వాషింగ్టన్ : మిచిగాన్‌లోని ‘ఫర్మింగ్టన్’ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో బాధితులుగా మారిన భారత విద్యార్థులను బయటకు తెచ్చేందుకు భారత కాన్సులెట్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) వెల్లడించింది. అమెరికాలోని తెలుగు అసోషియేషన్ల సాయంతో విద్యార్థుల వివరాలును తీసుకుని అధికారులు వారిని కలిసారని పేర్కొంది. వారు ఇబ్బంది పడకుండా అందరిని ఒక దగ్గరికి చేరేలా చర్యలు తీసుకుందని తెలిపింది.
గత శనివారం అమెరికాలోని పలు తెలుగు అసోసియేషన్లు భారత రాయబార కార్యాలయ అధికారి హర్షవర్దన్ ష్రింగ్లాను కలిసాయి. ఈ వివాదం నుంచి విద్యార్థులను రక్షించాలని కోరాయి. డిటెన్షన్‌కు గురైన విద్యార్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. డిటెన్షన్‌కు గురైన 139 మంది భారత విద్యార్థుల్లో భారత ఎంబసీ అధికారులు ఇప్పటికే 90 మందిని కలిసారు. ఇందులో 60 మందిని డిటెన్షన్ సెంటర్ల నుంచి విడుదల కూడా చేయించారు. విద్యార్ధుల తరపున ఎంబసీ న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment