
పెంపుడు జంతువులంటే ఇష్టం ఉన్న వారు కూడా, వాటికి వేళకు ఆహారం, ఆరోగ్యంపై దృష్టి సారించలేక వాటిని పెంచుకోవడానికి వెనుకాడతారు. అయితే, ఈ రోబోడాగ్‌తో ఈ సమస్యలేవీ ఉండవు.
తాజాగా, అమెరికన్ రోబోటిక్స్ కంపెనీ ‘టోంబోట్’ రోబోటిక్ కుక్కపిల్లను ‘జెన్నీ’ పేరుతో రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో తయారు చేసిన ఈ రోబో కుక్కపిల్ల బ్యాటరీలతో పనిచేస్తుంది. ఇందులోని టచ్ సెన్సర్స్ సాయంతో ఇది అచ్చం పెంపుడు కుక్కపిల్లలాగానే స్పందిస్తుంది.
దీన్ని గమనించిన వారు ఇదొక రోబో అన్న విషయమే గుర్తించలేరు. ఇళ్లల్లో శిక్షణ పొందిన పెంపుడు కుక్కపిల్లల మాదిరిగానే ఈ జెన్నీ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఎగరడం, కాళ్లపై కూర్చోవడం వంటి పనులన్నీ చేస్తుంది. దీనిని స్మార్ట్ యాప్ సాయంతో నియంత్రించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment