బైక్‌పై స్టంట్స్ చేస్తున్న వ్యక్తి
డ్రైవర్ లెస్ కార్లు రోడ్లపైకి వస్తున్న తరుణంలో తాజాగా ఓ వీడియో వైరల్ అయింది. వీడియో ఎక్కడ తీశారో తెలియదు గానీ.. ఓ వ్యక్తి బైక్ వెనకాల కూర్చుని ఉండగా.. అది వేగంగా దూసుకెళ్తోంది. ఇక అతను సరదగా రోడ్డు వెంట ఉన్నవారికి చేయి ఊపుతుండగా.. మరో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దీన్నంతా వీడియో తీశాడు. డ్రైవర్ లెస్ వాహనాలతో భారత్‌కు తెద్దామనుకున్న ఎలన్ మస్క్‌కు దీనితో కాంపీటీషన్ ఎదురవుతుంది కావచ్చు అంటూ సరదా క్యాప్షన్ ఇచ్చి ట్విటర్‌లో షేర్ చేశాడు.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహింద్రా ఈ వీడియోపై ట్విటర్‌లో స్పందించాడు. దిగ్గజ గాయకుడు కిశోర్‌కుమార్ ఆలపించిన ‘ముసాఫిర్ హోన్ యారాన్’ పాటను తాజా వీడియోకు ఆపాదిస్తూ ముసాఫిర్ హోన్ యారాన్.. నా చాలక్ హై, నా ఠికానా హై’ అంటూ రీట్వీట్ చేశారు. 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు 2.31 లక్షల మంది వీక్షించారు. 4500 మంది లైక్ చేశారు.
(చదవండి: Priyanka Gandhi: అడ్డుకున్న పోలీసులు, సెల్ఫీల వీడియో వైరల్)
డ్రైవర్ లేకుండా బైక్ అలా వేగంగా వెళ్తుండడంపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారు. గ్రేట్ రైడింగ్ స్కిల్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరేమో కనీసం హెల్మెట్ కూడా లేకుండా బైక్‌పై విన్యాసాలు చేస్తున్న ఇటువంటి స్టంట్స్‌ను ప్రమోట్ చేయొద్దని ఆనంద్ మహింద్రాకు సూచిస్తున్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాలకు ఇటువంటి పిచ్చి పనులే కారణమవుతున్నాయని మండిపడుతున్నారు.
(చదవండి: వృద్ధ బిచ్చగాడు కూడబెట్టుకున్న సోమ్ము వృధానేనా!)
Love this…Musafir hoon yaaron… na chalak hai, na thikaana.. https://t.co/9sYxZaDhlk
— anand mahindra (@anandmahindra) October 20, 2021
Comments
Please login to add a commentAdd a comment