driverless vehicles
-
ఏఐని వాడుకుంటాం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వ శాఖల్లో మెరుగైన సేవలందించేందుకు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), హైదరాబాద్ ఐఐటీలో అభివృద్ధి చేస్తున్న సాంకేతికతను వాడుకునే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇప్పటికే డ్రోన్ల ద్వారా పంటలకు మందులు పిచికారీ చేసే విధానాన్ని వ్యవసాయశాఖ వినియోగిస్తోందని, అలాగే రవాణా, హెల్త్‌కేర్ రంగాల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నామని తెలిపారు.సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో పరిశోధన విభాగం టీహాన్ అభివృద్ధి చేస్తున్న డ్రైవర్ రహిత (అటానమస్ నావిగేషన్) వాహనాన్ని పరిశీలించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి ఈ వాహనంలో ప్రయాణించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమెరికా, యూకే, యూరప్ దేశాల్లో మాదిరిగా మన దేశంలోని రోడ్లు, ట్రాఫిక్ తీరుకు అనుగుణంగా పనిచేసే డ్రైవర్ రహిత వాహన టెక్నాలజీని హైదరాబాద్ ఐఐటీ అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు. ఈ వాహనాలను రోడ్లపైకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఈ పరిశోధనకు సహకరిస్తున్న జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ ప్రతినిధులను, పరిశోధన విభాగం విద్యార్థులు, ప్రొఫెసర్లను మంత్రి అభినందించారు. ఐఐటీని ఇక్కడకు తీసుకొచి్చంది వైఎస్సే దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఈ హైదరాబాద్ ఐఐటీని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి సంగారెడ్డి జిల్లా కందిలో స్థాపించారని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. స్కిల్స్ యూనివర్సిటీలో ఒక డైరెక్టర్‌గా ఉండాలని మంత్రి హైదరాబాద్ ఐఐటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ బీ.ఎస్.మూర్తిని కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టీహాన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
డ్రైవర్ అవసరం లేని ట్రక్.. దుబాయ్‌లో టెస్ట్
టెక్నాలజీ పెరుగుతుంటే.. వినియోగించే వాహనాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే డ్రైవర్‌లెస్ వెహికల్స్ పుట్టుకొచ్చాయి. ఈ రంగం మరో అడుగు ముందుకు వేసి వాణిజ్య విభాగంలోకి ప్రవేశించి డ్రైవర్‌లెస్ ట్రక్కును తీసుకువచ్చింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదటి డ్రైవర్‌లెస్ ట్రక్కును దుబాయ్ కంపెనీ విజయవంతంగా టెస్ట్ చేసింది. డిసెంబర్ 2022లో ఏవియేషన్ హబ్ దుబాయ్ సౌత్.. ఎవోకార్గో భాగస్వామ్యంతో డ్రైవర్‌లెస్ ట్రక్కులకు సంబంధించిన ఓ ఒప్పందం ఏర్పడింది.ఈ డ్రైవర్‌లెస్ ట్రక్కు ఆటోమాటిక్‌గా ముందుకు కదులుతుంది. ఇందులో 360 డిగ్రీ కెమెరాలు చుట్టూ ఉన్న పరిసరాలను చూపిస్తాయి. ఇవి అల్ట్రాసోనిక్ సెన్సార్లుగా పనిచేస్తాయి. ఈ ట్రక్కును ఆబ్జెక్ట్ డిటెక్షన్, యాక్సిడెంట్ ప్రివెన్షన్, ఎమర్జెన్సీ స్టాప్‌లు, రివర్స్ ఆపరేషన్లు వంటి కీలక అంశాలలో టెస్ట్ చేశారు. ఈ అన్ని పరీక్షల్లోనూ ఈ ట్రక్కు విజయం సాధించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్‌లో దాదాపు అన్ని వాహన విభాగాల్లో ఆటోమాటిక్ రవాణాను పెంపొందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 2030 నాటికి 25 శాతం ఆటోమాటిక్ వాహనాలు రోడ్డు మీదికి రానున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నాయి. -
ఆర్టీసీలో ‘మానసిక’ టెన్షన్!
ముందు రోజు రాత్రివిధులు నిర్వహించి వచ్చాడు ఆ డ్రైవర్.. మరుసటి రోజు రాత్రి విధులకు వెళ్లేలోపు కనీసం నాలుగు గంటలన్నా నిద్రపోవాలి.. కానీ దగ్గరి బంధువుల ఇంట్లో వేడుకకు వెళ్లాల్సి ఉంది, సెలవులు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పగటి పూట వేడుకలో గడిపి, 110 కి.మీ. దూరంలోని తానుంటున్న పట్టణం నుంచి సొంత వాహనం నడుపుకుంటూ హైదరాబాద్ వచ్చి విజయవాడ బస్సు తీసుకుని బయలుదేరాడు. దారిలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొనటంతో మృతి చెందాడు. మరో 9 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ డ్రైవర్ కొన్నేళ్లుగా కుటుంబ వివాదాలతో సతమతమవుతున్నాడు.. దాదాపు కుటుంబ సభ్యులు వెలివేసినంత పనిచేశారు.. దీంతో అతని మానసిక స్థితి అదుపు తప్పింది. దూరప్రాంత బస్సు కావటంతో ఇద్దరు డ్రైవర్లు విధుల్లో ఉంటున్నారు. మరో డ్రైవర్ నడుపుతున్నప్పుడు అతను మద్యం సేవిస్తున్నాడు. ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేయగా, ఆ రోజు అధికంగా మద్యం తాగి ఉన్నట్టు తేలి అధికారులు కంగుతిన్నారు. అప్పుడు కాని అతన్ని విధుల నుంచి తప్పించలేదు. సాక్షి, హైదరాబాద్: ఇది తెలంగాణ ఆర్టీసీలో నెలకొన్న పరిస్థితి. సగటున ఒక్కో బస్సులో 60 మందికిపైగా ప్రయాణికులు ఉంటారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చేది డ్రైవరే. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి డ్రైవర్లపై పర్యవేక్షణే లేకుండా పోయింది. డ్రైవర్ భద్రంగా బస్సును గమ్యం చేర్చటమనేది డ్రైవింగ్ స్కిల్స్ పైనే కాకుండా, అతని మానసిక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే గతంలో డ్రైవర్‌పై నిఘా, పర్యవేక్షణ ఉండేది. కానీ, క్రమంగా నష్టాలను అధిగమించేందుకు ఆదాయంపైనే దృష్టి కేంద్రీకరించటం మొదలయ్యాక ఇది గతి తప్పింది. ఇప్పుడు డ్రైవర్ల కొరత కూడా ఉండటంతో, కచ్చి తంగా ఉన్నంత మంది విధులకు వచ్చేలా చూడ్డానికే అధికారులు పరిమితమవుతున్నారు. వారికి గతంలోలాగా సెలవులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో విధులు ముగిసిన తర్వాత నుంచి తిరిగి విధులకు వచ్చే వరకు ఆ డ్రైవర్ విషయాన్ని సంస్థ పట్టించుకోవటం లేదు. డ్యూటీకి వచ్చే సమయానికి అతని మానసిక స్థితి ఏంటో కూడా తెలుసుకోలేకపోతున్నారు. మద్యం తాగి ఉన్నాడా లేదా అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తేల్చుకుని బస్సు అప్పగిస్తున్నారు. సెలవులు లేక.. ఒంట్లో కాస్త నలతగా ఉన్నా, విశ్రాంతి సమయంలో నిద్రపోలేని పరిస్థితిలో ఉన్నా, రకరకాల వివాదా లతో మానసికంగా ఆందోళనతో ఉన్నా.. డ్రైవింగ్ సరిగా చేయలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో తనకు సెలవు కావాలంటూ డ్రైవర్లు అడుగుతారు. అయితే, సెలవు ఇస్తే డ్రైవర్ల కొరత వల్ల సరీ్వసునే రద్దు చేసుకోవాల్సి వస్తోంది. దీంతో వా రికి సెలవుల్లేక విధులకు హాజరు కావాల్సి వస్తోంది. విజయవాడ మార్గంలో జరిగిన యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్.. ఆ రోజు నిద్రలేమితో ఉండి కూడా సెలవుకు దరఖాస్తు చేయకుండా డ్యూటీకి హాజరయ్యాడని తెలిసింది. ఆ విధానమేమైంది..? గతంలో ప్రతి డిపోలో స్పేర్ డ్రైవర్లు ఉండేవారు. డ్యూటీ చేయలేని స్థితిలో డ్రైవర్ ఉంటే అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపే వారు. కానీ 13 ఏళ్లుగా డ్రైవర్ల రిక్రూట్మెంట్ లేకపోవటం, రిటైర్మెంట్లు, మరణించడం, పదోన్నతులు.. వంటి కారణాల వల్ల డ్రైవర్లకు కొరత ఏర్పడింది. గతంలో డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకునే విధానం ఉండేది. ఏవైనా కారణాలతో వారు మానసికంగా కుంగిపోతున్నారా అన్నది సంస్థకు తెలిసే ఏర్పాటు ఉండేది. ప్రతి సంవత్సరారంభంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేవారు. వాటికి డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు పాల్గొనాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డ్రైవర్ల స్థితిగతులపై ఆర్టీసీకి సమాచారం చేరేది. డ్రైవర్లతోపాటు, వారి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ చేసేవారు. డ్యూటీకి–డ్యూటీకి మధ్య చాలినంత నిద్ర ఉండేలా చూడాలంటూ కుటుంబ సభ్యులకు సూచించేవారు. ఇప్పుడు ఆ వారోత్సవాలు సరిగా నిర్వహించటం లేదు. సంవత్సరంలో ఒకసారి ప్రమాదరహిత వారోత్సవాలు నిర్వహించేవారు. ఆ వారంలో ఒక్క బస్సు కూడా ప్రమాదానికి గురి కాకుండా డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలుండేవి. ఇది కూడా వారి నైపుణ్యం, మానసిక స్థితి తెలుసుకునేందుకు ఉపయోగపడేది. ఇప్పుడు దీన్ని నిర్వహించటం లేదు. వరుస ప్రమాదాలతో.. చాలా విరామం తర్వాత మళ్లీ ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. ఇటీవలి వరుస ప్రమాదాలతో సంస్థలో టెన్షన్ నెలకొంది. డ్యూటీకి వచ్చేప్పుడు సరైన స్థితితో డ్రైవర్లు ఉండేలా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది అని అధికారులు చెబుతున్నారు. వారు రెస్ట్ సమయంలో తగినంతగా నిద్రపోవటం, సెల్ఫోన్లతో ఎక్కువ సేపు గడపకుండా చూడటం, అనవసర వివాదాలతో ఒత్తిడికి గురికాకుండా చూడటం.. లాంటి అంశాలపై కుటుంబ సభ్యులు దృష్టి సారించాలని చెప్పనున్నారు. కానీ, గతంలో ఉన్నట్టు పకడ్బందీ వ్యవస్థ ఏర్పాటు చేస్తే తప్ప ఇది ఫలించే సూచనలు కనిపించటం లేదు. డ్రైవర్లపై పని ఒత్తిడి తగ్గటంతోపాటు డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఉంటే సెలవు ఇచ్చే ఏర్పాటు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అది జరగాలంటే, తాత్కాలిక పద్ధతిలోనైనా డ్రైవర్ల రిక్రూట్మెంట్ ఉండాలని వారు పేర్కొంటున్నారు. -
వీడియో షేర్ చేసిన ఆనంద్ మహింద్రా.. ఇలాంటివి వద్దంటున్న నెటిజన్లు
డ్రైవర్ లెస్ కార్లు రోడ్లపైకి వస్తున్న తరుణంలో తాజాగా ఓ వీడియో వైరల్ అయింది. వీడియో ఎక్కడ తీశారో తెలియదు గానీ.. ఓ వ్యక్తి బైక్ వెనకాల కూర్చుని ఉండగా.. అది వేగంగా దూసుకెళ్తోంది. ఇక అతను సరదగా రోడ్డు వెంట ఉన్నవారికి చేయి ఊపుతుండగా.. మరో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. డ్రైవర్ లెస్ వాహనాలతో భారత్‌కు తెద్దామనుకున్న ఎలన్ మస్క్‌కు దీనితో కాంపీటీషన్ ఎదురవుతుంది కావచ్చు అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చి ట్విటర్లో షేర్ చేశాడు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహింద్రా ఈ వీడియోపై ట్విటర్లో స్పందించాడు. దిగ్గజ గాయకుడు కిశోర్‌కుమార్ ఆలపించిన ‘ముసాఫిర్ హోన్ యారాన్’ పాటను తాజా వీడియోకు ఆపాదిస్తూ ముసాఫిర్ హోన్ యారాన్.. నా చాలక్ హై, నా ఠికానా హై’ అంటూ రీట్వీట్ చేశారు. 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు 2.31 లక్షల మంది వీక్షించారు. 4500 మంది లైక్ చేశారు. (చదవండి: Priyanka Gandhi: అడ్డుకున్న పోలీసులు, సెల్ఫీల వీడియో వైరల్) డ్రైవర్ లేకుండా బైక్ అలా వేగంగా వెళ్తుండడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారు. గ్రేట్ రైడింగ్ స్కిల్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరేమో కనీసం హెల్మెట్ కూడా లేకుండా బైక్‌పై విన్యాసాలు చేస్తున్న ఇటువంటి స్టంట్స్‌ను ప్రమోట్ చేయొద్దని ఆనంద్ మహింద్రాకు సూచిస్తున్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాలకు ఇటువంటి పిచ్చి పనులే కారణమవుతున్నాయని మండిపడుతున్నారు. (చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా!) Love this…Musafir hoon yaaron… na chalak hai, na thikaana.. https://t.co/9sYxZaDhlk — anand mahindra (@anandmahindra) October 20, 2021 -
ఎంజీ ఎస్టర్ ఎస్యూవీ.... కీ ఫీచర్లు ఇవే
సాక్షి, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ ఇండస్ట్రీ టెక్నాలజీ బాట పట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతుండటంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సాంకేతిక హంగులు జోడిస్తున్నాయి. ఈ విషయంలో మిగిలిన కంపెనీల కంటే ఎంజీ మోటార్స్ ఒక అడుగు ముందే ఉంది. ఇప్పటికే రిలయన్స్ జియోతో జట్టు కట్టి నెట్ కనెక్టివిటీ అందిస్తుండగా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మీద దృష్టి సారించింది. ధర తక్కువ హెక్టార్ ఎస్‌యూవీతో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంజీ మోటార్, ఈసారి ఇండియన్ మార్కెట్‌కు తగ్గట్టుగా ఎస్టర్ పేరుతో ఎంట్రీ లెవల్ ఎస్యూవీసి మార్కెట్లోకి తెస్తోంది. ఎంజీ మోటార్స్ నుంచి తక్కువ ధరకు లభించే వాహనంగా ఇది ఇప్పటికే పేరు తెచ్చుకుంది. ఎస్టర్ ధర విషయంలోనే తక్కువని, ఫీచర్ల విషయంలో కాదంటోంది ఎంజీ మోటార్స్. సీఏఏపీ ఎంట్రీ లెవల్ ఎస్యూవీ సెగ్మెంట్లో డ్రైవర్ అసిస్టెంట్ అర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థ కలిగిన తొలి మోడల్‌గా ఎస్టర్ నిలవనుంది. ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ లెవల్ టూ టెక్నాలజీని ఉపయోగించారు. కాన్సెప్ట్ ఆఫ్ కార్ యాజ్ ఏ ప్లాట్ఫార్మ్ (సీఏఏపీ) సాఫ్ట్‌వేర్‌ని ఇందులో అందిస్తున్నారు. ఏఐ ఫీచర్లు డ్రైవర్ అసిస్టెంట్‌లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైట్ డిపాచర్ ప్రివెన్షన్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ (మాన్యువల, ఇంటిలిజెంట్మోడ్), రియర్ డ్రైవ్ అసిస్టెంట్, ఇంటిలిజెంట్ హెడ్ ల్యాంప్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటికి పోటీగా ఈ కారు ధర ఎంత అనేది ఇంకా ఎంజీ మోటార్స్ వెల్లడించలేదు. అయితే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ ధరల శ్రేణిలోనే ఎస్టర్ ధరలు ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. -
హ్యాట్సాఫ్: మన రోడ్లకు తగ్గట్లు సెల్ఫ్ డ్రైవింగ్ బండి!
సెల్ఫ్ డ్రైవింగ్ బండ్లు.. ఈ పేరు వినగానే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు ఎలన్ మస్క్. అమెరికన్ కంపెనీ టెస్లా ద్వారా ఎలక్ట్రికల్ బండ్లను అందిస్తూ.. సెల్ఫ్ డ్రైవింగ్ సాంకేతికతపై చర్చతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడాయన. అమెరికాలో వరకైతే ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ ఓకే. కానీ, ట్రాఫిక్ రద్దీ, ఇతరత్రా సమస్యలుండే మన దేశంలో అది కుదిరే పనేనా?. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించే ప్రయత్నం చేస్తోంది మైనస్ జీరో. ఛండీగఢ్: ఒకదాని వెనుక ఒక వాహనం, గుంతలతో వికారంగా మారిన రోడ్లు, అడ్డదిడ్డంగా దూసుకొచ్చే వాహనాలు.. మన రోడ్ల స్థితికి సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కష్టతరం అనేది నిపుణుల మాట. కానీ, సాంకేతికతో పని లేకుండా.. కామన్సెన్స్ను ఉపయోగించి వెహికిల్స్‌ను రూపొందించే పనిలో పడింది మైనస్ జీరో స్టార్టప్. జలంధర్(పంజాబ్)కు చెందిన ఈ స్టార్టప్ గత రెండేళ్లుగా మన రోడ్లకు సరిపోయే రీతిలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్ టెక్నాలజీని రూపొందించే పనిలో మునిగింది. అంతేకాదు ప్రయోగాత్మకంగా ఓ ఆటోను డెవలప్ చేసి రోడ్ల మీదకు వదిలింది కూడా. ఎలా పని చేస్తుందంటే.. మైనస్ జీరో తయారు చేసిన బండి ఏఐ టెక్నాలజీపై తక్కువ ఆధారపడుతూ పూర్తి ఆటానమస్ సిస్టమ్‌తో నడుస్తుంది. తద్వారా భద్రతా పరమైన సమస్యలు ఉండవని, ట్రాఫిక్‌కు తగ్గట్లు ప్రయాణం సాఫీగా సాగుతుందని, రోడ్లకు తగ్గట్లు ప్రయాణాన్ని మలుచుకోవచ్చని మైనస్ జీరో సీఈవో, సహ వ్యవస్థాపకుడు గగన్‌దీప్ రీహల్ వెల్లడించాడు. కంట్రోల్ యూనిట్స్‌తో పనిచేసే ఈ ‘ఈ-వెహికిల్ ఆటోరిక్షా’ను గగన్‌దీప్ టీం నెలలు శ్రమించి రూపొందించింది. ‘బిలియన్ల ఖర్చుతో, అత్యాధునిక సాంకేతికతతో వాళ్లు వాహనాలు రూపొందిస్తున్నారు. కానీ, ప్రాక్టీకల్‌గా మన రోడ్లకు ఆ టెక్నాలజీ సరిపోతుందా? అనే ప్రశ్న అందరిలో ఉంది. అయితే హంగుల కన్నా భద్రత, తక్కువ ఖర్చులో పని జరగడం మనకు ముఖ్యం. అందుకే లో-టెక్నాలజీతో ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికిల్స్‌ను రూపొందించింది మా బృందం’ అని గగన్‌దీప్ వెల్లడించాడు. నిజానికి చాలా కాలం క్రితమే వీళ్ల ఆవిష్కరణ వెలుగులోకి వచ్చినప్పటికీ.. లాక్డౌన్ కారణంగా పూర్తిస్థాయి డెవలప్మెంట్ ఆలస్యమవుతూ వస్తోంది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ ఆటోను పవర్ఫుల్ మోటర్ అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు రెంటెడ్ బేస్ మీద కొంత మంది ఆటోవాలాలాకు అప్పగించి.. పరిశీలిస్తోంది. తన సోదరుడు గురుసిమ్రన్ సలహా మేరకు పూర్తిస్థాయి పరీక్షల తర్వాతే వీటిని మార్కెట్లోకి తీసుకొస్తామని గగన్‌దీప్ స్పష్టం చేశాడు కూడా. మైనస్ జీరో ఫౌండర్లు గురుసిమ్రన్, గగన్‌దీప్ -
మరో ప్రయోగానికి ఇంటర్నెట్ దిగ్గజం శ్రీకారం
బీజింగ్ : చైనా ఇంటర్నెట్ దిగ్గజం ‘బైదు’ మరో నూతన ప్రాజెక్ట్‌ను చేపట్టింది. డ్రైవర్ రహిత, ఎలక్ట్రిక్ బస్సులను రూపొందించేందుకు చైనాలో బస్సుల తయారీకి పేరు గాంచిన ‘కింగ్‌లాంగ్’ కంపెనీతో జట్టు కట్టింది. ‘అపోలాంగ్’ పేరుతో కింగ్‌లాంగ్ తయారు చేయనున్న ఈ డ్రైవర్ రహిత ఎలాక్ట్రానిక్ బస్సుల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనున్నట్లు బైదు తెలిపింది. మనం నిత్యం చూసే సాధారణ బస్సులకు భిన్నంగా ఈ డ్రైవర్ రహిత బస్సులు ఉండనున్నట్లు సమాచారం. ఈ డ్రైవర్ రహిత బస్సుల్లో స్టీరింగ్ వీల్, పెడల్స్, డ్రైవర్ ఉండరు. ఇవేవి లేకుండా కేవలం అపోలో 3.0 అటానమస్ డ్రైవింగ్ ఒపెన్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ సాయంతో ఈ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి. తొలుత ఈ బస్సులు విమానాశ్రాయాలు, సందర్శనీయ ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. వాణిజ్యపరంగా పూర్తి తొలి అటానమస్ / డ్రైవర్ రహిత బస్సులుగా అపోలాంగ్ బస్సులు గుర్తింపు పొందనున్నాయి. తొలుత వీటిని బీజింగ్, షెన్జెన్, జియోగన్, వూహన్, పింగనస్ నగర రవాణా సంస్థల్లో వినియోగించనున్నట్లు సమాచారం. ఈ బస్సుల గురించి బైదు చైర్మన్, సీఈవో రాబిన్ లి బైదు బీజింగ్‌లో ఏర్పాటు చేసిన ‘క్రియేట్ 2018’ కన్సల్టింగ్ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రాబిన్ లి బైదు మాట్లాడుతూ.. ‘డ్రైవర్ రహిత ప్రయాణ వ్యాపారీకరణకు తొలి అడుగు 2018లోనే పడింది. పెద్ద మొత్తంలో తయారయ్యే అపోలాంగ్ బస్సుల వల్ల చైనా గొప్ప ప్రగతి సాధిస్తుంద’ని తెలిపారు. అంతేకాక తాము అందించే సాంకేతిక పరిజ్ఞానం కేవలం బస్సులకే పరిమితం కాదని తెలిపారు. ప్రస్తుతం బైదు అందించే ఒపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ కోసం ఇప్పటికే దాదాపు 116 కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వీటిలో ‘జాగ్వర్ లాండ్ రోవర్’, ‘బీవైడీ’ ప్రధానమైనవి. ‘బీవైడీ’ చైనాలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ. త్వరలోనే బీవైడీ ‘ఎల్ 3’ అటానమస్ వాహనాల తయారీని ప్రారంభించనుంది. ప్రస్తుతం బైదు తయారీ చేయనున్న అటానమస్ బస్సులు కేవలం చైనా రోడ్లకు మాత్రమే కాక వేరే దేశాలకు కూడా విస్తరింపజేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలో బైదు దృష్టి సారిస్తున్న మొట్టమొదటి దేశం జపాన్. ఇప్పటికే జపాన్‌లో అటానమస్ వాహనాల తయారు చేస్తున్న, జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ అనుబంధ సంస్థ ‘ఎస్బీ డ్రైవ్’తో బైదు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో 2019 నాటికి అపోలాంగ్ అటానమస్ మిని బస్పులను జపాన్ రోడ్ల మీదకు తీసుకు వచ్చేందుకు కింగ్‌లాంగ్, బైదు కంపెనీలు కృషి చేస్తున్నాయి. నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 12.5 కోట్ల ఎలక్ట్రిక్ కార్లు రోడ్ల మీదకు రానున్నట్టు ఇటీవల ఓ సర్వే తెలిపింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో చైనా ముందు స్థానంలో ఉంది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ వాహనాల్లో సగం చైనాలోనే అమ్ముడయ్యాయి. తరువాత స్థానంలో అమెరికా ఉంది. అతి త్వరలోనే ఎలక్ట్రిక్, అటానమస్ వాహనాలు వల్ల ప్రపంచ నగరాల్లో విప్లవాత్మకమైన మార్పులు రానున్నట్లు సమాచారం. వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్, బోస్టన్ కన్పులేటింగ్ నిర్వహించిన సర్వే ప్రకారం 60 శాతం ప్రజలు అటానమస్ వాహనాల వినియోగం పట్ల సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాక రైడ్ షేరింగ్ సర్వీస్ కూడా చాలా వేగంగా పెరగనున్నట్లు ఈ సర్వే తెలిపింది. -
కొత్తరకం పోలీసు సూపర్ బైక్స్ కమింగ్‌సూన్...
ప్రమాదాలకు తావులేకుండా డ్రైవర్‌లెస్ కార్లు, డ్రైవర్‌లెస్ బస్సులు ఇలా డ్రైవర్‌తో సంబంధం లేని పూర్తిగా టెక్నాలజీతో నడిచే సేవలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. పలు వాహన కంపెనీలు సైతం ఈ కొత్త తరం డ్రైవర్ లెస్ వాహనాలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నాయి. వీటిని రోడ్లపైకి విజయవంతంగా తీసుకురావడానికి టెక్నాలజీ కంపెనీలతోనూ జతకడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్తరకం డ్రైవర్‌లెస్ వాహనం మన ముంగింట్లోకి రాబోతుంది. అదేమిటంటే డ్రైవర్‌లెస్ పోలీసు సూపర్ బైక్.. సూపర్ ఫాస్ట్‌గా పేరొందనున్న ఈ వాహనం 24/7 సమయాలో జాతీయరహదారులపై చక్కర్లు కొడుతూ.. స్పీడ్ లిమిట్‌ను క్రాస్ చేసిన వాహనదారులకు చెక్ పెట్టేలా ఇది రూపొందుతోంది. ఇంటర్‌సెప్టర్ డ్రోన్ పోలీసు 01 పేరుతో ఇది మార్కెట్లోకి రానుంది. అయితే ఈ బైక్‌ను ఏ కంపెనీ రూపొందిస్తోందో తెలుసా? తర్వాతి తరం వాహనాలు రూపొందించడమే తమ డ్రీమ్‌గా సేవలందిస్తున్న లాభాపేక్ష లేని బొంబార్డియర్ దీన్ని ప్రవేశపెట్టబోతోంది. ఇది టెక్నాలజీలో ఓ సహజ పరిణామమని కెనడియన్ మెకానికల్ ఇంజనీర్ చార్లెస్ బొంబార్డియర్ పేర్కొన్నారు. నేటి ఉత్పత్తులకు కొత్తరకం ఆలోచనలతో ముందుకు రావడమే తమ లక్ష్యమని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు ఎన్నో రోజులుగా ట్రాఫిక్ కెమెరాలు వాడుకలో ఉన్నాయని, కానీ పబ్లిక్ వర్క్ సిస్టమ్స్‌లో కనీస అవసరాలకు కొత్తగా మెరుగైన పరిష్కారాలు తీసుకురావాలని ఆయన చెప్పారు. ఈ సూపర్ బైక్ పెట్రోలింగ్ చేసేటప్పుడు లైసెన్స్ ప్లేట్లను స్కాన్ చేయడం, రియల్ టైమ్ వీడియో ఉపయోగించి నేరాలు రికార్డు చేయడం వంటివి చేయనుంది. ఒకవేళ ఉల్లఘనలు రికార్డు అయితే, డ్రోన్ ఆటోమేటిక్‌గా వారికి నోటీసులు జారీచేయనుంది. హైడ్రోజన్ లాంటి కర్బన్ రహిత ఉద్గారాల ద్వారా ఇది రూపొందుతోంది.