telugu students
-
ఈసారి ఇద్దరే!
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)–2025 తొలి సెషన్ పరీక్షలో రాజస్తాన్‌కు చెందిన ఆయూస్ సింఘాల్ జాతీయ స్థాయిలో తొలి స్థానంలో నిలిచాడు. ఈ పరీక్షలో ఈసారి తెలుగు విద్యార్థులు పూర్తిగా వెనుకబడ్డారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో తొలి 14 స్థానాల్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే స్థానం సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 12వ స్థానంలో నిలవగా, తెలంగాణకు చెందిన బని బ్రాత మజీకి 14వ స్థానం దక్కింది. గత ఏడాది జేఈఈ మెయిన్‌లో తొలి 14 స్థానాల్లో 5, 6, 7, 8, 12, 13, 14 ర్యాంకులు తెలుగు విద్యార్థులు కైవసం చేసుకున్నారు. జేఈఈ మెయిన్–2025 తొలి సెషన్ పరీక్షలో కర్ణాటకకు చెందిన కుషార్గా గుప్తా ద్వితీయ స్థానం, ఢిల్లీకి చెందిన దక్ష, హరీస్ ఝా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. మొదటి 14 ర్యాంకుల్లో ఎక్కువగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ విద్యార్థులే ఉన్నారు. ఇద్దరు తెలుగువారికే వంద పర్సంటైల్ఈసారి జేఈఈ మెయిన్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మాత్రమే వంద పర్సంటైల్ సాధించారు. 99 స్కోర్ జాబితాలో తెలుగు పేర్లే లేవు. జనవరి 22 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్ –2025 తొలి సెషన్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 13,11,544 మంది రిజిస్టర్ చేసుకోగా, 12,58,136 (95.93 శాతం) మంది పరీక్ష రాశారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ 99 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు. మహిళా విభాగంలో సాయి మనోజ్ఞ గుత్తికొండ టాపర్‌గా నిలిచారు. ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్స్ రెండో సెషన్ జరుగుతాయి. రెండు విభాగాలను ప్రామాణికంగా తీసుకుని తుది ర్యాంకులు ప్రకటిస్తారు. -
అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51% తెలుగు రాష్ట్రాల నుంచే..
గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా.. 2023–24లో ఈ సంఖ్య 3,31,602కి చేరింది. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. – రెబెకా డ్రామ్ ఏయూ క్యాంపస్: గతేడాది భారత్ నుంచి అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 51 శాతం మంది తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని అమెరికా కాన్సులేట్ జనరల్ (హైదరాబాద్) కార్యాలయం కాన్సులర్ చీఫ్ రెబెకా డ్రామ్ తెలిపారు. విశాఖపట్నంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో భారతీయులు ప్రథమ స్థానంలో నిలిచారన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కాన్సులేట్ నుంచి రోజుకి సగటున 1,600 వరకు వీసాలు ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కాన్సులేట్‌లో సిబ్బందిని రెట్టింపు చేసినట్లు తెలిపారు.వచ్చే ఏడాది సిబ్బందిని మూడు రెట్లు పెంచి రోజుకు 2,500 వీసాలు ప్రాసెస్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తద్వారా అమెరికా–భారత్ సంబంధాలు బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఏపీలో కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేసే ఆలోచన లేదన్నారు. ఈ సందర్భంగా రెబెకా డ్రామ్ ఇంకా ఏమన్నారంటే..అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు..అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన విద్యార్థుల్లో 303.3 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది 336 మంది రాగా ఈ సంవత్సరం 1,355 మంది వచ్చారు. ప్రస్తుతం 8 వేల మంది వరకు అమెరికన్ విద్యార్థులు భారత్‌లో ఉన్నారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 2022–23లో 2,65,923 ఉండగా 2023–24లో ఈ సంఖ్య 13 శాతం వృద్ధితో 3,31,602కి చేరింది. మాస్టర్స్, పీహెచ్డీ కోర్సులకు అత్యధిక శాతం మంది విద్యార్థులను పంపుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోంది. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ గతేడాది 35 వేలు, ఈ ఏడాది 47 వేల స్టూడెంట్ వీసా ఇంటర్వూ్యలు నిర్వహించింది.బీ1, బీ2 వీసాలకు గరిష్టంగా ఏడాది కాలం.. బీ1, బీ2 వీసాల మంజూరుకు గరిష్టంగా ఏడాది కాలం పడుతోంది. వర్కర్ వీసా, స్టూడెంట్ వీసా తదితరాలను మూడు నెలల కంటే తక్కువ సమయంలోనే మంజూరు చేస్తున్నాం. గతేడాది భారత్‌లో 1.4 మిలియన్ వీసాలను ప్రాసెస్ చేశాం. పైలట్ ప్రోగ్రామ్‌గా హెచ్1బీ డొమెస్టిక్ వీసాను ఆన్లైన్లో పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల భారతీయులు వీసా పునరుద్ధరణకు తిరిగి తమ దేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు.స్టెమ్ కోర్సులనే ఎక్కువగా చదువుతున్నారు.. అమెరికా కాన్సులేట్ పబ్లిక్ ఎఫైర్స్ అధికారి అలెక్స్ మెక్లీన్ మాట్లాడుతూ.. తమ దేశానికి వస్తున్న విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్, మెడిసిన్ (స్టెమ్) కోర్సులను ఎక్కువగా చదువుతున్నారని తెలిపారు. యూఎస్‌లో ఉన్నత విద్యకు విద్యార్థులను పంపే దేశాల జాబితాలో ఈ ఏడాది భారత్ ప్రథమ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ భాగస్వామ్యం అమెరికాను ఎంతో బలోపేతం చేస్తుందన్నారు. అమెరికాకు వస్తున్నవారిలో పురుషులే అధికంగా ఉంటున్నారని చెప్పారు.మహిళలను సైతం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏయూలో నెలకొల్పిన అమెరికన్ కార్నర్‌పై స్పందిస్తూ ఈ కేంద్రం ఎంతో బాగా పనిచేస్తోందని తెలిపారు. తరచూ ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది అమెరికన్ నావికా సిబ్బంది ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి ఎన్సీసీ విద్యార్థినులతో మాట్లాడారని గుర్తు చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందిస్తూ రెండు దేశాల సంస్కృతుల మధ్య కొంత వైవిధ్యం ఉంటుందని.. వీటిని అలవాటు చేసుకోవడం, పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం అవసరమన్నారు. ఆత్మహత్యలను నివారించడానికి తాము పూర్తిస్థాయిలో పనిచేస్తున్నామని తెలిపారు. -
ఐక్యరాజ్యసమితికి తెలుగు యువ ప్రతిభ
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో రాబోయే డిసెంబర్లో జరిగే 8వ వార్షిక 1ఎమ్1బి (1మిలియన్ ఫర్ 1బిలియన్) యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనడానికి తెలంగాణలోని వివిధ కాలేజీలకు చెందిన ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఎంపికయ్యారు. వీరిలో నలుగురు అమ్మాయిలు– నారాయణం భవ్య, పెమ్మసాని లిఖిత చౌదరి, సత్యవతి కోలపల్లి, మనల్ మునీర్ కాగా మరొకరు మీత్కుమార్ షా ఉన్నారు. వీరి ఆవిష్కరణలకు ‘1ఎమ్1బి గ్రీన్స్కిల్స్ అకాడమీ’ వేదికయ్యింది. ఐదు నెలలపాటు సాగిన ఈ ప్ర్రక్రియలో 200 మంది పాల్గొనగా ఐదుగురు తెలుగు విద్యార్థులు ఎంపికై యువ ప్రతిభ కు ప్రేరణగా నిలిచారు.పట్టణ సవాళ్ల పరిష్కారం‘మానిఫెస్టింగ్ మ్యాన్ హోల్స్’ పేరుతో పట్టణ వరదలు, సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగాప్రాజెక్ట్ను ఆవిష్కరించాను. భారతీయ నగరాల్లో మౌలిక సదుపాయాల భద్రతను కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. – నారాయణం భవ్యటెక్.. టూర్‘ఇంటెలినెక్సా’ అనే నాప్రాజెక్ట్ ఎకో–టూరిజంను ఏఆర్, వీఆర్, ఏఐల ద్వారా మార్చేందుకుæవీలుగా ఫీచర్లను అందిస్తోంది. వైల్డ్ లైఫ్ ట్రైల్స్, వీఆర్ అడ్వెంచర్స్, ఎకో కెరీర్ గైడ్స్, ఎకో డైరీస్ ద్వారా మనప్రాంతాల పట్ల సమాజానికి అవగాహన కల్పించడం, గ్లోబల్ ఫోరమ్‌లపై ప్రభావం చూపడమే లక్ష్యంగా దీనిని ఆవిష్కరించాను.– మనల్ మునీర్లక్ష్యానికి మార్గం‘అప్నా ఇంటర్వ్యూ క్రాకర్’ అనే నాప్రాజెక్ట్ మార్కెట్ ట్రెండ్లు, పోర్ట్‌ఫోలియో క్రియేషన్, ఎటిఎస్ రెజ్యూమ్ టెంప్లేట్లు, ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ లను అందించే ఒక వేదిక. దీని ద్వారా ఎంతోమంది తమ లక్ష్యాలు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. – మీత్ కుమార్ షావిద్యార్థులకు ప్రాక్టికల్ స్కిల్స్‘టెక్.వెసాలియస్’ అనే నాప్రాజెక్ట్ లక్ష్యం అనాటమీ విద్యలో ఎఆర్/విఆర్ సాంకేతికత ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం. విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా, వారిలోప్రాక్టికల్ స్కిల్స్ పెంపొందించడమే ఈ ఆవిష్కరణ లక్ష్యం. – పెమ్మసాని లిఖిత చౌదరివాస్తవ అనుభూతినారు పోషణలో ఏఐ సాధనాలు, మెటా స్పార్క్ స్టూడియోని ఉపయోగించుకొని వాస్తవ అనుభూతిని ఎలా పొందవచ్చో నాప్రాజెక్ట్ పరిచయం చేస్తుంది. అంతేకాదు కెమెరా ట్రాకింగ్ ద్వారా వినియోగదారులకు వారి మొక్కలను సేంద్రీయంగా, వేగంగా ఎలా పెంచాలనే దానిపై లింక్‌లు, మార్గదర్శకాలను అందిస్తుంది. మొక్కల పెంపకంపై రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. – సత్యవతి కోలపల్లి -
అడ్వాన్స్‌డ్‌లో ఏపీ మెరుపులు
సాక్షి, అమరావతి : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో టాప్–10లో నలుగురు ఏపీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉన్నారు. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్ 360కి గాను 338 మార్కులతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టి కుశాల్ కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్ సుహాస్ 329 మార్కులతో 10వ ర్యాంకుతో మెరిశారు. ఏపీకి చెందిన మత బాలాదిత్య (ఐఐటీ భువనేశ్వర్ జోన్)కు 11వ ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్‌గా ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 355 మార్కులతో సత్తా చాటాడు. తొలి పది ర్యాంకుల్లో ఐఐటీ రూర్కీ జోన్‌కు ఒకటి, ఐఐటీ ఢిల్లీ జోన్‌కు రెండు, ఐఐటీ బాంబే జోన్‌కు మూడు, అత్యధికంగా ఐఐటీ మద్రాస్ జోన్‌కు నాలుగు ర్యాంకులు దక్కడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ జాతీయ స్థాయిలో 332 మార్కులతో 7వ ర్యాంకు సాధించడమే కాకుండా బాలికల విభాగంలో టాపర్‌గా నిలిచింది. గతేడాది తొలి పది స్థానాల్లో ఆరుగురు హైదరాబాద్ జోన్‌కు చెందిన విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. పెరిగిన ఉత్తీర్ణత దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఏటా 2.50 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది 1,86,584 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,80,200 మంది పరీక్షకు హాజరవ్వగా 48,248 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది 2023లో 43,773గా ఉంది. అడ్వాన్స్డ్ ఉత్తీర్ణతలో బాలికల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 7,509 మంది ఉంటే తాజాగా 7,964 మంది ఉత్తీర్ణులయ్యారు. 331 మంది ఓవర్సీస్ ఇండియన్స్ పరీక్ష రాస్తే 179 మంది, 158 విదేశీ విద్యార్థులు పరీక్షకు హాజరైతే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం.నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పిస్తోంది. అనంతరం 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాల్గవ దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది. జూలై 23న మిగిలిన సీట్లు ఉంటే వాటికి కూడా కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.నా లక్ష్యం ఐఏఎస్మాది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్ గ్రామం. అమ్మ వి.రాజేశ్వరి, నాన్న బి.రామ సుబ్బారెడ్డి.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 10/10 పాయింట్లు వచ్చాయి. ఇంటర్లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 99.99 పర్సెంటెల్‌తో ఆల్ ఇండియా లెవెల్లో 252వ ర్యాంకు వచ్చింది. జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో 368 మార్కులకు 338 వచ్చాయి. ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియాలో 3వ ర్యాంక్, సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి, సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. – బొగ్గులపల్లి సందేశ్, 3వ ర్యాంకు ముందస్తు ప్రణాళికతో చదివా మాది కర్నూలు జిల్లా కృష్ణగిరి గ్రామం. అమ్మానాన్నలు కృష్ణవేణి, శేఖర్.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 570, ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 83వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 8వ ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబైలో సీఎస్ఈ చదవాలని ఉంది. ముందస్తు ప్రణాళికతో చదవడం వల్లే ఉత్తమ ర్యాంకు సాధించాను. – కె.తేజేశ్వర్, 8వ ర్యాంకుపెరిగిన కటాఫ్ మార్కులుజేఈఈ అడ్వాన్స్డ్ అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్ మార్కులు పెరిగాయి. గతేడాది జనరల్ ర్యాంకు కటాఫ్ 86 ఉండగా ఇప్పుడు 109కి పెరిగింది. ఓబీసీ 98, ఈడబ్ల్యూఎస్ 98, ఎస్సీ, ఎస్టీ, వివిధ పీడబ్ల్యూడీ విభాగాల్లో 54గా ఉండటం గమనార్హం. 2017 తర్వాత భారీ స్థాయిలో కటాఫ్ మార్కులు పెరిగాయి. సత్తా చాటిన లారీ డ్రైవర్ కుమారుడునరసన్నపేట: ఒక సాధారణ లారీ డ్రైవర్ కుమారుడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 803వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 118 వ ర్యాంకు సాధించాడు. నరసన్నపేట మండలం దూకులపాడుకు చెందిన అల్లు ప్రసాదరావు కుమారుడు రామలింగన్నాయుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టాడు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి మొదటి నుంచి పట్టుదలతో చదివేవాడు. ఆరో తరగతి నుంచి వెన్నెలవలస నవోదయలో చదువుకున్నాడు. తండ్రి ప్రసాదరావు లారీ డ్రైవర్ అయినప్పటికీ, కుమారుడికి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి ప్రోత్సహించారు. విద్యార్థి తల్లి సుగుణ గృహిణి. కోర్సు పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని రామలింగన్నాయుడు తెలిపారు. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మనోళ్ల మెరుపులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు ఈసారి కూడా సత్తా చాటారు. తొలి పది ర్యాంకుల్లో నాలుగింటిని తెలుగు విద్యార్థులే కైవసం చేసుకున్నారు. టాప్ వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రాల వారేకావడం గమనార్హం. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాల కోసం గత నెల 26న దేశవ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే.ఈ పరీక్షలను నిర్వహించిన మద్రాస్ ఐఐటీ ఆదివారం ఫలితాలను వెల్లడించింది. 48,248 మందికి అర్హత: జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని ఎంపిక చేశారు.వారిలో 1,86,584 మంది అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 1,80,200 మంది పరీక్ష రాశారు. వీరిలో దేశవ్యాప్తంగా 48,248 మంది అర్హత సాధించారు. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 360 మార్కులకుగాను 355 మార్కులతో జాతీయ టాపర్‌గా నిలిచారు.అదే జోన్‌కు చెందిన ఆదిత్య రెండో ప్లేస్‌లో నిలిచారు. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన భోగలపల్లి సందేశ్ 338 మార్కులతో మూడో ర్యాంకు, పుట్టి కౌశల్‌కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, అల్లాడబోయిన ఎస్‌ఎస్‌డిబి సిద్విక్ సుహాస్ 329 మార్కులతో పదో ర్యాంకు సాధించారు. పెరిగిన కటాఫ్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత కోసం పరిగణనలోకి తీసుకునే కటాఫ్ పర్సంటైల్ ఈసారి పెరిగింది. జనరల్ కేటగిరీలో 2022లో 88.4 పర్సంటైల్ కటాఫ్ అయితే, 2023లో ఇది 90.7గా ఉంది. తాజాగా కటాఫ్ 93.2 పర్సంటైల్‌కు చేరింది. ఓపెన్ కేటగిరీలో కటాఫ్ మార్కులు 109గా, రిజర్వేషన్ కేటగిరీలో 54 మార్కులుగా నిర్ధారించారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు ప్రతీ సబ్జెక్టులో కనీసం 8.68 శాతం, మొత్తంగా 30.34 శాతం మార్కులతో ర్యాంకుల జాబితాలోకి వెళ్లారు. ఇక ఈసారి అర్హుల సంఖ్య కూడా పెరిగింది. గత ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో 43,773 అర్హత సాధించగా.. ఈసారి 48,248 మంది అర్హత సాధించారు. జోసా కౌన్సెలింగ్ షురూ ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపిక మొదలవుతాయి. 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాలుగో దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది.మిగిలిన సీట్లు ఏవైనా ఉంటే వాటికి జూలై 23న కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది. అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో, జేఈఈ ర్యాంకు ఆధారంగా ఇతర కేంద్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. దేశంలోని 121 విద్యా సంస్థలు ఈసారి జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. గత ఏడాది వీటి సంఖ్య 114 మాత్రమే. 2023–24 విద్యా సంవత్సరంలో దేశంలోని 23 ఐఐటీల్లో 17,385 సీట్లున్నాయి. ఈ సంవత్సరం వీటి సంఖ్య పెరగవచ్చని ఆశిస్తున్నారు. -
ఎవరు..ఎప్పుడు దాడి చేస్తారో..!
సాక్షి, హైదరాబాద్: ఐదు రోజులుగా తెలుగు విద్యార్థులు కిర్గిస్తాన్‌లో భయం నీడన కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడి ఓ యూనివర్సిటీలో విద్యార్థిని వేధించిన విషయంలో తలెత్తిన వివాదం అక్కడి స్థానికులు, విదేశీయుల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీసింది. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ లక్ష్యంగా జరుగుతున్న దాడులతో తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హౌస్అరెస్టులో తెలుగు విద్యార్థులకు నిత్యావసరాలు కూడా దొరకడం లేదు. అక్కడి భారత రాయబార కార్యాలయం పట్టించుకోవట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు స్పందించి, తక్షణం తమను అక్కడ నుంచి రెస్క్యూ చేయాలంటూ కొందరు తెలుగు విద్యార్థులు ‘సాక్షి’తో ఫోన్ ద్వారా వాపోయారు. పేర్లు గోప్యంగా ఉంచాలంటూ అక్కడి ఎంబీబీఎస్ విద్యార్థులు అనేక విషయాలు చెప్పారు. వివరాలు వారి మాటల్లోనే.... అనుమానంగా చూస్తున్నారు... ఓ యువతి విషయంలో కిర్గిస్, ఈజిప్ట్ విద్యార్థుల మధ్య మే 13న గొడవ జరిగింది. 18, 19 తేదీల్లో తీవ్రస్థాయిలో దాడులు జరిగాయి. ఇందులో పాకిస్తాన్, భారత్, బంగ్లా, ఈజిప్ట్ దేశాల విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్తాన్ విద్యార్థులు చాలామంది వెళ్లిపోయారు. అక్కడి స్థానికులు తెలుగు విద్యార్థులను అనుమానంగా చూస్తున్నారు. దీంతో ఎప్పుడైనా మాపై దాడి జరగొచ్చని భయాందోళనల మధ్య బతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్ నంబరు విద్యార్థులకు ఇచ్చింది. కాల్ చేస్తే పూర్తిస్థాయిలో స్పందన ఉండట్లేదు. కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సహకారం అందిస్తోంది. తెలుగు విద్యార్థులను ఐదు రోజులుగా బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కళాశాల యాజమాన్యం నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఇలా దాదాపు 700 మంది తెలుగు విద్యార్థులు అక్కడ బతుకెళ్లదీస్తున్నారు. భారత ఎంబసీతో మాట్లాడితే పరిస్థితులు బాగానే ఉన్నాయి అని అంటున్నారు. బయటకు వెళితే మాత్రం ఎవరు...ఎక్కడ దాడి చేస్తారో అన్న భయం విద్యార్థులను వెంటాడుతోంది. తమ ఉనికి బయటపడకుండా ఉండటానికి విద్యార్థులు తమ హాస్టల్లో లైట్లు ఆఫ్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు చెందినవారు మాత్రం వారి దేశానికి వెళ్లిపోయారు. తెలుగు విద్యార్థులు విమాన టికెట్లు బుక్ చేసుకుందామని ప్రయత్నిస్తే లభించట్లేదు. కిర్గిస్తాన్‌లో చోటు చేసుకున్న ఘటనలపై భారతీయ విద్యార్థుల భద్రతపై చొరవ తీసుకోవాలని జీవీకే ఎడ్యుటెక్ డైరెక్టర్ విద్యాకుమార్ బుధవారం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మవద్దని ఈ సందర్భంగా కేంద్రమంత్రి చెప్పారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే భారత రాయబార కార్యాలయ హెల్ఫ్‌లైన్ నంబర్ 0555710041కు ఫోన్ చేసిసంప్రదించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక విమానం వేయాలి ఇక్కడ బయట తిరగొద్దు అంటున్నారు. లాక్డౌన్ నాటి రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి. మా కళాశాలలో భారతీయ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కళాశాల యాజమాన్యం మాకు ఆహారం, నిత్యావసర సరుకులు అందిస్తోంది. ఆన్లైన్ క్లాసులు నడుస్తున్నాయి. ఇంటికి వెళ్లిపోతామంటున్న వారిని వెళ్లిపోండి అంటున్నారు. విద్యాసంవత్సరం చివరికు వచ్చింది. జూలైలో ఇంటికి రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంటికి రావాలన్నా టికెట్లు దొరకడం లేదు. ఉన్నవాట్లో నాలుగు రెట్లు చార్జీలు పెంచారు. భారత ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక విమానం వేయడం లేదా, విమానాల సంఖ్య పెంచి, చార్జీలు తగ్గించాలి. – రాధ, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అడుగు బయట పెట్టాలంటే భయం.. కళాశాలలకు సెలవులు ఇచ్చారు. రూంలోనే ఉంటున్నాం. అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టేవారు. భయంభయంగా ఉండేది. బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మా కుటుంబసభ్యులు భయపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీతో అంతా తప్పుడు సమాచారం ఇస్తోంది. అంతా బాగుంది అంటున్నారు. బయటకు వెళితే ఏ వైపు నుంచి ఎవరు దాడి చేస్తారో అని భయమేస్తోంది. మాకు పరీక్షలు దగ్గర పడ్డాయి. మాదగ్గర తెలుగు రా్రష్తాల నుంచి 800 మంది విద్యార్థులు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నెల రోజుల్లో డిగ్రీ పట్టా వస్తుందనుకుంటే ఇప్పుడు మానసిక ఆందోళన మొదలైంది. విమానాశ్రయంలో బాంబు ఉందంటూ బెదిరింపులు రావడంతో ఎవ్వరినీ రానీయడం లేదు. – ఉషారాణి, ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని -
మెయిన్‌లోనూ మనోళ్లు టాప్ గేర్‌లో
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్)లో ఈ ఏడాది కూడా తెలుగు విద్యార్థుల హవా కొనసాగింది. మొదటి 11 జాతీయ ర్యాంకుల్లో మూడింటిని తెలంగాణ విద్యార్థులు దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన హందేకర్ విదిత్ ఐదో ర్యాంకు, ముత్తవరపు అనూప్ 6వ ర్యాంకు, వెంకట సాయితేజ మాదినేని 7వ ర్యాంకు దక్కించుకున్నారు. అలాగే, దేశంలో 56 మందికి వందశాతం పర్సంటైల్ వస్తే, వీరిలో 22 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులున్నారు. అందులో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది అర్హత సాధించగా, తెలుగు రాష్ట్రాల నుంచి 49,532 మంది ఆ జాబితాలో ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్‌లో రెండు సెషన్లుగా నిర్వహించింది. ఈ రెండు సెషన్లకు కలిపి 9,24,636 మంది దరఖాస్తు చేస్తే, 8,22,899 మంది పరీక్ష రాశారు. ఈ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు, తుది మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఫలితాల్లో మూడో స్థానంలో తెలంగాణజేఈఈ మెయిన్‌లో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన 2,50,284 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్టు ఎన్టీఏ ప్రకటించింది. వీరిలో ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ నిలిచాయి. ఈ ఏడాది ఎక్కువ మంది జేఈఈ మెయిన్ రాయడంతో అన్ని కేటగిరీల్లో గత ఏడాదితో పోలిస్తే కటాఫ్ పెరిగింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అపరాధ రుసుముతో మే 10 వరకు గడువు ఉంది. మే 17 నుంచి 26 మధ్య అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి. మే 26న అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తారు. ఫలితాలను జూన్ రెండో వారంలో విడుదల చేయనున్నట్టు సమాచారం. జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ ద్వారా ఎన్ఐటీల్లో దాదాపు 24 వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్ ఐటీల్లో మరో 16వేల సీట్లను భర్తీ చేస్తారు. వంద పర్సంటైల్ సాధించిన తెలుగు విద్యార్థులు.. వారి ర్యాంకులుతెలంగాణ: హందేకర్ విదిత్(5), ముత్తవరపు అనూప్(6), వెంకట సాయితేజ మాదినేని(7), రెడ్డి అనిల్(9), రోహన్ సాయిబాబా(12), శ్రీయాశస్ మోహన్ కల్లూరి(13), కేసం చెన్నబసవరెడ్డి(14), మురికినాటి సాయి దివ్య తేజరెడ్డి(15), రిషి శేఖర్ శుక్లా(19), తవ్వ దినేశ్ రెడ్డి(24), గంగ శ్రేయాస్(35), పొలిశెట్టి రితిష్ బాలాజీ(39), తమటం జయదేవ్ రెడ్డి(43), మావూరు జస్విత్(49), దొరిసాల శ్రీనివాసరెడ్డి (52). ఆంధ్రప్రదేశ్: చింటు సతీష్ కుమార్ (8), షేక్ సూరజ్ (17), మాకినేని జిష్ణు సాయి(18), తోటంశెట్టి నిఖిలేష్(20), అన్నరెడ్డి వెంకట తనిష్ రెడ్డి(21), తోట సాయికార్తీక్ (23), మురసాని సాయి యశ్వంత్ రెడ్డి(36). ♦ ఈడబ్యూఎస్ విభాగంలో తొలి 6 స్థానాల్లో ఇద్దరు ఆంధ్రా, నలుగురు తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. తెలంగాణకు చెందిన కేసం చెన్నబసవరెడ్డి మొదటిస్థానంలో నిలవగా, తోటంశెట్టి నిఖిలేష్ మూడో స్థానంలో నిలిచాడు.♦ తెలంగాణ నుంచి ఓబీసీ కోటాలో మరువూరి జస్వంత్ వందశాతం, ఎస్టీ కోటాలో జగన్నాధం మోహిత్ 99 శాతం పర్సంటైల్ సాధించారు. పీడబ్ల్యూడీ కోటాలో చుంకిచర్ల శ్రీచరణ్ జాతీయ ర్యాంకర్‌గా నిలిచారు. ఐఐటీ–బాంబేలో చదవాలనుంది: హందేకర్ విదిత్జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. మా తండ్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా, తల్లి ప్రభుత్వ టీచర్. వారి చేయూతతోనే నేను ముందుకెళ్లాను. నాకు ఐఐటీ–బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలని ఉంది. ఆ తర్వాత స్టార్టప్ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించాలన్నది నా ఆశయం. క్రమశిక్షణ, పట్టుదల, ప్రణాళికబద్ధమైన ప్రిపరేషన్‌తోనే ఈ ర్యాంకు సాధించాను. -
విషాదం: స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
విదేశాల్లో ఉన్నత చదువులకోసం వెళ్లిన భారతీయ విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపుశోకాన్ని మిగుల్చుతోంది. తాజాగా స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రదేశంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయారు. బుధవారం సాయంత్రం జరిగిన దురదృష్టకర సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగిపోయారని వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని లండన్‌లోని భారత హైకమిషన్ ప్రతినిధి వెల్లడించారు. వీరిని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న చాణక్య బొలిశెట్టి (22), జితేంద్రనాథ్ కరుటూరి (27)గా గుర్తించారు. వాటర్‌ఫాల్స్‌కు పాపులర్ అయిన లిన్ ఆఫ్ తుమ్మెల్ జలపాతం వద్ద వీరిద్దరూ దుర్మరణం పాలయ్యారు. అత్యవసర సేవల ద్వారా ఇద్దరి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. డూండీ యూనివర్సిటీలో చదువుతున్న నలుగురు స్నేహితులు ట్రెక్కింగ్ చేస్తుండగా, ప్రమాద వశాత్తూ ఇద్దరు నీటిలో పడి మునిగిపోయారు. దీంతో మిగిలిన ఇద్దరు విద్యార్థులు ఎమర్జెన్సీ సర్వీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టాయి. (అమెరికా : ఆ ఇద్దరు తప్పు చేశారా? చేతివాటమా?) కాగా భారత కాన్సులేట్ జనరల్ విద్యార్థుల కుటుంబాలకు సమాచారం అందించింది వారికి తగిన సహాయాన్ని అందిస్తోంది. అలాగే ఒక కాన్సులర్ అధికారి బ్రిటన్‌లో నివసిస్తున్న విద్యార్థి బంధువును కలిశారు. అటు డూండీ విశ్వవిద్యాలయం కూడా తగిన సాయాన్ని హామీ ఇచ్చింది. పోస్ట్‌మార్టం అనంతరం వారి మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు -
సివిల్స్ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు
-
మహాబలిపురం బీచ్‌లో తెలుగు విద్యార్థుల గల్లంతు
చిత్తూరు, సాక్షి: తమిళనాడు మహాబలిపురం బీచ్ వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముగ్గురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతు అయ్యారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజ్‌లో చదివే విద్యార్థులుగా తెలుస్తోంది. కాలేజీ తరఫున తమిళనాడు టూర్‌కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. ఇందులో మౌనిష్, విజయ్, ప్రభు అనే ముగ్గురు ఒక్కసారిగా గల్లంతైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురి స్వస్థలాలు.. మౌనిష్-బంగారుపాలెం, విజయ్- సదుం, ప్రభు-పులిచెర్ల గ్రామంగా తెలుస్తోంది. విద్యార్థుల గల్లంతు సమాచారంతో తల్లిదండ్రుల్లో..బంధువుల్లో ఆందోళన నెలకొంది. -
జేఈఈ మెయిన్స్‌లో తెలుగు తేజాలు
సాక్షి, హైదరాబాద్/జహీరాబాద్ టౌన్: జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన తొలి విడత ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ మెయిన్స్–1)లో తెలుగు విద్యార్థులు ఈ ఏడాది కూడా సత్తా చాటారు. ఫలితాలను ఎన్టీఏ మంగళవారం వెల్లడించింది. తెలంగాణకు చెందిన రిషి శేఖర్ శుక్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన షేక్ సూరజ్ సహా పదిమంది వంద శాతం స్కోర్‌ను సాధించారు. వీరిలో తెలంగాణ విద్యార్థులు ఏడుగురు, ఏపీకి చెందిన ముగ్గురున్నారు. మొత్తమ్మీద టాప్–23లో పది మంది తెలుగు విద్యార్థులు చోటు దక్కించుకోవడం విశేషం. హరియాణాకు చెందిన ఆరవ్ భట్ దేశంలో టాపర్‌గా నిలిచారు. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో 544 కేంద్రాల్లో జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. తొలి విడత మెయిన్స్‌కు 12,21,624 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 11,70,048 మంది పరీక్షకు హాజరయ్యారు. తొలిదశలో కేవలం స్కోరు మాత్రమే ప్రకటించారు. రెండో దశ జేఈఈ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. ఆ తరువాత ఫలితాలతో కలిపి రెండింటికి ర్యాంకులను ప్రకటిస్తారు. 300కు 300 మార్కులు జేఈఈ మెయిన్స్ 300 మార్కులకు 300 మార్కులు సాధించిన మొదటి 23 మంది వివరాలను ఎన్టీఏ వెల్లడించింది. 100 శాతం సాధించిన వారిలో తెలంగాణ విద్యార్థులు రిషి శేఖర్ శుక్లా, రోహన్ సాయి పబ్బా, ముత్తవరపు అనూప్, హందేకర్ విదిత్, వెంకట సాయితేజ మాదినేని, శ్రీయషాస్ మోహన్ కల్లూరి, తవ్వా దినేష్ రెడ్డి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి షేక్ సూరజ్, తోట సాయి కార్తీక్, అన్నారెడ్డి వెంకట తనిష్ రెడ్డి ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో తెలంగాణకు చెందిన శ్రీ సూర్యవర్మ దాట్ల, దొరిసాల శ్రీనివాసరెడ్డి 99.99 స్కోర్‌తో టాపర్లుగా నిలిచారు. పీడబ్ల్యూడీ కోటాలో తెలంగాణకు చెందిన చుంచుకల్ల శ్రీచరణ్ 99.98 స్కోర్‌తో టాపర్‌గా నిలిచారు. పురుషుల కేటగిరీలోనూ పదిమంది తెలుగు విద్యార్థులే టాపర్లుగా నిలిచారు. కష్టపడితే అసాధ్యమనేది ఉండదు: హందేకర్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మల్చెల్మ గ్రామానికి చెందిన హందేకర్ అనిల్‌కుమార్ కుమారుడు హందేకర్ విదిత్ 300 మార్కులకు 300 మార్కులు సాధించాడు. జేఈఈ పరీక్ష కోసం రోజూ 15 గంటలపాటు ప్రణాళికాబద్దంగా చదివినట్లు విదిత్ చెప్పాడు. నమ్మకం, కష్టపడేతత్వం ఉంటే అసాధ్యమనేది ఉండదన్నాడు. -
US : ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి
హైదరాబాద్: అమెరికా దేశంలోని న్యూయార్క్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు అనూహ్యంగా మృతి చెందారు. తెలంగాణ వనపర్తి జిల్లాకు చెందిన దినేష్(22), ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నికేశ్(21)గా వారిని గుర్తించారు. ఈ విషయాన్ని దినేష్ దగ్గరి స్నేహితులు తమకు ఫోన్ చేసి చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరిద్దరు ఎలా చనిపోయారన్న దానిపై అక్కడి పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దినేష్ 2023 డిసెంబర్ 28న ఉన్నత చదువుల కోసం అమెరికాలోని హార్ట్ఫోర్డ్ చేరాడు. ఇటీవల నికేష్ అక్కడికి చేరుకున్నాడు. కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా వారిద్దరు అమెరికాలో రూమ్మేట్స్ అయ్యారు. అనుకోకుండా ఇద్దరు ఒకే రూమ్‌లో చనిపోయారు. అయితే వీరు ఉంటున్న గదిలో హీటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ వెలువడిందని, దీని కారణంగానే చనిపోయినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని, కచ్చితమైన ఆధారాలను బట్టి త్వరలోనే ఒక ప్రకటన చేస్తామన్నారు అధికారులు. వనపర్తిలో విషాద చాయలు వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గట్టు వెంకన్నకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు పేరు దినేష్. దినేష్ గత ఏడాది చెన్నైలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పట్టా పొందాడు. డిసెంబర్ 2023 చివర్లో MS చేయడానికి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని హార్ట్ఫోర్డ్ సిటీలో సేక్ర్డ్ హార్ట్ యూనివర్సిటీలో ఆడ్మిషన్ తీసుకుని స్థానికంగా నివాసముంటున్నాడు. దినేష్‌తో పాటు శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ ఉంటున్నాడు. వీరిద్దరూ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్టు తల్లితండ్రులకు సమాచారం అందింది. రూం హీటర్ నుంచి విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ బయటకు వచ్చిందని, దానిని పీల్చడం వల్ల దినేష్, నికేశ్ మరణించినట్టు తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.దీంతో కుటుంబ సభ్యులందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే దినేష్ తండ్రి వెంకన్న అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. తన కొడుకు పైచదువుల కోసం అమెరికా వెళుతున్న సందర్భంలో కొడుకుతో అయ్యప్ప స్వామి పూజ చేయించి పంపించారు వెంకన్న. ఇంతలోనే మరణవార్త తెలియడంతో వెంకన్న దంపతులు తల్లడిల్లిపోయారు. (ఎడమ నుంచి మూడో వ్యక్తి, ఎరుపు రంగు దుస్తుల్లో దినేష్) దినేష్ మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయం కోరినట్లు దినేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. నికేశ్ కుటుంబ సభ్యులతో తమకు పరిచయం లేదని, వారిద్దరూ ఇటీవలే అమెరికాలో స్నేహితులయ్యారని పేర్కొన్నారు. దినేష్ కుటుంబ సభ్యులను వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శించారు. నికేశ్ కుటుంబం గురించి తెలుసుకుంటున్నట్టు శ్రీకాకుళం పోలీసు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాలరాజు తెలిపారు. ఏపీ ప్రభుత్వం నుంచి సాయానికి రెడీ అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఇద్దరు తెలుగు విద్యార్థుల అనుమానాస్పద మృతి పట్ల ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు శ్రీకాకుళంకు చెందిన నికేశ్ (21), వనపర్తికి చెందిన దినేష్ (22)గా గుర్తించారని తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని రత్నాకర్ అన్నారు. శ్రీకాకుళం విద్యార్థి నికేశ్ భౌతిక కాయాన్ని పార్థివదేహాన్ని భారత్ కు రప్పించేలా ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రయత్నిస్తోందని, మృతుని కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని రత్నాకర్ తెలిపారు. My deepest condolences to the family of Nikesh from srikakulam AP , who lost his life along with another student dinesh from telnagana at an unfortunate incident. ANDHRA PRADESH CMO is concerned and extended their help. — Kadapa Rathnakar (@KadapaRathnakar) January 15, 2024 ఇదీ చదవండి: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు -
మన పిల్లలకు అండగా నిలుద్దాం
సాక్షి, అమరావతి: అమెరికా వెనక్కు పంపిన భారతీయ విద్యార్థుల్లో కొంత మంది తెలుగు విద్యార్థులూ ఉన్నారనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఆరా తీశారు. ఆ విద్యార్థుల పూర్తి వివరాలు తెలుసుకుని, వారికి అండగా నిలవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యార్థుల కోసం సీఎం ఆదేశాల మేరకు.. ప్రభుత్వం వేగంగా స్పందించి పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. విదేశాంగ శాఖతో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు దృష్టి సారించారు. వెనక్కి వచ్చిన విద్యార్థులు వ్యాలిడ్ వీసాలను కలిగి ఉండటంతో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యను త్వరగా పరిష్కరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన తెలుగు విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ను సంప్రదించాలని అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి తెలిపారు. ఇందుకోసం ఏపీఎన్ఆర్టీఎస్ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ నంబర్ కేటాయించిందన్నారు. ఈ హెల్ప్‌లైన్ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, +91 8632340678, 8500027678 సంప్రదించాలని సూచించారు. లేదా info@apnrts.com, helpline@apnrts.com కు మెయిల్ చేయాలని చెప్పారు. నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకోండి అమెరికా వీసా ఉన్నంత మాత్రాన ఆ దేశంలోకి ప్రవేశమనేది గ్యారెంటీ కాదని, విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ (పోర్ట్ ఆఫ్ ఎంట్రీ) వద్ద కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. లాప్టాప్, మొబైల్లో అమెరికా నిబంధనలను ఉల్లంఘించేలా సందేశాలు (పార్ట్‌టైమ్ జాబ్, బ్యాంక్ బ్యాలెన్స్ మేనేజ్ తదితర) ఉండకూడదని తెలిపారు. ఆ దేశంలోకి ప్రవేశం ఎందుకనే అంశాన్ని చెప్పి, వారిని ఒప్పించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో ముందుగానే విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థి దశలో అమెరికాలో జీవించడానికి అవసరమైన ఆర్థిక స్థోమతకు తగిన రుజువులు, యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, తదితరాల గురించి మన విద్యార్థులను అడిగినప్పుడు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వకపోతే విద్యార్థులు యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉందని వారు భావిస్తారని చెప్పారు. ఈ విషయాలపై విద్యార్థులు ముందుగానే అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు. పేరున్న ఏజెన్సీల ద్వారానే విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. -
యూఎస్ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా
అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. 21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు. విద్యార్థుల పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు. ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించామన్నారు విద్యార్థులు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు. వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు. చదవండి: అక్రమాల పుట్ట మార్గదర్శి.. ఆందోళనలో చందాదారులు.. రామోజీ పాపం ఫలితమే ఇదంతా! -
అమెరికాలో తెలుగు విద్యార్థులకు వెన్నక్కి పంపిస్తున్న అధికారులు
-
అమెరికా నుంచి తెలుగు విద్యార్థులు వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో చదువుకోవడం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ఇమి గ్రేషన్/భద్రతా అధికారులు ఎయిర్‌పోర్టు నుంచే తిప్పిపంపేశారు. ఎందుకు పంపేస్తున్నారనే దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. బలవంతంగా విమానం ఎక్కించి వెనక్కి పంపారు. ఇలా అట్లాంటా, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో ప్రాంతాల నుంచి 21 మందిని తిప్పిపంపినట్టు తెలిసింది. దాదాపు వారం రోజుల నుంచి ఇలా ఒకరిద్దరిని పంపేస్తున్నా.. ఇప్పుడు ఒక్కరోజే 20 మందికిపైగా విద్యార్థులను వెనక్కి పంపడంతో విషయం బయటికి వచ్చిందని అమెరికాలోని తెలుగు సంఘాలు చెప్తున్నాయి. అయితే పత్రాలు, వివరాలన్నీ పరిశీలించాకే అమెరికా వీసా ఇస్తారని, అలాంటప్పుడు ఈ సమస్య ఎందుకొచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సదరు విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా బయటికి రాలేదు.పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నా..: అమెరికాలో ఆగస్టులో విద్యా సంవత్సరం మొదలవుతుంది. దీనికి తగ్గట్టుగానే భారత విద్యార్థులు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అక్కడి వీసా నిబంధనలకు అనుగుణంగా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటారు. ముందే టోఫెల్, జీఆర్ఈ వంటి పరీక్షలు రాస్తారు. వాటి మార్కుల ఆధారంగానే అక్కడి యూనివర్సిటీలలో సీట్లు వస్తాయి. తర్వాత అమెరికాలో చదువుకున్నన్ని రోజులు జీవించడానికి అవసరమయ్యే మేర సొమ్మును బ్యాంకు బ్యాలెన్స్‌గా చూపిస్తారు. ఇందుకోసం విద్యార్థులు కన్సల్టెన్సీల సహకారం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్టుగా అనుభవం సర్టిఫికెట్లు కూడా సమర్పిస్తున్నారు. ఈ వ్యవహారంలోనే మన విద్యార్థులు ఇబ్బందుల్లో పడుతున్నారని అమెరికాలోని తెలుగు అసోసియేషన్లు చెప్తున్నాయి. డాక్యుమెంట్లపై అనుమానాలు.. సోషల్ మీడియా ఖాతాలు అమెరికాలో ‘సాక్షి’ ప్రతినిధికి అందిన సమాచారం ప్రకారం.. పలువురు తెలుగు విద్యార్థులు బ్యాంక్ ఖాతాలో సొమ్మును చూపిన అంశంపై అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఖాతాలో ఒకేసారి భారీగా డబ్బులు పడటం, లావాదేవీలు సక్రమంగా లేకపోవడాన్ని గుర్తించి, తిప్పి పంపారు. అమెరికాలో ఆటా సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాలో ఎన్నారై వ్యవహారాల సలహాదారు డాక్టర్ వాసుదేవరెడ్డి అందించిన వివరాల ప్రకారం.. అమెరికాకు వచ్చే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ఆ దేశ ఇమిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా పరిశీలిస్తోంది. వీసాకు అనుమతించిన మరుక్షణమే నిఘా పెడుతోంది. అందులో అమెరికా నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు, సమాచారం, వ్యాఖ్యలు ఉంటే వాటి ఆధారంగా ఎయిర్‌పోర్టులోనే ఆపేస్తున్నారు. ఉదాహరణకు భారత విద్యార్థి అమెరికా వస్తూ.. ఇక్కడి స్నేహితులతో అమెరికాలో చదువుకునే రోజుల్లో ఉండే పార్ట్‌టైం ఉద్యోగాల గురించి వాకబు చేశాడు. ఇది నిబంధనలకు విరుద్ధంగా పరిగణించి వెనక్కి పంపేశారు. నాటా ప్రతినిధి అందించిన సమాచారం ప్రకారం.. అమెరికా మన విద్యార్థులను తిప్పి పంపడానికి కారణాలను కేవలం భారత కాన్సులేట్‌కు మాత్రమే చెబుతుంది. దీనితో ఆ వివరాలు తెలుసుకునేందుకు అమెరికాలో తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. -
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్స్‌లో సత్తా చూపిన తెలుగు విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షలోనూ అదరగొట్టారు. జాతీయ స్థాయిలో మొదటి, రెండో ర్యాంకులతోపాటు టాప్–10లో ఆరుగురు తెలుగు విద్యార్థులే నిలిచారు. ఇందులో వావిలాల చిద్విలాసరెడ్డి (1వ ర్యాంకు), నాగిరెడ్డి బాలాజీరెడ్డి (9వ ర్యాంకు) తెలంగాణ వారుకాగా.. రమేశ్ సూర్యతేజ (2వ), అడ్డగడ వెంకట శివరామ్ (5వ), బిక్కిని అభినవ్ చౌదరి (7వ), వైపీవీ మనీందర్‌రెడ్డి (10వ ర్యాంకు) ఏపీకి చెందినవారు. ఇక మహిళల్లో జాతీయ టాప్ ర్యాంకర్ (298 మార్కులు)గా ఏపీ విద్యార్థిని నాయకంటి నాగ భవ్యశ్రీ నిలిచింది. ఆమెకు జనరల్ కేటగిరీలో 56వ ర్యాంకు వచ్చింది. టాప్‌లో ఐఐటీ హైదరాబాద్ జోన్.. దేశంలో ఐఐటీలు, ఇతర జాతీయస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఐఐటీ గౌహతి ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించగా.. ఆదివారం ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1,83,072 మంది పరీక్షలు రాయగా.. 43,773 మంది అర్హత సాధించారు. ఇందులో బాలురు 36,264 మంది, బాలికలు 7,509 మంది ఉన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు గణనీయ సంఖ్యలో ర్యాంకులు సాధించారు. అడ్వాన్స్డ్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల పరిధి అధికంగా ఉన్న ఐఐటీ హైదరాబాద్ జోన్ టాప్‌లో నిలిచింది. ఈ జోన్ పరిధిలో 10,432 మందికి ర్యాంకులు వచ్చాయి. టాప్–500 ర్యాంకర్లలో 174 మంది ఈ జోన్ (తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి కలిపి)కు చెందినవారే. నాగర్ కర్నూల్‌కు చెందిన వావిలాల చిద్విలాసరెడ్డి మొత్తం 360 మార్కులకు గాను 341 మార్కులు సా«ధించి జాతీయ స్థాయి టాపర్‌గా నిలిచాడు. గత ఏడాదితో పోల్చితే ఈసారి జేఈఈకి పోటీ ఎక్కువగా ఉందని.. పరీక్ష రాసిన వారి సంఖ్య, అర్హుల సంఖ్య పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. నేటి నుంచే జోసా రిజిరస్టేషన్లు ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన ‘జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా)’కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్ధులు దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. మొత్తం 6 దశల్లో సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ కౌన్సెలింగ్‌లో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు (23), ఎన్ఐటీ, ఐఐఈఎస్టీ (31), ఐఐఐటీ (26) జీఎఫ్‌ఐటీ (38)లు కలిపి మొత్తం 118 విద్యాసంస్థల్లో సీట్లను కేటాయిస్తారు. గత ఏడాది ఈ సంస్థలన్నింటిలో కలిపి 16,598 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసారి ఈ సీట్ల సంఖ్య మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. ఐఐటీలలోని మొత్తం సీట్లలో 20శాతం మేర మహిళలకు సూపర్ న్యూమరరీ కింద కేటాయిస్తారు. – జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన వారిలో ఆర్కిటెక్ట్ కేటగిరీ అభ్యర్ధులు ఆర్కిటెక్ట్ ఆప్టిట్యూడ్ టెస్టును రాయాల్సి ఉంటుంది. వారు సోమవారం నుంచే ఏఏటీకి దరఖాస్తు చేయవచ్చు. ఈనెల 21న పరీక్ష నిర్వహించి 24న ఫలితాలు విడుదల చేస్తారు. పేదల విద్య కోసం సాఫ్ట్వేర్ రూపొందిస్తా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మాది నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండలం గోదల్ గ్రామం. నాన్న రాజేశ్వర్‌రెడ్డి, అమ్మ నాగలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. అమ్మానాన్న, సోదరుడి ప్రోత్సాహంతో ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదివాను. భవిష్యత్‌లో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేలా సాఫ్ట్వేర్ రూపొందించడమే లక్ష్యం. – ఫస్ట్ ర్యాంకర్ చిద్విలాసరెడ్డి టాప్ 10 ర్యాంకర్లు వీరే.. 1. వావిలాల చిద్విలాసరెడ్డి (తెలంగాణ) 2. రమేశ్ సూర్యతేజ (ఏపీ) 3. రిషి కర్లా (రూర్కీ ఐఐటీ పరిధి) 4. రాఘవ్ గోయల్ (రూర్కీ ఐఐటీ పరిధి) 5. అడ్డగడ వెంకట శివరామ్ (ఏపీ) 6. ప్రభవ్ ఖండేల్వాల్ (ఢిల్లీ ఐఐటీ పరిధి) 7. బిక్కిని అభినవ్ చౌదరి (ఏపీ) 8. మలయ్ కేడియా (ఢిల్లీ ఐఐటీ పరిధి) 9. నాగిరెడ్డి బాలాజీరెడ్డి (తెలంగాణ) 10. వైపీవీ మనీందర్‌రెడ్డి (ఏపీ) -
సివిల్స్ లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
-
‘సివిల్స్’లో సత్తా చాటిన తెలుగు తేజాలు.. టాప్‌లో ఉమా హారతి
సాక్షి, న్యూఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్‌లో తెలుగు తేజాలు మరోసారి సత్తా చాటారు. ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు కుమార్తె నూకల ఉమా హారతి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం సిమ్లాలో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ లో ట్రైనీ ఆఫీసర్‌గా తరుణ్ పనిచేస్తున్నారు. తరుణ్ తండ్రి ఎం ఆర్ కే పట్నాయక్ రాజమండ్రిలో జక్కంపూడి ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యుడుగా ఉన్నారు. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తరుణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్‌కు చెందిన సాయి అర్హిత్ 40వ ర్యాంకు సాధించారు. ఉమా హారతి జగిత్యాల జిల్లాకు కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన ఏనుగు శివమారుతి రెడ్డి 132వ ర్యాంకు సాధించగా, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బి.వినూత్న 462వ ర్యాంకు సాధించింది. చదవండి: UPSC సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలు విడుదల సివిల్ సర్వీసెస్ 2022 తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది యూపీఎస్సీ. మొత్తం 933 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ర్యాంకులు వెల్లడించింది.933 మందిలో IAS సర్వీసెస్‌కు 180 మందిని ఎంపిక చేసింది. అలాగే IFSకు 38 మందిని, IPSకు 200 మందిని ఎంపిక చేసింది. ఇక సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్-Aకు 473 మందిని, గ్రూప్-Bకి 131 మందిని ఎంపిక చేసింది. గ్రూప్-B కలుపుకుంటే ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్య 1022 అయింది. పవన్ దత్త (తిరుపతి) ఏనుగు శివ మారుతి రెడ్డి (జగిత్యాల) ర్యాంకర్ల వివరాలు: హెచ్ఎస్ భావన -55 అరుణవ్ మిశ్రా-56 సాయి ప్రణవ్-60 నిధి పాయ్- 110 రుహాని- 159 మహేశ్‌కుమార్- 200 రావుల జయసింహారెడ్ది- 217 అంకుర్ కుమార్-257 బొల్లం ఉమామహేశ్వర్‌రెడ్డి-270 చల్లా కల్యాణి- 285 పాలువాయి విష్ణువర్థన్‌రెడ్డి- 292 గ్రంధె సాయికృష్ణ-293 హర్షిత-315 వీరంగంధం లక్ష్మీ సుజిత-311 ఎన్.చేతనారెడ్డి-346 శృతి యారగట్టి- 362 సోనియా కటారియా -376 యప్పలపల్లి సుష్మిత-384 రేవయ్య-410 సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి-426 బొల్లిపల్లి వినూత్న- 462 కమల్ చౌదరి -656 రెడ్డి భార్గవ్-772 నాగుల కృపాకర్ 866 -
మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్‌కు తెలుగు విద్యార్థులు
మణిపూర్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. రెండు ప్రత్యేక విమానాల్లో మొత్తం 157 మంది విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో మణిపూర్ నుంచి ఏపీ, తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. తొలి విమానంలో 108 విద్యార్థులు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి విద్యార్థలను తమ స్వస్థలాలకు చేరేవేసేందుకు రెండు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. మరో ప్రత్యేక విమానంలో 49 విద్యార్థులు కోల్‌కత్తాకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చేలా ఏపీ అధికారులు ఏర్పాటు చేశారు. ఏపీ విద్యార్థులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం కోల్‌కతాకు ప్రత్యేకంగా ఇద్దరు అధికారులు పంపింది. అంతేగాక విద్యార్థులకు విమాన టికెట్లను ప్రభుత్వమే బుక్ చేసింది. విద్యార్థుల భోజన, రవాణా సదుపాయలన్ని ప్రభుత్వం సొంత ఖర్చుతో అందిస్తుంది. చదవండి: ఫలించిన సీఎం జగన్ యత్నం సీఎంకు ధన్యవాదాలు మణిపూర్ చదువుతున్న తెలుగు విద్యార్థులను ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకువస్తున్న నేపథ్యంలో వారి తలిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మణిపూర్ ఎన్ఐటీలో కార్తీక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న తిరుపతి కొర్లగుంటకు చెందిన కార్తీక్ తల్లిదండ్రులు రెడ్డప్ప, మాధవి హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మణిపూర్ ఘటనతో తమ కొడుక్కి ఏం జరుగుతుందో అని ఆందోళన చెందామని, ఎయిర్‌పోర్టు నుంచి కార్తీక్ ఫోన్ చేశాడని పేర్కొన్నారు. సీఎం జగన్ దయవల్ల ఏపీ విద్యార్థులు అందరూ వెనక్కి వస్తున్నారని, ఈ మేరకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. -
ఫలించిన సీఎం జగన్ యత్నం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయనగరం/ వెంకటాచలం/దేవరాపల్లి: మణిపూర్‌లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థుల విషయంలో సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. సొంత ఖర్చులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ విమానాలను ఏర్పాటు చేసింది. ఒక విమానంలో హైదరాబాద్‌కు, మరో విమానంలో కోల్‌కతాకు తీసుకు వచ్చి, అక్కడి నుంచి వారిని స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం ఉదయం 9.35 గంటలకు మొదటి విమానం (IMF HYD 0935/1235108 ఆంధ్రప్రదేశ్) హైదరాబాద్ బయలుదేరనుంది. అందులో 108 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. రెండో విమానం (IMF CCU 1110/122049 ఆంధ్రప్రదేశ్) 11.10 గంటలకు కోల్‌కతా బయలుదేరనుంది. అందులో 49 మంది విద్యార్థులను తీసుకురానున్నారు. మణిపూర్‌లో చిక్కుకున్న మొత్తం 157 మంది విద్యార్థులను ఈ విమానాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విషయం తెలియగానే ముమ్మర కసరత్తు మణిపూర్‌లో చెలరేగిన అల్లర్ల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్ర విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్‌కు సహాయం కోరుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఫోన్ కాల్స్ చేసి వివరాలు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్‌కు వచ్చిన సమాచారం మేరకు మణిపూర్‌లోని నిట్, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారు 157 మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చదువుతున్నట్లు గుర్తించారు. మరోవైపు మణిపూర్‌లోని తెలుగు విద్యార్థులున్న కాలేజీల్లో ఒక్కో కాలేజీ నుంచి ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్‌గా అధికారులు గుర్తించారు. వారి ద్వారా ఆయా కాలేజీల్లోని ఏపీకి చెందిన మిగిలిన విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. వీరందరినీ ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి తీసుకొచ్చి, వారి స్వగ్రామాలకు చేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి విద్యార్థులను విద్యాలయాల నుంచి ఎయిర్‌పోర్టుకు సురక్షితంగా చేర్చేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతూ మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్‌కు ఏపీ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. అలాగే విద్యార్థులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ బన్సాల్‌కు కూడా లేఖ రాశారు. మణిపూర్ ప్రభుత్వంతోపాటు కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి సానుకూలంగా స్పందన వచ్చిందని, విద్యార్థులను తరలించడానికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించిందని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక విమానం ఏర్పాటు కాగానే విద్యార్థులను సురక్షితంగా రాష్ట్రానికి తరలించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక విమానాన్ని ఎన్ని గంటలకు ఏర్పాటు చేస్తామన్న సమాచారంతో పాటు ఏ విమానంలో తరలిస్తామన్నది తెలియజేస్తామని పౌర విమానయాన శాఖ అధికారులు తెలిపారు. ఒకవైపు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదిస్తూనే ప్రయివేటు విమానయాన సంస్థలతోనూ అధికారులు మాట్లాడుతున్నారు. ప్రత్యేక విమానం ఏర్పాటుకు ఇండిగో విమానయాన సంస్థతో అధికారులు సంప్రదిస్తున్నారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కర్ఫ్యూను సోమవారం నుంచి కొన్ని గంటల పాటు సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి ఉదయం 5 గంటల నుంచి 8 వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ప్రకటించింది. చురుగ్గా ఏర్పాట్లు : మంత్రి బొత్స మణిపూర్ నుంచి రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విజయనగరంలో ఆదివారం సాయంత్రం ఆయన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో అక్కడ మన విద్యార్థుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, వారికి అండగా నిలిచేందుకు కో ఆర్డినేటర్లను పంపామని చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్ లైన్ (88009 25668, 98719 99055) ఏర్పాటు చేశామన్నారు. విమానాశ్రయానికి వచ్చేశా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో తాను ఇంటికి బయలుదేరారని, ప్రస్తుతం క్షేమంగా మణిపూర్‌లోని విమానాశ్రయానికి చేరుకున్నానని మణిపూర్‌లో ఇంజినీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పాలిచెర్లపాడుకు చెందిన విద్యార్థి కల్యాణ్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం తండ్రి బి.ముసలయ్యకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. కాగా, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాకపల్లి గ్రామానికి చెందిన వేపాడ వెంకటేష్ అనే విద్యార్థి మణిపూర్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాడు. మణిపూర్‌లోని ట్రిపుల్ ఐటీలో కంప్యూటర్ సైన్స్ ఫస్టియర్ చదువుతున్నాడు. తాను చదువుతున్న కళాశాలకు సమీపంలో ఆందోళనకారులు భవనాలకు నిప్పు అంటించారని, ఓ జంటను హతమార్చారని స్థానిక విలేకరులకు ఫోన్ ద్వారా తెలిపాడు. తనతో పాటు యలమంచిలికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి కౌషిక్, మరో 25 మంది ఉన్నారన్నారు. తమను వెంటనే ఏపీకి తరలించే ఏర్పాటు చేయాలని కోరాడు. చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే.. -
ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
బనశంకరి: వాయువేగంతో కారు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. ఈ ఘటన బెంగళూరు మడివాళ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉన్నత చదువులు చదివి కంటి వెలుగులు అవుతారనుకున్న కుటుంబాల ఆశలు చిదిమిపోయాయి. ఒకే హాస్టల్లో స్నేహితులు వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ చెందిన కార్తీక్ (23), బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటూ కోరమంగలలో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన భగీరథరెడ్డి (17) బెంగళూరులో ఒక ప్రైవేటు కాలేజీలో పీయూసీ చదువుతూ అదే ప్రైవేటు హాస్టల్లో ఉంటున్నాడు. ఇద్దరి మధ్య స్నేహం ఉండేది. డివైడర్‌ను ఢీకొని మళ్లీ బస్సును మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో కార్తీక్ తన కారులో భగీరథరెడ్డి కలిసి బయలుదేరారు. కారులో వేగంగా వెళ్తూ సిల్క్‌బోర్డు సమీపంలో రోడ్డు డివైడరును అదుపుతప్పి ఢీకొని దూసుకెళ్లి అవత ల లేన్‌లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అంతలోగా ఇద్దరు మృతిచెందారు. బస్సులోని కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మడివాళ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. -
అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
సాక్షి, వరంగల్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మిస్సోరిలోని ఓజార్క్ సరస్సులో ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యారు. వీరిలో వికారాబాద్‌కు చెందిన శివదత్తు, హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. నలుగురు తెలుగు విధ్యార్థులు మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మరణ వార్త తెలియడంతో అతని తల్లిదండ్రులు జనార్థన్, ఝాన్సీ లక్ష్మీ బోరున విలపిస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన ఉత్తేజ్ హెల్త్ సైన్స్ డేటాలో మాస్టర్స్ చేస్తున్నాడు. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లాతాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) కూడా మరణించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు శివదత్తు. సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితులతొ కలిసి ఓజార్క్ లేక్‌కు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్‌ను బస్టాప్‌లో దింపేందుకు వెళ్తుండగా.. -
ఐఐటీల ప్రవేశాల్లో తెలుగు విద్యార్థులు భేష్!
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన కౌన్సెలింగ్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు గణనీయ సంఖ్యలో సీట్లు కొల్లగొట్టారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా సక్సెస్ రేటును పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణ టాప్–5 రాష్ట్రాల్లో ఉండటం విశేషం. భర్తీ అయిన మొత్తం 16,635 సీట్లలో 18.5 శాతం సీట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. సక్సెస్ రేటులో ముందు వరుసలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ ఐదో స్థానంలో నిలిచాయి. కాగా మొదటి స్థానంలో రాజస్థాన్, రెండో స్థానంలో మహారాష్ట్ర ఉండగా నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. భర్తీ అయిన మొత్తం సీట్లలో సగానికి పైగా ఈ ఐదు రాష్ట్రాల విద్యార్థులకే దక్కడం విశేషం. అగ్రస్థానంలో రాజస్థాన్.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఐఐటీల్లో సీట్లను కైవసం చేసుకున్న విద్యార్థుల్లో 15 శాతం సక్సెస్ రేట్‌తో రాజస్థాన్ అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరైన 13,801 మందిలో 2,184 మంది ఐఐటీల్లో చేరారు. రాజస్థాన్ తర్వాత సక్సెస్ రేటులో మహారాష్ట్ర నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి 16,341 మంది అడ్వాన్స్‌డ్‌కు హాజరు కాగా 1,747 మంది (సక్సెస్ రేటు 10.69) ఐఐటీల్లో సీట్లు సాధించారు. సక్సెస్ రేటులో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. ఏపీ నుంచి 14,364 మంది పరీక్షరాయగా 1,428 మంది ఐఐటీల్లో ప్రవేశం పొందారు. సక్సెస్ రేటు పరంగా నాలుగో స్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ నుంచి 22,807 మంది పరీక్ష రాయగా 2,131 మంది ఐఐటీల్లో చేరారు. ఐదో స్థానంలో నిలిచిన తెలంగాణ నుంచి 17,891 మంది హాజరు కాగా 1,644 మందికి (సక్సెస్ రేటు 9.18) సీట్లు లభించాయి. ఐఐటీలన్నీ హౌస్‌ఫుల్.. కాగా ఈ ఏడాది ఐఐటీల్లో దాదాపు అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. కొన్ని కొత్త ఐఐటీలు మినహా ప్రముఖ ఐఐటీలన్నింటిలో సీట్లు పూర్తిగా నిండాయి. ప్రముఖ ఐఐటీల్లో అయితే మొత్తం సీట్ల కంటే అదనంగా సీట్లను కేటాయించడం విశేషం. తమ సంస్థల్లో చేరడానికి వచ్చే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైతే అదనంగా సీట్లు కేటాయించుకునేలా ఆయా ఐఐటీలకు స్వయంప్రతిపత్తి ఉంది. దీంతో పలు సంస్థలు అదనపు ప్రవేశాలు కల్పించాయి. 2022–23 విద్యాసంవత్సరానికి ఐఐటీల్లో 16,598 సీట్లు ఉన్నట్టు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్‌కు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో 1,567 సీట్లు మహిళల కోసం సూపర్ న్యూమరరీ కోటాలో కేటాయించారు. కాగా ఆరు విడతల కౌన్సెలింగ్ తర్వాత మొత్తం సీట్లు 16,598 మించి ప్రవేశాలు ఉండడం విశేషం. ఐఐటీ బాంబే విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మొత్తం 16,635 సీట్లు భర్తీ అయ్యాయి. మహిళలకు సూపర్ న్యూమరరీ కోటా కింద కేటాయించిన సీట్లు 1,567తోపాటు ఇతర కేటగిరీల్లో ప్రతిభ ఆధారంగా మరో 1,743 సీట్లు దక్కాయి. ప్రముఖ ఐఐటీల్లో అదనంగా సీట్ల కేటాయింపు.. విద్యార్థులు మొదటి ప్రాధాన్యం ఇచ్చే ఐఐటీ బాంబేలో 1,360 సీట్లుండగా ఆ సంస్థ 1,371 మందికి ప్రవేశాలు కల్పించింది. అలాగే ఐఐటీ ఢిల్లీలో మొత్తం సీట్లు 1,209 కాగా 1,215 మందిని చేర్చుకుంది. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 1,869 సీట్లు ఉండగా 1,875 సీట్లు కేటాయించింది. వీటితోపాటు ఐఐటీ మద్రాస్, కాన్పూర్, హైదరాబాద్, రూర్కీ, తిరుపతి, గౌహతి, భువనేశ్వర్, పాట్నా, ఇండోర్ వంటి చోట్ల కూడా మొత్తం సీట్లకు మించి భర్తీ చేశారు. అలాగే డ్యూయెల్ డిగ్రీలకు సంబంధించి 102 సీట్లు కూడా భర్తీ అయినట్టు ఐఐటీ బాంబే గణాంకాలు పేర్కొంటున్నాయి. ఐఐటీ జోధ్‌పూర్, రోపార్, ధార్వాడ్, జమ్మూ, వారణాసి, ధన్‌బాద్‌ల్లో మాత్రమే స్వల్పంగా సీట్లు మిగిలాయి. ఐఐటీ బాంబే వైపే టాపర్ల మొగ్గు.. కాగా ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ 1,000 ర్యాంకులు సాధించినవారిలో ఏకంగా 246 మంది ఐఐటీ బాంబేను ఎంచుకోవడం విశేషం. ఆ తర్వాత 210 మంది అభ్యర్థులతో ఐఐటీ ఢిల్లీ నిలిచింది. -
తెలుగు విద్యార్థుల విజయకేతనం
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్–2022 ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దుమ్ములేపారు. ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులు హాజరవ్వగా.. అఖిల భారత స్థాయిలో 100లోపు ర్యాంకుల్లో 25 మంది, 200లోపు 48 మంది, 300లోపు 79 మంది, 400లోపు ర్యాంకుల్లో 100 మందికి పైగా విద్యార్థులు సత్తా చాటారు. ఇక 2, 4, 6, 10 ర్యాంకులతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించిన ఐఐటీ–బాంబే ఆదివారం ఈ ఫలితాలను విడుదల చేసింది. కామన్ ర్యాంకులతోపాటు వివిధ కేటగిరీల్లోని ఆలిండియా ర్యాంకుల్లోనూ తెలుగు విద్యార్థులు తమ సత్తా చాటారు. ఆలిండియా కామన్ ర్యాంకుల్లో పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి 2వ ర్యాంకు.. వంగపల్లి సాయి సిద్ధార్థ 4వ ర్యాంకు, పోలిశెట్టి కార్తికేయ 6వ ర్యాంకు, ధీరజ్ కురుకుంద 8వ ర్యాంకు, వెచ్చా జ్ఞాన మహేష్ 10వ ర్యాంకు సాధించారు. ఇక రిజర్వుడ్ కేటగిరీలకు సంబంధించి ఓబీసీ ఎన్సీఎల్, జనరల్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ కేటగిరీల్లోనూ ఆలిండియా టాప్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు నిలిచారు. కాగా ఐఐటీ–బాంబే జోన్‌లోని ఆర్కే శిశిర్ ఆలిండియా స్థాయిలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నాడు. శిశిర్.. అడ్వాన్స్‌డ్‌లో 360 మార్కులకుగానూ 314 మార్కులు సాధించాడు. అమ్మాయిల విభాగంలో ఐఐటీ ఢిల్లీ జోన్లో తనిష్క కాబ్రా టాప్ ర్యాంకర్‌గా (కామన్ ర్యాంకుల్లో 16వ స్థానం) నిలిచింది. ఈమెకు అడ్వాన్స్‌డ్‌లో 277 మార్కులు వచ్చాయి. 26.17 శాతం మందికే అర్హత మార్కులు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టు 28న నిర్వహించారు. రెండు పేపర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,55,538 హాజరుకాగా 40,712 (26.17 శాతం) మంది మాత్రమే అర్హత మార్కులు సాధించారు. అబ్బాయిల్లో 1,21,930 మందికి గాను 34,196 (28 శాతం) మంది, అమ్మాయిల్లో 33,608 మందిలో 6,516 (19.38 శాతం) మంది మాత్రమే అర్హత సాధించారు. దివ్యాంగుల్లో 1,392 మందిలో 375 మంది, విదేశీ విద్యార్థుల్లో 280 మందిలో 145 మంది అర్హులుగా నిలిచారు. నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు వెలువడడంతో జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను ప్రారంభించనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను జోసా ప్రకటించింది. ఈ నెల 23న మొదటి విడత సీట్ల కేటాయింపు చేయనున్నారు. చివరి రౌండ్ సీట్ల కేటాయింపు అక్టోబర్ 17తో ముగుస్తుంది. అనంతరం ఎవరైనా సీట్లను ఉపసంహరించుకుంటే మిగిలిన సీట్లకు అక్టోబర్ 18, 21 తేదీల్లో ప్రత్యేక రౌండ్ నిర్వహించి ఆ సీట్లను భర్తీ చేస్తారు. మెరిట్, రిజర్వేషన్ ప్రాతిపదికన సీట్ల భర్తీ.. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, జీఎఫ్టీఐలలో మొత్తం 54,477 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని జేఈఈలో మెరిట్, రిజరేషన్ల ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. 23 ఐఐటీల్లో 16,598 సీట్లు, 31 ఎన్ఐటీల్లో 23,994 సీట్లు, 26 ఐఐఐటీల్లో 7,126 సీట్లు, 33 జీఎఫ్‌టీఐల్లో 6,759 సీట్లు ఈసారి భర్తీకి అందుబాటులో ఉన్నాయి. వీటిలోనే అమ్మాయిలకు సూపర్ న్యూమరరీ కోటా కూడా అమలు కానుంది. ఐఐటీల్లో 1,567, ఎన్ఐటీల్లో 749, ఐఐఐటీల్లో 625, జీఎఫ్‌టీఐల్లో 30 సీట్లు అమ్మాయిలకు కేటాయిస్తారు. 14న ఏఏటీ పరీక్ష.. 17న ఫలితాలు.. ఆర్కిటెక్చర్ కోర్సులకు సంబంధించి ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ)కు 11, 12 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న ఏఏటీని నిర్వహించి 17న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఐఐటీ బాంబేకే ప్రాధాన్యం ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా.. మాది ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం పెద ఇర్లపాడు. అమ్మానాన్న.. లక్ష్మీకాంతం, పోలు మాల్యాద్రిరెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికే అన్నయ్య సాయి లోకేష్‌రెడ్డి ఐఐటీ బాంబేలో చదువుతున్నాడు. నాకు తాజా జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో రెండో ర్యాంక్ వచి్చంది. 360కి 307 మార్కులు వచ్చాయి. తెలంగాణ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాను. బాంబే ఐఐటీలో చేరాలనే లక్ష్యంతో రోజుకు 15 గంటలపాటు చదివాను. – పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి, ఆలిండియా రెండో ర్యాంకర్ నాలుగో ర్యాంక్ వచ్చింది. మాది విజయవాడలోని గుణదల. నాన్న.. వెంకట సుబ్బారావు ఏపీ జెన్కోలో ఇంజనీర్. అక్క దీపిక సిద్దార్ధ వైద్య కళాశాలలో హౌస్ సర్జన్‌గా చేస్తోంది. నాకు ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంక్, ఓబీసీ విభాగంలో మొదటి ర్యాంక్ వచ్చింది. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యం. – వంగపల్లి సాయి సిద్ధార్థ, ఆలిండియా నాలుగో ర్యాంకర్ బీటెక్ చదువుతా.. మాది హైదరాబాద్. నాన్న బ్యాంక్ మేనేజర్. అమ్మ.. గృహిణి. నాకు జేఈఈ మెయిన్‌లో 4వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 8వ ర్యాంకు లభించాయి. ఐఐటీ బాంబేలో బీటెక్ చేయడమే నా లక్ష్యం. – ధీరజ్ కురుకుంద, ఆలిండియా 8వ ర్యాంకర్ యూఎస్‌లో ఎంఎస్ చదువుతా.. మాది విశాఖపట్నంలోని సీతమ్మధార. నాన్న.. రామారావు కొవ్వొత్తుల వ్యాపారం చేస్తున్నారు. తల్లి.. ఝాన్సీలక్ష్మి గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పదో ర్యాంకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆలిండియా రెండో ర్యాంకు సాధించాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా. యూఎస్‌లో ఎంఎస్ చేయడమే నా లక్ష్యం. – వెచ్చా జ్ఞాన మహేష్, పదో ర్యాంకర్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే.. మాది ప్రకాశం జిల్లా గిద్దలూరు. నాన్న.. సర్వేశ్వరరావు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజనీర్ కాగా, తల్లి మాధవీలత ప్రభుత్వ ఉపాధ్యాయిని. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 261 మార్కులు వచ్చాయి. దీంతో జాతీయ స్థాయిలో 33వ ర్యాంక్ సాధించాను. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించగలిగాను. – సాయి ముకేష్, ఆలిండియా 33వ ర్యాంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం.. మాది నెల్లూరు. నాన్న కిశోర్ బట్టల షాపు నిర్వహిస్తున్నారు. అమ్మ వాణి గృహిణి. నాకు ఇంటర్లో 985 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో 101వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 61వ ర్యాంక్ సాధించాను. మంచి ఐఐటీలో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం. – అనుమాలశెట్టి వర్షిత్, ఆలిండియా 61వ ర్యాంకర్ పది మందికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తా.. మాది అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న.. వెంకట రమణ ఎల్ఐసీ అడ్వైజర్, అమ్మ.. లక్ష్మి గృహిణి. జేఈఈ మెయిన్‌లో 133వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 19వ ర్యాంక్ వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా స్థాయిలో 63వ ర్యాంక్, ఈడబ్ల్యూఎస్ విభాగంలో 6వ ర్యాంక్ సాధించాను. బాంబే ఐఐటీలో చేరతా. పది మందకీ ఉపాధి అవకాశాలు కల్పించేలా సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేస్తా. – గండు హరిదీప్, ఆలిండియా 63వ ర్యాంకర్ సామాజిక సేవే లక్ష్యం.. మాది వైఎస్సార్ జిల్లా వేంపల్లె. అమ్మానాన్న సువర్ణలత, తిరుపాల్‌రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులు. నేను 1వ తరగతి నుంచి 5 వరకు వేంపల్లెలో, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు గుడివాడలో, ఇంటర్ హైదరాబాద్‌లో చదివాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 82వ ర్యాంకు లభించింది. భవిష్యత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నవుతా. సమాజంలో అందరికీ సేవచేయాలన్నదే నా లక్ష్యం. – తమటం సాయిసింహ బృహదీశ్వరరెడ్డి, ఆలిండియా 82వ ర్యాంకర్ -
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) విడుదల చేసింది. జేఈఈ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచింది. జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు విద్యార్థి పి రవిశంకర్ ఆరో ర్యాంక్ సాధించగా.. హిమవంశీకి ఏడో ర్యాంక్, పల్లి జయలక్ష్మికి 9వ ర్యాంక్ వచ్చింది. కాగా ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ఫైనల్ కీని మాత్రమే రిలీజ్చేసిన ఎన్టీఏ.. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. -
విధాన నిర్ణయాల్లో జోక్యం కూడదు
సాక్షి, అమరావతి: ప్రాథమిక స్థాయి నుంచే విద్యను పటిష్టం చేసేందుకు, తెలుగు విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడేలా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అమలు చేయాల్సిన ఉపాధ్యాయ సంఘాలు వాటి మార్పులపై మాట్లాడటం సరికాదని హితవు పలికారు. సోమవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ పాఠశాలల విలీనాన్ని చేపట్టామన్నారు. అయితే ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ రీత్యా ఇబ్బందులు ఉంటే వాటిపై పోరాడాలేగానీ, ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవడం తగదన్నారు. ఉద్యమాలు చేస్తున్న ఉపాధ్యాయుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారని ప్రశ్నించారు. వారి పిల్లల భవిష్యత్తుకు పునాదులు పటిష్టంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదని, అలాగే పేద పిల్లల ఉన్నతిని కూడా వారు కోరుకోవాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని చెప్పారు. మెరుగైన విద్యకు బాటలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఎల్కేజీ, యూకేజీతో పాటు ఒకటి, రెండు తరగతులను కలిపి ఒకే చోట ఏర్పాటు చేసి ఇద్దరు ఎస్జీటీ, ఇద్దరు అంగన్వాడీ టీచర్ల పర్యవేక్షణలో చదువు చెబుతున్నట్లు బొత్స తెలిపారు. 3 నుంచి 8వ తరగతి/ 3 నుంచి 10వ తరగతి/3 నుంచి ఇంటర్ వరకు ఒకే చోట ఏర్పాటు చేయడం ద్వారా ప్రాథమికంగానే సబ్జెక్టు టీచర్ల బోధన లభిస్తుందన్నారు. డిజిటల్ స్క్రీన్‌పై క్లాసులు, 8వ తరగతి నుంచి 5 లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్‌లో ఇంగ్లిషులో ఉచిత బోధనలు అందిస్తున్నామన్నారు. అక్షరక్రమంలో తొలి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను విద్యా రంగంలో కూడా ప్రథమ స్థానంలో నిలిపేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో విలీనానికి 5,800 పాఠశాలలను మ్యాపింగ్ చేస్తే 268 స్కూళ్ల నుంచి అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. వాటిని జాయింట్ కలెక్టర్లు పరిశీలించి, ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలిపారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్ ప్రకారమే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యా బోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా, ప్రైవేటు పాఠశాలలకు నిర్ణీత రేట్ల ప్రకారం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఇందు కోసం రాష్ట్రంలోని 660 ప్రింటింగ్ ప్రెస్‌లను ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నామన్నారు. అయితే ప్రైవేటు పాఠశాలలు నిర్లక్ష్యంగా ఇండెంట్ తక్కువగా పెట్టడం వల్లే పుస్తకాల కొరత ఏర్పడిందన్నారు. ఆ సమస్యను అధిగమించేందుకు 15 రోజుల్లో మళ్లీ ఇండెంట్ పెట్టాలని ఆయా యాజమాన్యాలకు సూచించినట్లు తెలిపారు. -
జేఈఈ మెయిన్ తొలి విడత.. మనోళ్లే టాపర్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు సహా ఇతర జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జరిగిన జేఈఈ మెయిన్– 2022 మొదటి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు టాపర్ల జాబితాలో నిలిచారు. రాష్ట్రానికి చెందిన జాస్తి యశ్వంత్ వీవీఎస్, అనికెత్ చటోపాధ్యాయ, ధీరజ్ కురుకుండ, రూపేష్ బియానీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొయ్యన సుహాస్, పెనికలపాటి రవికిషోర్, పోలిశెట్టి కార్తికేయ నూటికి నూరు ఎన్టీఏ స్కోర్ సాధించారు. హరియాణా, జార్ఖండ్, పంజాబ్, అస్సాం, రాజస్తాన్, కర్ణాటక, యూపీకి చెందిన ఒక్కో విద్యార్థి కూడా టాపర్లు గా ఎంపికయ్యారు. మొత్తం 14 మంది విద్యార్థులు టాప్ స్కోర్ సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆదివారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసిన ఫలితాల్లో పేర్కొంది. అన్ని కేటగిరీల్లోనూ... అన్ని కేటగిరీల్లోనూ తెలంగాణ, ఏపీ విద్యార్థులు ముందు వరుసలో నిలిచారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కోటాలో ఏపీ విద్యార్థి పి.రవి కిషోర్ టాపర్‌గా నిలవగా ఎస్సీ విభాగంలో ఏపీ విద్యార్థి డి. జాన్ జోసెఫ్ 99.99 పర్సంటైల్‌తో మొదటి స్థానంలో సాధించాడు. ఓబీసీ కోటాలో 99.99 పర్సంటైల్‌తో ఏపీ విద్యార్థి సనపాల జస్వంత్ ఐదవ స్థానంలో నిలిచాడు. అలాగే అమ్మాయిల విభాగంలో ఏపీ విద్యార్థినులు టాప్–10లో 5 స్థానాలు సాధించారు. పేపర్ కఠినంగా ఉన్నా... జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష జూన్ 24 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా 588 కేంద్రాల్లో జరిగింది. ఈ పరీక్షకు 8,72,432 మంది దరఖాస్తు చేసుకోగా 7.69 లక్షల మంది పరీక్ష రాశారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి కారణంగా గత రెండేళ్లపాటు నాలుగు విడతలుగా నిర్వహించిన జేఈఈ మెయిన్స్‌ను ఈసారి కరోనా తీవ్రత తగ్గడంతో రెండు విడతలుగా జరుగుతోంది. తొలి విడత ఫలితాలు విడుదలవగా రెండో విడత పరీక్ష ఈ నెల 24 నుంచి 30 వరకు జరగనుంది. గత రెండేళ్లుగా సరైన తర్ఫీదు లేకపోవడం, రాష్ట్రాల ఇంటర్ బోర్డులు సిలబస్‌ను 70 శాతానికి కుదించినా, ఎన్టీఏ మాత్రం ఈ వెసులుబాటు ఇవ్వకపోవడంతో ఈసారి పరీక్ష కొంత కఠినంగానే ఉందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ తొలి విడతలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని గణితశాస్త్ర నిపుణుడు ఎంఎన్ రావు తెలిపారు. తొలి విడత మెయిన్స్ రాయలేకపోయిన వారు లేదా తొలి విడతలో వచ్చిన తమ స్కోర్‌ను మెరుగుపరుచుకోవాలనుకొనే విద్యార్థులు రెండో విడత జేఈఈ మెయిన్స్ రాసుకోవచ్చు. రెండు విడతల పరీక్ష పూర్తయ్యాకే ఎన్టీఏ ర్యాంకులు విడుదల చేయనుంది. సత్తా చాటిన ఎస్సీ, బీసీ గురుకుల విద్యార్థులు... జేఈఈ మెయిన్స్ మొదటి విడత ఫిలితాల్లో రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. మొత్తం 581 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాయగా వారిలో 35 మంది విద్యార్థులు 90 పర్సంటైల్ సాధించినట్లు ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెజారిటీ విద్యార్థులకు 40 కంటే ఎక్కువ పర్సంటైల్ వచ్చిందన్నారు. మరోవైపు మొత్తం 60 మంది బీసీ గురుకుల విద్యార్థులు ఈ పరీక్ష రాయగా 23 మంది అర్హులయ్యారు. భరత్‌కుమార్ అనే విద్యార్థి 92.01 పర్సంటైల్ సాధించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, అధ్యాపకులను బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు అభినందించారు. కాగా, జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సిరిసిల్ల పట్టణంలోని పెద్ద బజార్‌కు చెందిన గజవాడ శ్రీనివాస్–శ్రీదేవి దంపతుల ఇద్దరు కుమారుల్లో ఒకడైన భరత్ 99.764 పర్సంటైల్ సాధించాడు. ఎన్టీఏ స్కోర్ అంటే... ఈ పరీక్షలో విద్యార్థులకు ప్రకటించిన ఎన్టీఏ స్కోర్, వారికి వచ్చిన మార్కుల శాతం రెండూ ఒకటి కావని ఓ ఎన్టీఏ ఉన్నతాధికారి తెలిపారు. ఒక విడతలో పరీక్ష రాసిన విద్యార్థులందరి సాపేక్ష ప్రతిభా ప్రదర్శన ఆధారంగా స్కోర్ కేటాయిస్తామని... ఇందుకోసం విద్యార్థులు సాధించే మార్కులను 100 నుంచి 0 మధ్య ఉండే స్కేల్‌కు అనుగుణంగా మారుస్తామని చెప్పారు. -
తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2021 తుది ఫలితాలను (ఇంటర్వ్యూ) యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 685 మందిని ఆయా క్యాడర్ పోస్టులకు ఎంపిక చేసింది. సివిల్స్ తుది ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు. ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లి యశ్వంత్‌కుమార్‌రెడ్డి 15వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. విజేతలుగా నిలిచిన అభ్యర్థుల నేపథ్యం, వారి మనోగతాలివీ.. యశ్వంత్‌కుమార్‌రెడ్డి నేపథ్యమిదీ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లె యశ్వంత్‌కుమార్‌రెడ్డి తల్లిదండ్రులు.. పుల్లారెడ్డి, లక్ష్మీదేవి. యశ్వంత్ వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం కూలురు కొట్టాల ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు, రాజంపేట నవోదయలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివారు. విజయవాడలో ఇంటర్, కాకినాడ జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ఐవోసీఎల్ కంపెనీలో చేరారు. అనంతరం గ్రూప్–1లో మూడో ర్యాంక్ సాధించి సీటీవోగా కర్నూలులో పనిచేస్తూ సివిల్స్‌లో శిక్షణ పొందారు. 2020లో సివిల్స్‌లో 93వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ సివిల్స్ రాసి పట్టుదలతో 15వ ర్యాంక్ సాధించారు. పూసపాటి వంశీకురాలికి 24వ ర్యాంక్ విశాఖ జిల్లా ఎండాడకు చెందిన పూసపాటి సాహిత్య సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించారు. విజయనగరం జిల్లా ద్వారపూడికు చెందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పూసపాటి కృష్ణంరాజు మనవరాలు ఈమె. సాహిత్య తల్లిదండ్రులు.. జగదీష్‌వర్మ, పద్మజ. బీఫార్మసీలో నేషనల్ టాపర్‌గా నిలిచి ఎమ్మెస్సీ చేసిన సాహిత్య ఏడాదిపాటు ఉద్యోగం చేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను’ అని సాహిత్య తెలిపారు. సత్తా చాటిన నర్సీపట్నం యువకుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువకుడు మంతిన మౌర్య భరద్వాజ్ 28వ ర్యాంకు సాధించారు. 2017 నుంచి వరుసగా ఐదుసార్లు ప్రయత్నం చేసి చివరకు లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. భరద్వాజ్ తండ్రి సత్యప్రసాద్ హైస్కూల్లో హెచ్ఎంగా, తల్లి రాధాకుమారి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. వరంగల్ నిట్‌లో బీటెక్ పూర్తి చేసిన భరద్వాజ్ కొద్దికాలం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలాన్ని శిక్షణకు వెచ్చించి విజయం సాధించారు. ‘పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా నా వంతు కృషి చేస్తాను.. విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మరింత సేవ చేయాలన్నదే నా అభిమతం’ అని భరద్వాజ చెప్పారు. కందుకూరు కోడలికి 37వ ర్యాంక్ నెల్లూరు జిల్లా కందుకూరు కోడలు వి.సంజన సింహ 37వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లోనే బీటెక్ పూర్తి చేశారు. ఆ తరువాత సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు. భర్త హర్ష ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రయత్నించిన సంజన మూడో ప్రయత్నంలో ఐఆర్ఎస్కు ఎంపికై., ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇన్‌కంట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘నాలుగో ప్రయత్నంలో విజయం సాధించాను’ అని సంజన చెప్పారు. 56వ ర్యాంకర్ డాక్టర్ కిరణ్మయి కాకినాడ రూరల్ వలసపాకల గ్రామానికి చెందిన డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో 56వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి కొప్పిశెట్టి లక్ష్మణరావు హైదరాబాద్‌లో రక్షణశాఖ (డీఆర్డీఎల్)లో సీనియర్ టెక్నికల్ అధికారిగా, తల్లి వెంకటలక్ష్మి టీచర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కిరణ్మయి ఉస్మానియాలో ఎంబీబీఎస్, ఎంఎస్ చేసి అక్కడే వైద్యురాలిగా పనిచేశారు. 2019లో సివిల్స్ డానిక్స్‌లో 633 ర్యాంకు సాధించి ఆర్డీవో స్థాయి ఉద్యోగానికి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. ఉన్నతోద్యోగాలు వదులుకొని.. 62వ ర్యాంకు సాధించిన తిరుమాని శ్రీపూజ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండికి చెందినవారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీపూజ ఎన్ఐటీ సూరత్కల్లో బీటెక్ చేశారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. ‘లక్షలాది రూపాయల వేతనం కూడిన ఉన్నతోద్యోగాలు వచ్చినా చేరలేదు. మొదటిసారి సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. రెండోసారి ర్యాంకును సాధించాను’ అని శ్రీపూజ చెప్పారు. సత్తా చాటిన రైతు బిడ్డ 2021 సివిల్స్‌లో నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతు బిడ్డ గడ్డం సుధీర్‌కుమార్ సత్తా చాటారు. పెద్ద రామసుబ్బారెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడైన సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంకు సాధించారు. ఇంటర్ గుడివాడలో చదివి, ఖరగ్‌పూర్ ఐఐటీ చేశారు. 4వ ప్రయత్నంలో ఐఏఎస్ సాధించారు. రాజమహేంద్రి కుర్రాడికి 99వ ర్యాంకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకి చెందిన తరుణ్ పట్నాయక్ తొలి ప్రయత్నంలోనే 99వ ర్యాంకు సాధించారు. తరుణ్ తండ్రి రవికుమార్ పట్నాయక్ ఎల్ఐసీ రూరల్ బ్రాంచిలో క్లర్క్‌గా పనిచేస్తుండగా, తల్లి శారదా రాజ్యలక్ష్మి వైజాగ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తరుణ్ పట్నాయక్ గౌహతి ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ‘సివిల్స్‌కు స్వంతంగా చదువుకుంటూనే తొలి ప్రయత్నంగా పరీక్ష రాశాను. 99వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఏఎస్‌గా ఎంపికై ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యం నెరవేరింది’ అని తరుణ్ పట్నాయక్ తెలిపారు. ఎమ్మిగనూరు అమ్మాయికి 128వ ర్యాంక్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అంబికాజైన్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 128వ ర్యాంకు సాధించారు. పట్టణానికి చెందిన జైన్ ఎలక్ట్రికల్ షాపు యజమాని లలిత్‌కుమార్, అనిత దంపతుల కుమార్తె అయిన అంబికాజైన్ 10వ తరగతి వరకు ఇక్కడే చదివారు. ఇంటర్మీడియెట్, డిగ్రీలను హైదరాబాద్‌లో పూర్తి చేసి ఢిల్లీలోని సౌత్ ఏషియన్ వర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్లో ఎంఏ చేశారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఆన్లైన్ కోచింగ్..154వ ర్యాంక్ నంద్యాల జిల్లా నందిపల్లెకు చెందిన వంగల సర్వేశ్వరరెడ్డి, మల్లేశ్వరమ్మల కుమార్తె మనీషారెడ్డి సివిల్స్‌లో 154వ ర్యాంకు సాధించింది. మనీషా ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. సివిల్స్‌లో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకుంది. మనీషారెడ్డి మాట్లాడుతూ.. ‘రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఆడపిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్ చదువులే కాదు కష్టపడితే అతి తక్కువ కాలంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా సాధించగలరు’ అని చెప్పారు. న్యాయవాది కుమారుడికి 157వ ర్యాంక్ పల్నాడు జిల్లా పెదకూరపాడుకి చెందిన కన్నెధార మనోజ్‌కుమార్ 157వ ర్యాంక్ సాధించారు. న్యాయవాది కన్నెధార హనమయ్య, రాజరాజేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన మనోజ్ ఐఐటీ ఇంజనీరింగ్ విద్యను తిరుపతిలో అభ్యసించారు. ఆ తరువాత రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం రాగా.. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో 157 ర్యాంకు సాధించారు. ‘దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే సివిల్స్‌కు సిద్ధమయ్యా. తల్లిదండ్రుల స్ఫూర్తితో రోజుకు 8 గంటలు చదివేవాడిని’ అని మనోజ్‌కుమార్ తెలిపారు. మూడో ప్రయత్నంలో 235వ ర్యాంక్ గుంటూరు శ్యామలానగర్‌కు చెందిన కాకుమాను అశ్విన్ మణిదీప్ మూడో ప్రయత్నంలో 235వ ర్యాంకు సాధించారు. మణిదీప్ తండ్రి కిషోర్, తల్లి ఉమాదేవి ఉపాధ్యాయులు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ టెక్నాలజీలో బీటెక్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మణిదీప్ మాట్లాడుతూ.. ‘తొలిసారి దారుణంగా ఓటమి చెందినా నిరాశ చెందకుండా చెన్నైలో శిక్షణ పొందాను. ఆన్లైన్ టెస్ట్‌లు రాసేవాడిని, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, పత్రికలు చదవడం చేసేవాడిని’ అని చెప్పారు. తల్లిదండ్రుల స్ఫూరితో సివిల్స్‌కు.. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన షేక్ అబ్దుల్ రవూఫ్ సివిల్స్‌లో 309 ర్యాంక్ సాధించారు. రవూఫ్ తండ్రి మహ్మద్ ఇక్బాల్ వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండగా.. తల్లి గౌసియా బేగం కృష్ణా జిల్లా మైనార్జీ సంక్షేమ అధికారిగా, వ్యవసాయ శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పని చేశారు. ‘ముంబై ఐఐటీలో బీటెక్ పూర్తి చేశాక అమెరికాలో ఎంఎస్ చేశాను. చెన్నైలో నాబార్డు మేనేజర్‌గా రెండున్నరేళ్లు పని చేశాను. ఏడాదిగా ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ పొందాను’ అని రవూఫ్ పేర్కొన్నారు. గంగపుత్రుడికి 350వ ర్యాంక్ కాకినాడ పర్లోవపేటకు చెందిన దిబ్బాడ సత్యవెంకట అశోక్ 350వ ర్యాంక్ సాధించారు. అశోక్ తండ్రి సత్తిరాజు సముద్రంలో చేపల వేట చేస్తుంటారు. అశోక్ ఇంటర్మీడియెట్ గుంటూరులో, గౌహతిలో ఐఐటీ బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేశారు. నాలుగో ప్రయత్నంలో 350వ ర్యాంకు సాధించారు. రైతు బిడ్డకు 420వ ర్యాంక్ తెనాలి రూరల్ మండలం చావావారి పాలెంకు చెందిన రైతుబిడ్డ నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంకు సాధించారు. విజయవాడలో ఇంటర్, జేఎన్టీయూ, పులివెందులలో బీటెక్, చెన్నైలో రెన్యూవబుల్ ఎనర్జీలో ఎంటెక్ చేశాడు. జూనియర్ సైంటిస్ట్‌గా పనిచేశారు. ‘ప్రస్తుత ర్యాంక్‌తో ఐఆర్ఎస్ వస్తుందని భావిస్తున్నా. మరోసారి సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలనేది నా ఆశయం’ అని బాలకృష్ణ చెప్పారు. ఓఎన్జీసీ ఉద్యోగికి 602వ ర్యాంకు కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వాడపర్రుకు చెందిన పండు విల్సన్ 602వ ర్యాంకు సాధించారు. ముంబైలోని ఓఎన్జీసీ ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగం చేస్తూ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. తండ్రి ప్రసాద్ వ్యవసాయం చేస్తుంటారు. తల్లి లక్ష్మి గృహిణి. విల్సన్ కాకినాడ జేఎన్టీయూలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడై ఓఎన్జీసీలో ఉద్యోగం సాధించారు. సీఎం, గవర్నర్ శుభాకాంక్షలు సివిల్స్–2021లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 15వ ర్యాంకు సాధించిన సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు ఇతర అభ్యర్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని గవర్నర్ పేర్కొన్నారు. 15 ర్యాంకు సాధించిన యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వీరితో పాటు సివిల్స్‌కు ఎంపికైన 685 మందికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. చదవండి👉సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ -
సివిల్స్‌లో తెలుగు మెరుపులు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: సివిల్ సర్వీసెస్‌లో ఉత్తమ ర్యాంకులతో తెలుగువారు సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్–2021 తుది ఫలితాలను సోమవారం విడుదల చేసింది. జాతీయ స్థాయిలో 685 మందిని సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఇందులో 40 మంది వరకు తెలంగాణ, ఏపీల నుంచి సివిల్స్‌కు హాజరైనవారే ఉన్నట్టు ప్రాథమిక అంచనా. ముఖ్యంగా టాప్–100 ర్యాంకర్లలో 11 మంది ఇక్కడి వారే నిలిచారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు రాష్ట్రాల్లో స్థిరపడిన కొందరు అభ్యర్థులు కూడా రాష్ట్రం తరఫున ఎంపికైనవారి జాబితాలో ఉన్నారు. హైదరాబాద్ నుంచే ఎక్కువగా.. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుని.. ఇక్కడి నుంచి సివిల్స్ పరీక్షలకు హాజరైనవారు కూడా పెద్ద సంఖ్యలోనే ర్యాంకులు సాధించారు. జాతీయ స్థాయిలో 9, 16, 37, 51, 56, 62, 69 తదితర ర్యాంకులు సా«ధించిన అభ్యర్థులకు హైదరాబాద్‌తో సంబంధం ఉండటం గమనార్హం. ఇక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన అభ్యర్థులూ మంచి ర్యాంకులు సాధించారు. వ్యవసాయం చేసేవారు, హౌజ్ కీపింగ్ వంటి చిన్న ఉద్యోగం చేసే వారి పిల్లలకు ఉత్తమ ర్యాంకులు రావడంతో వారి కుటుంబాల్లో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ర్యాంకర్ల మనోగతం అసలు ఊహించలేదు.. సివిల్స్‌లో ఇంటర్వ్యూ పూర్తయ్యాక మంచి ర్యాంక్ వస్తుందనుకున్నా.. కానీ జాతీయస్థాయిలో 15వ ర్యాంకు వస్తుందని ఊహించలేదు. సరైన ప్రణాళిక, నిరంతర కృషి ఉంటే అసాధ్యమనే పదానికి తావే ఉండదు.’’అని సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించిన చల్లపల్లె యశ్వంత్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఏపీలోని కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం కలుగోట్లపల్లె గ్రామానికి చెందిన యశ్వంత్ తండ్రి పుల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అమ్మ లక్ష్మీదేవి గృహిణి. ఏపీపీఎస్సీ గ్రూప్–1 పరీక్షల్లో మూడో ర్యాంకు సాధించి, కర్నూలులో సీటీవోగా పనిచేస్తూ సివిల్స్‌కు సిద్ధమయ్యారు. 2020 సివిల్స్‌లో 93వ ర్యాంక్ సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. దానికి శిక్షణ తీసుకుంటూనే.. మరోసారి సివిల్స్ రాసి 15వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు కదిలించాయి హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన వి.సంజన సింహ సివిల్స్ ఫలితాల్లో 37వ ర్యాంకు సాధించారు. గతేడాది సివిల్స్‌లో 207వ ర్యాంకు సాధించి ఐఆర్ఎస్కు ఎంపికైన ఆమె.. ఆదాయపన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా శిక్షణ తీసుకుంటూనే మళ్లీ సివిల్స్ రాశారు. అఫీషియల్ ట్రిప్‌లో భాగంగా హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్న ఆమె.. ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ‘‘దేశంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందులో తెలుగు రాష్ట్రాలు టాప్–5లో ఉండటం కదిలించింది. ఐఏఎస్ అధికారిగా రైతుల ఆత్మహత్యలను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటా’’ అని చెప్పారు. రెండేళ్లు పాపకు దూరంగా ఉండి.. ‘‘ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సివిల్స్ కోసం సిద్ధమయ్యాను. అప్పటికే ఉద్యోగం ఉండి, స్థిరపడ్డ జీవితంలో.. చిన్న పాపకు, కుటుంబానికి దూరంగా ఉండటం ఏమిటన్న ప్రశ్నలు అనేక మంది నుంచి ఎదురయ్యాయి. ఎంతో బాధ అనిపించింది. కానీ నా భర్త ఎంతగానో ప్రోత్సహించారు’’ అని సివిల్స్ 56వ ర్యాంకర్ కొప్పిశెట్టి కిరణ్మయి చెప్పారు. ఆమె భర్త విజయ్‌కుమార్ చౌహాన్ హైదరాబాద్‌లో సీటీఓగా పనిచేస్తున్నారు. 2019లో సివిల్స్ 613వ ర్యాంకు రాగా డానిక్స్‌లో డిప్యూటీ కలెక్టర్‌గా చేరిన ఆమె.. మరోసారి సివిల్స్ రాసి 56వ ర్యాంకు సాధించారు. ఐపీఎస్ కావాలని ఉంది ‘‘నాకు ఐపీఎస్ కావాలని కోరిక. ర్యాంకును బట్టి ఐఏఎస్ వచ్చినా స్వీకరిస్తా. అటు ఉద్యోగం చేస్తూనే.. రోజూ ఎనిమిది గంటల పాటు సివిల్స్‌కు ప్రిపేరై మంచి ర్యాంకు సాధించా’’ అని 161వ ర్యాంకర్ బొక్క చైతన్యరెడ్డి తెలిపారు. హనుమకొండకు చెందిన ఆమె తండ్రి సంజీవరెడ్డి వరంగల్ జిల్లా సహకార అధికారిగా, తల్లి వినోద సంస్కృత లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వరంగల్ నిట్‌లో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన చైతన్య.. 2016లో రాష్ట్రంలో నీటిపారుదల శాఖ ఏఈగా ఎంపికైంది. ఉద్యోగం చేస్తూనే ఆరోసారి సివిల్స్ రాసి మంచి ర్యాంకు సాధించింది. మంచి పోస్టింగ్ కోసం పట్టుదలతో.. ‘‘2017 నుంచి వరుసగా సివిల్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. 2019లో ఐఆర్ఎస్కు ఎంపికయ్యాను. ప్రస్తుతం గుజరాత్‌లోని వదోదరలో శిక్షణలో ఉన్నాను. మంచి పోస్టింగ్ సాధించాలనే పట్టుదలతో మళ్లీ ప్రిపేర్ అయి 488 ర్యాంక్ సాధించాను. ఈ దిశగా నా తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు’’ అని నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం రాచాలపల్లికి చెందిన సంతోష్‌కుమార్‌రెడ్డి చెప్పారు. స్వీపర్ బిడ్డ కాబోయే కలెక్టర్ తండ్రి ఐలయ్య వ్యవసాయకూలీ, తల్లి సులోచన సింగరేణి సంస్థలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరి సంపాదన కలిపినా ఇల్లు సరిగా గడవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టుదలగా చదివి సివిల్స్‌లో 117వ ర్యాంకు సాధించాడు భూపాలపల్లికి చెందిన ఆకునూరి నరేశ్. ఇంటర్ వరకు ప్రభుత్వ స్కూలు, కాలేజీలోనే చదివిన నరేశ్ మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తిచేశాడు. చెన్నైలోనే మూడేళ్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసి.. తర్వాత సివిల్స్‌కు ప్రిపేరవడం మొదలుపెట్టాడు. 2019లో 782వ ర్యాంకుతో ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్‌కు ఎంపికయ్యాడు. గుజరాత్‌లోని వదోదరాలో ట్రైనింగ్ పొందుతూ.. మళ్లీ సివిల్స్ రాసి మెరుగైన ర్యాంకు సాధించాడు. నరేశ్ సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించడంతో సంబురంలో మునిగిన తండ్రి ఐలయ్య.. కుమారుడిని తన టీవీఎస్ ఎక్సెల్ బండిపై ఎక్కించుకొని కాలనీ అంతా తిరుగుతూ తన కుమారుడు ఐఏఎస్ సాధించాడంటూ మురిసిపోయాడు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తా.. మాది నిజామాబాద్ జిల్లా. నిర్దేశించుకున్న లక్ష్యంపై పట్టువదలకుండా కృషి చేసి నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌లో 136వ ర్యాంకు సాధించా. అమ్మ పద్మ కామారెడ్డి కలెక్టరేట్లో పేఅండ్ అకౌంట్స్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పుడే నా తండ్రి చనిపోయారు. అమ్మ చాలా కష్టపడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆమె ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించాను. మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టి సారిస్తా.. – అరుగుల స్నేహ, 136వ ర్యాంకర్ తల్లిదండ్రుల స్ఫూర్తితో.. మాది జగిత్యాల బీర్పూర్ మండలం చర్లపల్లి. తండ్రి బాషానాయక్ వ్యవసాయం చేస్తూ.. కష్టపడి నన్ను చదివించారు. తల్లి యమున మినీ అంగన్వాడీ కేంద్రంలో టీచర్‌గా పనిచేస్తున్నారు. వారి స్ఫూర్తితో ఐఏఎస్ సాధించాలన్న లక్ష్యంతో కçష్టపడి చదివాను. – గుగ్లావత్ శరత్‌నాయక్, 374వ ర్యాంకు ప్రణాళిక బద్ధంగా చదివి.. నేను బీటెక్ పూర్తి చేసి ఐటీ కంపెనీలో కొంతకాలం ఉద్యోగం చేశాను. సివిల్స్ సాధించాలనే తపనతో ప్రణాళికాబద్ధంగా చదివి.. నాలుగో ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించాను. – ఉప్పులూరి చైతన్య, 470వ ర్యాంకర్ పరిశోధనలు కావాలి దేశానికి శాస్త్రవేత్తలు కూడా అవసరం. చాలా మంది సివిల్స్, ఇతర ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతున్నారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను పరిశోధనల వైపు ప్రోత్సహిస్తాను. – గడ్డం సుధీర్‌కుమార్, 69వ ర్యాంకర్ పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో.. ‘‘పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను. మా ఇంట్లో అందరూ మంచి స్థానాల్లో ఉన్నారు. వారి స్ఫూర్తితో నేను సివిల్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. నాలుగో ప్రయత్నంలో అనుకున్నది సాధించాను. – అనన్యప్రియ, 544వ ర్యాంకర్, హైదరాబాద్ ఎంతో సంతోషంగా ఉంది.. ఐఏఎస్ లక్ష్యంగా గట్టిగా కృషి చేశా. నాకు వచ్చిన ర్యాంకును బట్టి ఐపీఎస్, ఐఆర్ఎస్ వచ్చే అవకాశముంది. ఏదొచ్చినా పేద ప్రజలకు సేవ చేయాలన్నదే లక్ష్యం. ఐపీఎస్ వస్తే నేరాలను అరికట్టేందుకు కృషి చేస్తా.. తల్లిదండ్రుల ప్రోత్సాహం తోనే ర్యాంకు సాధించా. – ముత్యపు పవిత్ర, 608 ర్యాంకర్ -
ఉక్రెయిన్ నుంచి విద్యార్థుల తరలింపు పూర్తి
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు, ప్రజలను రాష్ట్రానికి తీసుకొచ్చే కార్యక్రమం పూర్తయింది. తాజాగా వచ్చిన 89 మంది విద్యార్థులతో ఇప్పటివరకు 689 మందిని రాష్ట్ర ప్రభుత్వం క్షేమంగా ఇళ్లకు చేర్చింది. ఈ విషయాన్ని ఏపీఎన్ఆర్టీఎస్ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి ‘సాక్షి’కి తెలిపారు. వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌లో సుమారు 770 మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చిక్కుకున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఉక్రెయిన్ నుంచి రాష్ట్రానికి చెందిన విద్యార్థులను ఢిల్లీ, ముంబైలకు తీసుకొచ్చి అక్కడి నుంచి వారి స్వస్థలాలకు రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. విదేశాల్లో వసతి ఏర్పాట్లతోపాటు సొంత ఖర్చులతో స్వస్థలాలకు తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.70 కోట్లు విడుదల చేసింది. ఉక్రెయిన్ నుంచి హంగేరీ చేరుకున్న విద్యార్థుల తరలింపు దాదాపుగా పూర్తయింది. ఈ నేపథ్యంలో భారత రాయబార కార్యాలయ అధికారి తుహిన్‌కుమార్, వెంకట్ మేడపాటి .. ఇందుకు సహకరించిన స్థానిక భారత అసోసియేషన్ల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, తెలుగు అసోసియేషన్ల ప్రతినిధులతో బుడాపెస్ట్‌లోని టెక్నికుం, సెయింట్ ఇస్టివన్లో సమావేశమై వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎవరైనా విద్యార్థులు ఉంటే వారిని స్థానిక ఎంబసీ సహకారంతో వెనక్కి తీసుకొస్తామని వెంకట్ చెప్పారు. కొంతమంది విద్యార్థులు సొంతంగా స్వరాష్ట్రానికి చేరుకున్నారని, మరికొందరు రష్యా, ఆస్ట్రేలియాల్లోని వారి బంధువుల ఇళ్లకు చేరుకున్నారని సమాచారం వచ్చిందన్నారు. ఇంకా ఎవరైనా ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులుంటే ఆ వివరాలను తెలిపితే క్షేమంగా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
తరలివస్తున్న తెలుగు విద్యార్థులు
గన్నవరం: ఉక్రెయిన్ నుంచి శనివారం రాష్ట్రానికి చెందిన మరో 17 మంది విద్యార్థులు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పి.రత్నాకర్, డిప్యూటీ తహసీల్దారు ఎ.శ్రీనివాసరావు స్వాగతం పలికారు. విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు చేశారు. వీరంతా పోలండ్, రొమేనియా దేశాల బోర్డర్ నుంచి ప్రత్యేక విమానాల్లో ముంబయి, ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు. విద్యార్థులు రాధిక, నేహఫాతిమా, అడప లిఖిల్ తదితరులు మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో తామంతా సుమారు 30 గంటల పాటు ఆహారం, తాగునీరు లేకుండా గడిపామని చెప్పారు. అతి కష్టంగా రైలు ప్రయాణం చేసి, మరో 12 కిలోమీటర్లు నడుచుకుంటూ బోర్డర్‌కు చేరుకున్నామన్నారు. అక్కడి నుంచి కేంద్ర, రాష్ట్రాల అధికారులు తమను అన్ని వసతుల మధ్య ఇక్కడికి తీసుకొచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన తెలుగు విద్యార్థులు -
Ukraine Crisis: ఢిల్లీ చేరుకున్న 145 మంది తెలుగు విద్యార్థులు..
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ భీకర యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థుల తరలింపు ప్రక్రియ మరింత వేగవంతంగా జరుగుతోంది. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్థులను స్వదేశానికి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ నుంచి వేలసంఖ్యలో భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. మిగిలిన వారిని కూడా స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాల ద్వారా ఉక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థులు క్షేమంగా భారత్ చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ నుంచి శనివారం ఒక్కరోజే 145 మంది తెలుగు విద్యార్థులు ఢిల్లీ చేరుకున్నారు. నాలుగు విమానాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 83 మంది, తెలంగాణకు చెందిన 62 మంది విద్యార్థులు తరలి వచ్చారు. ఢిల్లీలో వీరికి స్వాగతం పలికిన ఏపీ తెలంగాణ అధికారులు అక్కడే వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆనంతరం వీరందరిని స్వస్థలాలకు పంపనున్నారు. విద్యార్థులను స్వస్థలాలకు తరలించేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: ఉక్రెయిన్.. భారతీయుల తరలింపులో సమస్యలు! ఇక ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన 450 మంది విద్యార్థులు భారత్‌కు చేరుకున్నట్లు ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు. ఇంకా ఉక్రెయిన్‌లో 350 వరకు తెలుగు విద్యార్ధులు ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు ఇండియా చేరుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలుపుతూ.. మిగిలిన విద్యార్థులను త్వరగా తీసుకురావాలని కోరుతున్నారు. -
ఒక్కసారిగా ఉక్రెయిన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి
-
కేంద్రం, ఏపీ ప్రభుత్వం సాయంతో క్షేమంగా వచ్చామన్నా విద్యార్థులు
-
ఉక్రెయిన్ నుంచి మరో 14 మంది తెలుగు విద్యార్థుల రాక
సాక్షి ముంబై: ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న విద్యార్థులను తీసుకువస్తున్న మరో ప్రత్యేక విమానం గురువారం ఉదయం ముంబైకి చేరుకుంది. వందకుపైగా విద్యార్థులు ఈ ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకోగా వీరిలో తెలంగాణకు చెందిన తొమ్మిది మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయిదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నోడల్ అధికారి వి.రామకృష్ణ, తెలంగాణ ప్రభుత్వ అధికారులు డాక్టర్ ఎ.శరత్ (పంచాయితీ రాజ్ కమిషనర్), లాల్శంకర్ చవాన్ (ఐపీఎస్)తోపాటు ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.నాగరాజ్ అన్నివిధాలా సహకారమందించారు. నవీముంబైలోని తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడి, ఎన్జీఓ సంస్థ పదాధికారులు కూరపాటి నరేష్, దోర్నాల రాజు, సురేష్‌కూడా విమానాశ్రయానికి వచ్చి విద్యార్థులను కలిశారు. ముంబైకి వచ్చిన తెలంగాణ విద్యార్థులు: అభిజిత్‌సింగ్ నేగి (హైదరాబాద్), గోపగల్ల ప్రణయ్ (హైదరాబాద్), ఎం.ఈసాద్‌అలీ బేగ్ (హైదరాబాద్), పాటిల్ అక్షయ్ విజయ్‌కుమార్ (హైదరాబాద్), డి.పవన్‌కళ్యాణ్ (హైదరాబాద్), కె.సిద్దువినాయక్ (హైదరాబాద్), బి.కార్తీక్ నాయక్ (నిజామాబాద్), కె.సొలొమొన్∙రాజ్ (కరీంనగర్), ఐ.కార్తికేయ (హైదరాబాద్) -
తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఏర్పాట్లు ముమ్మరం
-
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల తరలింపు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ చర్యల్లో భాగంగా బుధవారం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలండ్, హంగేరీలకు ఏపీ ప్రతినిధులను పంపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలను విదేశాంగశాఖకు ఏపీ ప్రభుత్వం అందించింది. ఆపరేషన్ గంగ గత ఏడు రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి కొనసాగుతూనే ఉంది. హోరాహోరి పోరులో రెండు దేశాల సైన్యం శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి. యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతున్న దశలో భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగ ప్రాజెక్టు ద్వారా భారతీయ విద్యార్థులను త్వరితగతిన స్వదేశానికి తరలించడానికి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి.. కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లాకు చెందిన నవీణ్ శేఖరప్ప ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్‌లో మంగళవారం ఉదయం చనిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సహాయ చర్యలను వేగవంతం చేసింది. (చదవండి: Ukraine War: ఉక్రెయిన్ పిల్లలే మిమ్మల్ని రక్షిస్తున్నారు!’ ) -
వారిని నేరుగా విజయవాడకు తరలించండి
సాక్షి, న్యూఢిల్లీ/మద్దికెర/చీమకుర్తి/చిలమత్తూరు/గన్నవరం: ఉక్రెయిన్ నుంచి స్లోవేకియా చేరుకోనున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్ని నేరుగా విజయవాడకు తరలించాలని కేంద్ర విదేశాంగ శాఖకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాశ్ మంగళవారం లేఖ రాశారు. తెలుగు విద్యార్థులు ఇప్పటివరకు ఢిల్లీ, ముంబైలకు వచ్చి అక్కడి నుంచి వారివారి స్వస్థలాలకు చేరుకుంటున్నారని.. కానీ, అలా కాకుండా.. ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలుగు విద్యార్థులందరినీ ఒకే విమానంలో విజయవాడకు తరలించాలని కోరారు. తద్వారా విద్యార్థులు వారివారి స్వస్థలాలకు త్వరగా చేరుకునే అవకాశం ఉంటుందన్నారు. రైలులో 900 మంది విద్యార్థులు హంగేరీకి తరలింపు ఇక భారత్‌కు చెందిన మరో 900 మంది విద్యార్థులను ఉక్రెయిన్‌లోని జపరోజ్జియా నుంచి 1,400 కి.మీ. దూరంలోని హంగేరీ దేశానికి అధికారులు ఏర్పాటుచేసిన ప్రత్యేక రైలులో తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన సాయితేజ అనే విద్యార్థి మంగళవారం తన తల్లిదండ్రులు ధనుంజయ, పద్మావతిలకు ఈ సమాచారం ఇచ్చారు. హంగేరీ నుంచి ఢిల్లీ లేదా ముంబై చేరుకునేందుకు అధికారులు విమాన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. సీఎం కార్యాలయ తక్షణ స్పందన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండల కేంద్రానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త పుణ్యవతి, శ్రీనివాసులు కుమారుడు కదిరిసాని అరవింద్ గౌడ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో చిక్కుకుపోగా.. ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే స్పందించింది. అరవింద్ విషయాన్ని తల్లి పుణ్యవతి సోమవారం ఎంపీపీ పురుషోత్తంరెడ్డి సహకారంతో ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం కార్యాలయ అధికారులు వేగంగా స్పందించారు. అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి స్వదేశానికి రావడానికి వీలుగా ఏర్పాట్లుచేయించారు. ఫలితంగా అరవింద్ ఇప్పటికే రుమేనియాకు చేరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా సమాచారం అందిందని పుణ్యవతి చెబుతూ సర్కారు స్పందించిన తీరుపై హర్షం వ్యక్తంచేశారు. 17మంది తెలుగు విద్యార్థులు రాక మరోవైపు.. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి మంగళవారం 17 మంది తెలుగు విద్యార్థులు చేరుకున్నారు. వీరిలో ఆరుగురు ఏపీ వారు కాగా, 11 మంది తెలంగాణ వారని ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ల అధికారులు తెలిపారు. ఆయా విద్యార్థులకు భోజన, వసతి, రవాణా సదుపాయాలు ఏర్పాటుచేసినట్లు వారు వివరించారు. విజయవాడకు చేరుకున్న ముగ్గురు విద్యార్థులు.. ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన డాక్టర్లు నత్తల జగన్మోహన్రావు, సరళాదేవి దంపతుల కుమారుడు నత్తల సుధేష్ క్షేమంగా తన ఇంటికి చేరుకున్నారు. అధికారులు సురక్షితంగా ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేర్చినట్లు సుధేష్ తెలిపారు. కుమారుడు క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే, మరో ఇరువురు విద్యార్థినులు మంగళవారం రాత్రి విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నారు. రొమేనియా నుంచి ప్రత్యేక విమానాల్లో ముంబై, ఢిల్లీకి వచ్చిన తూర్పు గో దావరి జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామానికి చెందిన ఎ.అంజనీకుమారి, ప్రకా శం జిల్లా చీరాలకు చెందిన వై.అఖిల వేర్వేరు విమానాల్లో ఇక్కడికి చేరుకున్నారు. వీరికి రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. వీరిరువురినీ ప్రభుత్వ వాహనంలో అధికారులు ఇంటికి పంపించారు. అఖిల, అంజనీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో ఆహారం, నీరు దొరకని పరిస్ధితి నెలకొందని.. అతికష్టం మీద నడుచుకుంటూ రొమేనియా బోర్డర్‌కు వచ్చామన్నారు. తమను క్షేమంగా తీసుకువచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
రెండ్రోజుల్లో అందరినీ తీసుకొస్తాం
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులందరినీ రెండ్రోజుల్లో రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఈ విషయమై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థుల వివరాలను సేకరించింది. కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్, కన్సల్టెన్సీల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం.. ఉక్రెయిన్‌లో రాష్ట్రానికి చెందిన 615 మంది విద్యార్థులు ఉన్నట్లు లెక్కతేలిందని టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. వీరితోపాటు వారి తల్లిదండ్రులతోనూ మాట్లాడామని.. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఏర్పాటుచేస్తున్న ప్రత్యేక విమానాల్లో వీరందరినీ స్వదేశానికి తీసుకువస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటనలో తెలిపారు. వీరిని ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల నుంచి ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో ఏపీకి తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐదు ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి చెందిన 32 మంది విద్యార్థులను తీసుకొచ్చామని, మిగిలిన వారిని కూడా మార్చి రెండులోగా తీసుకురానున్నట్లు కృష్ణబాబు వెల్లడించారు. ఇక ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను పోలండ్, మాల్డోవా, రొమేనియా, హంగేరి, స్లొవేకియా దేశాలకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ సహకారంతో ఆయా దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రుల సహకారంతో విద్యార్థులకు అవసరమైన వసతి, భోజనం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 5 వర్సిటీల్లోనే అధికంగా విద్యార్థులు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉక్రెయిన్‌లోని 14 విశ్వవిద్యాలయాల్లో చేరారని.. ఇందులో అత్యధికంగా ఐదు విశ్వవిద్యాలయాల్లోనే ఉన్నారని కృష్ణబాబు పేర్కొన్నారు. మరోవైపు.. దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతంలో ఉన్న జఫోరియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ చుట్టపక్కలే స్వల్పంగా బాంబుదాడులు జరిగినట్లు తేలిందని కృష్ణబాబు తెలిపారు. అలాగే, కైవ్ మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ యూఏఎఫ్‌ఎం, ఓడెస్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీ, విన్‌టెసా ఓఓ బోగోమోలెట్స్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులు అధికంగా ఉన్నారన్నారు. ఇక విశాఖపట్నం నుంచి 95 మంది, కృష్ణా జిల్లా నుంచి 89 మంది, తూర్పు గోదావరి నుంచి 70 మంది విద్యార్థులు వెళ్లగా, అత్యల్పంగా విజయనగరం నుంచి 11 మంది, శ్రీకాకుళం నుంచి 12, కర్నూలు నుంచి 20 మంది వెళ్లారు. -
ఢిల్లీకి మరో 25మంది రాక
సాక్షి, న్యూఢిల్లీ/అమరావతి/గన్నవరం: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో 25 మంది విద్యార్థులు సోమవారం ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో ఏపీకి చెందిన వారు 11మంది కాగా.. తెలంగాణకు చెందిన వారు 14 మంది ఉన్నారు. వీరికి ఏపీ, తెలంగాణ భవన్ ఉద్యోగులు వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. స్వస్థలాలు చేరుకునేందుకు ఏర్పాట్లుచేశారు. రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఒంగోలుకు చెందిన నట్ల సుధేశ్ మోహన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. తహసీల్దార్ నరసింహారావు తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుధేశ్ మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా అక్కడే అన్నీ వదిలేసి రావల్సి వచ్చిందని, పరిస్థితులు చక్కబడ్డాక కోర్సుకు సంబంధించి యూనివర్సిటీ నిర్ణయం తీసుకునే వరకూ ఎదురుచూడాల్సిందేనన్నారు. తనను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుధేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ విద్యార్థుల కోసం కేంద్రం హెల్ప్‌లైన్ ఇక ఉక్రెయిన్‌లో ఇప్పటికీ ఉండిపోయిన విద్యార్థుల వివరాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటుచేసిందని, ఏపీకి చెందిన ఆ విద్యార్థులు, ఇతర పౌరుల వివరాలు తెలియజేయాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ సీఎం జగన్‌కు సోమవారం లేఖ రాశారు. ఉక్రెయిన్‌కు చుట్టూ ఉన్న దేశాల్లో కూడా సహాయ కేంద్రాలు ఏర్పాటుచేశామని, విద్యార్థులు ఆ దేశంలోని భారత ఎంబసీలను కూడా ఈ–మెయిల్ లేదా ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం వద్ద నిర్ధిష్ట సమాచారం ఉంటే తన కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని ముఖ్యమంత్రిని కోరారు. తెలుగు విద్యార్థులు, పౌరుల పట్ల ఆందోళన చెందవద్దని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదిస్తే వెంటనే తమ బృందాలు సహాయం చేస్తాయని జయశంకర్ పేర్కొన్నారు. -
బంకర్లో ఓ తెలుగమ్మాయి కష్టాలు..
సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్‌లోని మైకోలివ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన పీ అండ్ టీ కాలనీ వాసి మద్దెల గీతానంద కోసం ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అక్కడి పెట్రోమోలియా బ్లాక్ సీ నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న ఈమె ప్రస్తుతం బంకర్లో తలదాచుకుని, ప్రాణాలు అరచేత పట్టుకుని ఉన్నట్లు తండ్రి గంగారాం ‘సాక్షి’కి తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్‌లో ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్వహించే పరీక్షకు గీత హాజరుకావాల్సి ఉంది. అయితే యుద్ధ మేఘాలు అలుముకోవడంతో నెల రోజుల క్రితమే ఆమెను తల్లిదండ్రులు తక్షణం తిరిగి వచ్చేయాల్సిందిగా పదేపదే కోరారు. కానీ యూనివర్సిటీ వర్గాలు యుద్ధం రాదని చెప్తూ గీతానందతో పాటు ఇతర విద్యార్థులనూ అడ్డుకున్నారు. సరిహద్దులకు 1,500 కిమీ దూరంలో.. కీవ్‌లో ఉన్న విద్యార్థులను పోలెండ్‌కు తరలించి అక్కడ నుంచి భారత్‌కు తీసుకువస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌కు తూర్పు భాగంలో ఉన్న మైకోలివ్ ఈ సరిహద్దుకు 1,500 కి.మీ దూరంలో ఉంది. కాస్త సమీపంలో ఉన్న హంగేరీ లేదా రొమేనియాల నుంచి వీరిని తరలించేందుకు అవకాశం ఉంది. కానీ ఈ ప్రాంతంలో చిక్కుకున్న దాదాపు వంద మంది భారతీయ విద్యార్థులపై ఎంబసీ దృష్టి పెట్టట్లేదు. వీరిలో గీత ఒక్కరే తెలుగు యువతి కావడం గమనార్హం. యుద్ధం మొదలైన నాటి నుంచీ గీతతో పాటు సహ విద్యార్థులూ బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన రష్యా బలగాలు దుకాణాలను లూటీ చేస్తున్నాయని, దీంతో సోమవారం నుంచి కనీసం ఆహారం కూడా దొరకని పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. బయటకు వెళ్లే పరిస్థితి లేదు ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రతి ఐదు నిమిషాలకు ఓ పేలుడు వినిపిస్తోంది. కరెంట్, ఆహారంతో పాటు ఎలాంటి ప్రాథమిక సదుపాయాలు లేవు. ఆహారం, నీరు కోసం బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ప్రస్తుతం మా దగ్గర ఏమీ లేవు. ఎవరైనా స్పందించి ఆదుకోకపోతే కనీసం సరిహద్దులకూ చేరుకోలేం. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎంబసీ వర్గాలు పట్టించుకోవాలి. – తల్లిదండ్రులకు పంపిన సెల్ఫీ వీడియోలో గీత తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలి అంధుడినైన నేను నా జీవితం మొత్తం దివ్యాంగుల సేవలోనే గడిపా. ఇప్పుడు నా కుమార్తె ఉక్రెయిన్‌లో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఉక్రెయిన్ రాజధాని, దాని చుట్టుపక్కల మినహా ఇతర ప్రాంతాలపై ఎంబసీ దృష్టి పెట్టట్లేదు. ఇప్పటికైనా స్పందించి అక్కడున్న వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారిని రప్పించడానికి ప్రయత్నించాలి. – గంగారాం, గీత తండ్రి -
గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర ఉద్విగ్న వాతావరణం
సాక్షి, విజయవాడ: ఉక్రెయిన్ నుంచి ఏపీకి విద్యార్థులు చేరుకుంటున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉద్విగ్న వాతావరణం నెలకొంది. విద్యార్థులు కావ్యశ్రీ, సాయి ప్రవీణ్ విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఏపీ విద్యార్థులకు నూజివీడు ఆర్డీవో రాజ్యలక్ష్మి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఉక్రెయిన్ పెయిన్: తప్పెవరిదైనా మారింది కీవ్ నగరం.. శ్మశాన నిశ్శబ్దం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే.. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుతున్న తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు కు చెందిన విద్యార్థినులు సుష్మ, సుదర్శన ఇవాళ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఉక్రెయిన్ నుండి రొమేనియా మీదుగా ముంబై చేరుకుని అక్కడి నుండి నేరుగా రాజమండ్రి చేరుకున్నామని విద్యార్థులు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే తాము తిరిగి తమ తల్లిదండ్రుల వద్దకు చేరుకోగలిగామని సంతోష వ్యక్తం చేశారు. తాము బోర్డర్‌కు దగ్గరగా ఉండటం వల్ల వెంటనే రాగలిగామంటున్నారు. ఉక్రెయిన్ యూనివర్సిటీల్లో అనేక మంది తెలుగు, ఇండియన్ విద్యార్థులు ఉన్నారని వారందరికీ కూడా వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరుకుంటున్నామని తెలిపారు. -
బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరుకున్న రెండో విమానం
సాక్షి, న్యూఢిల్లీ: బుకారెస్ట్ నుంచి 250 మంది భారతీయ విద్యార్థులతో రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. విద్యార్థులకు కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. విమానంలో 17 మంది తెలంగాణ, 11 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారు. తెలుగు విద్యార్థులను ఏపీ, తెలంగాణ భవన్‌కు అధికారులు తరలించారు. వారి వారి స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ భవన్లో వసతి, భోజనం ఏర్పాట్లు చేశారు. సురక్షితంగా భారత్‌కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే 219 ముందితో తొలి విమానం ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఉక్రెయిన్‌లో ఇంటికో బంకర్.. సైరన్ మోగితే చాలు.. ఒక్కసారిగా పరిస్థితులు ఇలా మారతాయని అనుకోలేదు: విద్యార్థులు ‘‘పశ్చిమ ప్రాంతంలోని యూనివర్సిటీల్లో చదువుకుంటున్నాం. రొమేనియా సరిహద్దు దాటి, బస్సులో బుకారెస్ట్ విమానాశ్రయం చేరుకున్నాం. ఒక్కసారిగా పరిస్థితులు ఇలా మారతాయని అనుకోలేదు. మా యూనివర్సిటీ అధికారులు ఆందోళన వద్దని, పరీక్షలు రాసిన తర్వాత వెళ్లొచ్చని చెప్పారు. కానీ ఒక్కసారిగా యుద్ధం మొదలైంది. మేము టికెట్లు బుక్ చేసుకుని కూడా ఉపయోగం లేకపోయింది. అక్కడి వాతావరణం బావుంటుంది. ప్రజలు బావుంటారు. అలాంటి దేశంలో ఈ పరిస్థితి వచ్చిందంటే చాలా బాధగా ఉంది. యుద్ధం మొదలైందన్న వార్తలు చూసి మా తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎట్టకేలకు భారత్‌పై కాలుమోపడం ఆనందంగా ఉంది. ఢిల్లీ నుంచి మా ఇంటికి చేరుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పారని’’ విద్యార్థులు అన్నారు. -
ఉక్రెయిన్‌లో ఇంటికో బంకర్.. సైరన్ మోగితే చాలు..
సాక్షి, హైదరాబాద్: ‘రాత్రి పగలూ తేడా లేకుండా బాంబుల మోతలు.. సైరన్ల హెచ్చరికలు.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ.. మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నాం’. అని ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పలువురు తెలుగు విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వినితియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న వందలాది మంది విద్యార్థులు శనివారం ఉదయమే అక్కడి నుంచి రొమేనియాకు చేరుకొనేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రొమేనియా సహా పోలెండ్, హంగేరీ తదితర దేశాలకు జనం తరలి వెళ్లడంతో రాకపోకలు స్తంభించాయి. ►ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రోడ్డు మార్గంలో పొరుగుదేశాలకు తరలించి అక్కడి నుంచి విమానాల ద్వారా భారత్‌కు తీసుకొచ్చేందుకు కేంద్రం రెండు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కానీ వాహనాల రద్దీ కారణంగా చాలా మంది రొమేనియా తదితర పొరుగు దేశాలకు చేరుకోవడం కష్టంగా మారింది. సైరన్ మోగినప్పుడు స్తంభించిన వినితియా నగరంలోని ఓ రహదారి ►ఈ క్రమంలోనే వినిత్స నుంచి రొమేనియాకు బయలుదేరిన సుమారు 300 మంది విద్యార్థులు (కొంతమంది తెలుగు వారు కూడా) చివరి క్షణంలో భారత రాయబార కార్యాలయం నుంచి అనుమతి లభించకపోవడంతో నిలిచిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ►రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నామని, తమను తక్షణమే ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థి వినోద్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ‘సాక్షి’కి వివరించారు. సైరన్ మోగితే పరుగులే... ►వినితియా మెడికల్ వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు స్థానికంగా అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. మొదటి నుంచి యుద్ధ భయాన్ని ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ప్రజలు తమ ఇళ్ల నిర్మాణంలో భాగంగా బంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఒక బంకర్ ఉంటుందని, సైరన్ మోగగానే అందరు వెళ్లి అందులో తలదాచుకుంటారని వినోద్ తెలిపారు. ►మూడు రోజులుగా ఎప్పుడు బంకర్ మోగితే అప్పుడు తామంతా బంకర్లకు పరుగులు తీస్తున్నామని వాపోయారు. వినితియాకు ఇంచుమించు 150 కిలోమీటర్ల దూరంలో బాంబుల మోత వినిపిస్తోందని, ఏ క్షణంలో తాము ఉన్న నగరానికి యుద్ధం ముంచుకొస్తుందో తెలియడం లేదని చెప్పారు. నగరంలోని ఎల్బీనగర్, మల్కాజిగిరి, పిర్జాదిగూడ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్ధులు జెప్రోజియా, వినితియా విశ్వవిద్యాలయాల్లో ఎంబీబీఎస్ చదువుతున్నారు. యుద్ధానికి ముందే కొందరు భారత్‌కు తిరిగి వచ్చినప్పటికీ ఇంకా చాలా మంది అక్కడే ఉండిపోయారు. కొరవడిన స్పష్టత.. భారత రాయబార కార్యాలయం ప్రకటనల్లో స్పష్టత లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ‘మొదట అందరూ బయలుదేరాలని ప్రకటించారు. తీరా సామగ్రి సర్దుకొని వెళ్లేందుకు సిద్ధమైన అనంతరం ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని ప్రకటించారు. తాము ఉన్న చోట భద్రత ఉంటే అక్కడే ఉండిపోవాలని చెబుతున్నారు. కానీ ఇలా భయం భయంగా ఎంతకాలం బతకాలి’ అని వినోద్ ఆవేదన వక్యం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని, సరిహద్దు దేశాలకు చేరుకొనేందుకు అవకాశం లేక, రాత్రింబవళ్లు బంకర్లలో తలదాచుకోలేక బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నామని పేర్కొన్నారు. -
బాంబుల హోరుతో భయం భయంగా..విద్యార్థులు
సాక్షి, నెట్వర్క్ : ఉక్రెయిన్‌లో మూడో రోజూ రష్యా దాడులు కొనసాగుతుండడం.. యుద్ధం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోవడంతో అక్కడ చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు బాంబుల హోరుతో బెంబేలెత్తుతున్నారు. రాజధాని కీవ్‌లో చిత్తూరు జిల్లా బి.కొత్తకోటకు చెందిన వైద్య విద్యార్థిని సాయినిఖిత ఉంటున్న అపార్ట్మెంటుకు కిలోమీటర్ దూరంలో శుక్రవారం రాత్రి బాంబులు పడటంతో అక్కడ వారంతా భయంకంపితులయ్యారు. బాంబులు పడిన ప్రాంతమంతా భీకర శబ్దాలతో దద్దరిల్లిందని శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పింది. రాత్రంతా బాంబుల శబ్దాలతో నిద్రపోలేదని చెప్పింది. కానీ, శనివారం ఉదయం నుంచీ కర్ఫ్యూ వాతావరణం నెలకొందని వివరించింది. ఎక్కడి వారు అక్కడే ఉండాలంటూ వాట్సప్ గ్రూపులో మెసేజ్‌లు వస్తున్నాయని అక్కడి పరిస్థితిని నిఖిత వివరించింది. వాహనాలు లేనందున ఎక్కడికీ కదల్లేని పరిస్థితని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లడం కూడా అంత శ్రేయస్కరం కాదని హెచ్చరించడంతో తామంతా కీవ్‌లోని అపార్ట్మెంట్లోనే ఉండిపోయామని తెలిపింది. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి ఫోన్లో మాట్లాడి దైర్యం చెప్పారని, ఆయన సిబ్బంది తరచూ మాట్లాడుతున్నారని చెప్పింది. అలాగే, బి.కొత్తకోట శెట్టిపల్లె రోడ్డులో ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రామకృష్ణ కూడా తన కుమారుడు ఎస్. చైతన్య కోసం ఆందోళన చెందుతున్నారు. అయితే శనివారం సాయంత్రం చైతన్య సహా పలువురు విద్యార్థులు బస్సులో రుమేనియా దేశానికి బయలుదేరారు. అక్కడినుంచి ప్రత్యేక విమానంలో ముంబై కాని, ఢిల్లీకాని చేరుకుంటారు. బస్సుల కొరతతో విడతల వారీగా.. ఇక భారత్ ఎంబసీ ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులో రుమేనియాకు బయల్దేరామని ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంకు చెందిన మోతుకూరు నాగప్రణవ్ తెలిపాడు. శనివారం మధ్యాహ్నం ప్రణవ్ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. బస్సులో రుమేనియాకు చేరుకునేందుకు ఒకటిన్నర రోజు పడుతుందని, అక్కడ నుంచి స్వదేశానికి వస్తామని తెలిపాడు. ఇక్కడ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 70 మంది విద్యార్థులు ఉన్నారని, ప్రస్తుతం 30 మంది బస్సులో రుమేనియా బయలుదేరామని తెలిపాడు. మరో 20 మంది రాత్రికి, మిగతా 20 మంది రేపు బయల్దేరుతారన్నాడు. బస్సుల కొరత కారణంగా విడతల వారీగా రుమేనియాకు వెళ్లాల్సి వస్తోందని ప్రణవ్ ‘సాక్షి’కి వివరించాడు. మరోవైపు.. విమానాలు లేక దాచేపల్లికి చెందిన కటకం మురళీకృష్ణ, లక్ష్మీ దంపతుల కుమార్తె రమ్యశ్రీ అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. విమానం టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ ఉపయోగం లేకుండాపోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న మరో యూనివర్సిటీకి రమ్యశ్రీతో పాటు మరికొంతమంది విద్యార్థులను అక్కడి అధికారులు తరలించారు. భయపడొద్దు..మేమందరం ఉన్నాం : కోన రఘుపతి ‘ఉక్రెయిన్ నుంచి ప్రతి ఒక్కరినీ క్షేమంగా తీసుకువచ్చేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు.. భయపడొద్దు..మేమందరం ఉన్నాం’.. అంటూ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఉక్రెయిన్‌లో ఉన్న నోషితకు, ఇక్కడ ఆమె తల్లిదండ్రులు శ్రీదేవి, శ్రీనివాసరావుకు ధైర్యం చెప్పారు. వీడియోకాల్‌లో నోషితతో మాట్లాడిన అనంతరం ఆయన టాస్క్‌ఫోర్స్ కమిటీతో ఉక్రెయిన్‌లోని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ప్రత్యేక విమానాల్లో విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని, అధైర్య పడొద్దని అమలాపురం ఎంపీ అనురాధ తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం విలసవల్లికి చెందిన సలాది గంగా భవాని (భవ్య)కు శనివారం వీడియో కాల్చేసి మాట్లాడారు. భవ్యతో పాటు 20 మంది విద్యార్థులు బంకర్లో ఉన్నారు. -
స్వదేశానికి తెలుగు విద్యార్థులు
సాక్షి, ముంబై/అమరావతి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థుల్లో కొందరు శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రత్యేక విమానంలో ముంబైకు చేరుకున్నారు. ఈ విమానంలో 10 మంది ఏపీకి చెందిన విద్యార్థులు, 15 మంది తెలంగాణ వారున్నారు. వీరి కోసం ముంబై ఎయిర్‌పోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున హెల్ప్‌డెస్క్ ఏర్పాటుచేశారు. ఈ హెల్ప్‌డెస్క్ సభ్యులు విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నామంటూ విద్యార్థులు ఆయా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తామంతా ఉక్రెయిన్‌లోని పశ్చిమ భాగంలో ఉండటంతో పెద్దగా ఇబ్బందులేమీ ఎదురుకాలేదని వారు ‘సాక్షి’కి వివరించారు. వీరున్న ప్రాంతంలో బాంబు దాడులు జరగనప్పటికీ ప్రస్తుతం నెలకొన్న యుద్ధంవల్ల తాము కొంత భయాందోళనకు గురైనట్లు చెప్పారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై దాడుల అనంతరం తమ విశ్వవిద్యాలయం అధికారులు స్వదేశానికి వెళ్లేందుకు ఎంతో సహకరించారని, అదేవిధంగా భారత రాయబార కార్యాలయం కూడా తమను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లుచేసిందని విద్యార్థులు తెలిపారు. అయితే, విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో పశ్చిమం వైపున్న రొమేనియాకు బస్సుల్లో తరలించి, సుమారు ఐదారు గంటల ప్రయాణం అనంతరం అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడకు చేరుకున్నట్లు వెల్లడించారు. ముంబై ఎయిర్ పోర్టులో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న ఏపీ అధికారులు ఇక్కడికి చేరుకున్న అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విద్యార్థులపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయం సమీపంలోని ఓ హోటల్లో బస ఏర్పాటుచేసి భోజన ఏర్పాట్లుచేసింది. నవీ ముంబై తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి, అడిషనల్ కమిషనర్ (ముంబై కస్టమ్స్) మెరుగు సురేష్, అసిస్టెంట్ కమిషనర్ (కస్టమ్స్) ఎం. నాగరాజు, రవిరాజు, చంద్రశేఖర్ తదితర అధికారులతో పాటు ఎన్జీవో సంస్థకు చెందిన కూరపాటి నరేష్ తదితరులు ఏపీ ప్రభుత్వం తరఫున విద్యార్థులకు సహకరించారు. మరోవైపు.. ముంబై నుంచి ఈ విద్యార్థులను వారివారి స్వస్థలాలకు పంపేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేస్తున్నారు. ముంబై చేరుకున్న ఏపీ విద్యార్థులు వీరే.. కావ్యశ్రీ (విజయవాడ), కొండమర్రి ప్రవీణ్ (చిత్తూరు జిల్లా), అల్లాడి నాగ సత్య హర్షిణి (చిత్తూరు జిల్లా), రాజనాల సుష్మ (కాకినాడ), చల్లా సుదార్ సోమ (కాకినాడ), షేక్ రీను (ఆళ్లగడ్డ), జంబుగోళం పావని (తిరుపతి), దరువూరి సాయిప్రవీణ్ (గుంటూరు), వెన్నెల వర్ష (పొట్నూరు, శ్రీకాకుళం జిల్లా), గాధంశెట్టి గోపిక వర్షిణి (తిరుపతి). వీరంతా ఆదివారం వారి స్వస్థలాలకు చేరుకుంటారు. -
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు కోసం ఏపీ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్
-
వణుకుతున్న ప్రాణాలు.. బాంబుల మోతలు.. ఎముకలు కొరికే చలి
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని ఖార్కీవ్ నగరంలో గడ్డకట్టే చలితో పాటు బాంబుల మోత తెలుగు విద్యార్థులను వణికిస్తోంది. గురువారం ఉష్ణోగ్రత మైనస్ 2 డిగ్రీలు ఉండగా శుక్రవారం ఒక్కసారిగా మైనస్ 6 డిగ్రీలకు పడిపోయింది. ఒకవైపు దట్టమైన మంచు కురుస్తుంటే.. మరోవైపు మిసైల్ దాడులతో నగరం అగ్నిగుండంగా మారింది. కళ్లముందు పేలుతున్న బాంబులను చూస్తూ.. ఎముకలు కొరికే చలికి వణుకుతూ తెలుగు విద్యార్థులు కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బంకర్లు, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కనీసం కప్పుకోవడానికి బ్లాంకెట్స్ లేని దయనీయ స్థితిలో రెండు రోజులుగా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తెచ్చుకున్న ఆహారం అయిపోతే ఆకలితో చావడం తప్ప వేరే గత్యంతరం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రష్యా చర్యలపై ఐరాసా భద్రతా మండలిలో ఓటింగ్.. భారత్ దూరం.. తమ క్షేమ సమాచారాన్ని కన్న వాళ్లకు అందించేందుకు సెల్ ఫోన్ల చార్జింగ్ కోసం, కనీస అవసరాలు తీర్చుకోవడానికి ప్రాణాలకు తెగించి బంకర్ల నుంచి బయటకు వచ్చి సమీపంలోని హోటళ్లకు పరుగులు తీస్తున్నారు. ఖార్కీవ్ నేషనల్ మెడికల్ వర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు శుక్రవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ఖార్కీవ్లో సుమారు 50 మెట్రో స్టేషన్లు ఉంటే ఒక్కో స్టేషన్లో సుమారు 600 మంది (అన్ని దేశాల వాళ్లు) తలదాచుకుంటున్నట్టు తెలిపారు. బంకర్లు మొత్తం నిండిపోయాయని వాపోయారు. ధ్వంసమైన భవనాలు.. రోడ్లపై మిసైళ్ల దాడుల నడుమ భయంతో సాయం కోసం ఎదురు చూస్తున్నామని వాపోయారు. గూగుల్ ఫామ్స్‌లో తమ సమాచారం పంపినా ఇప్పటివరకు ఇండియన్ ఎంబసీ నుంచి ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. కాల్ సెంటర్లకు ఫోన్ చేసినప్పటికీ నెట్వర్క్ సమస్యతో పాటు బిజీ వస్తోందని చెప్పారు. రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయిందని, ఎంబసీ అధికారులు మాత్రం బోర్డర్ వరకు వస్తే ఇండియాకి చేరుస్తామని చెబుతున్నారని.. అడుగు బయట పెట్టలేని స్థితిలో బోర్డర్‌కు ఎలా చేరుకోగలమని వాపోతున్నారు. స్థానిక పరిస్థితులను బయట వారికి చేరవేయకూడదంటూ నిత్యం అనౌన్స్మెంట్లు ఇస్తున్నారని, బయటకు ఎప్పుడు తీసుకెళ్తారో చెప్పకుండా సేఫ్టీ మెజర్స్ పాటించండి అంటూ సూచనలు చేస్తున్నారన్నారు. ఖార్కీవ్ నగరంలో తణుకు, అమలాపురం, కాకినాడ, ఖమ్మం, హైదరాబాద్, గుంటూరు, రాజమండ్రి, విజయవాడకు చెందిన విద్యార్థులు ఉన్నట్టు తెలిపారు. అమ్మా.. కంగారు పడొద్దు! నేను ఖార్కీవ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాను. ప్రస్తుతం మేం బంకర్లలో సేఫ్‌గా ఉన్నాం. శుక్రవారం చాలాసేపు బాంబులు పేలాయి. ఉష్ణోగ్రత పడిపోయింది. మేం ఇండియాకి వెళ్లిపోతామంటే వర్సిటీ వాళ్లు అకడమిక్స్ పోతాయని భయపెట్టేశారు. ఇక్కడి విషయాలను ఎవ్వరికీ చెప్పొద్దని అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. వీడియోలు.. ఫొటోలు తీయకుండా అడ్డుకుంటున్నారు. అమ్మా.. నాన్నా మీరు కంగారుపడొద్దు. త్వరలోనే పరిస్థితి నార్మల్ అవుతుందని చెబుతున్నారు. – తమలం అభిజ్ఞ, తణుకు, పశ్చిమ గోదావరి -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు: తెలుగు రాష్ట్రాల హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే
ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో.. అక్కడున్న ఇతర దేశాల పౌరుల భద్రతపై భయాందోళనలు నెలకొన్నాయి. సంక్షోభ సమయం నుంచి ఇప్పటి వరకు చాలామంది ఉక్రెయిన్ను వీడగా.. పరిస్థితి ఇక్కడిదాకా వస్తుందని ఊహించని వాళ్లు.. ప్రత్యేకించి విద్యార్థులు తరగతుల నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. ఈ పరిణామాల నడుమ.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులను సురక్షితంగా రప్పిస్తామని తల్లిదండ్రులకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకున తెలుగు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల భద్రతపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్ సమీర్ శర్మ, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షితంగా రప్పించే విషయమై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కోరగా.. కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా వివరించారు జైశంకర్. అనంతరం ప్రత్యేక హెల్ప్లైన్లపై అధికారులకు సూచనలు చేశారు. APNRTS హెల్ప్‌లైన్ నెంబర్: 0863-2340678 ఏపీ హెల్ప్‌లైన్ వాట్సాప్ నెంబర్ +918500027678 ఢిల్లీలో సంప్రదించాల్సిన అధికారులు: శివ శంకర్- 9871999055 రామారావు-9871990081 సాయిబాబు- 9871999430 ఉక్రెయిన్‌లోని వార్ జోన్లో చిక్కుకుపోయిన పిల్లల తల్లిదండ్రులు విశాఖపట్నంలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్‌లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని కలిశారు. వారి సమస్యలను విని విదేశాంగ మంత్రి జైశంకర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు విజయసాయి రెడ్డి. అంతేకాదు ఉక్రెయిన్‌లోని తెలుగు ప్రజలు 9871999055 & 7531904820 ద్వారా సాయం కోరవచ్చని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ ద్వారా తెలిపారు. The worried parents of children stuck in the war zone in #Ukraine met me at Circuit Guest House,Visakhapatnam. Heard their concerns & assured them of support in bringing their plight to the notice of Hon'ble CM Sri @YSJagan garu & External Affairs Minister Sri @DrSJaishankar. 1/2 pic.twitter.com/6wrkdAyFM3 — Vijayasai Reddy V (@VSReddy_MP) February 25, 2022 తెలంగాణ ప్రభుత్వం: ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వారి తరలింపునకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ నుంచి సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో మెడిసిన్ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో సగానికి పైగా విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. తమను రక్షించాలని.. త్వరగా ఇండియాకి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ అనేక కాల్స్ హెల్ప్‌లైన్ నంబర్లకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లిలోని తెలంగాణ భవన్లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. Humble appeal to Sri @DrSJaishankar Ji on the plight of students from Telangana stranded in Ukraine🙏 We appeal to Govt of India to arrange for special aircrafts & Telangana Govt is ready to bear the full travel expenses for these students so we can bring them home safe &soonest — KTR (@KTRTRS) February 25, 2022 న్యూఢిల్లీ, తెలంగాణ భవన్‌కు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లు విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్ : 7042566955 చక్రవర్తి, పీఆర్వో: 9949351270 నితిన్, ఓఎస్డీ: 9654663661 తెలంగాణ సెక్రటేరియట్, హైదరాబాద్ హెల్ప్ లైన్ నెంబర్లు చిట్టిబాబు, ఏఎస్వో: 040-23220603 : 9440854433 ఈమెయిల్ ఐడీ: so_nri@telangana.gov.in -
ఉక్రెయిన్ లో భారతీయ విద్యర్ధుల దయనీయ పరిస్ధితి ఇది
-
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది తెలుగు విద్యార్థులు
-
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: పిల్లలు ఎలా ఉన్నారో ఏమో..!
సాక్షి నెట్వర్క్ : చదువు నిమిత్తం ఉక్రెయిన్ వెళ్లి చిక్కుకుపోయిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల గురించి వారి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ పిల్లలు అక్కడ ఎలా ఉన్నారోనని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎప్పటికప్పుడు వీరు తమ పిల్లల యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. తమ పిల్లలను క్షేమంగా స్వస్థలాలకు తీసుకురావాలని వారు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. మా అబ్బాయి ఎన్ని కష్టాలు పడుతున్నాడో..? శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలోని నడిమింటి సీతంనాయుడు, సరస్వతిల ఏకైక కుమారుడు కుమారస్వామి మరికొద్దిరోజుల్లో చదువు పూర్తిచేసుకుని స్వస్థలానికి వస్తాడని ఎదురుచూస్తున్న తరుణంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆ తల్లిదండ్రుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. తమ కుమారుడు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడోనని ఆందోళన చెందుతున్నారు. తాను క్షేమంగా ఉన్నానని కుమారస్వామి గురువారం ఫోన్లో తెలియజేసాడు. మా బిడ్డను క్షేమంగా తీసుకురండి తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పెనుగుదురుకు చెందిన బుద్దాల వీర వెంకట సత్యనారాయణ (సత్తిబాబు), హైమావతిల కుమార్తె రిషిత క్రిస్మస్ సెలవుల తర్వాత ఈనెల 7న తిరిగి ఉక్రెయిన్ వెళ్లింది. కానీ, ఇప్పుడక్కడ నెలకొన్న యుద్ధంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రిషిత ఉంటున్న ప్రాంతానికి సమీపంలోనే కాల్పులు జరుగుతున్నాయని, ఆ వీడియోలు చూస్తుంటే భయమేస్తోందన్నారు. తమ బిడ్డను క్షేమంగా తీసుకురావాలని సత్తిబాబు ప్రభుత్వాన్ని కోరారు. యూనివర్సిటీ నుంచి సహకారం లేదు పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామానికి చెందిన జోత్స్న వంశీప్రియతోపాటు అక్కడి విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని జ్యోత్స్న తల్లిదండ్రులు ఇజ్జిని షాలేమ్‌రాజు, సువార్త చెబుతున్నారు. తమ కుమార్తె కోసం విమాన టికెట్ బుక్‌చేసినప్పటికీ ఎయిర్‌పోర్టును మూసివేశారని, ఎలా రావాలో అర్థం కావట్లేదని వారు ఆందోళన వ్యక్తంచేశారు. యూనివర్శిటీ నుంచి ఎలాంటి సహకారం లేదన్నారు. ఎప్పుడేం జరుగుతుందో.. ఉక్రెయిన్‌పై రష్యా గురువారం నుంచి బాంబుల వర్షం కురిపిస్తుండడంతో గుంటూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన వైద్య విద్యార్థి ఫహీమ్ అక్రమ్ తల్లిదండ్రులు మహబుబ్‌బాషా, ఫమీదా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. తాను క్షేమంగా ఉన్నానని అక్రమ్ సమాచారం ఇవ్వడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. మా బిడ్డ యూనివర్సిటీ పక్కనే యుద్ధం రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ ఏ క్షణాన ఏం జరుగుతుందోనని విశాఖ జిల్లా రాంపురానికి చెందిన రెడ్డి నోముల సత్య శ్రీజ తల్లిదండ్రులు అర్జున్, వరలక్ష్మి తల్లడిల్లిపోతున్నారు. తమ కుమార్తె శ్రీజ చదువుతున్న యూనివర్శిటీకి దగ్గర్లోనే యుద్ధం జరుగుతోందని.. తమ కుమార్తెను ఎలాగోలా తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే, తనను స్వదేశానికి తీసుకురావాలని శ్రీజ కూడా వీడియో ద్వారా ప్రభుత్వాన్ని కోరింది. భయపడకండి.. సీఎం కృషి చేస్తున్నారు తమ కుమార్తెను ఇక్కడకు రప్పించాలంటూ విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కుకు చెందిన బొమ్ము శివరామకృష్ణారెడ్డి, సదా వెంకటలక్ష్మీ దంపతులు గురువారం గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన ఉక్రెయిన్‌లో ఉంటున్న యువతితో ఫోన్లో మాట్లాడి భయపడొద్దని భరోసా ఇచ్చారు. సీఎం జగన్ ఇందుకోసం కృషిచేస్తున్నారని ధైర్యం చెప్పారు. -
‘ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం’
తాడేపల్లి: ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. విద్యార్థులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించిన విషయాన్ని సజ్జల తెలిపారు. ఇదే విషయంపై విదేశాంగశాఖ మంత్రికి సీఎం జగన్ లేఖ రాశారన్నారు. ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. -
మన విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు: ఆదిమూలాపు సురేష్
-
ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థులు క్షేమం: మంత్రి ఆదిమూలపు
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ దేశంలో తెలుగు విద్యార్థులు క్షేమంగా ఉన్నారని ఏపీ మంత్రి ఆదిమూలాపు సురేష్ తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న యుద్ధ సమయంలో మంత్రి ఆదిమూలాపు సురేష్ ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులను ఉక్రెయిన్ రప్పించేందుకు ప్రయత్నిస్తోందని వెల్లడించారు.ప్రస్తుతం ఉక్రెయిన్‌లో విమాన సర్వీసులు రద్దయ్యాయని మంత్రి ఆదిమూలపు తెలిపారు. విద్యార్థుల సహాయం కోసం నోడల్ అధికారి, స్పెషల్ ఆఫీసర్‌ను నియమించినట్లు చెప్పారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో అధికారులను అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. నోడల్ అధికారిగా రవి శంకర్: 9871999055. అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ గీతేష్ శర్మను సంప్రదించాల్సిన నెంబర్: 7531904820 ఏపీ ఎన్ఆర్టీ సీఈఓ దినేష్ కుమార్: 9848460046 -
మీరక్కడ క్షేమమేనా!
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్–రష్యా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఉక్రెయిన్‌లో ఉంటున్న తెలుగు వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ ఎప్పుడు, ఎలాంటి పరిస్థితి తలెత్తుతుందోనని భీతిల్లుతున్నారు. నిత్యం తమ వారితో ఫోన్లలో మాట్లాడుతున్నా క్షేమంగా స్వదేశానికి వచ్చేస్తే మంచిదని చెబుతున్నారు. యుద్ధం అనివార్యమైతే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి, స్వదేశానికి తిరిగి వెళ్లిపోదామా? వద్దా? అనే మీమాంసలో అక్కడి తెలుగు వారు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. విద్య, ఉపాధి నిమిత్తం ఏపీకి చెందిన పలువురు ఉక్రెయిన్‌లో ఉంటున్నారు. ఏపీ నుంచి వైద్య విద్య అభ్యసించడం కోసం ఎక్కువ మంది విద్యార్థులు ఉక్రెయిన్‌కు వెళ్తుంటారు. వినిచా, డ్నిప్రో, కైవ్, బోగోమోలెట్స్ యూనివర్సిటీల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువగా చదువుతుంటారు. వినిచా యూనివర్సిటీలో 200 నుంచి 250 మంది, మిగిలిన యూనివర్సిటీలు కూడా కలుపుకుంటే 2 వేల మంది ఏపీ విద్యార్థులు ఉంటారని అంచనా. ప్రస్తుతం భయాందోళనలకు గురయ్యేంత పరిస్థితులు ఉక్రెయిన్‌లో లేవని, ప్రశాంత వాతావరణమే నెలకొందని ఉందని అక్కడి వారు చెబుతున్నారు. రష్యాకు సరిహద్దున ఉన్న నగరాల్లో కొంత ఆందోళనకర వాతావరణం ఉన్నట్టు స్పష్టం చేస్తున్నారు. మేం బాగానే ఉన్నాం మాది గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరు. ఉక్రెయిన్‌లోని వినిచా వర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులందరి వివరాలను సేకరిస్తోంది. ఆన్లైన్లో మా వివరాలను ఎంబసీకి పంపించాం. భారత్‌కు వెళ్లాలనుకున్న వారు వెళ్లొచ్చని అధికారులు చెప్పారు. అనవసరంగా బయట తిరగవద్దని సూచించారు. యుద్ధం అనివార్యమై ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి స్వదేశానికి చేరుస్తామని ఎంబసీ చెప్పింది. మీడియాలో వస్తున్న వార్తలు చూసి ఇంటినుంచి తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు. దేశానికి తిరిగి వచ్చేయమని ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు బాగున్నాయి. – భానుప్రకాష్, ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థి ప్రశాంత వాతావరణమే ఉంది నేను రష్యా సరిహద్దుల్లోని సేవరో దోనెస్క్‌లో ఉంటాను. ఇక్కడ అంతా ప్రశాంత వాతావరణమే ఉంది. 2014లో యుద్ధ సమయంలో నేను ఇక్కడే ఉన్నాను. అప్పటితో పోలిస్తే యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రజలందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న భారతీయులపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – డాక్టర్ కుమార్, తెలుగు వైద్యుడు, ఉక్రెయిన్ -
‘అడ్వాన్స్డ్’లో అదరగొట్టారు
సాక్షి, అమరావతి/పాలకొల్లు సెంట్రల్/ దెందులూరు/ఒంగోలు మెట్రో/గుంటూరు ఎడ్యుకేషన్/చాగల్లు: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశానికి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–అడ్వాన్స్డ్–2021 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్–10లో ర్యాంకులు కైవసం చేసుకున్నారు. రామస్వామి సంతోష్‌రెడ్డి (4), పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి (5), మొదుళ్ల హృషికేష్‌రెడ్డి (10), సవరం దివాకర్ సాయి (11) ర్యాంకులను సాధించారు. రామస్వామి సంతోష్‌రెడ్డి ఈడబ్ల్యూఎస్ కోటాలో ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. ఎస్సీ కేటగిరీలో నందిగామ నిఖిల్, ఎస్టీ కేటగిరీలో బిజిలి ప్రచోతన్ వర్మ, ఓబీసీ కేటగిరీలో గొర్లె కృష్ణ చైతన్య ఆలిండియాలో మొదటి ర్యాంకులు సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను శుక్రవారం పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ విడుదల చేసింది. కాగా, ఢిల్లీకి చెందిన మృదుల్ అగర్వాల్‌కు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ లభించింది. జోన్లవారీగా చూస్తే.. టాప్–100 ర్యాంకుల్లో ఐఐటీ హైదరాబాద్ (27), ఐఐటీ బాంబే (28), ఐఐటీ ఢిల్లీ (28), ఐఐటీ కాన్పూర్ (3), ఐఐటీ ఖరగ్‌పూర్ (1), ఐఐటీ రూర్కీ (13) ఉన్నాయి. జోన్లవారీగా టాపర్లుగా నిలిచిన తెలుగు విద్యార్థుల్లో ఐఐటీ ఖరగ్‌పూర్ జోన్లో బాలాజీ సిద్ధార్థ్ (126వ ర్యాంక్), పట్నాన యశ్వంత్ నారాయణ (127వ ర్యాంక్) టాప్–5లో ఉన్నారు. విద్యార్థినుల వెనుకంజ ఈసారి జేఈఈ ర్యాంకుల్లో విద్యార్థినులు వెనుకబడ్డారు. ఆలిండియా స్థాయిలో టాప్–100లో ఒక్కరికి మాత్రమే చోటు లభించింది. ఐఐటీ ఢిల్లీ జోన్ పరిధిలోని కావ్య చోప్రా 98వ ర్యాంకు సాధించి మహిళల్లో టాప్‌లో నిలిచింది. తెలుగు విద్యార్థినుల విషయానికి వస్తే ఐఐటీ హైదరాబాద్ జోన్ పరిధిలో పల్లె భావన (107వ ర్యాంకు) అగ్రస్థానం దక్కించుకుంది. 41,862 మందికి అర్హత మార్కులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు 1,41,699 మంది హాజరుకాగా.. వారిలో 41,862 మంది అర్హత సాధించారు. వీరిలో 6,452 మంది విద్యార్థినులు ఉన్నారు. ఆలిండియా టాప్ ర్యాంక్ సాధించిన మృదుల్ అగర్వాల్‌కు 360 మార్కులకు గాను 348 మార్కులు వచ్చాయి. ఇక మహిళల్లో టాప్‌లో నిలిచిన కావ్య చోప్రాకు 286 మార్కులు లభించాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 20 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ రాశారు. వీరిలో సుమారు 7 వేల మంది ర్యాంకులు దక్కించుకున్నారని తెలుస్తోంది. 27న తొలి విడత సీట్లు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు, ర్యాంకులు వెలువడడంతో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) రిజిస్ట్రేషన్ల ప్రక్రియను శనివారం నుంచి ప్రారంభించింది. ఈ నెల 22న మాక్ సీట్ అలొకేషన్–1 చేస్తారు. 24న మాక్ సీట్ అలొకేషన్–2 ఉంటుంది. 25న విద్యార్థులు మళ్లీ తమ ఆప్షన్ల చాయిస్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. 27న తొలి విడత సీట్లు కేటాయిస్తారు. కాగా, ఈ విద్యా సంస్థలన్నింటిలో మొత్తం 50,000 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ర్యాంకర్ల అభిప్రాయాలు కంప్యూటర్ ఇంజనీర్‌ను అవుతా మాది ఒంగోలు. నాకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 331 మార్కులు వచ్చాయి. ప్రతివారం పరీక్ష రాయడం, అందులో జరిగే పొరపాట్లు సరిదిద్దుకోవడం, ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేసుకోవడం, సమయపాలన పాటించడమే నా విజయానికి ప్రధాన కారణాలు. రోజుకి ఎనిమిది గంటలు చదివాను. ఏపీఈసెట్‌లో 23వ ర్యాంకు వచ్చింది. కంప్యూటర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. – పోలు లక్ష్మీసాయి లోకేష్‌రెడ్డి, ఆలిండియా ఐదో ర్యాంకర్ ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా.. మాది వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు. విజయవాడలో ఇంటర్ చదవా. ఇంటర్ పరీక్షలు, జేఈఈ అడ్వాన్స్డ్ కోసం రోజుకు 14 గంటలు శ్రమించా. అమ్మ శ్రీదేవి ఎస్బీఐలో మేనేజర్. నాన్న జగదీశ్వర్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. ఏపీఈసెట్‌లో 25వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌లో 99 పర్సంటైల్ సాధించాను. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేస్తా. చదువు పూర్తయ్యాక వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పిస్తా. – మొదుళ్ల హృషికేష్‌రెడ్డి, ఆలిండియా పదో ర్యాంకర్ ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరతా.. మాది పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు. రాజమండ్రిలో పదో తరగతి, హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్ చదివాను. నాన్న బాపూజీరావు మల్లవరంలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవడమే నా లక్ష్యం. – ప్రగళ్లపాటి వెంకటరత్న సాయికుమార్, ఆలిండియా 21 ర్యాంకర్ ఏఐలో శాస్త్రవేత్తనవుతా.. మాది పాలకొల్లు. నాన్న త్రినాథరావు.. పారిశ్రామికవేత్త, అమ్మ మోహన కృష్ణకుమారి.. గృహిణి. అన్నయ్య బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. నాకు తెలంగాణ ఎంసెట్‌లో ఫస్ట్ ర్యాంక్, ఏపీఈసెట్‌లో 9వ ర్యాంక్, జేఈఈ మెయిన్‌లో 36వ ర్యాంక్ వచ్చాయి. ఐఐటీ – బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవడమే నా లక్ష్యం. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో శాస్త్రవేత్తనవుతా. – సత్తి కార్తికేయ, ఆలిండియా 33వ ర్యాంకర్ సైంటిస్టుని కావాలన్నది నా కల మాది పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం దోసపాడు. సైంటిస్టును కావాలన్నది నా కల. మొదటి నుంచీ అమ్మానాన్న డోమ్నిక్, విజయలక్ష్మి ఇస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. సైంటిస్టుగా మానవ చరిత్రలో బయటకు రాని విషయాలను వెలికితీయాలన్నదే నా లక్ష్యం. నాసాలో సైంటిస్టుగా పనిచేస్తా. తల్లిదండ్రులకు, దేశానికి పేరు తెస్తా. – బొంతు మాథ్యూస్, ఎస్టీ కేటగిరీలో 44వ ర్యాంకర్ -
నాసా ‘బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్’లో తెలుగు తేజాల సత్తా
దొండపర్తి (విశాఖ దక్షిణ): చంద్రుడిపై మానవ మనుగడ కోసం చేపట్టే పరిశోధనల్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్’లో ఇద్దరు తెలుగు తేజాలు సత్తా చాటారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోటీలో విశాఖకు చెందిన కరణం సాయి ఆశీష్‌కుమార్, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరు అమరేశ్వరప్రసాద్, యూఎస్‌కు చెందిన ప్రణవ్ ప్రసాద్‌లు ‘ఏఏ స్టార్’ పేరుతో రూపొందించిన ప్రాజెక్టుకు టాప్ టెన్‌లో స్థానం దక్కింది. దీంతో వీరికి రూ.25 వేల డాలర్లు (రూ.18 లక్షలు) లభించాయి. ఫేజ్–2లో నాసాతో కలిసి రెండేళ్లపాటు పనిచేసే అవకాశం దక్కింది. చంద్రుడిపై నిర్మాణాలు, నీటి జాడల అన్వేషణ కోసం నాసా గత కొన్నేళ్లుగా పరిశోధనలు, ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో మంచు (ఐస్) ఉన్నట్లు గుర్తించింది. దాన్ని మైనింగ్ ద్వారా తవ్వి తీసేందుకు గల అవకాశాలపై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసి సమర్పించాలి ప్రకటించింది. బ్రేక్ ది ఐస్ ఛాలెంజ్ పేరుతో నిర్వహించిన దీనికి 48 దేశాల నుంచి అనేక యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, శాస్త్రవేత్తలు, విద్యార్థుల నుంచి 374 ప్రాజెక్టులు వచ్చాయి. ఏయూ నుంచి ఎంటెక్ పూర్తి చేసిన ఆశీష్‌కుమార్, అమరేశ్వరప్రసాద్‌లతోపాటు యూఎస్ నుంచి ప్రణవ్‌ప్రసాద్ బృందం రూపొందించిన ప్రాజెక్టు టాప్ టెన్‌లో నిలిచి అవార్డు పొందింది. -
యూజీసీ నిబంధనల నుంచి మినహాయించాలి
సాక్షి, అమరావతి: ఢిల్లీలో టీటీడీ సహకారంతో ఏర్పాటైన శ్రీవేంకటేశ్వర కాలేజీ ఆఫ్‌లైన్ క్యాంపస్‌కు యూజీసీ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం లేఖ రాశారు. ఆ వివరాలివీ.. అఫిలియేషన్‌కు ఇబ్బందులు.. ‘ఢిల్లీలోని తెలుగు విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలను అందించాలన్న లక్ష్యంతో ప్రముఖ నాయకురాలు దుర్గాభాయ్ దేశ్‌ముఖ్, కె.ఎల్.రావు, సి.అన్నారావుల చొరవతో 1961లో ఏర్పాటైన శ్రీ వేంకటేశ్వర కాలేజీ ఆఫ్‌లైన్ క్యాంపస్‌గా కొనసాగుతోంది. ఢిల్లీ యూనివర్సిటీ యాక్ట్ 1922 ప్రకారం టీటీడీ చైర్మన్ నేతృత్వంలోని గవర్నింగ్ కౌన్సిల్ ఈ కాలేజీ పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తోంది. కౌన్సిల్‌లోని 15 మంది సభ్యుల్లో పది మందిని టీటీడీ నామినేట్ చేస్తుంది. కాలేజీ అభివృద్ధి, ఇతర అంశాలను బోర్డు పర్యవేక్షిస్తోంది. టీటీడీ ఇందుకు నిధులను అందిస్తోంది. దేశ రాజధానిలో తెలుగు విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్న ఈ కాలేజీ 2020లో ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్‌లో 14వ స్ధానంలో నిలిచింది. అయితే 2009 ఏప్రిల్ 16న యూజీసీ రాసిన లేఖలో యూనివర్సిటీలు ఆయా రాష్ట్రాల భౌగోళిక పరిధిలో మాత్రమే ఆఫ్‌లైన్ క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. రాష్ట్రాల యూనివర్శిటీ యాక్ట్ ప్రకారం వాటి భౌగోళిక పరిధుల్లో మాత్రమే క్యాంపస్ లను ఏర్పాటు చేయాలని, ఆ పరిధికి వెలుపల ఏర్పాటు చేయడానికి వీలులేదని 2013 జూన్ 27న యూజీసీ నోటీసు జారీ చేసింది. ఈ కారణంగా ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కాలేజీకి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొందేందుకు యూజీసీ నిబంధనలు ఆటంకంగా మారాయి. ఫలితంగా ఢిల్లీలోని తెలుగు విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలను కోల్పోవాల్సి వస్తోంది. ఇప్పటికే రాష్ట్ర విభజన వల్ల పలు ఉన్నత విద్యా సంస్థలు తెలంగాణలోనే ఉండిపోవడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఉన్నత విద్య కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూజీసీ నిబంధనలతో రాష్ట్రానికి చెందిన తెలుగు విద్యార్థులు ఢిల్లీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర కాలేజీ ఆఫ్‌లైన్ క్యాంపస్‌కు ఆంధ్రా యూనివర్సిటీ అఫ్లీయేషన్ కల్పించేలా యూజీసీ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలి’ అని లేఖలో సీఎం కోరారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకంలో రాష్ట్రం ఉన్నత విద్యలో పురోగతి సాధిస్తోందని, జాతీయ విద్యా విధానంలో నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని లేఖలో సీఎం పేర్కొన్నారు. -
హెచ్1వీసాల పేరుతో మోసం
-
తెలుగు విద్యార్ధులను నట్టేట ముంచిన జంట..
సాక్షి, హైదరాబాద్: ఎఫ్1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామంటూ ఓ జంట అమెరికాలోని తెలుగు విద్యార్థులను నట్టేట ముంచింది. స్టూడెంట్స్ వద్ద నుంచి సుమారు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి.. పరారయ్యింది ఈ జంట. వివరాలు.. నిందితులు ముత్యాల సునీల్, ప్రణీతలు అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులను హెచ్1 వీసా పేరిట మోసం చేశారు. ఎఫ్1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి దగ్గరి నుంచి 25 వేల డాలర్లు వసూలు చేశారు. ఈ మోసానికి సంబంధించి 30 మంది తెలుగు విద్యార్థులు నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటర్‌పోల్ ముత్యాల సునీల్, ప్రణీతలపైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం సునీల్, ప్రణీత పరారీలో ఉన్నారు. (చదవండి: అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?) ఇక, విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను సునీల్ తన తండ్రి ముత్యాల సత్యనారాయణ అకౌంట్‌కు బదిలీ చేశాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరిలో ఉంటున్న సత్యనారాయణ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఈ ఘటన వెలుగుచూడటంతో సత్యనారాయణ కూడా పరారీలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసులు సత్యనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
అడ్వాన్స్‌డ్‌లో అగ్రస్థానం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఐఐటీలు తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్సుడ్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు ముఖ్యంగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విజయఢంకా మోగించారు. ఢిల్లీ ఐఐటీ సోమవారం విడుదల చేసిన ఈ ఫలితాల్లో అగ్రస్థానాలను సాధించడమే కాకుండా సంఖ్యాపరంగా అత్యధిక ర్యాంకులను సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఆలిండియా ర్యాంకుల్లో జనరల్ కేటగిరీలో సెకండ్ ర్యాంకు, ఈడబ్యూఎస్ ఆలిండియా కోటాలో ప్రథమ ర్యాంకును వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి (345 మార్కులు) సాధించాడు. ఓబీసీలో ప్రథమ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 14వ ర్యాంకును విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర (318 మార్కులు) దక్కించుకున్నాడు. జితేంద్ర మెయిన్స్‌లో ఆలిండియా ర్యాంకుల్లో 4వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. తెలుగు విద్యార్థులు వివిధ కేటగిరీల్లో 1, 2, 5, 9, 10వ ర్యాంకులతో పాటు వంద లోపు 35 ర్యాంకులు సాధించారు. బాలికల్లో మద్రాస్ జోన్లో ఏపీకి చెందిన కొత్తపల్లి అనిత ఆలిండియా జనరల్ కేటగిరీలో 44వ స్థానాన్ని సాధించింది. తెలుగు విద్యార్థుల్లో 321 మార్కులకు పైగా సాధించిన వారు 10 మంది ఉన్నారు. మద్రాస్ జోన్ పరిధిలో టాప్ 500 ర్యాంకుల్లో 429 మంది ఉండగా అందులో తెలుగు విద్యార్థులు ముందువరసలో నిలిచారు. జాయింట్ సీట్ అలకేషన్ అధారిటీ (జోసా) మంగళవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. – ఆలిండియా జనరల్‌లో కాపెల్లి యశ్వంత్‌సాయి (ఏలూరు) 32వ ర్యాంకు, చిలుకూరి మణిప్రణీత్ (విజయవాడ) 47వ ర్యాంకు, కందుల యశ్వంత్ 113వ ర్యాంకు, పైడా వెంకట గణేష్ ఓబీసీ 15వ ర్యాంకు, కృష్ణకమల్ ఈడబ్ల్యూఎస్ 11వ ర్యాంకు, నన్నపనేని యశస్వి ఈడబ్ల్యూఎస్ 12, మోగంటి హర్షదీప్ ఈడబ్ల్యూఎస్ 13, వారాడ జశ్వంత్‌నాయుడు ఓబీసీ 41, నాగెల్లి నితిన్‌సాయి ఓబీసీ 48, వారణాసి యశ్వంత్‌కృష్ణ ఈడబ్యూఎస్ 32, దండా సాయి ప్రవల్లిక ఓబీసీ 34, బి వెంకటసూర్యవైద్య ఓబీసీ 53, ఎం.జయప్రకాశ్ ఓబీసీ 54, ఎస్.వి.సాయిసిద్దార్థ్ ఓబీసీ 69, వారాడ వినయభాస్కర్ ఓబీసీ 73, బిజ్జం చెన్నకేశవరెడ్డి ఈడబ్ల్యూఎస్ 47, ఎస్.విష్ణువర్థన్ ఓబీసీ 94, ఎం.సాయి అక్షయ్‌రెడ్డి ఈడబ్యూఎస్ 48, వడ్డి ఆదిత్య ఈడబ్ల్యూఎస్ 57 ర్యాంకులను సాధించారు. ఇద్దరిదీ వ్యవసాయ కుటుంబమే... ఆలిండియా జనరల్ కేటగిరీలో రెండో స్థానంలో నిలిచిన గంగుల భువన్‌రెడ్డి, ఓబీసీలో ఒకటో స్థానంలో నిలిచిన లడ్డా జితేంద్ర ఇద్దరూ వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. వీరిద్దరూ వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రకు చెందిన వారు. ఇంటి నుంచే పరీక్షకు సిద్ధం.. లాక్‌డౌన్‌కు ముందు విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నానని, ఆ తరువాత ఇంటి నుంచి ప్రిపేర్ అయ్యానని వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి తెలిపాడు. మెయిన్స్‌లో 26వ ర్యాంకు సాధించానని, పరీక్షల ముందు రోజుకు 10 నుంచి 15 గంటల పాటు చదివానని పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్సు కోర్సులో చేరాలని కోరుకుంటున్నట్లు భువన్‌రెడ్డి చెప్పాడు. 8వ తరగతి వరకు చదువుకున్న భువన్‌రెడ్డి తల్లి వరలక్ష్మి గృహిణి కాగా తండ్రి గంగుల ప్రభాకర్‌రెడ్డి ఇంటర్ వరకు చదువుకున్నారు. ఆయన వ్యవసాయంతోపాటు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేస్తున్నారు. టెన్త్ వరకు నేర్చుకున్నవి ఉపకరించాయి: జితేంద్ర విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివాడు. టెన్త్ వరకు నేర్చుకున్న అంశాలు ఇంటర్, జేఈఈ పరీక్షల్లో విజయానికి దోహదం చేశాయని జితేంద్ర పేర్కొన్నాడు. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్సు కోర్సులో చేరాలనుకుంటున్నానని చెప్పాడు. జితేంద్ర తండ్రి వెంకటరమణ వ్యవసాయంతో పాటు చిన్నపాటి ట్రాన్స్‌పోర్టు వ్యాపారంలో ఉన్నారు. -
‘అడ్వాన్స్డ్’లో తెలుగోళ్లు
సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు సోమవారం విడుదల య్యాయి. ఇందులో తెలుగు విద్యార్థులు సత్తా చాటినా, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే ఈసారి తెలం గాణ విద్యార్థులు వెనుకబడిపోయారు. టాప్– 100లోపు రెండు రాష్ట్రాల్లో కలిపి 15 మంది పైగా ఉండగా, అందులో ఏపీ నుంచే ఎక్కువ మంది ఉన్నారని విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. తెలంగాణ నుంచి టాప్– 100లో ఇద్దరి పేర్లే వెల్లడైనా.. మరో ఐదారుగురు ఉండొచ్చని పేర్కొన్నాయి. తెలంగాణలో స్థిరపడిన (మధ్యప్రదేశ్‌కు చెం దిన) హర్ధిక్ రాజ్‌పాల్ ఆరో ర్యాం కుతో టాప్ 10లో నిలువగా, మంచిర్యాలకు చెందిన అన్నం సాయివర్ధన్ 93వ ర్యాంకు సాధించారు. ఇక ఏపీ నుంచి.. ఆలిండియా ర్యాం కుల్లో జనరల్ కేటగిరీ 2వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ ఆలిండియా కోటాలో ప్రథమ ర్యాంకు.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి సాధించాడు. ఓబీసీలో ప్రథమ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 14వ ర్యాంకును విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర దక్కించుకున్నాడు. రాసింది తక్కువే.. అర్హులు తక్కువే.. జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులకు అర్హత కల్పించగా, కరోనా నేపథ్యంలో వారిలో 1,60,838 మందే దరఖాస్తు చేసుకున్నారు. గతనెల 27న జరిగిన పరీక్షకు 1,50,838 మంది హాజరు కాగా, వారిలో 43,204 మంది అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. అర్హుల్లో బాలురు 36,497 మంది ఉండగా, బాలి కలు 6,707 మంది ఉన్నారు. టాప్ 500లో 140 మందే ఐఐటీ మద్రాస్ పరిధిలో టాప్–500 ర్యాంకులోపు 140 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో టాప్ 100లోపు 28 మంది ఉండగా, అందులో తెలుగు విద్యార్థులే అత్యధికంగా ఉన్నారు. ఇక టాప్–200లోపు 61 మంది, టాప్–300లోపు 86 మంది, టాప్–400లోపు 114 మంది, టాప్–500 ర్యాంకులోపు 140 మంది ఉన్నారు. తగ్గిన కటాఫ్ మార్కులు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్ మార్కులు తగ్గాయి. గతేడాది 90 వరకు ఉండగా ఈసారి కామన్ ర్యాంకులో కటాఫ్ 69 మార్కులకు తగ్గిపోయింది. ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 62, ఈబ్ల్యూఎస్‌లో 62, ఎస్సీ, ఎస్టీలలో 34 మార్కులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కనీస అర్హత మార్కులుగా ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. ఇక వికలాంగుల కోటాలో 34 మార్కులను కనీస అర్హత మార్కులుగా ప్రకటించింది. ప్రణాళికతో చదివి.. అనుకున్నది సాధించి.. మంచిర్యాలఅర్బన్ : ఉన్నత స్థానాలను చేరుకోవాలనే తపన.. కష్టపడేతత్వం ఉంటే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభమే అని నిరూపించాడు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయివర్ధన్ . తల్లిదండ్రుల ప్రోత్సాహం.. పట్టుదలతో చదివి జేఈఈ అడ్వాన్ ్సడ్ ఆలిండియా ర్యాంక్‌ల్లో 93, ఓబీసీలో 7వ ర్యాంక్‌తో ప్రతిభ కనబరిచాడు. తల్లిదండ్రులు జయ, రమణారెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. సాయివర్ధన్ ను 8వ తరగతిలో హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య విద్య సంస్థల్లో చేర్పించారు. 10వ తరగతిలో 9.5 మార్కులు, ఇంటర్లో 967 మార్కులు సాధించాడు. సీఈసీ (కంప్యూటర్ సైన్ ్స ఇంజనీర్) చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, ప్రణాళికాబద్ధంగా చదివితే సాధించలేనిది ఏమిలేదని సాయివర్ధన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తను ఈ ర్యాంక్ సాధించడం వెనుక కుటుంబసభ్యుల తోడ్పాటు ఎంతో ఉందన్నాడు. -
అమెరికాలో తెలుగు విద్యార్థులకు తప్పిన ప్రాణాపాయం
సాక్షి, అమరావతి: అమెరికాలోని జార్జియా రాష్ట్రం లిండ్‌బర్గ్‌లో తెలుగు విద్యార్థులు నివాసముంటున్న అపార్టుమెంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో 80 ఫ్లాట్లు కాలిపోయాయి. జార్జియా స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు 28 మంది వీటిలో నివసిస్తున్నారు. వీరంతా ప్రమాదం నుంచి తప్పించుకుని సురక్షితంగా ఉన్నారు. అయితే వారి దుస్తులు, పుస్తకాలు, పాస్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ధ్రువపత్రాలతో సహా అన్ని వస్తువులు ప్రమాదంలో కాలిపోయాయి. అట్లాంటాలో ఉంటున్న రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య సమన్వయకర్త డాక్టర్ కుమార్ అన్నవరపు ప్రభుత్వానికి అగ్నిప్రమాద సమాచారం అందించారు. ఈ ఘటన గురించి తెలియగానే రాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థులను ఆదుకొనేందుకు చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో వెంటనే స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్య) సతీష్‌చంద్ర.. బాధిత విద్యార్థులకు కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని విదేశీవిద్య సమస్వయ విభాగానికి ఆదేశాలు ఇచ్చారు. ► సీఎం ఆదేశాలతో స్థానిక తెలుగు అసోసియేషన్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టామని డాక్టర్ కుమార్ అన్నవరపు తెలిపారు. విద్యార్థులు కోల్పోయిన ధ్రువపత్రాలను వీలైనంత త్వరగా ఇప్పించే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ► విద్యార్థులకు అవసరమైన ఇతర సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందించేందుకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చారన్నారు. ► సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్ హరికృష్ణ, విదేశీ విద్య సమన్వయకర్తలు విద్యార్థులను ఆదుకొనే చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
కజకిస్తాన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్ : ఉన్నత విద్య కోసం కజకిస్తాన్ వెళ్లిన తెలంగాణ విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా యూనివర్సిటీలు తాత్కాలికంగా యూసివేయడంతో తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే తెలుగు విద్యార్థులకు రవాణా సదుపాయాలు లేకపోడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కజకిస్తాన్‌లోని ఓ ఏజెన్సీ తెలంగాణకు పంపిస్తామని తమ వద్ద 45 వేల రూపాయలు కట్టించుకొని తర్వాత తమకు ఎలాంటి రవాణా సదుపాయం కల్పించలేదని మెడికల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమను సొంత రాష్ట్రానికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత చదువులు అభ్యసించేందుకు 300 మంది విద్యార్థులు కజకిస్తాన్‌కు వెళ్లారు. కజకిస్తాన్ ఎయిర్‌పోర్టు వద్ద ఏషియన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన తెలంగాణ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. (టిక్‌టాక్ అవుట్; స్వదేశీ పరిజ్ఞానంతో ‘పాప్-ఇన్’ యాప్) చైనా హెచ్చరికలు.. ఖండించిన కజకిస్థాన్! అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ -
అమెరికాలోని తెలుగు విద్యార్థులకు ప్రభుత్వ అండ
సాక్షి, అమరావతి: ఆన్లైన్ కోర్సులు అభ్యసిస్తున్న ఇతర దేశాల విద్యార్థులు దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ అమెరికా ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలతో గందరగోళానికి గురవుతున్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఆ విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అమెరికాలోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగాన్ని అప్రమత్తం చేసింది. ఏపీ సీఎంఓ అధికారులు ఇప్పటికే ఓవర్సిస్ విభాగం కో ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపుతో అక్కడి పరిస్థితిపై మాట్లాడి తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు అందించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికాలోని యూనివర్సిటీలు ముందు జాగ్రత్తగా తమ కోర్సులను పూర్తిగా ఆన్లైన్ మోడ్‌లోకి మార్పు చేశాయి. ఈ తరుణంలో ఇతర దేశాల విద్యార్థులు వారి వారి దేశాలకు వెళ్లి పోవాలని యునైటెడ్ స్టేట్స్ ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) ఇటీవల ఒక ప్రకటన చేసింది. సెప్టెంబర్ నుంచి ప్రారంభం అయ్యే వచ్చే విద్యా సంవత్సరం వరకు వీరికి సమయం ఇచ్చింది. ► ఈ పరిస్థితుల్లో తమ చదువులు, భవిష్యత్తుపై అక్కడి తెలుగు విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అమెరికాలో తెలుగు విద్యార్థులు 47 వేల మంది చదువుతుండగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 26 వేల మంది ఉన్నారు. ► వీరి పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూఎస్‌లోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగాన్ని వారికి అండగా ఉండాలని ఆదేశించింది. ► కరోనా వైరస్ కారణంగా కోర్సులను వర్సిటీలు ఆన్లైన్ మోడ్‌లోకి తాత్కాలికంగా మార్పు చేశాయని, ఇందులో తమ పొరపాటు ఏమీ లేదని, రెగ్యులర్ కోర్సుల్లో చేరిన తమకు ఇబ్బంది రాకుండా చూడాలని ఇమ్మిగ్రేషన్ అధికారులకు, వర్సిటీల ప్రెసిడెంట్లకు విద్యార్థుల ద్వారా వినతులు ఇప్పించింది. ► జార్జియాటెక్, క్లెమ్స్‌న్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఆస్టిన్, టెక్సాస్ ఏ అండ్ ఎం కాలేజీ స్టేషన్, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, సదరన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ అలబామా, లామర్ వర్సిటీ, డ్యూక్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, ఎమోరీ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా, జార్జియా స్టేట్ యూనివర్సిటీ, టెన్నెస్సీ టెక్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ డెంటన్, యూనివర్సిటీ ఆఫ్ కార్పస్ క్రిస్టి, కింగ్స్‌విల్లే వర్సిటీ తదితరాల్లో తెలుగు విద్యార్థులు ఎక్కువ. వినతులతో కదిలిన వర్సిటీలు 36 వర్సిటీల విద్యార్థులు అందిస్తున్న వినతులతో ఆయా వర్సిటీలు ఇప్పటికే యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని విన్నవిస్తూ లేఖలు రాస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల తలెత్తే సమస్యలను అందులో పొందు పరిచాయి. యూఎస్‌లోని వివిధ వర్సిటీల్లో చదువుతున్న ఇతర దేశాల విద్యార్థులు దేశం విద్యార్థులు చైనా 3,69,548 ఇండియా 2,02,014 సౌత్‌కొరియా 52,250 సౌదీ అరేబియా 37,080 కెనడా 26,112 వియత్నాం 24,392 తైవాన్ 23,369 జపాన్ 18,105 సీఎం జగన్ చర్యలతో ధైర్యం కరోనా వైరస్ వల్ల యూఎస్ యూనివర్సిటీలు కోర్సులను తాత్కాలికంగా ఆన్లైన్ మోడ్‌లోకి మార్చాయన్న కారణంతో మమ్మల్ని దేశం విడిచి వెళ్లాలన్న ఐసీఈ ఆదేశాలు ఇబ్బందికరంగా మారాయి. ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఉన్నాం. ఈ సమయంలో మమ్మల్ని ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న చర్యలు ధైర్యాన్ని ఇస్తున్నాయి. – రాజేష్ అంబవరం, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంటు సైన్స్, వర్జీనియా దిక్కుతోచని స్థితిలో ఊరట ఎన్నో ఆశలతో, ఆశయాలతో ఉన్నత విద్యనభ్యసించడానికి యూఎస్‌లోని వర్సిటీల్లో చేరాం. కరోనా వైరస్ వల్ల మా కోర్సులను ఆన్‌లైన్‌లోకి మార్పు చేసి బోధన కొనసాగిస్తున్నాయి. మా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఈ విధానాన్ని ఎంచుకున్నాయి. వైరస్ తగ్గాక మళ్లీ రెగ్యులర్ తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈలోగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు మమ్మల్ని దేశం విడిచి వెళ్లాలనడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాం. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ విభాగం ద్వారా మాకు మార్గనిర్దేశం చేస్తూ ఆదుకుంటున్నందుకు కృతజ్ఞతలు. – నాగసాయి శశాంక్, ఎంఎస్ కంప్యూటర్ సైన్స్, విల్మింగ్టన్ యూనివర్సిటీ, డీఈ, యూఎస్ -
కిర్గిస్తాన్‌లో వైద్య విద్యార్థుల వెతలు
సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌తో 4 వేల మంది తెలుగు విద్యార్థులు కిర్గిస్తాన్‌లో చిక్కుకుపోయారు. కళాశాలలు మూతపడి మూడు నెలలైనా స్వ దేశానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్లోని నాలుగు మెడికల్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విద్యార్థులు కరోనా ప్రభావంతో భ యం భయంగా అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే అనారోగ్య కారణాలతో ఇద్దరు తెలుగు విద్యార్థులు చనిపోవడం కూడా వారిని ఆందోళన కు గురిచేస్తోంది. వందేభారత్ మిషన్‌లో భాగంగా ఇప్పటికే రెండు ప్రత్యేక విమానాల ద్వారా 500 మంది భారత పౌరులను ఇండియాకు తరలించి న ప్రభుత్వం.. ఈనెల 20న మరో విమానాన్ని కిర్గిస్తాన్‌కు నడుపుతోంది. సుమారు 14 వేల మం ది భారతీయులు స్వదేశానికి రావడానికి ఎదురుచూస్తుండటంతో విమాన టికెట్ల ధరలు కూడా రెట్టింపయ్యాయి. సాధారణ రోజుల్లో రాకపోకల కు రూ.28వేలు ఉండగా.. ప్రస్తుతం కేవలం ఇండియాకు రావడానికే రూ.20 వేలు పలుకుతోంది. పెరుగుతున్న కేసుల సంఖ్య కిర్గిస్తాన్‌లోనూ కరోనా తీవ్రత పెరుగుతోంది. లా క్‌డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పుంజుకుందని అక్కడే మెడిసిన్ చదువుతు న్న వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌కు చెందిన సంకేపల్లి హరికారెడ్డి తెలిపారు. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని, సరైన ఆహా రం దొరక్క ఇబ్బందులు పడుతున్నామని ‘సాక్షి’కి చెప్పారు. భారత్‌కు విమానాలు నడపాలని స్థానిక రాయబార కార్యాలయానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన లేదని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం చేసుకొని చొరవ చూపాలని కోరారు. -
తెలుగు వారిని రప్పించేందుకు సహకరించాలి
భారతదేశానికి రావడం కోసం కువైట్‌లో నమోదు ప్రక్రియలో మన వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ దృష్ట్యా వివిధ దేశాల నుంచి తిరిగి రావాలనుకుంటున్న వలసదారుల నమోదు ప్రక్రియ, వారిని పంపించే ఏర్పాట్లు సజావుగా సాగేలా ఆయా దేశాల్లోని మన రాయబార కార్యాలయాల అధికారులను ఆదేశించాలని కోరుతున్నాను. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు భారతదేశం వస్తున్న వలసదారుల సమాచారాన్ని (డేటా) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ముందుగానే ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలకు అందించేలా చూడాలి. తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఏర్పాట్లతో వారి రాకకై సిద్ధంగా ఉంటాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరిం చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాశారు. కువైట్, దుబాయ్‌లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని, ఆ సందర్భంగా కువైట్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ఎంబసీ అధికారులకు సూచనలు చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ఆ లేఖలోని ఇతర అంశాలు ఇలా ఉన్నాయి. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో రావొచ్చు ► కోవిడ్19 సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు కోల్పోయి, అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభమయ్యాక భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చేవారి సంఖ్య మరింత పెరగొచ్చు. ► దుబాయ్‌లో, ఇతర దేశాల్లో భారత దౌత్యకార్యాలయాలు స్వదేశానికి తిరిగి వెళ్లే భారతీయుల సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టాయి. ఇతర రాష్ట్రాల వారితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు వలసదారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అధికంగా ఉన్నారు. ► భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణ సదుపాయాలను తిరిగి ప్రారంభించాక గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చే వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలసదారులు కొన్ని వేల మంది ఉంటారు. వీరి భద్రత, క్షేమం కోసం, క్వారంటైన్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ దిశగా చర్యలు తీసుకుంది. ► ఏప్రిల్ 30 గడువులోగా నమోదు చేసుకోవటానికి, ఏప్రిల్ 29న కువైట్‌లోని మన రాయబార కార్యాలయానికి వలస కార్మికులు భారీగా తరలివచ్చారు. ఈ నమోదు ప్రక్రియలో రాయబార కార్యాలయం వద్ద వారు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ► గత 6 వారాలుగా వివిధ దేశాలలో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు, సందర్శకులు భారత ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే స్వదేశానికి తిరిగి రావడానికి వేచి ఉన్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ► ముఖ్యమంత్రి లేఖను ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ పత్రికలకు విడుదల చేశారు. -
అమెరికాలో అడ్మిషన్లపై కరోనా ఎఫెక్ట్
-
భారత విద్యార్థులకు కరోనా కష్టాలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : టెక్సాస్ టెక్ యూనివర్సిటీలో ఎంఎస్ కంప్యూటర్ కోర్సు చదువుతున్న మాదిరెడ్డి స్వరూప అదే యూనివర్సిటీలో అసిస్టెంట్‌షిప్ ద్వారా నెలకు 800 డాలర్లు సంపాదిస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్‌లో ఎంఎస్ (మెకానికల్) కోర్సు చేస్తున్న మారుపాక రమేశ్ మెకానికల్ విభాగంలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పని చేస్తూ నెలకు 650 డాలర్లు సంపాదిస్తున్నాడు. ఇలా సంపాదించుకుంటున్న సొమ్ముతోనే అక్కడ తాము చదువుకోవడానికి అవసరమైన సదుపాయాలన్నీ సమకూర్చుకుంటున్నారు. గడచిన నెల రోజులుగా విశ్వవిద్యాలయాలు మూతపడటంతో వారికి అసిస్టెంట్‌షిప్ అందడంలేదు. స్వరూప, రమేశ్ మాత్రమే కాదు అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న 50వేల మంది ఇప్పుడు నిరుద్యోగులయ్యారు. వీరుకాక మరో లక్షమంది విద్యార్థులు అనధికారికంగా వివిధ వాణిజ్య, వ్యాపారసంస్థల్లో రోజువారీ వేతనంపై పనిచేస్తుంటారు. లాక్‌డౌన్‌తో నెల రోజులుగా వారికి వేతనాలు రావడంలేదు. దీంతో ఇప్పుడు వారికి డబ్బులు పంపాల్సిన బాధ్యత భారత్‌లోని తల్లిదండ్రులపై పడింది. మధ్యతరగతి తల్లిదండ్రులు ఏదోలా ఇక్కడి నుంచి తమ పిల్లలకు డబ్బు సర్దుబాటు చేస్తున్నారు. కానీ, అక్కడ ఏదో ఉద్యోగం చేసుకుని ఎంఎస్ పూర్తిచేస్తామని వెళ్లిన దాదాపు లక్షమంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ‘మేము నలుగురం డల్లాస్‌లో త్రిబుల్ బెడ్రూమ్ నెలకు రూ.2,500 డాలర్లకు అద్దెకు తీసుకుని ఉంటున్నాం. వర్సిటీలో తాత్కాలిక ఉద్యోగాలు కోల్పోయాం. ఇప్పుడు ఇండియా నుంచి (తల్లిందండ్రులు) డబ్బులు పంపుతున్నారు. కానీ, మాలో ఇద్దరికి అక్కడి నుంచి డబ్బు వచ్చే ఆశ లేదు. దీంతో సాయం చేయాలని మాకు తెలిసిన వారిని అడిగాం. వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాం. ఎవరూ స్పందించలేదు. ఎలాగోలా టికెట్ డబ్బులు సంపాదించుకుని ఇండియా పోదామంటే విమానాలు లేవు. శాన్ఫ్రాన్సిస్కోలో భారతీయ ఎంబసీకి ఫోన్‌చేసి మా బాధలు చెప్పుకున్నాం. వారు నాలుగు ఊరడించే మాటలు చెప్పారు తప్ప సహాయం చేస్తామనలేదు’ అని నల్లగొండ జిల్లారామన్నపేటకు చెందిన దేవిరెడ్డి సృజన్ వాపోయాడు. గంపెడాశలతో అమెరికా వెళ్లిన వేలాదిమంది విద్యార్థులది ఇదే పరిస్థితి. వెనక్కి పంపడం ఇప్పట్లో కష్టమే.. ‘ఇప్పటికిప్పుడు అమెరికాలో 3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారిలో పలువురు ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోకొంత సహాయం చేయాలని ఉన్నా లాక్డౌన్ కారణంగా సాధ్యపడటంలేదు. అమెరికాలో ఉన్న భారతీయుల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే వారు మాత్రమే సహాయంచేసే స్థితిలో ఉంటారు. ఇప్పుడా కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. భారీగా సహాయం చేయాల్సిన స్థితిలో ఉన్న అనేకమంది భారతీయులు న్యూయార్క్‌లో ఇబ్బందులు పడుతున్నారు. వారు కాలు బయటపెట్టే పరిస్థితి లేదు. భారత ప్రభుత్వం సత్వరమే ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది’ అని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ప్రతినిధి సుధీర్ చెప్పారు. అమెరికాలో కరోనా కేసులు నమోదు కావడంతోనే విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయని, చాలామంది వెళ్లిపోయారని, ఉన్నవాళ్లలో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరో ప్రతినిధి బాల ఇందూర్తి చెప్పారు. ప్రస్తుతం అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల డేటాను సేకరిస్తున్నామని, ఏ మేరకు సాయం చేయగలమనేది పరిశీలిస్తున్నామని తానా ప్రతినిధి తోటకూర ప్రసాద్ చెప్పారు. పెద్ద సంఖ్యలో ఉన్న మన విద్యార్థులను భారత్‌కు పంపడం ఇప్పట్లో సాధ్యపడదని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం చెబుతోంది. హెచ్1బీ వీసాదారులకు కష్టకాలం అమెరికాలో లాక్‌డౌన్‌తో హెచ్1బీ వీసాపై కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న దాదాపు 40వేల మంది ఉద్యోగాలు పోయాయి. వచ్చే రెండు నెలల్లో మరో 60వేల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందనేది నిపుణుల అంచనా. రానున్న రోజుల్లో అత్యంత అధునాతనమైన విమానాలు ఉత్పత్తిచేసే కార్యక్రమంలో భాగంగా బోయింగ్, ఎయిర్‌బస్సు సంస్థలు అమెరికాలోని అరడజను ఐటీ కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేసుకున్నాయని, మునుముందు ఉద్యోగాలకు ఇది గడ్డుకాలమని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. హెచ్1బీ వీసాదారుడు ఉద్యోగం కోల్పోయినా సరే వీసా స్టేటస్ కొనసాగించాలంటే ఫెడరల్ ప్రభుత్వానికి నెలకు వెయ్యి డాలర్ల దాకా చెల్లించాలి. లేకపోతే వీసా రద్దయ్యే ప్రమాదం ఉంది. దీంతో కొందరు ఇప్పటిదాకా తాము పొదుపు చేసుకున్న మొత్తంలో నుంచి తీసి చెల్లిస్తున్నారు. ‘ఈ పరిస్థితి ఎప్పటిదాకా ఉంటుందో, విమానాలు ఎప్పుడు నడుస్తాయో తెలియదు. మొత్తం మీద మా పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయ్యింద’ని బోస్టన్‌లో ఉంటున్న వేమిరెడ్డి నరేందర్ వాపోయాడు. అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను చూస్తుంటే ఉద్యోగం సంగతి దేవుడెరుగు.. బతికుంటే బలుసాకు తినొచ్చన్న సామెత గుర్తుకు వస్తోందని డల్లాస్‌లో ఉంటున్న కంచనపల్లి రఘుబాబు వ్యాఖ్యానించాడు. ఉద్యోగాలు ఎలాగూ పోతాయి. వాటి గురించి ఆలోచించడం కంటే స్వదేశానికి వెళ్లి ఏదో ఒక పని చేసుకోవచ్చనే ఆలోచనలో వేలాదిమంది హెచ్1బీ వీసాదారులు ఉన్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలో గడప దాటాలంటే భయం ‘మాకు ఇప్పుడు ఉద్యోగం గురించి ఎలాంటి ఆలోచన లేదు. సరుకుల కోసం గడప దాటాలంటేనే భయపడుతున్నాం. న్యూయార్క్‌లో సరుకుల కోసం బయటకు వెళ్లిన ప్రతి పదిమందిలో ఆరేడుగురు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు న్యూజెర్సీలోనూ అదే భయం. ఉన్న సరుకులతోనే వెళ్లదీసుకోవడం లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేయడంతోనే మా జీవితం సాగిపోతోంది. ఇదెంతకాలమో తలచుకుంటే భయంగా ఉంది’అని న్యూజెర్సీలో ఉంటున్న బైరెడ్డి దేవిక చెప్పారు. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు న్యూయార్క్‌లో 1,88,694 కేసులు నమోదు కాగా, న్యూజెర్సీలో 61,850మంది కరోన బారినపడ్డారు. ఈ రెండు రాష్ట్రాల్లోనే ఇప్పటివరకు 11,735 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చదవండి: అమెరికాలో అడ్మిషన్లపై కరోనా ఎఫెక్ట్ -
నేడు వైజాగ్‌కు ఇటలీ తెలుగు విద్యార్థులు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఇటలీలోని తెలుగు విద్యార్థులు సోమవారం విశాఖ చేరుకోనున్నారు. ఇటలీ నుంచి మార్చి 15, 21 తేదీల్లో ఢిల్లీ వచ్చి ప్రభుత్వ ఐటీబీపీ క్యాంపస్‌లోని క్వారంటైన్ కేంద్రాల్లో ఏపీ విద్యార్థులు 33 మంది ఉన్నారు. వీరికి రెండు సార్లు కోవిడ్ పరీక్షలు జరపగా నెగిటివ్‌గా తేలింది. క్వారంటైన్ పూర్తయ్యాక ఐటీబీపీ క్యాంపస్ అధికారుల అనుమతి తీసుకుని ప్రైవేటు బస్సులో ఏప్రిల్ 10న బయలుదేరారు. ఛత్తీస్‌గఢ్ అధికారులు వీరిని ఆపేశారు. అన్ని పత్రాలు ఉన్నాయని చూపినా వారు కదలనివ్వలేదు. స్థానికంగా ఆదివాసీ బాలికా విహార్‌లో వసతి కల్పించారు. ఇందులో కొందరు విద్యార్థినులు కూడా ఉన్నారు. విషయాన్ని విద్యార్థులు ఏపీ ప్రభుత్వం, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీ జీవీఎల్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు చొరవ తీసుకొని విద్యార్థులు విశాఖకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. కాశీ నుంచి తెలుగు రాష్ట్రాలకు యాత్రికుల తరలింపు: జీవీఎల్ లాక్‌డౌన్‌కు ముందు కాశీ యాత్రకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన వెయ్యి మంది తెలుగు యాత్రికులను సొంత ప్రాంతాలకు తరలించినట్టు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ప్రధాని కార్యాలయ అనుమతితో వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారన్నారు. కాగా, ఏపీలో చిక్కుకుపోయిన జపాన్ దేశీయులను వారి దేశానికి తరలించడానికి విశాఖ నుంచి బెంగళూరుకు నేడు ప్రత్యేక విమానం నడపనున్నారు. -
ప్రభుత్వ చొరవతో తెలుగు విద్యార్థులకు విముక్తి..
సాక్షి, విజయవాడ : ఇటలీ నుంచి వచ్చి ఛత్తీస్‌గఢ్ బార్డర్లో ఆగిపోయిన 33 మంది తెలుగు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. ఆ విద్యార్థులను క్షేమంగా ఏపీకి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలీకృతం అయ్యాయి. విరాల్లోకి వెళితే.. ఇటలీ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులు ఛత్తీస్‌గఢ్ బార్డర్లో చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వారిని రాష్ట్రానికి క్షేమంగా తీసుకు వచ్చేందుకు చొరవ చూపించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబులు రంగంలోకి దిగి రాయపూర్, జగదల్పూర్ మీదుగా సోమవారం విశాఖకు చేరే విధంగా ఏర్పాట్లు చేశారు. తెలుగు విద్యార్థులను ఏపీకి తీసుకు వచ్చేందుకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. -
తెలుగువారికి అండగా..
సాక్షి, అమరావతి: అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో అక్కడ చిక్కుకుపోయిన వేలాది తెలుగు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అక్కడి విద్యార్థులకు ఆర్థిక, ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురుకాకుండా చూసేందుకు జాగ్రత్తలు తీసుకుంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్స్ (ఆపి), నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) తదితర సంస్థల ద్వారా విద్యార్థులకు సహకారం అందేలా చర్యలు చేపట్టింది వర్సిటీలతో సంప్రదింపులు ► తెలుగు విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్న అమెరికా యూనివర్సిటీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ► యూటీ డల్లాస్, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ – డెంటాన్, టెక్సాస్ ఏ అండ్ ఎం కాలేజ్ స్టేషన్, జార్జియా టెక్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, లూసియానా స్టేట్ యూనివర్సిటీ, టెక్సాస్ ఏ అండ్ ఎం కార్పస్ క్రిస్టి, సదరన్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ, క్రిస్టియన్ బ్రదర్స్ యూనివర్సిటీ, టెన్నెస్సీ టెక్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా, యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, టల్ లహస్సీ తదితర వర్సిటీల్లో మన తెలుగు విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉన్నారు. ► విద్యార్థులకు ఏ సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికాలోని ఏపీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు ‘సాక్షి’కి చెప్పారు. ► విద్యార్థుల్ని ఫ్లాట్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ వస్తున్న ప్రచారం వాస్తవం కాదని.. ఏ విద్యార్థికీ ఇలాంటి ఇబ్బంది వస్తే వెంటనే ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐఎస్ఏ)ను నేరుగా సంప్రదించవచ్చన్నారు. విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రతి వర్సిటీలో కో–ఆర్డినేటర్లు ఉన్నారన్నారు. ► యూనివర్సిటీలు ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయని, విద్యార్థులు వర్సిటీ క్యాంపస్‌లను వినియోగించనందున స్టైఫండ్ రూపంలో కొంత మొత్తం తిరిగి చెల్లిస్తున్నాయన్నారు. భయమొద్దు.. మేమున్నాం తెలుగు విద్యార్థుల యోగక్షేమాల గురించి ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదు. సీఎం జగన్ సూచనల మేరకు విద్యార్థులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. – డాక్టర్ కుమార్ అన్నవరపు, అట్లాంటా, యూఎస్ఏ email: saikumarannavarapu@gmail. com (+16786407682) ‘ఆపి’ ఆపన్న హస్తం అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్స్ (ఆపి) ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థుల సంరక్షణ, సహాయం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశాం. ‘ఆపి’ వైద్యులు సదా అందుబాటులో ఉంటారు. – డాక్టర్ సుధాకర్ జొన్నలగడ్డ, ‘ఆపి’ ప్రెసిడెంట్ ఎలెక్ట్ జాగ్రత్తలు తీసుకున్నాం లూసియానాలోని సదరన్ వర్సిటీతో పాటు ఇతర వర్సిటీల్లోని విద్యార్థులు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మనవాళ్లెవరూ కరోనా బారినపడలేదు. –శ్రీనివాసరెడ్డి గవిని, సదరన్ వర్సిటీ ప్లానింగ్ డైరెక్టర్, లూసియానా email: reddy& gavini@ subr.edu (225 771 2277) ‘నాటా’ బాసట నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో యూఎస్‌లోని తెలుగు విద్యార్థులకు సేవలు అందిస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. – డాక్టర్ రాఘవరెడ్డి, అధ్యక్షుడు, నాటా ఫెలోషిప్స్ ఆపలేదు అమెరికా వర్సిటీల్లో ఫెలోషిప్స్ ఆపేశారన్నది అవాస్తవం. విద్యార్థుల క్షేమంపై మేమంతా శ్రద్ధ వహించాం. ఎలాంటి ఇబ్బందుల్లేవు. – ప్రొఫెసర్ అప్పారావు, డైరెక్టర్, క్లెమ్సెన్ యూనివర్సిటీ email: arao@clemson.edu భద్రంగా ఉన్నారు మన విద్యార్థులు భద్రంగా ఉన్నారు. ఎటువంటి అవసరమొచ్చినా మమ్మల్ని సంప్రదించవచ్చు. – ప్రొఫెసర్ శ్రీనివాసరావు మెంట్రెడ్డి్డ, అలబామా ఏ అండ్ ఎం యూనివర్సిటీ email: srinivasa.mentreddy@aamu.edu మేమంతా క్షేమం తెలుగు విద్యార్థులకు ఎలాంటి భయం లేదు. మేమంతా ఇక్కడ క్షేమంగా ఉన్నాం. – రవితేజ పసుమర్తి, కెన్నెస్సీ స్టేట్ వర్సిటీ విద్యార్థి, అల్ఫారెటా -
ధైర్యంగా ఉండండి
సాక్షి, అమరావతి: ‘మీరెవరూ నిబ్బరం కోల్పోవద్దు. ధైర్యంగా ఉండండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయ్’ అని లండన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ భరోసా ఇచ్చారు. కోవిడ్–19 కారణంగా ఈనెల 20 నుంచి అంతర్జాతీయ విమానాలు రద్దు కావడంతో చివరి నిమిషంలో హిత్రూ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్థులు, ప్రయాణికులు ప్రస్తుతం లండన్‌లోనే ఉంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారితోపాటు ఏపీకి చెందిన 29 మంది అక్కడే ఉండిపోయారు. విమానాలు నిలిపివేయడంతో తామంతా అక్కడ చిక్కుకుపోయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ ఎన్ఆర్టీ కంట్రోల్ రూమ్, సీఐడీ ఎన్ఆర్ఐ సెల్‌కు సమాచారం ఇచ్చారు. దీనిపై స్పందించిన డీజీపీ సవాంగ్ ఏపీ సీఐడీ (ఎన్ఆర్ఐ సెల్), ఏపీ ఎన్ఆర్టీల సమన్వయంతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. విద్యార్థుల గోడు ఇది.. అల్లూరి గోపాల్ అనుకోకుండా లండన్ విమానాశ్రయంలో చిక్కుకుపోయాం. ఈ నెల 20 నుంచి ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఏపీ ఎన్ఆర్టీ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన చొరవతో ఇక్కడ ఐదు రోజులు మాకు ఏర్పాట్లు బాగానే చేశారు. తర్వాత కొంత ఇబ్బందిగా మారింది. తాత్కాలిక షెల్టర్లలో ఉంటున్నాః. ఆహారం ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయి. యుగసాయి, కార్తీక్‌రెడ్డి, గంగిరెడ్డి ఇక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆహారానికి ఇబ్బందిగా ఉంది. బయటకెళ్లి ఆహారం తెచ్చుకుందామంటే పోలీసులు పట్టుకుంటున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా వైరస్ వస్తుందనే భయం వెంటాడుతోంది. నెలనూతల కార్తీక్, మరి కొందరు విద్యార్థులు దేశంలో ఎవరూ మా సమస్యలను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మా సమస్య తెలుసుకుని స్పందించడం, వెంటనే డీజీపీ మాతో మాట్లాడటం చాలా ధైర్యాన్నిచ్చింది. కరోనా వైరస్ ప్రభావం మాపైనా పడుతుందేమోననే భయమేస్తోంది. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి తక్షణమే మమ్మల్ని ఇండియా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. డీజీపీ ఏం భరోసా ఇచ్చారంటే.. ► మీరెవరూ ఆందోళన చెందొద్దు. ధైర్యంగా ఉండండి. మీ ఇబ్బందులను తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తాను. ► వీలైనంత త్వరగా భారతదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. ► మీకు ఏపీ సీఐడీ (ఎన్ఆర్ఐ సెల్), ఏపీ ఎన్ఆర్టీ అందుబాటులో ఉంటాయి. ► ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడి వారితో వీడియో కాల్లో మాట్లాడండి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది లండన్‌లో చిక్కుకున్న మన వాళ్లను వెనక్కి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. అక్కడ చిక్కుకున్న వారికి ఎటువంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలిచ్చారు. విదేశాంగ శాఖ, హోం శాఖ అధికారులు, లండన్‌లోని ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. – వెంకట్ మేడపాటి, ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు లండన్‌లో చిక్కుకున్న వారికి ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. వీరిని వీలైనంత త్వరగా ఏపీకి పంపేలా చేస్తున్నాం. – యూరప్‌లో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కందుల రవీందర్‌రెడ్డి -
లండన్‌లోని తెలుగు విద్యార్థులకు ఏపీ డీజీపీ భరోసా
సాక్షి, విజయవాడ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ లండన్ ఉన్న తెలుగు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ధైర్యం చెప్పారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్‌లోని తెలుగు విద్యార్థులతో గౌతమ్ సవాంగ్ మాట్లాడారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, నిబ్బరం కోల్పోవద్దని వారికి సూచించారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు డీజీపీకి వివరించారు. విద్యార్థుల సమస్యలు విన్న డీజీపీ.. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులతో నిరంతరం అందుబాటులో ఉండాలని సీఐడీ(ఎన్ఆర్ఐ సెల్), ఏపీ ఎన్ఆర్టీ ప్రతినిధులను ఆదేశించారు. డీజీపీ స్పందనపై లండన్‌లోని తెలుగు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. చదవండి : ‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’ సర్వే నిరంతరాయంగా కొనసాగాలి: సీఎం జగన్ -
రెండు రోజులుగా విమానాశ్రయంలోనే..
రణస్థలం: కరోనా ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీని విజృంభణకు విదేశాలకు వెళ్లిన భారతీయులంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం ఫిలిప్పీన్స్ వెళ్లిన 400 మంది విద్యార్థులు తిరిగి దేశానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరి దేశాలకు వారు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించడంతో ప్రయాణాలకు సిద్ధపడిన విద్యార్థులు విమాన సర్వీసులు రద్దయిపోవడంతో రెండు రోజులుగా మనీలా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. రణస్థలం మండలం జేఆర్ పురానికి చెందిన జి.సాయినిఖిల్, లావేరు మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన ఎం.నరేష్ కూడా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. కరోనా నేపథ్యంలో ఇక్కడ పడుతున్న ఇబ్బందులను ఇలా వివరించారు..(ఏపీలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు) ‘ఫిలిప్పీన్స్‌లో మన దేశానికి చెందిన 400 మంది విద్యార్థులం ఎంబీబీఎస్ చదువుతున్నాం. నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నాం. ఇందులో 85 మంది తెలుగు వారే. మూడు రోజుల కిందట ఫిలిప్పీన్స్ ప్రభుత్వం విదేశీయులంతా తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. దీంతో ఇండియా వచ్చేందుకు విమాన టికెట్లు తీసుకుని అంతా మనీలా ఎయిర్‌పోర్టుకు వచ్చాం. కానీ రెండు రోజులు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ విమానాశ్రయం మూసేస్తున్నట్లు ప్రకటించారు. విమాన సరీ్వసులు రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో మాకేమీ పాలు పోవడం లేదు. టికెట్ రూ. 30వేలు పెట్టి కొన్నాం. రిఫండ్ వస్తుందో రాదో తెలీడం లేదు. ఉండేందుకు వసతులు లేవు. తిరిగి రూములకు వెళ్లిపోదామంటే ఉండేందుకు డబ్బులు లేవు. ఇక్కడి ప్రభుత్వం మాకేమీ సహకరించడం లేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి రాక కోసం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. (తాత్కాలికంగా శ్రీవారి దర్శనం రద్దు) ప్రభుత్వమే రప్పించాలి విమాన టికెట్లు బుక్ చేసుకొని విమానాశ్రయానికి చేరుకుంటే విమానాలు రద్దు చేస్తున్నాం, విమానాశ్రయమే మూసేస్తున్నాం అని చెబితే చదువు కోసం వెళ్లిన విద్యార్థులు ఏం చేయగలరు..? భోజనాలు కూడా దొరకడం లేదంట. ప్రభుత్వమే వారిని రప్పించే ఏర్పాట్లు చేయాలి. – కల్యాణకుమార్ రాజా, విద్యార్థి నిఖిల్ తండ్రి ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మూడు రోజులు గడువిచ్చి స్వదేశాలకు వెళ్లిపొమ్మంది. ఈ లోగానే విమాన సరీ్వసులు రద్దయిపోయాయి. మనీలా విమానాశ్రయం మూసేస్తున్నారని మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. కరోనా వల్ల వారు ఏం ఇబ్బందులు పడుతున్నారో..? ప్రభుత్వం చొరవ తీసుకుని వారిని రప్పించాలి.– ఎం.గోవిందరావు, విద్యార్థి నరేష్ తండ్రి -
‘ఆ విద్యార్ధులను తీసుకురండి’
సాక్షి, న్యూఢిల్లీ : ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా విమానాశ్రయంలో మూడు రోజులుగా చిక్కుబడిపోయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 70 మంది మెడికల్ విద్యార్ధులను తక్షణమే స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. తిండి, నీరు లేకుండా కటిక నేలపై నిద్రిస్తూ మనీలా ఎయిర్‌పోర్ట్‌లో తెలుగు విద్యార్ధులు పడుతున్న కష్టాలను ఆయన మంత్రికి వివరించారు. ఈ విద్యార్ధులంతా మనీలాలో వైద్య విద్య అభ్యసిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా మనీలాలో విద్యా సంస్థలు మూసివేయడంతో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులంతా మూడు రోజుల క్రితమే మనీలా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే మనీలా ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు కూడా స్తంభించిపోవడంతో విద్యార్దులు దిక్కుతోచని స్థితిలో ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో బిక్కు బిక్కుమని గడుపుతున్నారు. ఎయిర్పోర్ట్ మూసివేయడంతో తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేని దుర్భరమైన పరిస్థితుల్లో సహాయం కోసం వారంతా ఎదురుచూస్తున్నారని విజయసాయి రెడ్డి మంత్రికి వివరించారు. రవాణా వ్యవస్థ యావత్తు నిలిచిపోవడంతో వారు ఎయిర్పోర్ట్ నుంచి తమ హాస్టళ్ళకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మనీలా ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుబడిపోయిన 70 మంది విద్యార్ధులలో 36 మంది యువతులు ఉన్నారని, టాయిలెట్ సౌకర్యం కూడా అందుబాటులో లేకపోవడంతో దుర్భరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారని మంత్రికి తెలియచేశారు. విద్యార్ధులు మనీలాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించగా తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి మూడు రోజులు కావస్తున్నా వారి నుంచి ఎలాంటి సాయం అందలేదని విద్యార్ధులు వాపోతున్నట్లు మంత్రి జైశంకర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మనీలాలో చిక్కుబడిపోయిన విద్యార్ధులను స్వదేశానికి రప్పించాలని విజయసాయి రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. -
హమ్మయ్యా.. మనోళ్లు వచ్చేశారు
సాక్షి, విశాఖపట్నం : కరోనావైరస్ కారణంతో మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న తెలుగు విద్యార్థులను ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో తెలుగు విద్యార్థులు విశాఖపట్నంకు చేరుకున్నారు. కౌలాలంపూర్ నుంచి 186 మంది విద్యార్థులతో వచ్చిన ప్రత్యేక విమానం బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకుంది. కోవిడ్–19 వల్ల ఫిలిప్పీన్స్ దేశంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో మలేషియాకు చేరుకున్న తెలుగు విద్యార్థులు స్వదేశానికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం.. విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హుటాహుటిన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌ను సంప్రదించారు. విద్యార్థులందరినీ తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేయడంతో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం, ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానాలు నడిపేందుకు ఆయన అనుమతించారు. దీంతో తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. (చదవండి : కరోనా ఎఫెక్ట్: 7 ప్రత్యేక రైళ్ల సేవలు రద్దు) ప్రయాణికులందరికీ థర్మల్ స్క్రీనింగ్ తెలుగు విద్యార్థులు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులందరికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికులను పరిక్షీంచేందుకు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. కరోనా లక్షణాలు ఉన్నవారిని విశాఖ చెస్ట్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ చెస్ట్ ఆస్పత్రిలో ఇప్పటికే 100 పడకలను సిద్ధం చేశారు. 50మంది వైద్యులను నియమించారు. విదేశాల నుంచి వచ్చే వారిని విమ్స్‌లోని ఐసోలేషన్ వార్డులకి తరలించేందుకు ఐదు అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఏ లక్షణాలు లేకున్నా 14 రోజుల పాటు ఇంట్లోనే క్వారంటైన్లో ఉంచనున్నారు. ప్రయాణికులను స్వస్థలాలకు చేర్చడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. -
తెలుగు విద్యార్థులకు సర్కారు అండ
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): కరోనా వైరస్ కారణంతో మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారందరినీ క్షేమంగా తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హుటాహుటిన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌ను సంప్రదించారు. విద్యార్థులందరినీ తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేయడంతో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం, ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానాలు నడిపేందుకు ఆయన అనుమతించారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎయిర్ ఏషియా సంస్థను సంప్రదించాలన్నారు. మరోవైపు.. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు నివేదించాలని ఢిల్లీ ఏపీ భవన్ అధికారులను సీఎం ఆదేశించారు. కౌలాలంపూర్‌లో విద్యార్థుల అవస్థలు అంతకుముందు.. కోవిడ్–19 వల్ల ఫిలిప్పీన్స్ దేశంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా, అలాగే కావైట్ పట్టణంలో చదువుతున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 120 మంది ఉన్నట్లు సమాచారం. మనీలాలో ఇప్పటివరకు 100 పాజిటివ్ కేసులు.. కావైట్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో తమకు ఏప్రిల్ 30 వరకు సెలవులు ప్రకటించారని అక్కడి విద్యార్థులు తెలిపారు. తమను కళాశాల యాజమాన్యం గురువారం సాయంత్రంలోపు ఖాళీచేయాలని.. లేనిపక్షంలో నిర్బంధిస్తామని హెచ్చరికలు జారీచేసిందన్నారు. అంతేకాక.. అనుమతి లేకుండా వీధుల్లో సంచరిస్తే కాల్చివేస్తామని కూడా హెచ్చరికలు చేసిందని వాపోయారు. దీంతో వారంతా మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ, అక్కడ భారత్ వెళ్లే విమానాలన్నీ రద్దు చేయడంతో వీరంతా ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. వీరిలో కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థులున్నారు. వీరంతా ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటామా లేదా అని ఆందోళన చెందుతున్నారు. సరైన ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడిపేందుకు అంగీకరించడంతో వారంతా స్వస్థలాలకు సురక్షితంగా వచ్చేందుకు మార్గం సుగమమైంది.