలో దళారులతోపాటు వందలాదిగా విద్యార్థులను నిర్బంధించిన అధికారులు మరో 600 మందికి వారంట్లు జారీ చేశారు. -
‘ఫర్మింగ్టన్’లో నమోదై ఉంటే.. వివరాలివ్వండి
చికాగో : మిచిగాన్‌లోని ‘ఫర్మింగ్టన్’ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో బాధితులుగా మారిన భారత విద్యార్థులను బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అమెరికన్ తెలుగు అసోషియేషన్ వెల్లడించింది. ఈ ఉదంతంలో అరెస్టయిన విద్యార్థుల వివరాల కోసం భారత ఎంబసీ అధికారులు వాషింగ్టన్ డీసీ, అట్లాంటాలోని ఆటా సాయం తీసుకున్నారని తెలిపారు. ఆటా నాయకుల సహకారంతో బాధిత విద్యార్థులు, వారి స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్లను సంప్రదిస్తున్నారని.. అరెస్టయిన వారి వివరాలను తెలుసుకుంటున్నారని అన్నారు. ఒకవేళ విద్యార్థులు ఫర్మింగ్టన్ యూనివర్సిటీలో నమోదై ఉండి.. వారి ఆచూకీ తెలియక పోయినా లేదా ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో వారు అరెస్టయ్యారా లేదా అనే విషయం వెల్లడికాకపోయినా.. విద్యార్థుల పూర్తి వివరాలు ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్ ద్వారా ఎంబసీ అధికారులకు పంపొచ్చని పేర్కొన్నారు. (130 మంది విద్యార్థుల అరెస్టు) మీవారి వివరాలతో ఈ అడ్రస్‌కు మెయిల్ చేయొచ్చు.. Hoc.atlanta@mea.gov.in Com.atlanta@mea.gov.in fsitou.washington@mea.gov.in మెయిల్ చేసే సమయంలో.. సబ్జెక్ట్ అనే చోట "Farmington" అని తప్పక రాయాలని సూచించారు. విద్యార్థుల వివరాలిలా.. First Name : Last Name : Address or city of residence (if known) : Date arrested(if known and arrested) : Detention location (If Known) : Your contact Phone no : Your email address : Student's contact phone no : Student's email address : పై విధంగా మెయిల్ చేయడం ద్వారా మీ విద్యార్థుల వివరాలు ఎంబసీ అధికారులు నమోదు చేసుకుని తగు చర్యలు చేపట్టే వీలుంటుంది. https://tinyurl.com/DetainedIndianStudents లింక్ ద్వారా కూడా విద్యార్థుల వివరాలు అందివ్వొచ్చని ఆటా నాయకులు తెలిపారు. -
విద్యార్థుల వివరాలకు హాట్‌లైన్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అమెరికాలో వీసా మోసం కేసులో అరెస్టయిన 129 మంది భారతీయ విద్యార్థులను విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయాలు కృషి చేస్తున్నాయి. అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలు అందించేందుకు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో హాట్లైన్లను ఏర్పాటు చేశారు. +12023221190, +12023402590 నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా అరెస్టయిన విద్యార్థులకు సంబంధించిన వివరాలను వారి బంధువులు, స్నేహితులు తెలుసుకోవచ్చని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నంబర్లు 24x7 పనిచేస్తాయనీ, cons3. washington@mea.gov.in కు ఈ–మెయిల్ పంపడం ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. విద్యార్థి వీసాలను దుర్వినియోగం చేస్తున్న విదేశీయులను పట్టుకునేందుకు అమెరికా అధికారులే ఫార్మింగ్టన్ యూనివర్సిటీ పేరుతో నకిలీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి వల పన్నడం తెలిసిందే. ఈ యూనివర్సిటీలో 600 మంది విద్యార్థులుగా చేరారు. వారిని చేర్పించిన 8 మంది మధ్యవర్తులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ యూనివర్సిటీలో తరగతులుండవు, నిబంధనల ప్రకారం ఈ విశ్వవిద్యాలయం పనిచేయదని తెలిసినా కేవలం అమెరికాలో ఉండి, ఇతర ఉద్యోగాలు చేసుకోవడం కోసమే ఆ 600 మంది ఇక్కడ చేరారని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయం వారికి తెలియదనీ, చాలా యూనివర్సిటీ కోర్సుల్లో చదువుతున్న సమయంలోనే ఉద్యోగాలు చేసుకునే వీలు కూడా ఉంది కాబట్టి ఇది కూడా అసలైనదేనని విద్యార్థులు భావించారని అరెస్టయిన వారి తరఫు న్యాయవాదులు అంటున్నారు. రాజకీయ చర్య తీసుకున్న భారత్ విద్యార్థులు అరెస్టవ్వడంపై భారత్ శనివారం రాజకీయపరమైన చర్య తీసుకుంది. అరెస్టయిన విద్యార్థులను కలిసేందుకు భారత దౌత్యాధికారులను తక్షణం అనుమతించాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయాన్ని కోరింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామనీ, చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే కొందరు దౌత్యాధికారులు అరెస్టయిన విద్యార్థులను కలుసుకున్నారని చెప్పింది. అరెస్టయిన వారందరినీ విడుదల చేయాలనీ, వారికి ఇష్టం లేకుండానే అమెరికా నుంచి పంపించి వేయద్దని భారత్ కోరింది. ఎక్కడికీ వెళ్లకుండా ప్రత్యేక పరికరాలు ఈ యూనివర్సిటీలో చేరిన 130 మందిని (వారిలో 129 మంది భారతీయులు) ఇప్పటికే అరెస్టు చేసిన అధికారులు, మరింత మందిని త్వరలో పట్టుకునే చాన్సుంది. కాగా, కొంతమంది విద్యార్థులు వారు నివసిస్తున్న ప్రదేశం నుంచి ఎక్కువ దూరం బయటకు వెళ్లడానికి వీలు లేకుండా వారి కాలి చీలమండ దగ్గర ట్రాకింగ్ పరికరాలను అమర్చారు. -
బాధిత విద్యార్థులకు ‘నాటా’ న్యాయసహాయం
న్యూజెర్సీ : ఫర్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగు విద్యార్థులకు సాయం చేసేందుకు నార్త్ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (నాటా) ముందుకొచ్చింది. ఫర్మింగ్టన్ యూనివర్సిటీ ఫేక్ అని తెలియక చాలా మంది విద్యార్థులు మోసపోయారని నాటా ప్రెసిడెంట్ డాక్టర్ గోసల రాఘవ రెడ్డి, కార్యదర్శి ఆళ్ళ రామిరెడ్డి అన్నారు. బాధితుల్లో ఎక్కువమంది తెలుగు విద్యార్థులే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (130 మంది విద్యార్థుల అరెస్టు) అరెస్టయిన వారిలో చాలామంది తమ వర్క్ పర్మిట్ పొందడానికి ఈ యూనివర్సిటీలో చేరానని వెల్లడించారు. బాధిత విద్యార్థులు నాటాకు ఫోన్ చేసి పరిస్థితి వివరించారని తెలిపారు. విద్యార్థులకు ఉచిత న్యాయసహాయం అందిస్తామని నాటా నాయకులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇమ్మిగ్రేషన్ లాయర్లు విజయ్ ఎల్లారెడ్డిగారి, సంతోష్‌రెడ్డి సోమిరెడ్డి, యాయా తిబిట్ బాధిత విద్యార్థులతో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి, వలసదారుల హక్కులేమిటో తెలిపారని, మళ్లీ ఇలాంటి ఘటనల్లో బాధితులు కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారని తెలిపారు. తల్లిదండ్రులు భయపడొద్దు.. అరెస్టయిన విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదని నాటా నాయకులు తెలిపారు. విచారరణ పూర్తయిన అనంతరం విద్యార్థుల భారత్‌కు పంపుతారని వెల్లడించారు. హోమ్ ల్యాండ్ సెక్యురిటీ శాఖ నిర్బంధంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని భరోసానిచ్చారు. వివరాలు తెలుసుకోవాలంటే.. అరెస్టయిన వారి వివరాలు తెలుసుకోవాలంటే https://locator.ice.gov వెబ్సైట్లో లేదా ఇండియన్ ఎంబసీ వారికి {(202) 322-1190, (202) 340-2590} ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. వివరాలకోసం.. cons3.washington@mea.gov.in కి ఈమెయిల్ చేయవచ్చని తెలిపారు. కష్టపడి చదివిన విద్యార్థులా ఫేక్ యూనివర్సిటీల ఉచ్చులో పడకుండా.. అన్ని రూల్స్ పాటించి ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి OPT/CPT పొందడం కోసం కృషి చేయాలని సలహా ఇచ్చారు. ఎటువంటి కోర్లులు లేకుండా ఏ యూనివర్సిటీ అయినా CPT అందించినట్టయితే అలాంటి వర్సిటీలను నమొద్దని హెచ్చరించారు. 129 మంది భారతీయులే.. అమెరికాలో విద్యార్థి వీసాలపై అక్రమంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులను పట్టుకునేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) అధికారులు పార్మింగ్టన్ పేరుతో నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ వలలో చిక్కిన 8 మంది మధ్యవర్తులు (అందరూ తెలుగు వారే) ఇప్పటికే అరెస్టవ్వగా, తాజాగా 130 మంది విద్యార్థులు కూడా అరెస్టయ్యారు. 8 మందిపై వీసా సంబంధిత నేరపూరిత కుట్ర, లాభం కోసం అన్యులకు ఆశ్రయమివ్వడం తదితర అభియోగాలను నమోదు చేసిన అధికారులు, విద్యార్థులపై మాత్రం కేవలం పౌర వలస నిబంధనల ఉల్లంఘన అభియోగంతో సరిపెట్టారు. అరెస్టైన 130 మంది విద్యార్థుల్లో 129 మంది భారతీయులేనని ఐసీఈ అధికార ప్రతినిధి ఖాలిద్ వాల్స్ చెప్పారు. వారిని భారత్‌కు తిరిగి పంపించేయనున్నామన్నారు. -
130 మంది విద్యార్థుల అరెస్టు
వాషింగ్టన్: అమెరికా వీసా మోసం కేసులో 130 మంది విద్యార్థులు అరెస్టయ్యారు. వీరిలో అత్యధికులు భారతీయులే. అధికారులు వల పన్ని ఏర్పాటు చేసిన ఫార్మింగ్టన్ యూనివర్సిటీ నకిలీదని తెలిసినప్పటికీ అమెరికాలో ఉండి అక్రమంగా ఉద్యోగాలు చేసుకునేందుకే ఈ విద్యార్థులంతా ఆ విశ్వవిద్యాలయంలో చేరారని వలస విభాగం అధికారులు ఆరోపణలు నమోదు చేశారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయమే వీరందరినీ అరెస్టు చేశారు. మరికొంత మంది కూడా అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అయితే ఫార్మింగ్టన్ యూనివర్సిటీ చట్టబద్ధమైన రీతిలో పనిచేయడం లేదనే విషయం విద్యార్థులకు తెలియదనీ, చాలా కోర్సులు/యూనివర్సిటీల్లో చదువుతోపాటే ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఇది కూడా నిజమైన యూనివర్సిటీనే అని ఆ విద్యార్థులు భావించారని వారి తరఫు న్యాయవాదులు అంటున్నారు. అధికారులే ఇబ్బందికర పద్ధతుల ద్వారా, వల విసిరి విద్యార్థులను పట్టుకున్నారని లాయర్లు ఆరోపించారు. అమెరికాలో విద్యార్థి వీసాలపై అక్రమంగా ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులను పట్టుకునేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) అధికారులు పార్మింగ్టన్ పేరుతో నకిలీ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ వలలో చిక్కిన 8 మంది మధ్యవర్తులు (అందరూ తెలుగు వారే) ఇప్పటికే అరెస్టవ్వగా, తాజాగా 130 మంది విద్యార్థులు కూడా అరెస్టయ్యారు. 8 మందిపై వీసా సంబంధిత నేరపూరిత కుట్ర, లాభం కోసం అన్యులకు ఆశ్రయమివ్వడం తదితర అభియోగాలను నమోదు చేసిన అధికారులు, విద్యార్థులపై మాత్రం కేవలం పౌర వలస నిబంధనల ఉల్లంఘన అభియోగంతో సరిపెట్టారు. అరెస్టైన 130 మంది విద్యార్థుల్లో 129 మంది భారతీయులేనని ఐసీఈ అధికార ప్రతినిధి ఖాలిద్ వాల్స్ చెప్పారు. వారిని భారత్‌కు తిరిగి పంపించేయనున్నామన్నారు. వారికేం తెలియదు: న్యాయవాదులు ఫార్మింగ్టన్ వర్సిటీలో తరగతులు జరగవు, సిబ్బంది ఉండరనే విషయం అందులో చేరిన విద్యార్థులకు ముందే తెలుసుననీ, కేవలం అమెరికాలో ఉండి ఉద్యోగాలు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే వారు ఆ యూనివర్సిటీలో చేరారని దర్యాప్తు అధికారులు అంటున్నారు. కానీ ఇలా చదువుతున్నప్పుడే ఉద్యోగాలు చేయడం మామూలే కాబట్టి విద్యార్థులు ఇది కూడా అలాంటిదే అనుకున్నారనీ, ఇందులో వారి తప్పేమీ లేదని విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. మైకేల్ సోఫో అనే న్యాయవాది మాట్లాడుతూ ‘కోర్సులో చేరిన తొలి రోజు నుంచే ప్రయోగాత్మక శిక్షణను ప్రారంభించి, మిగిలిన సమయంలో ఉద్యోగాలు చేసుకునే వర్సిటీలున్నాయి. యూనివర్సిటీకి రాకుండా ఎంతో దూరంలో ఉండి, ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ఆ కోర్సులు చేయొ చ్చు. ఇది కూడా అలాంటిదేనని వారు భావించారు’ అని చెప్పారు. రవి మన్నం అనే మరో న్యాయవాది మాట్లాడుతూ ప్రభుత్వమే అభ్యంతరకర, ఇబ్బందికరమైన పద్ధతుల్లో విదేశీ విద్యార్థులను చేర్చుకుందన్నారు. వారికి అక్కడి రాయబార కార్యాలయం, భారత సంఘాలు సాయం అందించే ప్రయత్నాలను ప్రారంభించాయి. -
అమెరికా పోలీసుల వలలో భారత విద్యార్థులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వీసా గడువు ముగిసినా అక్రమంగా నివాసం ఉంటున్న వారికోసం అమెరికా అధికారులు పన్నిన వలలో దాదాపు 600 మంది విదేశీ విద్యార్థులు చిక్కుకున్నారు. అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సృష్టించిన ఫేక్ వర్సిటీ వలలో చిక్కుకున్న వారిలో ఎక్కువమంది భారతీయులే కాగా.. అందులో సగం తెలుగువారేనని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. న్యూజెర్సీలో 2015లో మూతపడ్డ ఫార్మింగ్టన్ వర్సిటీ పేరిట డీహెచ్ఎస్ కోర్సులు ఆఫర్ చేసింది. విద్యార్థులను చేర్పించిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థి వీసా గడువు ముగిసిన, ముగిసే దశలో ఉన్న దాదాపు 600 మంది విద్యార్థులు డీహెచ్ఎస్ వలలో పడ్డారు. ప్రోత్సాహకాలు ఆశించి పట్టుబడ్డ జాబితాలో ఎనిమిది మంది తెలుగు యువకులు ఉండటంతో వీరిని ఫెడరల్ పోలీసులు అరెస్టు చేశారు. గుట్టు రట్టయిందిలా!: నకిలీ యూనివర్సిటీల్లో చేరి అమెరికాలో నివాసం ఉండటం కొత్త కాదు. గతంలో చాలాసార్లు ఇలాంటి ఘటనలు బయటపడ్డాయి. అయితే ఈ మధ్య కాలంలో అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. విదేశీ విద్యార్థుల గుట్టు రట్టు చేయడానికి డీహెచ్ఎస్ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. అక్రమంగా నివా సం ఉంటున్న వారిని తేలిగ్గా పట్టుకునేందుకు వర్సిటీ వ్యూహాన్ని అమలుచేసింది. ఇందులో భాగంగా 2017 ఫిబ్రవరిలో మిషిగన్ రాష్ట్రంలో యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటనలు ఇచ్చింది. వాషింగ్టన్ పోస్టు కథ నం ప్రకారం.. ఈ యూనివర్సిటీలో 800 మంది విద్యార్థులు చేరారు. అయితే వీరిలో 200 మంది విద్యార్థి వీసా గడువు ముగిసేందుకు.. రెండేళ్లు మిగిలుండగానే చేరారు. దీంతో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వదిలివేశారు. మిగిలిన వారిలో అత్యధికులు వీసా గడువు ముగిసినవారో.. లేక 6నెలల్లో వీసా ముగిసేవారో ఉన్నారు. వీరిలోనూ ఎక్కువమంది భారతీయులే. విద్యార్థి వీసా స్టేటస్ తెలుసుకోకుండా ఎక్కువమంది విద్యార్థులను చేర్పించిన భారత సంతతికి చెందిన ఎనిమిది మంది దళారులను అరెస్టు చేశారు. వారిలో అశ్వంత్ నూనె అనే వ్యక్తి ఫీజుల్లో ఏకంగా 25వేల డాలర్లు అధికంగా వసూలు చేసినట్టు డీహెచ్ఎస్ పేర్కొంది. ఈ ఉత్తుత్తి యూనివర్సిటీలో తరగతులు జరగవు. ఆన్లైన్ తరగతులు అసలే లేవు. కానీ డబ్బులు చెల్లించినందుకు స్టూడెంట్ వీసా గడువు పెంచుతారు. దీనికారణంగా వారు అమెరికాలో నివాసం ఉండడానికి, ఉద్యోగాలు వెతుక్కోవడానికి వీలు కలుగుతుంది. అరెస్టు అయిన వాళ్లు వీరే.. భరత్ కాకిరెడ్డి (ఫ్లోరిడా), సురేష్ కందాళ (వర్జీనియా), ఫణిదీప్ కర్నాటి (కెంటకీ), ప్రేమ్ రామ్పీసా (ఉత్తర కరోలినా), సంతోష్‌రెడ్డి సామ (కాలిఫోర్నియా), అవినాశ్ తక్కెళ్లపల్లి (పెన్సిల్వేనియా), అశ్వంత్ నూనె (జార్జియా), నవీన్ ప్రత్తిపాటి (టెక్సాస్), (న్యూయార్క్ టైమ్స్ కథనం మేరకు) గడువు ఐదేళ్లు దాటితే.. మామూలుగా అమెరికాలో మాస్టర్స్ కోసం వెళ్లే విద్యార్థులకు ఐదేళ్ల వీసా ఇస్తారు. రెండు మూడేళ్లపాటు చదువుకుని, ఆ తర్వాత రెండు మూడేళ్లపాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) పేరుతో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) ఇస్తారు. ఈఏడీ అమల్లో ఉన్న రెండు, మూడేళ్లలో హెచ్1బీ వీసాకు మారాలి. లేనిపక్షంలో వీసా గడువు పెంచుకునేందుకు వెంటనే ఏదో ఒక గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మరో కోర్సులో చేరాలి. అలా చేరకుండా అక్కడే ఉంటే వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. ఇలాంటి వారు అమెరికాలో వేలల్లో ఉన్నట్లు వెల్లడైంది. వీసా క్రిమినల్ అభియోగాల కింద అరెస్టయిన వారిని అయితే భారత్‌కు తిరిగి పంపించేస్తారు. అభియోగాలు రుజువైతే ఐదేళ్ల జైలు శిక్ష తప్పకపోవచ్చు. చిరునామాలు ఇచ్చి దొరికిపోయిన విద్యార్థులు విశ్వవిద్యాలయంలో చేరడానికి విద్యార్థులు తమ చిరునామాలు సమర్పించారు. దీంతో వీరెక్కడున్నారో పట్టుకుని అరెస్టు చేయడం పోలీసులకు సులువైంది. రెండ్రోజుల క్రితం హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (డీహెచ్ఎస్), ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) అధికారులు సంయుక్తంగా ఫ్లోరిడా, డెట్రాయిట్, వర్జీనియాలో నివాసం ఉంటున్న విద్యార్థుల ఇళ్లపై దాడులు చేశారు. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ల పేరేమిటి? తరగతులు జరుగుతున్నాయా? లేదా ఆన్లైన్ క్లాస్‌లకు హాజరవుతున్నారా? ఉంటే వాటి వివరాలు ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ ప్రశ్నలకు విద్యార్థులు బిక్కమొహం వెయ్యాల్సి వచ్చింది. తాము ఇప్పటివరకు వర్సిటీకి వెళ్లలేదని.. మధ్యవర్తులు ఇచ్చిన సమాచారంతో అందులో చేరామని విద్యార్థులు చెప్పారు. దీంతో డీహెచ్ఎస్ దళారులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుంది. కేవలం స్టూడెంట్ వీసా గడువు పొడిగించుకుని అమెరికాలో ఉండేలా చేస్తున్నందుకు.. ఒక్కో విద్యార్థి నుంచి 10–15 వేల డాలర్ల మేర దళారులకు చెల్లించినట్లు డీహెచ్ఎస్ వెల్లడించింది. మామూలుగా అయితే నిర్ణీత గడువులో హెచ్1బీ రాని విద్యార్థులు మళ్లీ కొత్త కోర్సుల్లో చేరడం, వీసా గడువు పెంచుకోవడం సాధారణమైన విషయం. అయితే, ఉద్యోగాలు లేక, ఫీజులు చెల్లించే స్థోమత లేక అనేక మంది ఏదో ఒక పని చేస్తూ అక్రమంగా అమెరికాలో ఉంటున్నారు. అలాంటి విద్యార్థుల్లో భారతీయులు అందులోనూ తెలుగువారే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఫిబ్రవరి 5లోపే వచ్చేస్తే..! విద్యార్థి వీసా గడువు దాటినా అక్రమంగా అమెరికాలో ఉంటున్న వారు.. వీలైనంత త్వరగా స్వదేశానికి వెడితే మంచిదని అమెరికా తెలుగు సంఘాలు సూచిస్తున్నాయి. అక్రమంగా ఉంటున్నవారు అటార్నీ (న్యాయవాది) సాయంతో తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించాలని.. ఆర్నెల్లకంటే తక్కువ గడువు ఉన్నవారు వెంటనే వెళ్లడం మంచిదంటున్నాయి. ‘అరెస్టు అయిన వారికి మేము న్యాయపరమైన సాయం అందిస్తాం. అరెస్టు కాని వారు, వీసా గడువు ముగిసిన వారు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలి’అని తెలంగాణ తెలుగు సంఘాల ప్రతినిధి జలగం నవీన్ అన్నారు. ‘నకిలీ పత్రాలతో అమెరికాలో నివాసం ఉంటున్న విదేశీ విద్యార్థుల్ని తిరిగి వారి దేశాలకు పంపించేందుకు గత కొన్నేళ్లుగా ఇమిగ్రేషన్ అధికారులు రహస్య ఆపరేషన్లు చేపడుతున్నారు. ఈ విషయాన్ని అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంది. యూనివర్సిటీ వివరాలు సరిగా తెలుసుకోకుండా సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉండే ప్రయత్నం చేయవద్దంటూ అమెరికాకు వచ్చే విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్నాం’అని ఆటా అధ్యక్షుడు పరమేశ్ భీమ్‌రెడ్డి వెల్లడించారు. అమెరికాలో భారత రాయబారి హర్షవర్ధన్ సింగ్లాను కూడా ఆటా ప్రతినిధులు కలుసుకున్నారు. అరెస్ట్ వారెంట్లు జారీ అయిన విద్యార్థులకు అందించాల్సిన సాయంపై చర్చలు జరుపుతున్నారు. 2016లోనూ ఇదే తరహా స్కామ్ మూడేళ్ల క్రితం కూడా అమెరికాలో ఇలాంటి వీసా కుంభకోణం బట్టబయలైంది. న్యూజెర్సీ యూనివర్సీటీలో స్టింగ్ ఆపరేషన్ చేసిన అధికారులు 11 మంది భారతీయ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. 11 మంది చైనా విద్యార్థులు కూడా ఈ స్కామ్‌లో పట్టుబట్టారు. అంతకు ముందు 2011, 2012 సంవత్సరాల్లో కూడా కాలిఫోర్నియాలో ట్రైవ్యాలీ యూనివర్సిటీ, హెర్గాన్ యూనివర్సిటీలో కూడా ఇలాగే నకిలీ పత్రాలతో నివసిస్తున్న విద్యార్థుల్ని గుర్తించి.. స్వదేశాలకు పంపించారు. అయితే అప్పట్లో విద్యార్థులు నకిలీ యూనివర్సిటీ అని తెలియక మోసపోతే, ఇప్పుడు మాత్రం తెలిసి తెలిసి ఈ స్కామ్‌లో భాగస్వామ్యులయ్యారని ఆటా అధ్యక్షుడు భీమ్‌రెడ్డి పేర్కొన్నారు. -
మనోళ్లను ఆదుకునేందుకు రంగంలోకి ‘ఆటా’
న్యూజెర్సీ : ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఆటా (అమెరికన్ తెలుగు అసోషియేషన్) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇప్పటివరకు 600 మందికి వారెంట్లు జారీ చేయగా.. 100 మందిని అరెస్టు చేశారు. నకిలీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న మరో 8 మందిని కూడా అరెస్టు చేశారు. కాగా, ఆటా లీగల్ టీమ్ సంబంధిత అటార్నీలను సంప్రదించింది. యూఎస్‌లోని పలు భారతీయ విద్యార్థి సంఘాలతో సమావేశమైంది. ఫర్మింగ్టన్ యూనివర్సిటీ ఘటనలో చిక్కుకున్న బాధిత తెలుగు విద్యార్థులను బయటకు తెచ్చేందుకు ఇండియన్ అంబాసిడర్ హర్షవర్ధన్ సింఘాల, ఇండియన్ కాన్సులేట్ జనరల్ డాక్టర్ స్వాతి విజయ్ కులకర్ణిలను ఆటా లీగల్ టీమ్ సభ్యులు కలిశారు. తదుపరి చేపట్టబోయే చర్యలపై వారితో చర్చించారు. ఇండియన్ ఎంబసీకి అవసరమైన అన్ని సహాయసహకారాలు అందిస్తామని ఆటా ప్రెసిడెంట్ పరమేష్ భీమ్‌రెడ్డి తెలిపారు. (అమెరికాలో పట్టుబడ్డ 200 మంది తెలుగువారు) ఇమ్మిగ్రేషన్ అటార్నీలు రవికుమార్ మన్నం, మైఖేల్ సోఫో, హేమంత్ రామచెంద్రన్ ఆధ్వర్యంలో గురువారం (జనవరి 31) ఆటా వెబినార్ (ఇమ్మిగ్రేషన్ సెమినార్) సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. ఫేక్ ఏజెంట్ల చేతుల్లో మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఈ సదస్సులో సలహాలు, సూచనలు ఇస్తామన్నారు. నకిలీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొంది ఇబ్బందులలకు గురికావద్దని అన్నారు. అమెరికా చట్టాల ఉల్లంఘించి కటకటాలపాలు కాకుండా పాటించాల్సిన మార్గదర్శకాలను అటార్నీలు సదస్సులో చెప్తారని తెలిపారు. -
అమెరికాలో బయటపడ్డ ఫేక్ యూనివర్సిటీ
-
అమెరికాలో పట్టుబడ్డ 200 మంది తెలుగువారు!
వాషింగ్టన్: అమెరికాలో అక్రమ వలసదారుల అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. అక్రమ వలసదారుల గుట్టును రాబట్టేందుకు మిచిగన్ రాష్ట్రంలో ఒక ఫేక్ యూనివర్సిటీని సృష్టించి.. సరైన ధ్రువపత్రాలు లేని 600 మంది విదేశీయులను అమెరికాకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అదుపులోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో పట్టుబడ్డవారిలో దాదాపు 200 మంది తెలుగు వారు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సరైన ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాలోకి విదేశీ విద్యార్థులను తీసుకువచ్చారనే అభియోగాలతో ఎనిమిది మందిని అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం డెట్రాయిట్ పోలీస్‌స్టేషన్‌లో ఉన్న వీరిలో భరత్ కాకిరెడ్డి (29) (ఫ్లోరిడా), అశ్వంత్ నూనె (26) (అట్లాంటా), సురేష్‌రెడ్డి కందాల (31) (వర్జినియా), ఫణిదీప్ కర్నాటి (35) (కెంటకీ), ప్రేమ్‌కుమార్ రామ్పీసా (26) (నార్త్ కరోలినా), సంతోష్‌రెడ్డి సామ, (28) (కాలిఫోర్నియా), అవినాష్ తక్కళ్లపల్లి (28) (పెన్సిల్వేనియా), నవీన్ పత్తిపాటి (29) (డల్లాస్) తదితరులు ఉన్నారు. మరో 14మంది తెలుగు విద్యార్థులను కూడా అరెస్టు చేశారని, వీరిలో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని తెలుస్తోంది. (పలువురు భారతీయ విద్యార్థుల అరెస్ట్) అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకే 2015లో డీహెచ్ఎస్.. మిచిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్లో యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్ పేరిట ఒక ఫేక్ వర్సిటీని ఏర్పాటు చేసింది. ఈ వర్సిటీలో యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) అధికారులు మారుపేర్లతో అధికారులుగా రంగంలోకి దిగి.. అక్రమ వలసదారులకు అడ్మిషన్ పేరిట గాలం వేశారు. ఉన్నత విద్య పేరిట నకిలీ పత్రాలతో అమెరికాలోకి ప్రవేశించి.. అక్రమంగా నివసిస్తున్న వారిని టార్గెట్ చేసుకొని వారు ఆపరేషన్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్టన్‌లో విద్యార్థుల పేరిట నమోదైన అక్రమ వలసదారుల గుట్టు బట్టబయలైంది. అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి హెచ్ 1బీ వీసా కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు కూడా ఉండడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్ అధికారుల విచారణలో.. నకిలీ మాస్టర్స్ డిగ్రీలతో కొందరు ఉద్యోగాలు కూడా చేస్తున్నట్టు వెల్లడైంది. -
దేశ వ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు
-
వీసా కేసులో ఇద్దరు భారతీయులకు శిక్ష
వాషింగ్టన్: ఐటీ నిపుణులకు ఉద్దేశించిన హెచ్1బీ వీసాల మోసం కేసులో ఇద్దరు భారతీయ సోదరులకు అమెరికా కోర్టు ఏడేళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. చీఫ్ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి బార్బరా లిన్.. అతుల్ నందా, జితెన్ నందాలకు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు. తమ కంపెనీలో ఐటీ నిపుణుల అవసరం ఉందని పేర్కొంటూ నందా సోదరులు కొందరు భారతీయులకు హెచ్1బీ వీసాలు ఇప్పించారు. నిజానికి సదరు ఉద్యోగాలు వీరి కంపెనీ డిబన్ సొల్యూషన్స్‌లో లేవని తెలిసినా, వీసాలకు అనుమతించారు. దీంతో అమెరికా వచ్చిన భారతీయులకు ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించి కమీషన్ తీసుకున్నారు. డిబన్ నుంచి వీసాలు పొందిన శివ సుగవనమ్, వివేక్ శర్మ, రోహిత్ మెహ్రాలు కూడా నేరాన్ని అంగీకరించడంతో నెల చొప్పున శిక్ష పడింది. -
ఇండియన్ స్టూడెంట్స్పై చర్యలు
వాషింగ్టన్: అనుకున్నది జరగబోతోంది. స్టూడెంట్ వీసాలపై వచ్చి అమెరికాలోనే స్థిరపడిపోవాలనే ఉద్దేశంతో ఒక అక్రమ సంస్థతో చేతులు కలిపిన భారతీయ విద్యార్థులపై తాము చర్యలు తీసుకుంటామని ఆ దేశ అధికారులు చెప్పారు. 306మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్రమాలకు పాల్పడ్డారని, వీరిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ తెలిపారు. కొందరు బ్రోకర్లు, అమెరికాకు చెందిన హోమ్ లాండ్ సెక్యూరిటీ సంస్థలోని ఇంకొందరు వ్యక్తులు కుమ్మక్కై 2013లో క్రాన్ఫోర్డ్లో యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే పేరుతో బోగస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. స్థానికంగా విద్యాసంస్థలకు అనుమతినిచ్చే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ దీనికి రాష్ట్ర స్థాయి యూనివర్సిటీగా గుర్తింపునిస్తూ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. కానీ, ఇది పైకి యూనివర్సిటీ భవనంలాగే కనిపించినా అక్కడ పాఠాలు లేవు.. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేరు. కేవలం హెచ్ 1 వీసాకు నిరాకరించబడిన వారిని చేర్చుకొని భారీ మొత్తంలో డబ్బులు దండుకునేందుకు స్థాపించబడిందే ఈ బోగస్ వర్సిటీ. ఈ విషయం ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా తెలిసింది. సాధారణంగా అమెరికా విద్యకోసం వెళ్లిన వారికి తొలి ఏడాదిన్నరలో కర్రిక్యులమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్(సీపీటీ) ప్రోగ్రాం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఆఫ్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) అనే మరో కార్యక్రమం ఉంటుంది. ఇవి పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులు హెచ్ 1 వీసాకోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే, ఏకారణం రీత్యానైనా వారికి హెచ్ 1 వీసా లభించని పక్షంలో ఆ విద్యార్థులు ఆ దేశం విడిచి తమ స్వదేశాలకు రావాల్సి ఉంటుంది. అయితే, అలా రాకుండా ఉండేందుకు మరో యూనివర్సిటీలో ప్రవేశం పొంది.. తిరిగి సీపీటీ, ఓపీటీలు పూర్తి చేసి హెచ్ 1 వీసాకోసం ప్రయత్నిస్తారు. వాస్తవానికి ఒకసారి హెచ్ 1వీసాకు నిరాకరించబడిన విద్యార్థులను ఏ యూనివర్సిటీలు రెండోసారి చేర్చుకోవు. అలా చేయడం నేరం కూడా. కానీ, యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ మాత్రం భారతీయ విద్యార్థులను డబ్బులకోసం బుట్టలో వేసుకొని ప్రవేశాలు ఇచ్చింది. ఇందులో వెయ్యిమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉండగా వారిలో 306మందికి ముందే ఈ వర్సిటీ బాగోతం తెలుసు. అంటే ఉద్దేశ పూర్వకంగా అమెరికాలో ఉండిపోయేందుకు అక్రమ వర్సిటీతో వారు చేతులు కలిపారన్నమాట. ప్రస్తుతం ఆ విద్యార్థులపైనే చర్యలు తీసుకుంటామని అమెరికా అధికారులు అంటున్నారు. అయితే, వాస్తవానికి ఆ వర్సిటీ గురించి తెలియని విద్యార్థులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోబోమని కూడా టోనర్ చెప్పారు. ఒక అక్రమ సంస్థ ద్వారా ప్రవేశాలు పొంది శాశ్వతంగా ఉండిపోవాలని ప్రణాళిక రచించడం తప్పేనని చెప్పారు. -
ఇండియన్ స్టూడెంట్స్‌కు న్యూజెర్సీ గండం
న్యూయార్క్: అమెరికాలో కొందరు భారతీయ విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. హెచ్ 1 వీసాకోసం వారు అనుసరించిన మార్గాలు వారిని చిక్కుల్లో పడేసేలా ఉంది. ఓ బోగస్ కాలేజీ తయారై వారికి ఆశలు రేకెత్తించి చివరకు ఇబ్బందుల పాలయ్యే పరిస్థితిని కల్పించింది. అది ఒక్కరో ఇద్దరో కాదు ఏకంగా వెయ్యిమందికి పైగా విద్యార్థులకు. అమెరికాలోని క్రాన్ఫోర్డ్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే పేరుతో విశ్వవిద్యాలయాన్ని 2013లో స్థాపించారు. ఉన్నత విద్యలో భాగంగా ఇందులో అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్ కింద అకౌంటింగ్, మార్కెటింగ్, హెల్త్ కేర్ వంటి కోర్సులను అందిస్తామని ప్రకటించింది. స్థానికంగా విద్యాసంస్థలకు అనుమతినిచ్చే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ దీనికి రాష్ట్ర స్థాయి యూనివర్సిటీగా గుర్తింపునిస్తూ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. అదిగో అలా గుర్తింపు వచ్చినప్పటి నుంచి మొదలైంది అసలు దందా. ఎందుకంటే అది పైకి చూడ్డానికే ఓ యూనివర్సిటీ కానీ, అక్కడ పాఠాలు లేవు.. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేరు. కేవలం హెచ్ 1 వీసాకు నిరాకరించబడిన వారిని చేర్చుకొని భారీ మొత్తంలో డబ్బులు దండుకునేందుకు స్థాపించబడిందే ఈ బోగస్ వర్సిటీ. సాధారణంగా అమెరికా విద్యకోసం వెళ్లిన వారికి తొలి ఏడాదిన్నరలో కర్రిక్యులమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్(సీపీటీ) ప్రోగ్రాం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఆఫ్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) అనే మరో కార్యక్రమం ఉంటుంది. దీనిని సాధరణంగా కొన్నిగంటలపాటు పనిచేసుకుంటూ మరి కొన్ని గంటలు కాలేజీకి వెళ్లి చదువుకుంటూ ఏవో చిన్నచిన్న సంస్థల్లో పనిచేసుకుంటూ ఉంటారు. ఇవి పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులు హెచ్ 1 వీసాకోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే, ఏకారణం రీత్యానైనా వారికి హెచ్ 1 వీసా లభించని పక్షంలో ఆ విద్యార్థులకు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. పైగా ఒక్కసారి హెచ్ 1వీసా నిరాకరించబడి ఇంటికొస్తే అలాంటి విద్యార్థికి తిరిగి అమెరికాలో విద్యకోసం అడుగుపెట్టే అవకాశం ఉండదు. అయితే, అలా వీసాకు నిరాకరించబడిన వాళ్లంతా తిరిగి వేరే కళాశాలల్లో ప్రవేశం పొంది పైన పేర్కొన్న సీపీటీ, ఓపీటీ చేసుకుంటూ తిరిగి హెచ్ 1 వీసాకోసం ప్రయత్నిస్తుంటారు. అలా ప్రయత్నించేవారిని అందుకునేందుకు అక్కడ ఉన్న కొందరు దళారీలు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్‌తో చేతులు కలిపి చేసిన సృష్టే యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ. ఈ వర్సిటీని స్థాపించి హెచ్ 1 వీసా పొందడంలో విఫలమైనవారందరిని ఇబ్బడిముబ్బడిగా సీట్లు ఇస్తూ ఒక వసతి గృహంలాగా తయారై విద్యార్థులకు చిన్నచిన్న సంస్థల్లో సీపీటీ, ఓపీటీ, హెచ్ 1 వీసాకోసం ప్రయత్నించడానికి అక్రమంగా సహకరించింది. ఇలా ఈ వర్సిటీలో చేరినవాళ్లలో భారతీయులు, చైనీయులే అధికం. వీరంతా దాదాపు వెయ్యిమందికి పైగే ఉన్నారు. ఇందులో వాస్తవానికి చదువుకుందామని చేరినవారు కొందరైతే దీని బాగోతం ముందే తెలిసి ఏదో షెల్టర్ దొరికితే చాలు హెచ్ 1వీసాకోసం ప్రయత్నించవచ్చు అని చేరిన విద్యార్థులు కొందరు. వాస్తవానికి ఇలాంటి చర్యలకు ఓ వర్సిటీ పాల్పడటం చట్టప్రకారం నేరం. హెచ్ 1 వీసాల విషయంలో ఇటీవల కాలంలో సీరియస్ గా స్పందిస్తున్న అమెరికా ఉన్నతాధికారులు వర్సిటీల తీరుపై దృష్టిసారించారు. అందులో భాగంగానే యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా దాని అసలు డొల్లతనం బయటపడింది. మంగళవారం నిర్వహించిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో భాగంగా వర్సిటీకి చెందిన అధికారులను 21మందిని అరెస్టు చేశారు. అక్రమ మార్గాల్లో హెచ్ 1 వీసాలకు ఇప్పించేందుకు యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అక్రమాలకు పాల్పడిందంటూ న్యూజెర్సీ అటార్నీ పాల్ జే ఫిష్ మేన్, అమెరికా ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ అధికారి సరాహ్ ఆర్ సాల్దానా మీడియా సమావేశంలో వెల్లడించారు. వర్సిటీ గురించి తెలిసి కూడా విద్యార్థుల ప్రవేశాలు పొందడం నేరం కావడంతో ఇప్పుడు అక్కడ ఉన్న విద్యార్థుల భవితవ్యం ఆందోళనకరంగా మారింది. అంతేకాదు.. విద్యార్థుల స్టడీ వీసాలను కొనసాగించేందుకు కొందరు మద్యవర్తులు సహాయపడటమే కాకుండా చట్ట విరుద్ధంగా వర్కింగ్ వీసాలు కూడా ఆ విద్యార్థులకు ఇప్పించారు. పెద్దపెద్ద కంపెనీలల్లో పనిచేసేందుకు కూడా ఆ విద్యార్థులు ఈ వీసాలను ఉపయోగించినట్లు తెలిపారు. అరెస్టయిన వారంతా కూడా అమెరికా బ్రోకర్లే. వీరిలో ఆరుగురు న్యూయార్క్‌లో ఉండేవారు కాగా.. మరో ముగ్గురు ఫ్లషింగ్.. క్వీన్స్‌లో ఉండేవారు. ఈ సందర్భంగా ఫిష్ మాన్ మాట్లాడుతూ.. నిజమైన విద్యార్థులకు తప్పక న్యాయం చేస్తామని అన్నారు. అక్రమంగా న్యూజెర్సీ 1,076మందికి ప్రవేశాలు కల్పించిందని, ఈ విద్యార్థులంతా కూడా చట్టబద్ధంగా స్టూడెంట్ వీసాలు కలిగి ఉన్నవారేనని, కాకపోతే వారంతా ఇక్కడే ఉండిపోయేందుకు కావాల్సిన మార్గాల గురించే ఎక్కువగా వెతికారని చెప్పారు. అంతేకాకుండా బ్రోకర్లు కూడా దారుణంగా వ్యవహరించారని అసలు వారు ఎవరికి ఈ అనుమతులిస్తున్నారో కూడా తనిఖీలు చేయలేదని, వారు విద్యార్థులా, ఉగ్రవాదులా అనే కనీసం సమాచారం తెలుసుకోకుండానే ప్రవేశాలు ఇచ్చారని, వీసా ఫ్రాడ్‌కు పాల్పడ్డారని అన్నారు. ఈ వర్సిటీలో ప్రవేశం పొందిన విద్యార్థులను అదుపులోకి తీసుకునే అవకాశంగానీ, లేదంటే వారిని తిరిగి వెనక్కి పంపించే అవకాశంగానీ లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. -
వీసా స్కాంలో 10 మంది ఎన్నారైల అరెస్టు!
అమెరికన్ అధికారులు ఒక భారీ స్టింగ్ ఆపరేషన్ చేశారు. అధికారులే ఒక నకిలీ యూనివర్సిటీని సృష్టించి, దాని ద్వారా... ఒకే సమయంలో స్టూడెంట్, వర్క్ పర్మిట్ వీసాలు రెండింటినీ పొందిన 21 మందిని అరెస్టు చేశారు. వారిలో పది మంది ఎన్నారైలు కూడా ఉన్నారు. ఈ స్కాంలో దాదాపు వెయ్యి మంది వరకు విదేశీయులు ఉన్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్, వర్జీనియా రాష్ట్రాల్లో ఇప్పటికి 21 మందిని అమెరికన్ అధికారులు అరెస్టు చేశారు. నకిలీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందడం ద్వారా వీసాలు పొందేందుకు వీళ్లంతా ప్రయత్నించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆ నకిలీ యూనివర్సిటీ సృష్టికర్తలు సాక్షాత్తు అమెరికాలోని హోంలాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏజెంట్లే! 26 దేశాలకు చెందిన దాదాపు వెయ్యిమందికి స్టూడెంట్ వీసాతో పాటు ఫారిన్ వర్కర్ వీసాలు కూడా ఇప్పించేందుకు ప్రయత్నించిన బ్రోకర్లు, రిక్రూటర్లు, యజమానులు అరెస్టయిన వారిలో ఉన్నారు. అమెరికాలో పనిచేసేందుకు వీసాలు, వర్క్ పర్మిట్లు పొందేందుకు భారతీయులు భారీ మొత్తంలో ఈ బ్రోకర్లకు సొమ్ము చెల్లించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఏడాదిపాటు కొనసాగిన ఈ భారీ స్టింగ్ ఆపరేషన్‌లో ఎంతమంది భారతీయ విద్యార్థులు ట్రాప్‌లో పడిందీ అధికారులు ఇంకా వెల్లడించలేదు. అరెస్టయిన వాళ్లు ఏ దేశాలకు చెందినవారో అమెరికా అధికారులు వెల్లడించలేదు. వారిలో తాజేష్ కొడాలి, జ్యోతి పటేల్, షహజాదీ ఎం పర్వీన్, నేంద్ర సింగ్ ప్లాహా, సంజీవ్ సుఖిజా, హర్‌ప్రీత్ సచ్దేవ, అవినాష్ శంకర్, కార్తీక్ నిమ్మల, గోవర్ధన్ దేవరశెట్టి, సయ్యద్ ఖాసిం అబ్బాస్ తదితరులున్నారు. అధికారులు సృష్టించిన నకిలీ వర్సిటీలో అసలు అధ్యాపకులు గానీ, క్లాసులు గానీ, అసలైన విద్యార్థులు గానీ లేకపోయినా బ్రోకర్లు మాత్రం ఆ పేరు ఉపయోగించుకుని డబ్బు తీసుకుని వీసాలు ఇప్పించేశారు. వాళ్లకు ప్రధానంగా ఐ-20 ఫారాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఈ తరహా బెడద ఎక్కువైపోవడంతో అమెరికన్ అధికారులు ఈ ఫేక్ యూనివర్సిటీని సృష్టించి, దాని ద్వారా మొత్తం డొంక కదిలించేందుకు వ్యూహం పన్నారు. -
ఫేక్ యూనివర్సిటీ స్కాంలో 21 మంది అరెస్ట్
న్యూ జెర్సీ: ఫేక్ యూనివర్సిటీల స్టూడెంట్ వీసా స్కాంలో 21 మందిని యూఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. గత రెండున్నర ఏళ్లుగా అక్రమ పద్దతుల్లో 1000 మందికి పైగా విదేశీ విద్యార్థులకు స్టూడెంట్, వర్క్ వీసాలు ఇచ్చారన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేశారు. నిందితులు అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఫేక్ యూనివర్సిటీల పేరిట విదేశీ విద్యార్థులకు వీసాలు ఇచ్చారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, వీరి నుంచి వీసాలు తీసుకున్నవారిలో భారత్, చైనా దేశాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు.