Indian Embassy officials
-
జులై 29న దోహాలో ఓపెన్ హౌజ్
దోహా: ఖతార్ లో ఇండియన్ ఎంబసీలో 2021 జులై 29న ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నారు. ఖతార్ లో నివసిస్తున్న భారతీయుల కార్మిక (లేబర్), కాన్సులర్ (దౌత్య) సంబంధమైన అత్యవసర సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ఈ సమావేశం వేదిక కానుంది. జులై 29 మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దోహాలోని ఇండియన్ ఎంబసీ ఆవరణలో ఈ సమావేశం జరుగుతుంది. భారత దౌత్య అధికారులు ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. వర్చువల్‌గా ఈ సమావేశానికి నేరుగా రాలేకపోయిన వారు జులై 29వ తేది మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 00974 50411241 ఫోన్ ద్వారా అయినా ఎంబసీ అధికారులను సంప్రదించవచ్చు. అదే విధంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆన్ లైన్ జూమ్ మీటింగ్ లో పాల్గొనవచ్చు. మీటింగ్ ఐడీ ID: 830 1392 4063 పాస్‌కోడ్‌లను 121700 ఉపయోగించి జూమ్ సమావేశంలో జాయిన్ కావొచ్చు. వీటితో పాటు labour.doha@mea.gov.in కు మెయిల్ ద్వారా కూడా సమస్యలను విన్నవించుకోవచ్చు. -
బాబోయ్ కరోనా
బీజింగ్/న్యూఢిల్లీ: చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ ప్రమాదకర స్థాయిలో విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన పడి సోమవారం వరకు 81 మంది చనిపోయారు. 2,744 మందికి ఈ వైరస్ సోకినట్లు ధ్రువీకరించారు. వీరిలో 461 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఈ వైరస్ మొదట వెలుగు చూసిన వుహాన్ నగరంలో సోమవారం చైనా ప్రధాని లీ కెక్వింగ్ పర్యటించారు. బాధితులకు అందుతున్న చికిత్స వివరాలను, వైరస్ వ్యాపిని నిరోధించేందుకు తీసుకుంటున్న చర్యలను పర్యవేక్షించారు. బాధితులు ఉన్న పలు ఆసుపత్రులను తనిఖీ చేశారు. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న 32,799 మందిని పరీక్షించామని, వారిలో 583 మందిని ఆదివారం మొత్తం అబ్జర్వేషన్లో ఉంచి, సోమవారం డిశ్చార్జ్ చేశామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. థాయిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, అమెరికా, వియత్నాం, సింగపూర్, మలేసియా, నేపాల్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాల్లో కూడా ఈ వైరస్ సోకిన కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా చైనా పలు చర్యలు తీసుకుంది. నగరంలోకి రాకపోకలు నిషేధించిన జనవరి 23 లోపే వుహాన్ నుంచి దాదాపు 50 లక్షల మంది వెళ్లిపోయారని ఆ నగర మేయర్ జో జియాన్‌వాంగ్ తెలిపారు. ఆ నగర జనాభా దాదాపు కోటి పదిలక్షలు. భారతీయుల కోసం మూడు హాట్‌లైన్స్ హ్యుబెయి రాష్ట్రంలో ఉన్న భారతీయుల కోసం చైనాలోని భారతీయ రాయబార కార్యాలయం 3 హాట్‌లైన్ నెంబర్లను ప్రారంభించింది. వుహాన్‌లో చిక్కుకుపోయిన దాదాపు 300 మంది భారతీయులను తీసుకురావడానికి సంబంధించి చైనా విదేశాంగ శాఖతో భారతీయ అధికారులు సోమవారం సంప్రదింపులు జరిపారు. కాగా, ముంబైలోనూ పలు అనుమానిత కేసులు నమోదయ్యాయి. స్థానిక కస్తూర్బా ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఒక అనుమానిత వ్యాధిగ్రస్తుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
ఎట్టకేలకు న్యాయసహాయం!
-
జాధవ్‌ను కలుసుకోవచ్చు!
న్యూఢిల్లీ: పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌కు ఎట్టకేలకు న్యాయసహాయం పొందే అవకాశం దక్కింది. భారత దౌత్యాధికారులు జాధవ్‌ను శుక్రవారం కలుసుకోవచ్చని భారత విదేశాంగశాఖకు పాక్ గురువారం సమాచారమిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం భారత్ దౌత్యాధికారులు జాధవ్‌ను కలుసుకోవచ్చునని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మహమ్మద్ ఫైజల్ చెప్పారు. గూఢచర్యం, ఉగ్రవాదం ఆరోపణలపై పాక్ సైనిక కోర్టు జాధవ్‌కు వేసిన మరణశిక్షను పునః పరిశీలించాలని ఇటీవల అంతర్జాతీయ కోర్టు చెప్పింది. న్యాయ సహాయం అంటే.. 1963 వియన్నా ఒప్పందం ప్రకారం రెండు స్వతంత్ర దేశాల మధ్య న్యాయ సహాయ సంబంధాలు ముఖ్యం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ప్రకారం ఏదైనా దేశం విదేశీ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటే వారి హక్కుల్ని కాపాడడానికి ఆలస్యం చేయకుండా అరెస్ట్‌కు సంబంధించిన విషయాన్ని ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారం అందించాలి. అరెస్ట్‌కి కారణాలు వివరించాలి. తనకు లాయర్ కావాలని నిర్బంధంలోని వ్యక్తి కోరితే ఆ ఏర్పాటు చేయాల్సిందే. భారత్‌కు ఎలా ప్రయోజనం ? ఇన్నాళ్లూ ఏకపక్షంగా విచారణ జరిపి జాధవ్ గూఢచారి అని పాక్ ముద్రవేసింది. లాయర్ని నియమిస్తే జాధవ్ వైపు వాదన ప్రపంచానికి తెలుస్తుంది. అతని అరెస్ట్ వెనుక నిజానిజాలు వెలుగు చూస్తాయి. పాకిస్తాన్ కుటిలబుద్ధిని బయటపెట్టే అవకాశం భారత్‌కు లభిస్తుంది. -
విద్యార్థుల కోసం తెలుగు సంఘాల కృషి
వాషింగ్టన్ : మిచిగాన్‌లోని ‘ఫర్మింగ్టన్’ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో బాధితులుగా మారిన భారత విద్యార్థులను బయటకు తెచ్చేందుకు భారత కాన్సులెట్ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) వెల్లడించింది. అమెరికాలోని తెలుగు అసోషియేషన్ల సాయంతో విద్యార్థుల వివరాలును తీసుకుని అధికారులు వారిని కలిసారని పేర్కొంది. వారు ఇబ్బంది పడకుండా అందరిని ఒక దగ్గరికి చేరేలా చర్యలు తీసుకుందని తెలిపింది. గత శనివారం అమెరికాలోని పలు తెలుగు అసోసియేషన్లు భారత రాయబార కార్యాలయ అధికారి హర్షవర్దన్ ష్రింగ్లాను కలిసాయి. ఈ వివాదం నుంచి విద్యార్థులను రక్షించాలని కోరాయి. డిటెన్షన్‌కు గురైన విద్యార్థులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశాయి. డిటెన్షన్‌కు గురైన 139 మంది భారత విద్యార్థుల్లో భారత ఎంబసీ అధికారులు ఇప్పటికే 90 మందిని కలిసారు. ఇందులో 60 మందిని డిటెన్షన్ సెంటర్ల నుంచి విడుదల కూడా చేయించారు. విద్యార్ధుల తరపున ఎంబసీ న్యాయ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. -
‘ఫర్మింగ్టన్’లో నమోదై ఉంటే.. వివరాలివ్వండి
చికాగో : మిచిగాన్‌లోని ‘ఫర్మింగ్టన్’ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో బాధితులుగా మారిన భారత విద్యార్థులను బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అమెరికన్ తెలుగు అసోషియేషన్ వెల్లడించింది. ఈ ఉదంతంలో అరెస్టయిన విద్యార్థుల వివరాల కోసం భారత ఎంబసీ అధికారులు వాషింగ్టన్ డీసీ, అట్లాంటాలోని ఆటా సాయం తీసుకున్నారని తెలిపారు. ఆటా నాయకుల సహకారంతో బాధిత విద్యార్థులు, వారి స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్లను సంప్రదిస్తున్నారని.. అరెస్టయిన వారి వివరాలను తెలుసుకుంటున్నారని అన్నారు. ఒకవేళ విద్యార్థులు ఫర్మింగ్టన్ యూనివర్సిటీలో నమోదై ఉండి.. వారి ఆచూకీ తెలియక పోయినా లేదా ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో వారు అరెస్టయ్యారా లేదా అనే విషయం వెల్లడికాకపోయినా.. విద్యార్థుల పూర్తి వివరాలు ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్ ద్వారా ఎంబసీ అధికారులకు పంపొచ్చని పేర్కొన్నారు. (130 మంది విద్యార్థుల అరెస్టు) మీవారి వివరాలతో ఈ అడ్రస్‌కు మెయిల్ చేయొచ్చు.. Hoc.atlanta@mea.gov.in Com.atlanta@mea.gov.in fsitou.washington@mea.gov.in మెయిల్ చేసే సమయంలో.. సబ్జెక్ట్ అనే చోట "Farmington" అని తప్పక రాయాలని సూచించారు. విద్యార్థుల వివరాలిలా.. First Name : Last Name : Address or city of residence (if known) : Date arrested(if known and arrested) : Detention location (If Known) : Your contact Phone no : Your email address : Student's contact phone no : Student's email address : పై విధంగా మెయిల్ చేయడం ద్వారా మీ విద్యార్థుల వివరాలు ఎంబసీ అధికారులు నమోదు చేసుకుని తగు చర్యలు చేపట్టే వీలుంటుంది. https://tinyurl.com/DetainedIndianStudents లింక్ ద్వారా కూడా విద్యార్థుల వివరాలు అందివ్వొచ్చని ఆటా నాయకులు తెలిపారు. -
సౌదీ నుంచి 29 మంది తెలంగాణవాసులకు విముక్తి
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన 29 మంది తెలంగాణవాసులను కాపాడినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ‘సౌదీ అరేబియాలో బందీలుగా ఉన్న 29 మంది భారతీయులను కాపాడాం. వారి విమాన ఖర్చులను కూడా మేమే భరిస్తాం’ అని మంత్రి గురువారం రాత్రి ట్వీటర్లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ ఈ విషయంపై సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకోవాలని ఇటీవలే లేఖ రాశారు. సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో వీరిని నిర్బంధిం చారని, భోజనం, నీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్ అక్కడి భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి బాధితుల విడుదలకు చొరవతీసుకున్నారు.