ప్రయోగాలు విజయవంతమైతే అటానమస్
వాహనాలను రోడ్లపైకి తెచ్చే అంశం పరిశీలిస్తాం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
ఐఐటీహెచ్‌లో డ్రైవర్‌రహిత వాహనంలో ప్రయాణించిన మంత్రి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వ శాఖల్లో మెరుగైన సేవలందించేందుకు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), హైదరాబాద్ ఐఐటీలో అభివృద్ధి చేస్తున్న సాంకేతికతను వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇప్పటికే డ్రోన్ల ద్వారా పంటలకు మందులు పిచికారీ చేసే విధానాన్ని వ్యవసాయశాఖ వినియోగిస్తోందని, అలాగే రవాణా, హెల్త్‌కేర్ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో పరిశోధన విభాగం టీహాన్ అభివృద్ధి చేస్తున్న డ్రైవర్ రహిత (అటానమస్ నావిగేషన్) వాహనాన్ని పరిశీలించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి ఈ వాహనంలో ప్రయాణించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో మాదిరిగా మన దేశంలోని రోడ్లు, ట్రాఫిక్ తీరుకు అనుగుణంగా పనిచేసే డ్రైవర్ రహిత వాహన టెక్నాలజీని హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ఈ వాహనాలను రోడ్లపైకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ పరిశోధనకు సహకరిస్తున్న జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ ప్రతినిధులను, పరిశోధన విభాగం విద్యార్థులు, ప్రొఫెసర్లను మంత్రి అభినందించారు.
ఐఐటీని ఇక్కడకు తీసుకొచి్చంది వైఎస్సే
దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఈ హైదరాబాద్ ఐఐటీని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి సంగారెడ్డి జిల్లా కందిలో స్థాపించారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. స్కిల్స్ యూనివర్సిటీలో ఒక డైరెక్టర్‌గా ఉండాలని మంత్రి హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తిని కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టీహాన్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment