డ్రైవర్ అవసరం లేని ట్రక్.. దుబాయ్‌లో టెస్ట్ | First Driverless Trucks in Dubai, Complete Initial Tests | Sakshi
Sakshi News home page

డ్రైవర్ అవసరం లేని ట్రక్.. దుబాయ్‌లో టెస్ట్

Published Sat, Jul 20 2024 4:22 PM | Last Updated on Sat, Jul 20 2024 4:33 PM

First Driverless Trucks in Dubai, Complete Initial Tests

టెక్నాలజీ పెరుగుతుంటే.. వినియోగించే వాహనాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. ఇందులో భాగంగానే డ్రైవర్‌లెస్ వెహికల్స్ పుట్టుకొచ్చాయి. ఈ రంగం మరో అడుగు ముందుకు వేసి వాణిజ్య విభాగంలోకి ప్రవేశించి డ్రైవర్‌లెస్ ట్రక్కును తీసుకువచ్చింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదటి డ్రైవర్‌లెస్ ట్రక్కును దుబాయ్ కంపెనీ విజయవంతంగా టెస్ట్ చేసింది. డిసెంబర్ 2022లో ఏవియేషన్ హబ్ దుబాయ్ సౌత్.. ఎవోకార్గో భాగస్వామ్యంతో డ్రైవర్‌లెస్ ట్రక్కులకు సంబంధించిన ఓ ఒప్పందం ఏర్పడింది.

ఈ డ్రైవర్‌లెస్ ట్రక్కు ఆటోమాటిక్‌గా ముందుకు కదులుతుంది. ఇందులో 360 డిగ్రీ కెమెరాలు చుట్టూ ఉన్న పరిసరాలను చూపిస్తాయి. ఇవి అల్ట్రాసోనిక్ సెన్సార్‌లుగా పనిచేస్తాయి. ఈ ట్రక్కును ఆబ్జెక్ట్ డిటెక్షన్, యాక్సిడెంట్ ప్రివెన్షన్, ఎమర్జెన్సీ స్టాప్‌లు, రివర్స్ ఆపరేషన్‌లు వంటి కీలక అంశాలలో టెస్ట్ చేశారు. ఈ అన్ని పరీక్షల్లోనూ ఈ ట్రక్కు విజయం సాధించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్‌లో దాదాపు అన్ని వాహన విభాగాల్లో ఆటోమాటిక్ రవాణాను పెంపొందించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. 2030 నాటికి 25 శాతం ఆటోమాటిక్ వాహనాలు రోడ్డు మీదికి రానున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement