భారతదేశంలో గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు జరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' వెల్లడించారు. ఈ ప్రమాదాలను తగ్గించడానికి మార్గం ఆటోమోటివ్ రంగంలో అత్యాధునిక సాంకేతికతలను ప్రవేశపెట్టడమే అని ఆయన పేర్కొన్నారు.
వాహన తయారీ సంస్థలు వాహనాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బేస్డ్ ఫీచర్స్ అందించాలి. అప్పుడే ప్రమాదాల సంఖ్య తగ్గుతుందని పలువురు నిపుణులు విశ్వసిస్తున్నారు. అంతే కాకుండా ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తాయని చెబుతున్నారు.
ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) అనేది రోడ్డు ప్రమాదాలను తగ్గిస్తుంది. ఇందులో బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, పార్కింగ్ అసిస్టెన్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వార్డ్ కొలీషియన్ వార్ణింగ్, ట్రాఫిక్ రికగ్నైజేషన్, హై బీమ్ అసిస్టె, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టం, సరౌండ్ వ్యూ కెమెరా, లేన్ అడాఫ్టివ్ వార్ణింగ్ మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ కూడా వాహన ప్రమాదాలను తగ్గిస్తాయి.
ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్
ఏడీఏఎస్ ఫీచర్స్ వల్ల హైవేల మీద వాహన వేగాలను పరిమితం చేయడమే కాకుండా.. ముందున్న వాహనాలను కూడా గుర్తిస్తాయి. వేగాన్ని నియంత్రించాలని డ్రైవర్లకు అలెర్ట్ ఇస్తాయి. డ్రైవర్ స్పందించనప్పుడు ఆటోమాటిక్‌గా వేగం తగ్గుతుంది. ఇలా ప్రమాదాలను భారీగా తగ్గించడంలో ఏడీఏఎస్ ఫీచర్స్ చాలా ఉపయోగపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment