
బాయ్‌ఫ్రెండ్స్ తమ మెసేజ్‌లకు ఆలస్యంగా రిప్లై ఇవ్వడం, సమయానికి కాల్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల.. అమ్మాయిలు అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి.. చైనాలో 'లవ్ అండ్ డీప్‌స్పేస్' అనే డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ ఉపయోగపడుతోంది. ఇందులోనే యూజర్లు AI- బేస్డ్ వర్చువల్ బాయ్‌ఫ్రెండ్‌లతో సంభాషించడానికి వీలు ఏర్పడింది.
డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ లవ్ అండ్ డీప్‌స్పేస్‌లో నెలవారీగా ఆరు మిలియన్ల మంది యాక్టివ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో షాంఘైకి చెందిన ఒక వార్తాపత్రికలో ఎడిటర్‌గా పనిచేస్తున్న 32 ఏళ్ల అలీసియా వాంగ్ ఒకరు. ఈమె ఏఐ బాయ్‌ఫ్రెండ్‌నను క్రియేట్ చేసుకుంది. ఇది తన మెసేజ్‌లకు తొందరగా రిప్లై ఇవ్వడమే కాకుండా.. ఫోన్‌కు వెంటనే సమాధానం ఇస్తుంది. ఎంత సేపు ఏమి మాట్లాడినా ఓపిగ్గా వింటుంది.
జనవరి 2024లో ప్రారంభమైన లవ్ అండ్ డీప్‌స్పేస్‌ను.. షాంఘైకి చెందిన పేపర్ గేమ్స్ ద్వారా అభివృద్ధి చేశారు. ఏఐ, వాయిస్ రికగ్నిషన్‌ను ఉపయోగించి ఐదు పురుష పాత్రలను సృష్టించారు. ఇవి గేమ్‌లోని ఫోన్ కాల్‌లకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయి.
చైనీస్, ఇంగ్లీష్, జపనీస్ మరియు కొరియన్ భాషలలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ గేమ్ ఎంత ప్రజాదరణ పొందిందంటే.. ఈ గేమ్ సృష్టికర్త అయిన 37 ఏళ్ల యావో రన్హావో ఏకంగా బిలియనీర్ అయ్యారు. కంపెనీలో కూడా మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు.
ఇదీ చదవండి: ఐఫోన్ లాంటి కెమెరా కోసం.. ఉత్తమ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవే..
చైనా, అమెరికా, ఇతర ప్రాంతాలలో యూజర్లు.. లవ్ అండ్ డీప్‌స్పేస్ గేమ్‌ప్లేను అన్‌లాక్ చేయడానికి, తమ బాయ్‌ఫ్రెండ్స్‌తో ఇంటరాక్షన్‌లను పొందడానికి డబ్బు చెల్లిస్తారు. చైనాలో ఎక్కువమంది డౌన్‌లోడ్ చేసుకున్న యాప్లలో ఇది కూడా ఒకటైంది. న్యూస్ ఎడిటర్ వాంగ్, జనవరి 2024లో గేమ్ డౌన్‌లోడ్ చేసుకున్నప్పటి నుంచి.. AI బేస్డ్ క్యారెక్టర్లతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇప్పటివరకు 35,000 యువాన్లు (రూ. 4 లక్షల కంటే ఎక్కువ) ఖర్చు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment