సాక్షి, హైదరాబాద్ : ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు సోమవారం విడుదల య్యాయి. ఇందులో తెలుగు విద్యార్థులు సత్తా చాటినా, ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే ఈసారి తెలం గాణ విద్యార్థులు వెనుకబడిపోయారు. టాప్– 100లోపు రెండు రాష్ట్రాల్లో కలిపి 15 మంది పైగా ఉండగా, అందులో ఏపీ నుంచే ఎక్కువ మంది ఉన్నారని విద్యా సంస్థలు పేర్కొంటున్నాయి. తెలంగాణ నుంచి టాప్– 100లో ఇద్దరి పేర్లే వెల్లడైనా.. మరో ఐదారుగురు ఉండొచ్చని పేర్కొన్నాయి. తెలంగాణలో స్థిరపడిన (మధ్యప్రదేశ్‌కు చెం దిన) హర్ధిక్ రాజ్‌పాల్ ఆరో ర్యాం కుతో టాప్ 10లో నిలువగా, మంచిర్యాలకు చెందిన అన్నం సాయివర్ధన్ 93వ ర్యాంకు సాధించారు. ఇక ఏపీ నుంచి.. ఆలిండియా ర్యాం కుల్లో జనరల్ కేటగిరీ 2వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ ఆలిండియా కోటాలో ప్రథమ ర్యాంకు.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి సాధించాడు. ఓబీసీలో ప్రథమ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 14వ ర్యాంకును విజయనగరం జిల్లా గుర్ల మండలం లగడాం గ్రామానికి చెందిన లండా జితేంద్ర దక్కించుకున్నాడు.
రాసింది తక్కువే.. అర్హులు తక్కువే..
జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది విద్యార్థులకు అర్హత కల్పించగా, కరోనా నేపథ్యంలో వారిలో 1,60,838 మందే దరఖాస్తు చేసుకున్నారు. గతనెల 27న జరిగిన పరీక్షకు 1,50,838 మంది హాజరు కాగా, వారిలో 43,204 మంది అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించారు. అర్హుల్లో బాలురు 36,497 మంది ఉండగా, బాలి కలు 6,707 మంది ఉన్నారు. టాప్ 500లో 140 మందే ఐఐటీ మద్రాస్ పరిధిలో టాప్–500 ర్యాంకులోపు 140 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో టాప్ 100లోపు 28 మంది ఉండగా, అందులో తెలుగు విద్యార్థులే అత్యధికంగా ఉన్నారు. ఇక టాప్–200లోపు 61 మంది, టాప్–300లోపు 86 మంది, టాప్–400లోపు 114 మంది, టాప్–500 ర్యాంకులోపు 140 మంది ఉన్నారు.
తగ్గిన కటాఫ్ మార్కులు..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్ మార్కులు తగ్గాయి. గతేడాది 90 వరకు ఉండగా ఈసారి కామన్ ర్యాంకులో కటాఫ్ 69 మార్కులకు తగ్గిపోయింది. ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 62, ఈబ్ల్యూఎస్‌లో 62, ఎస్సీ, ఎస్టీలలో 34 మార్కులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కనీస అర్హత మార్కులుగా ఐఐటీ ఢిల్లీ ప్రకటించింది. ఇక వికలాంగుల కోటాలో 34 మార్కులను కనీస అర్హత మార్కులుగా ప్రకటించింది.
ప్రణాళికతో చదివి.. అనుకున్నది సాధించి..
మంచిర్యాలఅర్బన్ : ఉన్నత స్థానాలను చేరుకోవాలనే తపన.. కష్టపడేతత్వం ఉంటే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభమే అని నిరూపించాడు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన సాయివర్ధన్ . తల్లిదండ్రుల ప్రోత్సాహం.. పట్టుదలతో చదివి జేఈఈ అడ్వాన్ ్సడ్ ఆలిండియా ర్యాంక్‌ల్లో 93, ఓబీసీలో 7వ ర్యాంక్‌తో ప్రతిభ కనబరిచాడు. తల్లిదండ్రులు జయ, రమణారెడ్డి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. సాయివర్ధన్ ను 8వ తరగతిలో హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య విద్య సంస్థల్లో చేర్పించారు. 10వ తరగతిలో 9.5 మార్కులు, ఇంటర్‌లో 967 మార్కులు సాధించాడు. సీఈసీ (కంప్యూటర్ సైన్ ్స ఇంజనీర్) చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని, ప్రణాళికాబద్ధంగా చదివితే సాధించలేనిది ఏమిలేదని సాయివర్ధన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తను ఈ ర్యాంక్ సాధించడం వెనుక కుటుంబసభ్యుల తోడ్పాటు ఎంతో ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment