ఇది పడవే గాని, అడుగు భాగాన్ని నీటిపై మోపకుండా ప్రయాణిస్తుంది. దీనిలోని ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ వల్ల ఇది నీటి ఉపరితలానికి దాదాపు ఒక అడుగు ఎత్తున ప్రయాణిస్తుంది. దీని లోపలిభాగం ఒక వ్యాను లోపలి భాగం మాదిరిగానే ఉంటుంది. అందువల్ల దీనిని వాటర్ టాక్సీగా వ్యవహరిస్తున్నారు.
బ్రిటన్‌కు చెందిన ఆర్టెమిస్ టెక్నాలజీస్ సంస్థ ఈ విచిత్ర వాహనాన్ని ‘ఈఎఫ్–12 ఎస్కేప్’ పేరుతో ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసింది.ఇందులో ఇద్దరు సిబ్బంది కాకుండా, మరో పన్నెండుమంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.
దీని గరిష్ఠవేగం గంటకు 52 నాటికల్ మైళ్లు (96.3 కి.మీ.). ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం కావడం వల్ల పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని, ప్రయాణికుల జల రవాణాలో ఇది విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాగలదని ఆర్టెమిస్ ప్రతినిధులు చెబుతున్నారు. దీని ధర 3.75 లక్షల డాలర్లు (రూ.3.07 కోట్లు).
Comments
Please login to add a commentAdd a comment