ఫార్మింగ్టన్‌ యూనివర్సీటి కేసు.. కొనసాగుతున్న విచారణ | Farmington University Case Investigation Is Going | Sakshi
Sakshi News home page

ఫార్మింగ్టన్‌ యూనివర్సీటి కేసు.. కొనసాగుతున్న విచారణ

Published Tue, Feb 5 2019 11:45 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

Farmington University Case Investigation Is Going - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మింగ్టన్‌ ఫేక్‌ యూనివర్సిటీ కేసుకు సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతోందని తెలుగు విద్యార్థుల తరుపున వాదిస్తున్న న్యాయవ్యాది ఎడ్వర్డ్‌ బజూకా తెలిపారు. అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌(ఆటా-ATA) రమేష్‌ మంథన న్యాయవ్యాదిని కలిసి కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో చిక్కుకున్న ఎనిమిది మంది తెలుగు విద్యార్థుల తరపున వాదించేందుకు ఆటా ప్రత్యేకంగా న్యాయవాదిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 130మంది విద్యార్థులు అరెస్టవ్వగా.. అందులో అధికంగా భారతీయులే ఉండటం విశేషం. వీరిలో 30మందిని ఇప్పటికే ఇండియాకు రప్పించారు. అలాగే ఈ కేసులో అరెస్ట్ అయిన ఫణి దిప్ కర్నాటికి బెయిల్ మంజూరు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement