వీసా కేసులో ఇద్దరు భారతీయులకు శిక్ష | US fake university sting: 2 Indians Sentenced | Sakshi
Sakshi News home page

వీసా కేసులో ఇద్దరు భారతీయులకు శిక్ష

Published Sun, Jun 5 2016 10:16 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

వీసా కేసులో ఇద్దరు భారతీయులకు శిక్ష - Sakshi

వీసా కేసులో ఇద్దరు భారతీయులకు శిక్ష

వాషింగ్టన్: ఐటీ నిపుణులకు ఉద్దేశించిన హెచ్1బీ వీసాల మోసం కేసులో ఇద్దరు భారతీయ సోదరులకు అమెరికా కోర్టు ఏడేళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. చీఫ్ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి బార్బరా లిన్.. అతుల్ నందా, జితెన్ నందాలకు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించారు. తమ కంపెనీలో ఐటీ నిపుణుల అవసరం ఉందని పేర్కొంటూ నందా సోదరులు కొందరు భారతీయులకు హెచ్1బీ వీసాలు ఇప్పించారు.

నిజానికి సదరు ఉద్యోగాలు వీరి కంపెనీ డిబన్ సొల్యూషన్స్లో లేవని తెలిసినా, వీసాలకు అనుమతించారు. దీంతో అమెరికా వచ్చిన భారతీయులకు ఇతర కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించి కమీషన్ తీసుకున్నారు. డిబన్ నుంచి వీసాలు పొందిన శివ సుగవనమ్, వివేక్ శర్మ, రోహిత్ మెహ్రాలు కూడా నేరాన్ని అంగీకరించడంతో నెల చొప్పున శిక్ష పడింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement