చికాగో : మిచిగాన్‌లోని ‘ఫర్మింగ్టన్’ ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో బాధితులుగా మారిన భారత విద్యార్థులను బయటకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అమెరికన్ తెలుగు అసోషియేషన్ వెల్లడించింది. ఈ ఉదంతంలో అరెస్టయిన విద్యార్థుల వివరాల కోసం భారత ఎంబసీ అధికారులు వాషింగ్టన్ డీసీ, అట్లాంటాలోని ఆటా సాయం తీసుకున్నారని తెలిపారు. ఆటా నాయకుల సహకారంతో బాధిత విద్యార్థులు, వారి స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్లను సంప్రదిస్తున్నారని.. అరెస్టయిన వారి వివరాలను తెలుసుకుంటున్నారని అన్నారు. ఒకవేళ విద్యార్థులు ఫర్మింగ్టన్ యూనివర్సిటీలో నమోదై ఉండి.. వారి ఆచూకీ తెలియక పోయినా లేదా ఫేక్ యూనివర్సిటీ వ్యవహారంలో వారు అరెస్టయ్యారా లేదా అనే విషయం వెల్లడికాకపోయినా.. విద్యార్థుల పూర్తి వివరాలు ఈ క్రింది ఈమెయిల్ అడ్రస్ ద్వారా ఎంబసీ అధికారులకు పంపొచ్చని పేర్కొన్నారు. (130 మంది విద్యార్థుల అరెస్టు)
మీవారి వివరాలతో ఈ అడ్రస్‌కు మెయిల్ చేయొచ్చు..
Hoc.atlanta@mea.gov.in
Com.atlanta@mea.gov.in
fsitou.washington@mea.gov.in
మెయిల్ చేసే సమయంలో.. సబ్జెక్ట్ అనే చోట "Farmington" అని తప్పక రాయాలని సూచించారు.
విద్యార్థుల వివరాలిలా..
First Name :
Last Name :
Address or city of residence (if known) :
Date arrested(if known and arrested) :
Detention location (If Known) :
Your contact Phone no :
Your email address :
Student's contact phone no :
Student's email address :
పై విధంగా మెయిల్ చేయడం ద్వారా మీ విద్యార్థుల వివరాలు ఎంబసీ అధికారులు నమోదు చేసుకుని తగు చర్యలు చేపట్టే వీలుంటుంది. https://tinyurl.com/DetainedIndianStudents లింక్ ద్వారా కూడా విద్యార్థుల వివరాలు అందివ్వొచ్చని ఆటా నాయకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment